Oct 30, 2009

పిచ్చి పజ్జెంది రకాలు

ఈ సీను గుర్తుకుదెచ్చుకోండి -

ఓ ఇగ్రహం కాళ్ళకాడ సిరన్జీవి కూకోనుంటాడు.
ఇంతలో ఓతను సైకిలు మీనొచ్చి సిరన్జీవికాడ కూకొని ఇలా జెప్తాడు.
ఏటిసెయ్యమన్టావేటి.
అడవిరాముడు సీరలొచ్చినయ్యా
అయ్యి అమ్మేలోపు దొంగరాముడు సీరలు
అయ్యికొనుక్కొచ్చి అమ్ముకునేలోపు అభిలాష సీరలు
ఇలా ఒకదానెమ్మట కొత్త సినిమా కోకలన్నీ ఇలా మారుకెట్టులోకి వత్తంటే యాపారం ఎలాజేస్కోవాల

నేనో యుపాయవ్ సెప్తా ఇన్టావా
సెప్పు గురువా
ఓ తాను సైనుగుడ్డకొను
ఏటిగురువా నుసెప్పేది, ఏటిసేస్కోమన్టా దాన్ని?
సెప్తాగా

సీను కట్ సేత్తే - యాడజూసినా అభిమాన ఈరోల ఈరోవిన్ల బొమ్మలు అచ్చెసిన గుడ్డలే. లుంగీలు, టవళ్ళు, సొక్కాలు, లన్గాలు, డోరు కర్టెన్లు, సివరాకరికి కడ్డాయర్లు కూడా.
ఏందీ అన్నీ జోతిలచ్చిమి జయమాలినివేనా మా సిరన్జీవి బాయ్య బొమ్మలవి లేవా? అని ఓ డవిలాగు.
- ఛాలెంజి సిత్రం నుండి.....

ఆయాల సినిమా కాబట్టి సూస్కుని నవ్వుకున్నాం.
నిన్న వార్తల్లో ఇదిజూసినాక నవ్వాగల. పిచ్చి పజ్జెంది రకలు అని నవ్వుకున్నా -
http://timesofindia.indiatimes.com/life/parties/delhi/Designers-at-Play-in-Delhi/articleshow/5136319.cms
పైన నొక్కండి. ఎవుత్తో డిజైనరంట. ముంబై అంట. నదియా మహమ్మూద్ అంట.
గబ్బర్ జాకెట్లు, అమితాబచ్చన్ జాకెట్లు, డిజైన్ జేసి అవతలనూకింది.
గబ్బర్ జాకెట్లు -
ఈటి మీన *ఈ చేతులు, ఈ చేతులు, ఈ చేతులు నాకిచ్చేయ్ ఠాకూర్* అని రాసుంది కొన్నిటిమీన.
ఇంకొన్నిమీన *ఎంతమంది ఉన్నార్రా, మీరెంతమంది ఉన్నార్రా* * సర్కార్ మీ ఉప్పు తిన్నా సర్కార్, ఐతే ఇప్పుడు గోలీ తిను* ఇలాంటి డవలాగులు.
*ఈ కుక్కలముందు డ్యాన్స్ నృత్యం ఆడమాక బసంతీ* అని
ఇలాంటివి ఇంకా సానా డిజైన్లంట బెమ్మాండంగా సేసిందీమె.

అదీ కధ ఈ పొద్దు.

Oct 29, 2009

తీర్ధం తీస్కుంటే జరఁమొస్తుందా?

అయ్యా
కార్తీక మాసం!! మొన్నటి సోమవరం, గుడికెళ్ళాం నాయనా. సోమవార పూజ గట్రా అయ్యాక నాయనా, దండవెట్టుకుని, తీర్ధం పుచ్చుకుని ఇంటికిచేరా నాయనా. ఛిల్స్ మొదలైయ్యాయి మహాప్రభో. వణికిపొయ్యా.
ఏంటీ? ఏమైంది?
చలి
జరంగా ఉందా
ఉన్నట్టుగా ఉంది
ఏదీ సూణ్ణీ? చల్లగానే ఉందే వళ్ళు
ఏమో లోపల్లోపల ఉన్నట్టుంది
దరమామీట్రీ పెట్టుకుని సూస్కో
తొంభైతొమ్మిది
పడుకో పాలుతాగి
టైలినాల్ ఇవ్వు ఏస్కుని పడుకుంటా

అయ్యింది. పొద్దున్నే మళ్ళీ దరమామీట్రీ నోట్లోఎట్టుకుని సూస్కుంటే నూట్రెండు. కళ్ళు బైర్లు కమ్మినై. ఎంటనే డాకటేరుకాడికి పరిగెత్తా.
ఏట్రా సిన్నా
జొరం
ఏదీ సూణ్ణీ
సూడు
ఏంపర్లేదు, దీన్నే ఇన్ఫ్లుఎన్జా అంటారు. ఆడా ఈడా తిరగమాక. ఈ బిళ్ళలేస్కో.
అట్టాగే.

ఇక ఇంటికాడా,
అవును. సానా మంది చెప్పారు. గుళ్ళో తీర్ధం పుచ్చుకుంటే విరోచనాలు అయినోళ్ళు ఉన్నారు, ఇలా జరాలొచ్చినోళ్ళూ ఉన్నారు, స్టమక్ అప్సెట్ ఐనోళ్ళూ ఉన్నారూ అని.

బెదరూ!! కాబట్టి జాగరత్త.

Oct 27, 2009

ఈ కధేంటో కాస్త చెప్తారా?

ఈ పిల్ల ఛగ్గు ఛగ్గు అని ఏంటేంటో చెప్తోంది. ఇక్కడ చూడండి.మీకేమైనా *కధ* అర్ధం ఐతే కాస్త చెప్పరా?

Oct 26, 2009

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం,
వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం
నారదాదియోగిబృందవందితం దిగంబరం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భానుకోటిభాస్వరం భవాబ్దితారకం పరం,
నీలకంఠమీప్సితార్ధదాయకం త్రిలోచనం
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

శూలటంకపాశదండపాణిమాదికారణం,
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం,
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం,
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణశేశపాశశోభితాంగమండలం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం,
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం,
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాశనమ్
అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం,
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం,
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం,
ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం నరా ధ్రువమ్

కాశికాపురాధినాథకాలభైరవం భజే
కాశికాపురాధినాథకాలభైరవం భజే
కాలభైరవం భజే
కాల భైరవం భజే

[కాలభైరవాష్టకం]


[సంస్కృత మూలం - http://sanskritdocuments.org/all_pdf/kaalabhairava.pdf]

Oct 24, 2009

ఆలోచింపజేసే రెండు నిశ్చలనచిత్రాలు
ఆలోచించండి..నిర్ణయం మీచేతిలోనే ఉంది!!!!

