Nov 27, 2008

ముంబై లో మళ్లీ బాంబుపేలుళ్లు 25 మంది మృతి

ఎందుకిలా జరుగుతోంది? ఎటుపోతున్నాం మనం? మనంవీటిని ఎదురించలేమా? అంత బిజీ అయిపొయ్యామా మనచుట్టూ ఏంజరుగుతోందో తెలియనంత, తెలుస్కోలేనంత?
చనిపోయిన కుటుంబాలకి నా హృదయం అట్టడుగు నుంచి సానిభూతి తెల్పుతున్నా.
ముందు దీనెమ్మ ప్రభుత్వం అంటాం! కాని ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఇట్టాంటోళ్లకి సహాయం చేస్తున్నది మనలో ఒకరే, మనం ఎన్నుకున్న ప్రభుత్వమే.

http://www.ndtv.com/convergence/ndtv/default.aspx
http://www.rediff.com/news/2008/nov/26-firing-in-cst-station.htm
http://news.bbc.co.uk/2/hi/south_asia/7751160.stm
Firing, blasts in city

Fresh blast at Taj and Trident hotels
Attacks at Oberoi, Taj and Trident hotel
ATS team arrives at the Taj Hotel
Encounter on between police and terrorists at Taj, Oberoi: A N Roy, Dy Police Commissioner
Two types of attacks: Blasts, AK-47
Prime Minister Office confirms five blasts
Terror attack outside CST Station
CST Station cordoned off by the police
2 blasts reported in Napean Sea Road area
Oberoi hotel lobby on fire after attack
Trains on the central line stopped
2 terrorists said to be holed up at CST station armed with guns, grenades


- జై హింద్

6 comments:

 1. భాస్కర్, భాస్కర్ గారు, మాటలలు రావటం లేదు ఆ దృశ్యాలు చూస్తూంటే, దీనికి అంతం ఎప్పుడు ? ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఇవి జవాబు లేని ప్రశ్నలు గానే మిగిలిపోతున్నాయి.

  ReplyDelete
 2. ప్రొద్దునే లేవగానే విన్నా పేలుళ్ళ గురించి.. చాలా బాధగా, అనిపించింది..
  కానీ, మన మీడియా వాళ్ళు అత్యుత్సాహంతో, అక్కడ ఏమి జరుగుతుందో లైవ్ లో చూపిస్తున్నారు.. ఎంతమంది కమెండోలు వచ్చారు, ఎలా లోపలికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అని.. దీని వళ్ళ లోపల ఉన్న తీవ్రవాదులు ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంది కదా.. కనీసం అది అర్ధం చేసుకోలేర, ఈ మీడియా వాళ్ళు.. నిజమే అక్కడ ఏం జరుగుతుందో తెలియజెప్పాల్సిన అవసరం ఉంది, కానీ మరీ ఇంతలా చూపించడం అవసరం లేదు..

  ReplyDelete
 3. భారత దేశం మీద ఈ టెర్రరిస్టు దాడులు ఎందుకు జరగాలి అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా అసలు? అనుక్షణం భయంతో మేమెందుకు బతకాలి? మా జీవితాలని ఇలా నిర్దేశించే హక్కు ఈ ప్రభుత్వానికెక్కడిది? ఇవాళ ముంబై..రేపు హైద్రాబాదు! ఎలా బతకాలి? ఎందుకిలా జీవితానికి భయమనే నిర్వచనం ఇచ్చుకోవాలి మేము?


  ఇలాంటి సందర్భాల్లో మీడియా అత్యుత్సాహాన్ని వర్ణించడానికి మాటలు దొరకడం లేదు ఎందుకంటే, నాకంతగా బూతులు రావు! అసలు టీవీ 9 వాడు రిటైర్ అయిన ఆంధ్ర పోలీసులందరినీ పట్టుకుని వాళ్ళేమనుకుంటున్నారో అడుగుతున్నాడు పొద్దుటినుంచీ! అదేదే వాళ్లే ఇదంతా చేస్తున్నట్టు. ఇహ పది రోజులు ఈ చానెల్స్ కి పండగే!

  ReplyDelete
 4. @ సుజాత: టి. వి నైన్ చూడడం మానెయ్యండి.

  ReplyDelete
 5. నెటిజెన్,
  ఐడియా బాగానే ఉంది కానీ ఆ చానెల్ వాళ్లని చీల్చి చెండాడడానికైనా చూడాలని ఉంటుందండీ! ముఖ్యంగా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడంలో,తెలుగు వార్తలు ఇంగ్లీష్ లో చదవడంలో..వాళ్లని మించినవాళ్ళు లేరు.

  ReplyDelete