ఈ మధ్య మా ఏకస్థలబహుళగృహ సముదాయంలో జరిగిన ఓ సంఘటన.
మొన్నోరోజు ఆఫీసునుండి ఇంటికి వెళ్తూ పోస్ట్ చూద్దామని పోస్ట్ డబ్బావైపుగా వెళ్తున్నా. పాత్ వే మీద ఇద్దరు పిల్లలు, నల్లవాళ్ళు కూడా పోస్ట్ బాక్స్ వైపుగా వెళ్తున్నరు.
వారిని క్రాస్ చేస్కుని ముందికి వెళ్ళి నేను కారు పార్కింగ్ చేసి సూరిగాడికి పోస్ట్ బాక్స్ తాళంచెవి ఇచ్చాను వెళ్ళి చూసిరారా అని. వాడు కార్ దిగాడు. అప్పుడు ఆ నల్ల పిల్లలవైపు చూశాను. అందులో ఒకడు నాతో ఏదో చెప్తున్నాడు. నేను అద్దాన్ని కిందకి దింపి ఏంటీ అని అడిగేలోపు వాడు చేబులోంచి తుపాకీ తీసి వేలుమీదగా కిందకి వేళ్ళాడేసి, ఇది బీబీ గన్ (బొమ్మ తుపాకీ) అని చెప్తున్నాడు. నాకర్థం అవ్వలేదు. నాకెందుకు చెప్తున్నాడు? అని. ఓకే వాటెవర్ అన్నాను. నా కారుని దాటుకుంటు పోస్ట్ బాక్స్ వెనక ఉన్న ప్లే ఏరియాలోకి వెళ్ళిపోయారిద్దరు పిల్లలూ. అంతలో సూరిగాడు పోస్ట్ చూసొచ్చి కార్లో కూర్చున్నాడు. నేను క్రీగంట వాళ్ళెంచేస్తున్నారా అని గమనిస్తే, నావైపే చూస్తున్నారు. నేను వారివైపు తల తిప్పేలోపు మాయం అయ్యారు.
నాకు ఆశ్చర్యం వేసింది. ఆ గన్ పుల్ చేసిన పిల్లాడు సూరిగాడు వెళ్ళే బడికే వెళ్తాడు. అంటే ఇంకా ఎలిమెంటరీ స్కూలుకే అన్నమాట. అంటె పట్టుమని టీనేజి కూడా కాదు. ప్రతీరోజూ మా ఇంటి ముందునుండే వెళ్తాడు బడికి, ఇంటికీ. రోజూ చూస్తూనే ఉంటాను వాడ్ని. నాకే ఎందుకు చెప్పాడా అని ఒక పాయింటు.
ఇక నాకు కొంత భయం కూడ వేసింది. ఎందుకంటే సూరిగాడు కూడా వాడితో పాటు ఒకే బస్సులో వెళ్తాడు. ఇలాంటి పెద్ద పిల్లలు ఉన్న బస్సులో ఎలాంటి వెధవ వేషాలు వేస్తే అవి పిల్లలకు ఎలా అంటుకుంటాయా ఆని కొంత భయం.
ఇక వాడు చూపింది బొమ్మ తుపాకీనే అవ్వచ్చు గాక. కానీ బడి అయ్యాక ఇంటికొచ్చినాక దాన్ని బయటకు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందీ? ఏ శనివారమో పిల్లలంతా జేరి బొమ్మ తుపాకులతో ఆడుకోవటం ఒక పార్శ్వం. కానీ బడి ఉన్న రోజున. సాయంత్రం ఇద్దరే అలా తుపాకీతో తిరగాల్సిన అవసరం ఏంటీ? వాడు నాకు దాదాపు ముప్ఫై అడుగుల దూరంలోంచి చూపించాడా తుపాకిని. నల్లగా ఉన్నది. పిస్టల్ అనుకుంటా. అది నిజం తుపాకీనే అయే సంభావ్యత ఎంతా?
ఇలా పలు ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరి చెస్తుండగా మర్రోజు రెంటల్ ఆఫీస్కి వెళ్ళాను. మేనేజర్ తో మాట్లాడాను. ఇలా జరిగింది అని వివరించాను. కావాలంటే నేను వాళ్ళని గుర్తుపట్టగలను కానీ పట్టను. నా ఉనికిని నేను కాపాడుకోవాలి కదా. కాబట్టి మిమ్మల్ని హెచ్చరిద్దామని చెప్తున్నా అని చెప్పకొచ్చాను. ఆ సదరు పిల్లల మీద నాకెలాంటి ఇదీ లేదు కానీ, నా సేఫ్టీ నా కుటుంబం సేఫ్టీ అపార్టుమెంటు సేఫ్టీ కూడా ముఖ్యమనే భావనతోనే మీదృష్టికి తీస్కొస్తున్నాను అని వివరించాను. ఇలాంటివి మరికొన్ని సార్లు పునరావృతం అయితే ఈ అపార్టుమెంటుకి ఎవరొస్తారో మీరే ఊహించుకుని తగు సేఫ్టీ చర్యలు తీస్కుంటే బాగుంటుందని నొక్కి చెప్పొవచ్చాను.