Oct 23, 2009

గడనిచిపోయిననిన్నటికి రాబోయే రేపటికి మధ్యనున్న నిశ్శబ్దం

నా పాత పోస్టు ఓ తోటమాలి కధ - బాగ్బాన్ http://ramakantharao.blogspot.com/2008/12/blog-post_11.html లో ఓ విన్నపాన్ని పెట్టాను ఇలా
ఓ చిన్న విన్నపం: పై అమితాభ్ ప్రసంగాన్ని ఎవ్వరైనా తెలుగులోకి అనువదించగలరా?
కృష్ణ గారు, పెద్దమనస్సుతో అమితాభ్ ప్రసంగాన్ని తెలుగీకరించి అందించారు. ఆయనకు ధన్యవాదాలు.
ఈ అమితాభ్ ప్రసంగాన్ని రాసింది జావేద్ అక్తర్. అక్తర్ ఈ సినిమాకి రచయిత కాదు, కానీ కేవలం ఈ ప్రసంగం రాసిచ్చారాయన.
కేవలం మీతో పంచుకుందాం అని ఇక్కడ పెడుతున్నా..చూడండి..నేను రచయిత ని కాదు...రచయితలయితే ఆలోచనల సముద్రాలలో మునిగి ఎన్నో మంచి ముత్యాలు వెలికి తీస్తారు. నేనేదో జీవితం నాకు చూపించినవే కథ గా రాశాను. 'బాఘ్బన్' (తోట మాలి) నా కథో ఇంకెవరి కథో కాదు. ఈ కథ గడనిచిపోయిననిన్నటికి రాబోయే రేపటికి మధ్యనున్న నిశ్శబ్దాన్నిగురించి రాసింది. ఇది ఒక తరానికి మరొక తరానికి మధ్య కూలిపోయిన ఎన్నో వారధుల కథ. తమపై కూర్చున్న పిల్లలకి జీవితం అనే వేడుకని చూపించి ఇప్పుడు అలసిపోయి కుంగిపోయిన భుజాల కథ ఇది. తమ పిల్లలకి తప్పటడుగులు వేయడం నేర్పించి..ఇప్పుడు ఊతం లేక వణుకుతున్న చేతుల కథ....ఒకప్పుడు జోల పాటలు పాడి..ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మాటలు లేక అదురుతున్న పెదవుల కథ కూడా. కాలం మారిపోయింది..జీవితం మారిపోయింది..మా వయసు వాళ్ళకి గుర్తే[మాత్రమే] ఉంటుంది..బంధాలు అనుబంధాలు అంటూ ఎలా వెంపర్లాడేవాళ్ళమో....తండ్రి ముఖంలో పరమ శివుడ్ని చూసేవాళ్ళం..తల్లి పాదాల వద్ద స్వర్గం కనిపించేది...కాని ఇపుడు జనాలు ఇంగితం కలవాళ్ళు. ఈ తరం తెలివి, లోకజ్ఞానం కలిగినది. వీళ్ళకి ప్రతి బంధం పైకి వెళ్ళడానికి ఒక మెట్టు లాంటిదే. ఆ మెట్టు అవసరంలేదు అనిపించినపుడు ..ఇంట్లో విరిగిపోయిన కుర్చీలాగా, అరిగిపోయిన గిన్నెలాగా, చినిగిన పాత బట్టల్లా నిన్నటి వార్తా పత్రికలా ఏమూలనో పారవేస్తారు. కాని జీవితం మెట్లలా పైకి వెళ్ళదు..జీవితం చెట్టులా పెరుగుతుంది. తల్లిదండ్రులు పైకి వెళ్ళే నిచ్చెనలో మొదటి మెట్టు కాదు. తల్లిదండ్రులు, జీవితం అనే చెట్టుకి తల్లి వేరు లాంటివాళ్ళు. చెట్టు ఎంత పెద్దదైన ఎంత పచ్చగా పుష్పించినా..తల్లి వేరు కొట్టేస్తే అది పచ్చ గా మనలేదు. అందుకే ఈ రోజు నేను సాదరంగా సవినయంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏ పిల్లల సంతోషం కోసం ఒక తండ్రి తను కష్టపడి సంపాదించిన ప్రతి పైసా నవ్వుతూ ఖర్చు చేస్తాడో..ఆ పిల్లలు ఆ తండ్రి కళ్ళు మసక బారినప్పుడు ఆ కళ్ళకి కాస్త వెలుగు నివ్వడానికి ఆలోచిస్తారెందుకు? తన జీవితంలో మొదటి అడుగు వేయడం నేర్పిన తండ్రి జీవితం చివరి దశలో ఆ కొడుకు ఆసరాగా నిలబడలేడెందుకని? జీవితం అంతా తమ సంతోషాలను పిల్లలకోసం త్యాగం చేసే తల్లిదండ్రులకి ఏ నేరం చేసారని కన్నీళ్ళు ఒంటరితనం శిక్షగా విధిస్తున్నారు? మాకు ప్రేమని పంచలేని వాళ్ళు మా ప్రేమను తీసుకునే అధికారం ఎవరిచ్చారు? ఈ పిల్లలు ఎం అనుకుంటున్నారు? ప్రేమ అనే బంధంతో భగవంతుడు కలిపిన తల్లిదండ్రులను రెండు భాగాలుగా విడదీసి ఎవరికీ వారుగా బాధ పడేలా చేస్తారా? ఈ రోజు కోసమేనా ఒక మనిషి పిల్లలను పెంచేది? పిల్లలు మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. ఈ రోజు మాకు జరిగింది రేపు వాళ్ళకి జరగవచ్చు. ఈ రోజు మేము ముసలి వాళ్ళం ఐతే వాళ్ళు ఒక రోజు ముసలి వాళ్ళు అవుతారు. ఈ రోజు మేం అడిగే ప్రశ్నలు రేపు వాళ్ళు అడుగుతారు. ఇక మా గురించి మీరు ఆలోచించకండి. ఎందుకంటే ఎంమాట్లాడలేని, నడవలేని అర్థం చేసుకోలేని పిల్లలను పెంచి పెద్ద చేసినవాళ్ళం..మమ్మల్ని మేము పోషించుకోలేమా? మాకు ఎవరి అండ అవసరం లేదు. నేను అదృష్టవంతుడిని. ఎందుకంటే జీవితం నాకొక అద్భుతమైన తోడూ నిచ్చింది. తనతో నడుస్తూ ఉంటె దారి తేలిగ్గా అనిపించేది. తనతో నడుస్తూ ఉంటె జీవితం లో ఎంత చిక్కు సమస్య అయినా ఇట్టే విడి పోయేది. ఆ తొడు..నా భార్య. అందరు ప్రేమిస్తారు. కాని ఈ విషయం చెప్పవలసినన్ని సార్లు చెప్పరు. ఆ తప్పు నేను చేయదలచుకోలేదు. "పూజా, నువ్వంటే నాకు అంతు లేని ప్రేమ..అంతు లేని ప్రేమ..thank you for being there". "నీవు ఉంటే మనం ఉంటాం. మనం ఉంటే అన్ని ఉంటాయి..లేకపోతె ఏది ఉండదు....ఏది ఉండదు.."..నేను చెప్పవలసినది ఇంతే.

