Jul 14, 2012

గౌహతి మొలెస్టేషన్

ఇరవై మంది మగాళ్ళు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయటం దాన్ని వీడియోతీయటం, యూట్యూబుకి ఎక్కించటం
థూ!!
ఎటుపోతున్నాం మనం? మనదీ ఓ సమాజమేనా? మనం మనుషులమేనా? మానవత్వం అనేది అసలు ఏడ్చిందా అనే ప్రశ్నలను అడగలేక అడిగినా బదులు రాక గోడల్తో మాట్లాడినట్టుగా అనిపించి, గొంతులోనే ఆపుకున్నాను.

థూ!! నాకు మాటలు రావటంలేదు.

పిల్లలు ఎటు పోతున్నారో కూడా పట్టించుకోని తల్లితండ్రులదా తప్పు? పుట్టినరోజు పండక్కి బారుకెళ్ళే సంస్కృతిదా తప్పు?

తప్పెవరిదీ అనేకన్నా మన సిస్టం ఎంతలా కుళ్ళిపోయిందో అనాలనిపిస్తున్నది

ఎందుకంటే  -
ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండు పుట్టిన్రోజు పండగ సెలబ్రెషన్సు కోసరం బార్ కి వెళ్ళింది.
మైనర్ బాలికని బారులోకి ఎలా అనుమతించారూ?
అనేది కూడా ఓ మౌళిక ప్రశ్న.
ఏవైనా సిగ్గుపడాల్సిన సంఘటన
సదరు వ్యక్తులకు కఠిన శిక్ష పడాలని కొనఊపిరితో ఉన్న న్యాయవ్యవస్థని ప్రార్థిస్తున్నా

15 comments:

 1. అబ్బాయ్ నువ్వు మరీ అతి సున్నితమనస్కుడవై పోతున్నావ్.
  ఉచితవినోదాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పు.

  ReplyDelete
 2. అవును. చాలా మౌలిక ప్రశ్నలున్నాయి. పదిహేడేళ్ల మైనర్ అమ్మాయి ఎంత పుట్టిన రోజైతే మాత్రం, బార్ కి ఎలా వెళ్లింది? తల్లిదండ్రులు ఎలాగ అనుమతించారు? వాళ్లకి ఒకవేళ అభ్యంతరం లేకపోయినా, లేదా ఈ అమ్మాయి అబద్ధం చెప్పి వెళ్లినా, బార్ యాజమాన్యం అమ్మాయిని ఎలాగ అనుమతించారు?
  సరే వెళ్లినా మళ్లీ తిరిగి ఆ అమ్మాయి ఎంత బార్ నుండి వస్తున్నా, ఈ ఆటవికులు ఎవరు? నడి రోడ్డు మీద అత్యాచారాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడమేమిటి? మూడు రోజులకి కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేశారు.. నిజంగా ఇంతటి సిగ్గు చేటు సంఘటన ని టీవీ ల్లో చూసి,పేపర్లలో చదివి కూడా ఈపూట మామూలు గా అన్నం తిన్నందుకు కూడా తల వంచుకోవాలి,మౌనం పాటించాలి. I share your pain.
  Very very disturbed by this incident.

  ReplyDelete
  Replies
  1. కృష్ణప్రియ గారూ
   ధన్యవాదాలు. మౌళికమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకటం కూడా అనవసరం, సమాధానం రాదు కనక

   Delete
 3. ఒక నాణేనికి రెండు వైపులా చూడాలి.ఆ సంఘటనని వీడియో తీయడం వల్లనే ప్రపంచానికి తెలిసింది.తను ప్రతిఘటించినా ఫలితం లేక వీడియో తీసినట్లు అతను చెప్పుకున్నాడు.అది నిజమే అయివుంటుంది.అలాటి సంఘటనలు యెన్ని జరుగుతున్నాయో ప్రపంచానికి తెలియదుగదా !సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి , అరాచకం ,ధనదాహం , .... వీటి నుండి విముక్తి చేయడానికి దారులు వెదకాలిగాని తప్పెవరిది అని చర్చించుకోవడం శుధ్ధ దండగ.