ఐతే, చివరికి ఇలా అనిపించింది నాకు.
ఆ పిల్లాడు తుపాకీ చూపుతున్నప్పుడు నేను కార్లోనే కూర్చొనున్నాను. ఒకవేళ అది నిజం తుపాకీ అయుండి, నేను నా దురద్రుష్టం కొద్దీ కారు దిగివారివద్దకు వెళ్ళే ప్రయత్నం చేసుంటే ఏవైయుండేదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. సో! మన అదృష్టం బాగుండి అలా చేయలేదు....
ఆ నల్లపిల్లాడి అదృష్టం బాగుండి నాదగ్గర తుపాకీలేదు. ఇలాంటి పరీస్థితుల్లో మరొకడో మరొకడో అయుంటే వెంటనే తుపాకి తీసి షూట్ చేసుండే అవకాశాలున్నాయి. అది బొమ్మ తుపాకీనే అయున్నప్పటికీ. పిల్లాడు నాకు తుపాకీని చూపించాడేకాని ఎక్కుపెట్టలేదు. అయినా!
మిత్రులారా! గమనిస్తూ ఉండండి. ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే మీ గృహసముదాయ కార్యాలయంలో చెప్పండి. సెక్యూరిటీని టైట్ చేయమని చెప్పండి. పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్ళండి. మీ పేరు బయటకు తెవద్దని మనవి చెయవచ్చు కూడా.
Nov 20, 2012
Subscribe to:
Post Comments (Atom)
Bhaskar Garu,
ReplyDeleteEvery time I see a post from you on such incident I will have another incident to share. It is just a coincidence or may be we are the only one's sharing such incidents or may be we are living in such a society where these kind of things are sometimes common.
Coming to the incident, I have to share, this in CT.
An elementary school kid got the toy gun to school ( I think it has some plastic Tarts( not sure what these are called))and the boy took it out and started playing( shhoting at other kids) it in the class. Teacher noticed it and called the principal. Principal thought in the same way as you mentioned what if it was a real and she reacted immediately called police,the kid was arrested, suspended, case was filed and so on.
Listening to this I couldn't sleep for a week.
I was thinking poor little boy not even 9 years old had to go through this much ? can never go to school again ? ( I too thought what if it was real and someone was injured. i dont think at such a tender age any one will have any motif except the curioisty of trying it out)
why should he be the scapegoat ? who gave the toy to him ( looks like his uncle gave hime as gift previous day) why these kind of toys are made ?
how can a kid differntiate if it is real or toy ?
why should the media, society publicize these gun actions so much and raise the curiosity of kids?
what about the movies ?
Lastly why did the parents check what the boy was taking to school?
who is responsible for the kids behavior ?
Finally I learnt that kid is back in another school.
Sorry for lenghty comment.
Surabhi
this is a very deeper issue sir. we may need to to research.
Deleteశ్రీ సురభి గారూ
ReplyDeleteఇదొక మల్టై డైమెన్షనల్ థింగ్ అండీ. అంత సులభంగా ఒక కన్‌క్లూజన్‌కి రాలేం.
సాధారణంగా ఇందులో పిల్లల తప్పు వెతికేకన్నా సదరు పిల్లల తల్లితండ్రులను తప్పుపట్టాలి.
పై సంఘటన నాకు కొంచెం ఇబ్బంది కరంగా మారటానికి కంత నేపథ్యం కూడా ఉన్నది. రెండు నెనల క్రితమే మా అపార్టుమెంటులో షూటింగ్ జరిగింది. అది బొమ్మగన్నే అయుండచ్చు గాక. కానీ అప్పుడప్పుడే టీనేజ్ లోకి వెళ్తున్న ఒక కుర్రవాని చేతిలోకి అలాంటి బొమ్మ చేరితే మానసికంగా ఎలాంటి స్థితికి వెళ్తాడో అనే భయం ఎదుటివాడికి కలగటం తప్పుకాదు. టూమచ్ గా థింక్ చేయటమూ మంచిదికాదు. కానీ ఇందులో వాడితోపాటే బడికి వెళ్ళే మావాడి మీద ఇలాంటి పిల్లల పొడ పడకుండా ఉండాలంటె మనం ఏంచేయాలీ ఇత్యాది ఆలోచనలు కలగక మానవు కదా. అండ్ వాటిని తప్పక అడ్రస్ చేయాలి కూడా
అది ఆటలాడుకునే బొమ్మ తుపాకీయే ఐతే నాకు చూపించి చెప్పాల్సిన పనేఉందీ?
ReplyDeleteBhaskar Garu,
ReplyDeleteLooks like I have not communicated properly on what I wanted to say.
I only wanted to share the incident I knew and did not had any intention to compare.
I do understand these two are different scenarios. I am with you on the concerns you have raised and the cautions too.
హ్మ్
ReplyDeleteeek!!! jagraththa raa babooo.. eeyyal repooo em seppaleni paristhithi... vaadu inko roju nijam tupaaki thechchina thevatchchu
ReplyDelete