Oct 22, 2009

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకారచండతాండవంతనోతునశ్శివశ్శివం

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోలవీ చివల్లరీ విరాజమానమూర్ధని
ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే
కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ

ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర
స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే
కృపాకటాక్షధోరణీ నిరుద్ధ్దుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ

జటాభుజంగపింగళ స్ఫురత్ఫనామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిహ్వధూముఖే
మదాంధసిందురస్ఫుర త్వగుర్తరీయమేదురే
మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి

సహస్రలోచన ప్రభుత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూ:
భుజంగరాజమాలయానిబద్ధజాటజూటక:
శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖర:

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా
నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకం
సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తున:

కరాళ ఫాలపట్టికా దగద్ధగద్ధగజ్జ్వల
ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే
ధరాధరేంద్రనందినీ కుచాగ్రచిత్రపత్రక
ప్రకల్ప నైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ

నవీన మేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్
కుహూ నిశీధినీ తమః ప్రబంధ బద్ధకంధరః
నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధాన బంధురః శ్రియం జగుద్ధురంధరః

ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా
వలంబి కంఠకందలీ రుచుప్రబద్ధకంధరం
స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధూవ్రతం
స్మరాంతకం పురాంతకమ్ భవాంతకమ్ మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే

జయత్వదభ్రవిభ్రమ భ్రమద్భుజంగ మశ్వస
ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళఫాలహవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగతుంగమంగళ
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః

దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో
ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:
తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్

కదానిలింపనిర్ఝరీ నికుంజకోతరేవసన్
విముక్తదుర్మతిః సదాశిరఃస్థమాంజలింవహన్
విలోలలోలలౌర్చనో లలాలబాలలగ్నహః
శివేతిమంత్రముచ్ఛరణ్ సదాసుఖిః భవావ్యహం

నిమగ్ని నిత్యమేవముక్తముక్తమోత్తమం స్తవం
పఠన్స్మరంబృవనరో విశుద్ధిమేతిసంతతం
హరేగురౌ సుభక్తిమాసుయాతినాం యధాగతిం
విమోహనం హి దేహినాంసు శంకరస్య చింతనం
[శివ తాండవ స్తోత్రం]


యావత్ లోకం కార్తీక మాసం సందర్భంగా శివధ్యానంలో మునిగిపోయి ఆ సదాశివుని కృపకు పాత్రులౌవ్వాలని కోరుకుంటా

Oct 15, 2009

యా కుందేందు తుషార హార ధవళా

యా కుందేందు తుషార హార ధవళా
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వర దండ మణ్డిత కరా
యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్
దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా

సరస్వతి స్తుతి. ఎంతకమ్మగా ఉంటుంది!! ఇక్కడ వినండి లేక ఇక్కడ -

చిన్నపిల్లలు అనుకుంటా ఎంత చక్కగా స్తుతించారో!!

నాకోరిక!! మా సూరిగాడు పిల్ల, ఇంకొంచెం పెద్దైయ్యాక ఇలా చక్కటి శృతిలో పాడుతుంటే, నేను నరసరావుపేట కుర్చీలో విశ్రమించి అలా మైమరచి వింటూవుండలని...

Oct 14, 2009

పేరు సూసి మోసపోకు మిత్రమా

మోసాలు ముఫైఆరు రకాలైతే మోసపోటాలు మూడొందలరవై రకాలు.
మొన్నీమధ్య ఇంటికాడి ఓ కొట్టుకెళ్ళాం, అయి ఇయి కొంటా సూపుల సందుకి వెళ్ళి సూసి ఎతికి, ఇది కొన్నాం - పేరు Savory Vegetable Barley Progresso Soup. బార్లీ సానా మంచిది వారోగ్యానికి అన్నిటికీ అని తోపుడుబండిలో ఏస్కున్నాం.

నిన్న ఆపీస్ నుండి ఇంటికి రాంగనే "కాపీతాగుతావా సూపు తాగుతావా? టీతాగుతావా మంచీళ్ళు తాగుతావా?" ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చింది శ్రీమతి.
"సూపుతే"
"ఏ సుపు?"
"ఏమున్నాయ్?"
"కార్న్ సూపు, టమాటా సూపు, రోస్టెడ్ పెప్పర్ సుపు, పైన సెప్పిన సూపు"
"ఐతే పైన సెప్పిన సూపుతే"
"ఏడిసేయాల్నా?, పొయ్యిమీన మాడగొట్టాల్నా?, మైక్రోవేవులో పెట్టి గోరెచ్చగా ఇవ్వాల్నా? అసలు ఇవ్వాల్నా వద్దా?"
"మైక్రోవేవులోపెట్టి ఏడిసేసి ఇవ్వు"
"సరే"
..
ఇంతలో కెవ్వుమని కేక.
"ఏంది సంగతి?"
"బాసూ ఏంసూపు తెచ్చావ్? దాంట్లోని ఇన్గ్రేడియంట్స్ చూస్కోవాల్సిన పనిల్యా?"
"ఏమీ? బార్లీ వెజిటేబుల్లు ఇంకేంగావాల?"
"అదేమరి క్యా-బే-జి అంటే"
"ఏంసంగతి"
"ఇది చూడు -
Ingradiants - Water, Beef broth, Celery, Tomatoes యాట యాట యాట"అదీ సంగతి. కాబట్టి, వళ్ళు తగ్గిచ్చుకునే మార్గంలో సూపులు గట్రా కొనుక్కునేప్పుడు తక్కువ సోడియం ఉన్నవి వెత్తుక్కుని, బీఫులు గట్రా తిననివారైతే సరిగ్గా ఇన్గ్రేడియంట్స్ చదువుకుని కొనుక్కోండి. నాలా మోసపోవద్దు.