  ReplyDelete
  Replies
  1. >>అలాటి సంఘటనలు యెన్ని జరుగుతున్నాయో ప్రపంచానికి తెలియదుగదా<<
   గుడ్ పాయింట్ జెపి గారూ

   Delete
 4. భారతీయులు దశాబ్దాలబట్టి ఒక చిత్రమైన జబ్బుతో బాధపడుతూ ఉన్నారు. తప్పేమిటో తెలుసు. అది కళ్ళ ముందు జరుగుతుంటే అపే శక్తి తనకు తప్ప ఇతరులకు మాత్రమే ఉండాలని లేదా ఉందని అందరూ అనుకోవటం. దానివల్లా తప్పు ఆపటానికి ఎవ్వరూ ఆసక్తి కనబరచరు. భగత్ సింగ్ ఎప్పుడూ పక్కింట్లోనే పుట్టాలి, మనింటో మాత్రం సామాన్యమైన బాలుడే జన్మించాలి. టి వి పానెల్ చర్చల్లో మటుకు మాటలు కోటలు దాటుతుంటాయి. అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని. మరొక రకమైన రుగ్మత కూడ అంటు రోగంగా ప్రబలి ఉన్నది అందరిలోనూ. ఎవరికీ ప్రత్యేకమైన అభిప్రాయలంటూ ఉండవు. ఆవతలి వాడు చెప్పినది కాదంటమే చాలా మంది అభిప్రాయం. ఇటువంటి రోగాలవల్ల మనం ఒక దేశంగా చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తున్నది. ఎవరికి వాళ్ళం తెలివిగలవాళ్ళమే. కాకపోతే కలివిడిగా ఉండలేము, ఉన్నా సవ్యమైన ఆలోచన రాదు, ఒక వేళ వచ్చినా దాన్ని తీవ్రంగా ఖండించటానికి మరొక పెద్ద గుంపు ఎప్పుడూ సిధ్ధంగా ఉంటుంది. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనే తీసుకుందాము. పోలీసులు వచ్చి ఆ దుండగులను కాల్చిపారేశారనుకుందాం అప్పుడు ఎంత గోల, మానవ హక్కులు, విచారణ, గోంగూర అంటూ.

  ReplyDelete
  Replies
  1. ఔనుసార్
   వీరు దొరికినా శిక్ష ఏ వేస్తారూ? వేసిన ఏ రాష్ట్రపతో క్షమాభిక్ష పెడుతుంది.
   మన చట్టం ఇంత కఠినంగానూ మన న్యాయవ్యవస్థ ఇంత పటిష్టంగానూ ఉంటే మనం కేవలం ప్రేక్షకుల్లా మిగలటమే చేయగలిగింది.
   ధన్యవాదాలు
   -భాస్కర్

   Delete
 5. ఈ మాట అనగానే చాల మంది అంటున్నారు "అసలకి ఆ పిల్ల బారు కి ఎందుకు వెళ్ళాలంట?" అని...అయ్యా నాకోఅర్ధం కాని విషయం... బయట ఉంది వినోదం చూస్తున్న గాడిదలకు తెలీదు కదా... ఆపిల్ల తాగి ఉందా? వ్యభిచార? ఇంట్లో అబద్ధం చెప్పిందా? ఇవన్ని అనవసరం కదా? చూస్తు ఉండగా మన కాళ్ళ ముందు ఒక ఆడ పిల్ల ని అలా చిత్ర వధ చేస్తుంటే మన ఇంట్లో ఉన్న అమ్మ అక్క చెల్లి భార్య గుర్తు రారా? దాని తరువాత వాళ్ళ చావు వాళ్ళు చస్తారు...కాని మన కాళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోకపోతే రేపు ఆ స్థానం లో మన ఇంట్లో ఉన్నా అదే పరిస్థితి....

  ReplyDelete
  Replies
  1. నాకు శ్రీపాద వారి "తులసి మొక్కలు" లో ఈ మాటలు గుర్తుకు వచ్చాయి లక్ష్మీ నరేష్ గారి వ్యాఖ్య చూశాక:
   "బోగందైతే మాత్రం! ఎదిగిన బిడ్డ; తప్పుకాదూ?" ఆ మాటల ఆ అమ్మాయిని ఆలోచింప చేసి తనూ ఒక మనిషినే అన్న నమ్మకాన్ని కలిగించాయి. అలా ఆలోచింపచేసే లా ఉండాలి కదా మన observations.