Oct 13, 2009

రాయుచ్చుక్కొడతా!!

ఈ మధ్య ప్రతీదానికీ ఏదోటి చేసేయటం ఫ్యాషన్ అయ్యింది.

పెన్షన్ అందట్లేదు, లేక ప్రభుత్వ ఉద్యోగి ఆర్జీ అందుకోట్లేదు..సంబంధిత మంత్రి పత్రికా ముఖాముఖీకి వెళ్ళు చెప్పులిసురు.
ఇంట్లో మట్టివాసనేస్తోంది, నీళ్ల గొట్టాలు తుప్పుపట్టినై, ఏదోక పత్రికా ముఖాముఖీకి వెళ్ళు ఏదోటి చెయ్యి.
లేకపోతే కనీసం ఓ బస్సునన్నా పగల్నూకటం. పొయ్యేదేముంది బస్సుతప్ప!!

ఓ వైపు జలం ప్రళయం ఇంకోవైపు జనం ప్రళయం
సందట్లో సడేమియా జగన్ని ముఖ్యమంత్రిన్జేయండి.

ఇంకోవైపు కెసీఆర్ పొన్నాలపై సవాళ్ళు
పొన్నాల ప్రతి సవాళ్ళు
దానికి కాంగ్రేస్ - "కెసిఆర్ తాగుబో[తు]టు[ఆబోటెక్కినోళ్ళందరికి ఓ సుక్క పోస్తాట్ట], అందుకే తూలిపడ్డాడు"
దీనికి టిఆరెస్ - "రాశేరె సచ్చినాక కాంగ్రేసోళ్ళకు పిచ్చెక్కింది"

ఇయి ఇంటా జనాలకి పిచ్చెక్కే స్టేజి వచ్చింది. ఈళ్ళెమ్మ ఈళ్ళనెట్టా గెలిపించాంరా బగమంతుడా అని తలకాయలు గోడలకేసి నూక్కుంటాఉన్నారు జనాలు.

ఇంతలో ఎవుడో గన్నారావు [జూపూడి ప్రభాకర్] వై.యస్.ఆర్ ని పెల్చేసారా? లేకపోతే శవాలు అట్టా సెల్లాసెదురుగా ఎలా పడిపోతాయ్? ఎవురో ఆ హెలీకాప్టర్ ని *ఆ రెండు* కొండల మద్దిన పేల్చేసారు. దీనిపైన ఓ ఇరవైరెండు ప్రశ్నలు రాసుకొచ్చాట్ట గన్నారావ్ [జూపూడి ప్రభాకర్], సిబీఐ క్కూడా ఇచ్చాట్ట.

నేనూ ఓ పాతిక ప్రశ్నలు రాసుకొస్తా!!

ఇంతలో మన ముక్యమంత్రిగారు కర్నూలు ఎళ్ళనే ఎళ్ళారు, ఆ!! జగను మరియూ బృందానికి ఇయ్యన్ని యాడ గుర్తుంటైలే, మరి వరదలొచ్చి అన్నీ తుడిసిపెట్టుకొపాలా [జగన్ సియం కావాలా! అనే డిమ్యాండు] అనుకున్నాడు పాపం రోతయ్య [పాపము శమించుగాక] అర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ రోశయ్య. అలా ఎళ్ళాడు, ఇలా రాళ్ళేసారు కొందరు. పాపం పెద్దముండావాడు ఒగ్గేయ్యండర్రా!!!

Oct 9, 2009

మనోళ్ళ అంగ్లం :):)

ఫార్వర్డ్ కాబడిన ఓ మెయిల్, సరదాగా నవ్వుకోటానికి -
 *Funny Killer English


Principal to student..." I saw u yesterday rotating near girls hostel
pulling cigarette... ? "

************ ********* ***

Class teacher once said :

" pick up the paper and fall in the dustbin!!!"

************ ********* ***

once Hindi teacher said...."I'm going out of the world to America.."

************ ********* ***

"..DON'T TRY TO TALK IN FRONT OF MY BACK.."

************ ********* ***

don't. laugh at the back benches...otherwise teeth and all will be fallen
down.....

************ ********* ***

it was very hot in the afternoon when the teacher entered.. She tried to
switch the fan on, but there was some problem. and then she said

" why is fan not oning" (ing form of on)

************ ********* ***

teacher in a furious mood...

write down ur name and father of ur name!!

************ ********* ***

"shhh... quiet... the principal is revolving around college"

************ ********* ***

My manager started like this

"Hi, I am Madhu, Married with two kids"

************ ********* ***

"I'll illustrate what i have in my mind" said the professor and erased the
board

************ ********* ***

"will u hang that calendar or else I'll HANG MYSELF"

************ ********* ***

LIBRARIAN SCOLDE ," IF U WILL TALK AGAIN , I WILL KNEEL DOWN OUTSIDE"

************ ********* ***

Chemistry HOD comes and tells us...

"My aim is to study my son and marry my daughter"

************ ********* ***

Tomorrow call ur parents especially mother and father

************ ********* ***

"why are you looking at the monkeys outside when i am in the class?!"

************ ********* ***

Lab assistant said this when my friend wrote wrong code..

"I understand. You understand. Computer how understand??

************ ********* ***

Seeing the principal passing by, the teacher told the noisy class..

"Keep quiet, the principal has passed away"

************ ********* ***--Oct 8, 2009

పిన్నీ!!!

నేను నిఖార్సైన తెలుగు బిడ్డని.
నేను వోల్ మొత్తం ఆంధ్రప్రదేశ్ తరపున మాట్టాడుతున్నా.
తెలుగు తల్లి అందరు తెలుగోళ్ళకు తల్లి.
[మరి తెలంగాణా తల్లి?]
౪%@#%@&‌%&‌‌
తెలంగాణా తల్లి కాదు!
[మరి?]
పిన్ని

- కెసిఆర్.

Oct 6, 2009

ఇదెక్కడి గోల??

౧. శుక్రవారం రాత్రి: బెజవాడ: ఐన్యూస్ -
ఒకవైపు ముంపు ముంచెత్తుకుంటూ వస్తుంటే బెజవాడ ప్రకాశం బ్యారేజిమీద వేలకొద్దీజనాలు నీళ్ళని చూట్టానికి వేంచేసారు. ట్రాఫిక్కు జ్యాం.
౨. ముందుగా, మొట్టమొదటగా వరగ ముంపు గురించి చెప్పింది ఐన్యూసే - ఐన్యూస్
౩. ఆదివారం సాయంత్రం టివి తొమ్మిది - పొరపాటున ఎలా ఉందో పరీస్థితి చూద్దాం అని పెట్టా. తలగిర్రున తిరిగింది.
వార్తాహరులు రోడ్లెమ్మట, వాళ్ళ కార్యాలయం ముందు అక్కడా ఇక్కడా -
"తండోపతండాలుగా కదలి వస్తున్న జనం. ఇది సైన్యమా కాదు మాన్యవత్వంతో నిండిన సైన్యం. యుద్ధానికి వెళ్ళే సైన్యం కాదు, ఆపన్నులను ఆదుకునే మానవత్వపు సైన్యం." ఇంతవరకు బాగనే ఉంది. అప్పుడుమొదలయ్యింది గోల.
"టివి నైన్ వాళ్ళ పిలునందుకుని వచ్చాం - చాలా మంచి పనిచేస్తున్నారు"
"ఇప్పుడే విమాణం దిగాం. టివినైన్ వాళ్ళ ఈ డ్రైవ్ మాకెంతో నచ్చింది. విరాళం అందివ్వటానికి వచ్చాం"
"మా అమ్మాయి టివి నైన్ కార్యక్రమంలో భాగం అవ్వాలని పరిగెత్తుకుంటూ వచ్చింది ఇటైపేమన్నా వచ్చిందా?"
ఇలా!!
ఇక ఏ ఇతర ఛానలూ పెట్టాలనిపించలా.
-----------------------------

మొన్నటిదాకా మీటర్లపై మీటర్లు ఎత్తుపెంచిన కర్ణాటక, నీళ్ళు ఇవ్వండ్రా అంటే ఏడుపిచ్చుకుతిన్న కర్ణాటక.
ఎంత గొడవ. ఆ ట్రైబ్యునల్ అని ఇది అని మనకి నిద్రలేకుండా చేసారు కృష్ణా జలాలకోసం.
ఇవ్వాళ్ళ మా ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోటున్నాయర్రా ఎర్రిపీనుగుల్లారా అన్నా నీళ్ళు వదుల్తూనే ఉన్నారు.
---------------------------

తాజాగా -
మంత్రాలయం లాంటి అత్యంత దెబ్బతిన్న ప్రాంతాల్లో జనాలు ఉన్నపళంగా ఇళ్ళు ఖాళీచేనందున, ఒక బ్యాచి లూటీలు చేస్తున్నారట.

కర్నూలు వైపు కొందరు వ్యాపారస్తులు బ్రహ్మాండమైన తెలివితేటలతో కిలో బియ్యాన్ని వందకి, పాల పొట్లం ఒకటి యాభైకి అమ్ముతున్నారట.

నాకో అనుమానం మనం మధ్యతారియుగంలో ఉన్నామా?

Oct 3, 2009

మానవతప్పిదం కొంత

గత కొన్ని ప్రభుత్వాలదగ్గరనుండి ఈనాటి ప్రభుత్వం వరకూ చేసిన కొన్ని తప్పులు, తప్పుడు నిర్ణయాలు పేరుకుపొయ్యి ఈనాటి ఈ ఘోరప్రమాదానికి ఊతానిచ్చినై.
ఎలా?
౧. ఒకానొకప్పుడు ఎప్పుడూ నాగార్జునసాగర్ ని నింపి శ్రీశైలాన్ని ఖాళీగా ఉంచేవారట.
కర్ణాటక నుండి వచ్చే వరద శ్రీశైలం చేరటానికి కనీసం పన్నెండు గంటలు పట్టొచ్చు. సిద్ధాంతం ప్రకారం, నాగార్జునసాగర్ లోకి శ్రీశైలం రిజర్వాయర్ ని కనీసం సగం ఖాళీగా ఉంచి ఉంటే వరద నీళ్ళు చేరి, రిజర్వాయర్ నిండి, సాగర్ కి నీళ్ళు వదిలి అది నిండి, సాగర్ కి నీళ్ళు వదిలి అది నిండి, సాగర్ నుండి కిందకి వదిలటానికి టైం దొరికి ఉండేది. అలానే శ్రీశైలం నిండటానికి కనీసం వంద టీయంసీలు కావాల్సొచ్చి, వరద వెనక్కి తన్నకుండా కర్నూల్ మునక్కుండా ఉండేది.
తప్పిదం - శ్రీశైలంలో నీళ్ళని ఫుల్లుగా నింపి ఉంచటం, పైనున్న రాష్ట్రాలతో సత్ సంబంధాలు లేకపోవటం, సరైన కమ్యూనికేషన్ లేకపోవటం.
౨. ఇక ప్రకాశం బ్యారేజి. దీని కెపాసిటి అతి తక్కువ. క్యాచ్మెంట్ ఏరియాని పెంచుకోలేకపోవటం పెద్ద తప్పు
౩. దేశం మొత్తానికీ ఓ బాడి ఉంటుందట. దానిపేరు ఏదో ప్రకృతి వైపరీత్యాల హెచ్చరిక కేంద్రం. వీళ్ళు, ప్రతీసమచ్చరం, జూన్ నుండి అక్టోబర్ చివరివరకూ అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరికలు పంపుతూనే ఉంటారట. మనోళ్ళు వాటిని పెడచెవిన పెట్టారు.

ఇంకోవిషయం - పాలనావ్యవస్థల *సీరియస్నెస్*. ఇలాంటి హెచ్చరికలు గట్రా వచ్చినా వ్యవస్థలోని బ్యూరోక్రసి, ప్రోటోకాల్ సమస్యలు, నాకు ముందు తెలియదు అనే మనఃస్తత్వం ఇలాంటివి వ్యవస్థ మొత్తాన్నీ నిర్వీర్యంచేసి జననష్టానికీ ప్రాణానష్టానికీ దోహదపడుతున్నాయి

Oct 2, 2009

వరదలు - అరవైఏళ్ళ దేశ చరిత్ర - ఏంలాభం?