   Delete
  2. In trying to be brief I might not have conveyed my sense correctly. నేను పై వ్యాఖ్యలో ఆ అమ్మాయి ఎలాంటిది అన్నది ఆ తప్పు పని చేసే వాళ్ళకి excuse కాకూడదు అన్న విషయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఆ అమ్మాయి ఎలాంటిది, ఏ పరిస్థితులలో బయటికి వచ్చిందీ అన్నది ఇంకో చర్చా విషయం. Independent of that discussion తప్పు చేసిన వాళ్ళది తప్పే. ఇలా చేస్తే వాళ్ళు అలా react అవుతారు అందుకని ఇలా చెయ్యద్దు అని ఎలా చెప్తారో (చెప్పాలి కూడాను), అమ్మాయిలకి, అలాగే అబ్బాయిలకీ అమ్మాయిలు ఇలాంటి బట్టలు వేసుకున్నారు కదా అని మీరు వారిని తేలికగా తీసుకోకండి అని కూడా చెప్పాలి.
   All said and done, it was a very unfortunate incident. Very sad. Hope (against hope) such incidents do not happen at all. Hope the energy of the youth finds right channels and expresses itself in a positive way.

   Delete
 6. ౧. సమాజం ఎలా మారుతున్నదో, సాయంత్రం ఐతే ఎంత విషపూరీతపైన పాములా రూపాంతరం చెందుతున్నదో తెలుసుకోటానికి పేద్ద పుస్తకాలు చదవాల్సిన పనిలేదు. కాబట్టి, ఆడపిల్ల తగు జాగ్రత్తలో ఉండటం అనేది బహుముఖ్యం.
  ౨. మౌళిక ప్రశ్నలు అనేవి కేవలం వీళ్ళిలా ఎందుకు చేశారూ చేయవచ్చా అనే స్థాయికన్నా, అసలు వ్యవస్థలో జరుగుతున్న మార్పులు, వ్యవస్థ యొక్క దిగజారుడుతనం, దాన్ని తిరిగి నిలపెట్టేందుకు కావాల్సిన వ్యవస్థపై, కావాల్సిన చైతన్యంపై. పై సంఘటనలో చట్ట వ్యవస్థ, ఆబ్కారీ వ్యవస్థ ఇత్యాది ప్రభుత్వ వ్యవస్థల ఫైల్యూర్ అనేది పెద్ద కోణం అని నా అభిప్రాయం.
  ౩. అమ్మాయి బారుకి వెళ్తే మాత్రం ఇలా చేయటం తప్పు.

  ReplyDelete
 7. /మైనర్ బాలికని బారులోకి ఎలా అనుమతించారూ?/
  :)) ఎపుడో ఓ సారి బార్‌కు వెళ్ళినపుడు అక్కడ బర్త్‌సర్ట్లు వెరిఫై చేయడం చూసినట్టు గుర్తులేదు. ఈసారి వెళితే అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు తీసుకెళతా, ఎందుకైనా మంచిది. :P :))

  ఏడు చేపల కథలోలా
  చేపా చేపా ఎందుకు ఎండలేదు?
  జ: గడ్డి మోపు అడ్డమొచ్చింది
  గడ్డి మోపా గడ్డి మోపా ఎందుకడ్డమొచ్చింది?
  జ: ఆవు నన్ను మేయలేదు

  ఆ అమ్మాయి చేసిన ఎదవ పనికి శిక్ష ఎక్కువగానే పడింది, ఇక ఆ మృగాలు చేసిన అకృత్యాలకు శిక్ష పడాల్సివుంది. రిపోర్టర్ కెమెరాతో ఆ రాత్రి అదే స్పాట్లో వుండటం యాదృచ్చికమా?!

  ReplyDelete
  Replies
  1. ఆళ్ళకి సిచ్చ నిజంగనే పడిద్దంటావా?
   ఏం సిచ్చ పడిద్దీ? *కఠిన కారాగార సిచ్చా*?
   ఉండు ఇప్పుడే ఓ టపా రాస్చన్నా
   ఆడ మాట్టాడుకున్దావు.
   ఉండన్నా
   కదలమాక
   ఈణ్ణే ఉండాల శంకరన్నా

   Delete