బాబు హైదరబాద్ *అభివృద్ధి*లో గడిపేసాడు.
దివంగత రా.శే.రె ఆనకట్టలు కడదాం అన్నాడు మొదలెట్టాడు. [కొన్ని ఇప్పుడు కొట్టుకుపొయ్యాయి. కొన్ని పోతాయి. కొన్నిటి ఆనవాళ్ళుకుడా దొరక్కపోవచ్చు రేపటికి]

మొదట - ఇంతనీరు వృధా
రెండు - ఆపత్తు, దానికి ముందే సమాయత్తమయ్యే మేనేజిమెంటు, మేనేజిమెంటు ఫోర్స్, ఇంప్లిమెంటేషన్ ఫోర్స్, నిబద్ధత, సరైన డైరెక్షన్
మూడు - ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెడ్. స్టాటిస్టిక్స్, మనం ఎక్కడ? ఏంకావాలి?
నాలుగు - డిజాస్టర్ రికవరి, డిజాస్టర్ ప్లాన్స్
ఐదు - ఫ్యూచర్ గోల్స్
ఆరు - ప్లాన్స్ విత్ రిస్క్ ఎసెస్మెంట్స్ ఫర్ ఫ్యూచర్ గోల్స్.
అరవైఏళ్ళ స్వతంత్రభారతం!! పైవాటికి సమాధానాలు లేవు, ఉండవు. మనదంతా యాడ్-హాక్. ఓ వాన పడితే అతలాకుతలం. ఓ వైపు పెరుగుతున్న అప్పులు. ఇంకోవైపు ప్రపంచ పట్టీకలలో ప్రతీ దాంట్లో అట్టడుగు స్థానం.

ఇప్పుడేంటి? -

కృష్ణానది ఉగ్రరూపం. గడచిన రెండొందల సమచ్చారలలో ఇంత ఉధృతి ఎప్పుడూ రాలేదని వార్త.

చదువరి గారి టపా పోటెత్తిన కృష్ణ -ప్రమాదంలో రాష్ట్రం
నా వ్యాఖ్య -
కర్నూలు, మహబూబ్ నగర్, తెలంగాణ వైపు వరద ఉధృతంగా ఉందని విన్నా.
శ్రీశైలం డ్యాం పైనుండి నీళ్ళు ప్రవహిస్తున్నాయి అని వార్త.
డ్యం కి ఏమైనా ప్రమాదమా?
సాగర్ కి ఏమైనా ముప్పుందా? విజయవాడకి ఏమైనా ముప్పు ఉండొచ్చా?చేతులెత్తేసిన ప్రభుత్వం!! అంతకన్నా ఇంకేంచేయగలదూ? ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే పరీస్థితి. ప్రకృతికి ప్రభుత్వం ఎవరిదీ అనేది పట్టదు కాని, ఓరి సన్నాసుల్లారా ముందుగానే సమాయత్తం కాండిరా అనిమాత్రం సంకేతాలు పంపుతుంది. వాతావరణ శాఖ తమ బూజుపట్టిన వ్యవస్థను ఒక్కసారి కదిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నా నమ్మకం.
ఇది ప్రభుత్వ చేతగానితనం కన్నా, ప్రభుత్వ *పాలనా వ్యవస్థల అట్టర్ ఫైల్యూర్*
ఐతే - ప్రమంచంలో ఏమూలకెళ్ళినా కంప్యూటర్ రిలేటెడ్ ఉద్యోగాల్లో మనోళ్ళని కనీసం ఒక్కళ్ళనైనా చూస్తాం. ప్రపంచదేశాలకు సేవలు అందిస్తున్నాం. మనకి మనం సేవలు ఎప్పటికి అందించుకుంటాం? అలా అందించినా స్వీకరించే స్థాయిలోకి ప్రభుత్వాలు ఎప్పటికి వస్తాయి?
శశాంక్ రాసిన పోస్టు -
కృష్ణమ్మ కొంచం కోపం తగ్గించుకోమ్మ..
http://aakasam.blogspot.com/2009/10/blog-post.htmlపోయినేడాది, గాంధీజయంతి సందర్భంగా నే రాసిన పోస్టు -
గాంధి ని చంపేసాను http://ramakantharao.blogspot.com/2008/10/blog-post.html
అవును. నేనే. గాంధిని అత్యంత దారుణంగా, హేయంగా, ఆతని అరుపులు ఎవ్వరికీ వినబడనీయకుండా నేనే చంపేసాను. దేనికంటే.. సత్యాగ్రహమంటాడా? అహింసా? ఖాదీయా? ఉపవాసం చేయమంటాడా?
కట్నాలకోసం అమ్మాయిల్ని అతిదాఋణంగా హింసిస్తున్న సమాజాన్ని చూసి దిక్కులు పిక్కటిల్లేలా అఱవకుండా, తిలాపాపంలో పాలుపంచుకుని గాంధీని చంపేసాను.
అడుగడుగునా లంచాలతో జనాల రాక్తాన్ని పీల్చుకుంటున్న అధికారగణం మీద యుద్ధాన్ని ప్రకటించకుడా, నాకు చేతనైనంతవఱకూ లంచాల్ని ప్రోత్సహిస్తూ గాధీని చంపేసాను.
కులం కులం అని కుచ్చితాలుపెంచుకుంటున్న జనాల్ని సరైన మార్గంలో పెట్టకుండా నేనూ ఒక కుల కుంపట్ని వెలింగించి గాధీ చంపేసాను.
మతం తన పరిధులు దాటి గజ్జిగా మాఱితే నేను దాన్ని కడుక్కోకుండా అందఱికి అంటిస్తూ గాంధీని మళ్ళీ చంపేసాను.
సత్యాగ్రహం అనేపదానికి సమాజం "అ" చేర్చినప్పుడు కిమ్మనకుండా నేనూ అసత్యాగ్రహాన్ని ప్రచారం చేస్తూ గాంధీని అతిదారుణంగా చంపేసాను.
అహింస పరమో ధర్మహ కి బూజు పట్టించి దాన్ని హింస పరమో ధర్మహ లా మార్చినప్పుడు సమాజాన్ని ఎదురించటం మానేసి నేనూఒక కత్తి పట్టి గాంధీని నఱికేసాను.
పేదరికాన్ని రూపుమాపేందుకు అప్పులు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాన్ని ఎదురించటం పక్కనబెట్టి ప్రపంచీకరణ పేరుతో మన సహజ వనరుల్ని అమ్ముకుంటూ గాంధీని చంపేసాను.
అభివృద్ధి పేరుతో సంస్కృతినీ సంప్రదాయాన్ని గాలికొదిలేస్తూ గాంధీని మళ్ళి చంపేసాను

అవును నేనే, గాంధీని, నాలో ఉన్న గాంధీని చంపేసానుసోదరుడు మలక్ ఆలోచన -
http://malakpetrowdy.blogspot.com/2009/10/blog-post.html
ఇవన్నీ ఎందుకడుగుతున్నానంటే ఇప్పుడే శరత్ తో మాట్లాడాను. కెబ్లాస అధ్యక్షుడిగా ఆయన సహాయానికి ముందుకు వచ్చారు. ఎక్కువా తక్కువా కాకుండా సహాయం చెయ్యదలచుకున్న వారి దగ్గరనుండి కనీసం 50 డాలర్ల చొప్పున సేకరిద్దామన్న ఆలోచన వచ్చింది.
- మలక్

మంచి ఆలోచన. మనం అందరం ముందుకి రావాల్సిన సమయం. అక్కడి సహాయక బృందాలకు స్పూర్తినివ్వాల్సిన సమయం.

Oct 1, 2009

జ్ఞాపకాల దొంతర - వ్యాపార అవకాశాలు ఓ మూడు కధలు

ఆ రోజుల్లో ....
కధ వన్ -
మేము తోటల మహానగరం, గదేన్వయా, బంగళూరులో ప్రాజెక్టు వర్కు ఎలగబెట్టేవాళ్ళం.
జెపినగర ఫేజ్ ఒకటి లో ఉండేవాళ్ళం. మాంచి రంజు పసందైన పేట అది. మా అపార్టుమెంటు కిరికిటీ తీస్తే యస్.యస్.యం.ఆర్.వి కళాశాల. రంగురంగులు. అహా ఓహోలు.
అలా ప్రాజెక్టువర్కుని సాగదీస్తూ సాయంత్రాలు గోలచేస్తూ వచ్చేపొయ్యే జనాలను గెలుకుతూ వీళ్ళేవరండీ బాబూ అని అనిపించుకుంటు ఉన్నరోజుల్లో ఓ పెద్దాయన ఓ రోజు మమ్మల్ని ఆపాడు.
"అబ్బాయిలూ ఏందీ కత" అన్నాడు
"అబ్బే ఏంలేదు మాదీఊరుకాదు" అన్నాం
"ఐతే ఓకే మరీమంచిది ఓ పలి మా ఇంటికి రండా, మాట్టాడాల" అన్నాడు.
ఏందిరో నాయనో అసలే ఊరుకాని ఊరు
పేటకానిపేట
ఇల్లుకాని ఇల్లు
స్థానబలం నేదు
పిలిత్తే పలికే నాధుడే లేడు వచ్చి నాలుగుతికేవాడేగాని అనుకున్నాం
ఎవురన్నా కంప్లైంటుజేసిన్త్రారా మనమీన అనుకున్నాం
జెస్తే ఎవత్తె జేసుండాచ్చూ అనుకున్నాం
ఏదైతే అదైంది. మనం గుంటూరోళ్ళం నాయ్యాల్ది జైహో అనుకున్నాం
ఎళ్ళాం. లోన ఓ పదిమంది కూకోనున్నారు. రెండు పిల్లిగడ్డాలు ఒకటి తెల్లది ఇంకోటి నల్లది. రెండు బోడిగుండ్లు ఒకటి తెల్లది ఇంకోటి నల్లది. ఓ పెద్డాయన ఓ సిన్నాయన ఒకడు నలుపు ఇంకోడు తెలుపు.
ఓ బోర్డు పెన్నులు, మార్కర్లు ఒకటి తెల్లది ఇంకోటినల్లది. హడావిడిగా ఉంది. దీనెక్క మనమీన ఎవురూ కంప్లైంటుజెయ్యలా అనుకుని లోనకి అడుగేసినం. అందరు సేతులు సేతులు పట్టుకుని లాక్కున్నరు.
ఇక ఓ తెల్ల పిల్లిగడ్దం ఏదో మొదలెట్టాడు. ఇంగిల్పీస్ లో తెగసెప్తున్నడు. బొమ్మలు గీస్తున్నాదు. మనకి ఇంగిల్పీస్లో కొంచెం ఈక్ [రహస్యం].
అర్ధంగాలే, సమఝ్గాలే. మాటల మధ్యలో ఎదో ఆడిగారు నన్ను. అహ, ఇహి, ఉహు అన్నా. సరే సరే అని మా దోశ్తుని అడిగారు వాడూ భాషమార్చి అహ ఇహి ఉహు అన్నాడు. అంతే వాళ్ళు మమ్మల్ని లెక్కలోకేసేస్కున్నారు. చివరికి ఉండబట్టలేక అడిగా మావా ఏందిరా ఈ గోల. కాపీ ఇచ్చారు, స్పీటుపెట్టారు అసలేంది కత అని?
సరే క్లుప్తంగా సెప్తా ఇనుకో అని ఆంవే అని, ఒక్కోడు ముగ్గుర్నో నలుగునో జేర్చాల అని, ఆళ్ళు ఒక్కోళ్ళు ముగ్గుర్ని జేర్పించాల అని ఏందో సెప్పకొచ్చాడు.
మేము పారిపోయివచ్చేసాం. ఒకడు బుక్కు. అది వేరే సంగతి.....

కధ రెండు -
రగతం మరిగే రోజుల్లో
మనమా ఓడికింద పనిసేయటమా అనుకునే రోజుల్లో
ఆదివారం పనిసెయ్యాలి లేకుంటే పీకేస్తాం అంటే ఏందిరా నువ్వుపీకేది, నేనే పీకేస్కుంటా అని లేచిఎళ్ళిపోయిన రోజుల్లో
జావా ప్రాజెక్టు అయ్యింది జెరెండుఈఈ ప్రాజెక్టుకి వెళ్ళు, ఈ పరీక్షరాయాలి ఐతే అంటే పోబే నేరాయ, ఇదినాకు అవమానం అనేసి పారెళ్ళొచ్చిన రోజుల్లో
యండిగాడిపెళ్ళాంతో డ్యాన్సుచెయ్యబోతే ఉద్యోగం ఊడబీకుచ్చుకుని రోడ్డునపడిన రోజుల్లో
కనిపించిన ప్రతీ బిజినెస్సూ సేసేద్దాం దానెక్క అని కాలుదువ్వేరోజుల్లో
డేటాఎంట్రీ వ్యాపారం రంజుగా సాగుతున్నరోజుల్లో
డేటాఎంట్రీలో పాతికలచ్చలు పోగొట్టుకుని నెత్తిన తెల్లగుడ్డేస్కుని ఇంకో పాతిక ముఫై యాణ్ణుంచైన ఎత్తుకొచ్చి మళ్ళీ వ్యాపారం మొదలెట్టాల అనుకునే రోజుల్లో హైద్ లో కేఫుల్లో కూకొని డెగిశాలు డేగిశాలు చాయ తాగుతూ పిరంగులు ఊత్తూ ఏదో సేసేయ్యాల అని రగిలిపోతూ ఊగిపోతూన్న రోజుల్లో
ఒకానొక రోజున పేపర్లో ఓ ప్రకటన
బ్రహ్మాండమైన వ్యాపారావకాశం. మీరు సొతంత్రభావాలు కలవారా? కలలు కంటారా? ఇరానీకేపులో చాయ తాగుతారా? ఫిరంగులు కాలుస్తారా? మీది గుంటూరా? బ్రాడీపేటా? ఐతే మాదగ్గర మీకోశం కలలోకూడా ఊహించని వ్యాపారావకాశం ఉంది, ఎమ్మటే వచ్చేయండేం. ఇదిగో పలానాసోట.
నాయాల్ది మనకోసమే ఎలా పడిందిరా అన్నాడొకడు. మనది గుంటూరని ఆళ్ళకెట్టా తెలుసుబావా అన్నాడింకోడు. మనది బ్రాడీపేట అని ఎట్టా పట్టేసార్రా అని అన్నాడింకోడు...
సరే ఆ రోజు రానే వొచ్చింది.
ఓ నాలుగు ట్రాక్టర్లు, రెండు లారీలు, పది సుమోలేస్కుని ఎళ్ళాం ఆడికి. అదో సినిమా హాలు.
లోనకి అడుగెట్టాం. కేకలు ఈలలు అరుపులు. కూకున్నాం.
స్క్రీన్ ముంగట నలుగురు నిల్చోని మైకులు పట్టుకుని నడిపిస్తున్నారు కార్యక్రమాన్ని. కూకున్న జనాలు మహా జోశ్ మీదున్నారు.
"మనం హైదరబాద్ లో ఉన్నాం"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మనం మనుషులం"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మనం"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మ"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు

ఎదోతేడాగా అనిపించింది.
ఇంతలో ఓ బండది ముందుకి దూకి తెరకాడికొచ్చింది.
ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"నువ్వు సిద్ధమా"
ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"ఔను"
ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు

సమఝ్గాలే!! మనకు సమఝ్గాలే. అప్పుడు కిందకి పడింది చూపు.
లూజ్ వెయిట్, ఆస్క్ మి హౌ. హెర్బల్ ప్రాడక్ట్స్.
సీన్ కట్ చేస్తే మేము మా లారీలు ట్రాక్టర్లు సుమోలు గాయబ్...అక్కణ్నుంచి పరుగో పరుగు.

కధ మూడు -
ట్రింగ్ ట్రింగ్.
"మాఁమా!!"
"ఏరా ఏంసంగతి"
"అంతా మంచేనా"
"మంచేలేరా సంగతిజెప్పు"
"మవా మీఊళ్ళో ఓ మీటింగు ఉందిరా. మా వాళ్ళు అరేంఝి జేస్తున్నరు"
"ఎవుర్రా మీవాళ్ళు"
"అయన్నీ తర్వాతజెప్తా. నువ్వు ఎల్లితీరాల."
"అట్టకాదురా కర్త కర్మ క్రియ సెప్పకుండా ఎట్టారా"
"ఆడికిబో మావా అన్నీ తెలుసుకొస్తై"
"ఏం కంపెనీరా అది"
"మావా నేనేమిజెప్ప, తప్పుజెప్తానేమో అని భయం. ఆడికిబో ఆళ్ళే జెప్తారు"
"సరే"
"ఇవిగో ఇవరాలు"

సీన్ కట్ జేస్తే
హాలిడే ఇన్, లేతం, న్యూ యార్క్ -
హడావిడి. లోనకిపోంగనే ఓ ఇద్దరు కుర్రాళ్ళు మనోళ్ళె సూటూబూటు.
"హిహిహి రండి రండి రండి"
"నేను మికు తెలుసా?"
"దాందేముంది తెలుసుకుంటే అదే తెలుసుద్ది ఇంతకీ మీటింక్కేగా ఒచ్చింది అటు అటు వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే అక్కడ. ఎళ్ళండి"
సమఝ్గాలే ఎడంకన్ను ఎగిరెగిరిపడతా ఉంది
లోనకెళ్ళినా
మళ్ళి అవే అరుపులు కేకలు ఐతే సూట్లు బూట్లు అత్తరులు సంపంగులు
"మనం అందరం ఒకే ఇది"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మనం ఓ కమ్యూనిటీ"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మీరందరూ ఫైర్ అప్ప్ అయిఉన్నరా"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మళ్ళీ"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మళ్ళీ"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"ఎక్సైట్ అయ్యిఉన్నారా"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"కొత్తగా వచ్చిన వాళ్ళకోసం"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"ఉండండి ఉండండి."
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మీరు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు"
నన్ను- "ఎనిమిది"
"నువ్వెప్పుడైనా ఊహించావా గంటకి కొన్ని వందల మ్యాన్ అవర్స్ ని?"
"యా కార్యాలయంలో "
"అదే నీ జీవితంలో జరిగితే"
"బొంగు"
"నీకు రెసిడ్యువల్ ఇన్కం అంటే ఇంటరెస్టా? ఓ గంటకి నీతోపాటు కొన్ని వందలమంది పనిచేస్తే ఎలా ఉంటుందో ఊహించావా?"
"సంగతేంది."
"నువ్వు చేరు, ముగ్గుర్ని చేర్పించు. ఆళ్ళు ఒక్కోళ్ళు ముగ్గురిన్ చేర్పిస్తారు. యాట యాట యాట."
"ఇదేం కంపెనీ?"
"క్విక్స్టర్"
మనం మాయం.