మాతృభాష నేర్పకపోతే పిల్లలకి ఎలా?
పిల్లలు అవసరానికి ఏవైనా నేర్చుకోగలరు, వారి లెరనింగ్ కర్వ్స్ హైగా ఉంటాయని గుర్తించకపోతే ఎలా?
పిల్లలు *లెరనింగ్ బై ఇమిటేషన్* అనే ప్రక్రియ ద్వారా పదహారు భాషల దాకా అవలీలగా నేర్చుకోగలరనీ, అంచేత మాతృభాషని ముందు నేర్పుకుంటే, అవసరానికి మిగతా భాషలు నేర్చుకోగలరనీ ఎందుకు గుర్తించరూ అమెరికాలోని భారతీయులు, అందునా తెలుగువాళ్ళూ?
నాల్గు గోడలమధ్య, అదే ప్రపంచం అనుకుని, ఆ నాల్గు గోడల రాజ్యానికి తనే అధికారినని విర్రవీగుతూ, తీస్కునే నిర్ణయాలలో తప్పొప్పులు చెప్పే మహానుభావులు లేక, సరిచేసే పెద్ద హస్తంలేక చేసే పనులవల్ల, మన సంస్కృతి భూస్తాపితం అవుతుందని గుర్తించు!!
ఒక మెక్సికన్ తన పిల్లలతో స్పానిష్ లోనే మాట్లాడతాడు
ఒక మెక్సికన్ తన సహ మెక్సికనులతో స్పానిష్ భాషలోనే సంభాషిస్తాడు
ఒక పనామా వాసి తన పిల్లలతో స్పానిష్ లోనే మాట్లాడతాడు
ఒక బ్రజీలియన్ తన పిల్లలతో పోర్చుగీసులోనే మాట్లాడతాడు
ఒక తెలుగువాడు తన పిల్లలతో ఆంగ్లంలో ఎందుకు మాట్లాడాలీ?
Subscribe to:
Post Comments (Atom)
అడిగేవాళ్ళు లేక ఇష్టం వచ్చిన భాషలో మాట్లాదేసుకు౦టున్నారు. కాస్త గట్టిగా అడగండీ..మీకు సహాయంగా మేము కూడా వస్తా౦.
ReplyDeleteమంచి ప్రశ్న .. భాస్కర్ రామరాజు గారు.
ReplyDeleteనాకు తెలిసిన ఒక కుటుంబం వారు US లో ఉద్యోగం కోసం వెళ్ళారు.అక్కడే స్థిరపడ్డారు భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లు. వారి పిల్లలకి అసలు తెలుగు నేర్పలేదు. వారి బంధువులతో ఆ పిల్లలకి అసలు మాటా-మంతీ ఏం లేదు. నానమ్మ-తాతయ్య ,అత్తయ్య..ఎవరితో సంభాషించలేరు ఎందుకంటే వారికి తెలుగు రాదు,ఇక్కడ వారికి ఇంగ్లిష్ తెలియదు. . ఆ భార్యాభర్తల తోనే ఇక్కడ వారితో సంబంద బాంధవ్యాలు తెగి పోయాయి.తప్పు ఎవరిది అంటారు? మాతృ భాష పై ,మాతృ భూమి పై మమకారం విదేశాలు వెళ్లినవారికి కొంతమంది కైనా మిగిలి ఉంటే.. మీరు ఈ ప్రశ్న సంధించేవారు కాదండీ!!
అవును, మనం కూడా పిల్లలతో ఫ్రెంచి లోనో , స్పానిష్ లోనో మాట్లాడడం మొదలెట్టాలి.
ReplyDelete:))))
Deleteనా చుట్టు పక్కల నేను ఈ మధ్య చూస్తున్న తెలుగు వారందరూ పిల్లలతో తెలుగులోనే మాట్లాడ్తున్నారండీ. కొంత మంది పిల్లలు తెలుగులోనే సమాధానం చెప్తున్నారు కూడా.
ReplyDeleteలలిత గారి మాటే నా మాట కూడా. ట్రెండ్ మారుతోంది. తెలుగులోనే మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలా మంది.
ReplyDeleteమా వాడి ఆంగ్లం ఇక్కడ అమెరికా లో కేవలం పాటశాలకు మాత్రమె పరిమితం .. ఇంటికి వచ్చిన దగ్గరి నుండి ... ఇంట్లో కాని .. పక్కన తెలుగు పిల్లలతో కాని తెలుగు లోనే మాటాలాడాలి .. అలాగే వాడు మాట్లాడతాడు . కనీసం అంకుల్ .. ఆంటీ అని కూడా అనడు . మామా , అత్తా అని పిలుస్తాడు .
ReplyDeleteవాళ్ళు ఒకొక సారి మస్తుగా గుసాఇస్తారు .. వారి ఖర్మ అంతే ... :)
నేను చెప్పేది బహుసా కొంత వింతగా ఉండవచ్చేమో కానీ మన తెలుగు పిల్లలు ఉత్తరాదివాళ్ళని పెళ్ళి చేసుకున్న తరువాత ఆ ఉత్తరాది వాళ్ళు చక్కగా తెలుగు మాట్లాడటం మొదలు పెట్టినవాళ్ళు కూడా ఉన్నారు.అది మా కుటుంబంలోనే.
ReplyDeleteక్రిష్ణవేణి
అది మన తెలుగు వారి సిగ్గుమాలినతనం అని నేను నిసిగ్గుగా చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు అద్యక్షా...! మీరు మెక్సికో, బ్రెజిల్ వరకు వెళ్ళనవసరం లేదు, అవి వేరే దేశాలు, పక్కేనే ఉన్న తమిళులు అత్యవసరమయితే తప్ప వాళ్ళకి ఆంగ్ల బాష వచ్చు అనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోరు, అలాంటి వారికి పక్కనే ఉన్న మనకు ఏ మాత్రం సిగ్గు, లజ్జ, బుద్ది లేదు, వాళ్ళని చూసినా సిగ్గు రాదు. పరాయి బాషలను, సంస్కృతిని చేతనయినంత తొందరగా అలవరచుకోవడమే గొప్ప అనుకుంటారు మన తెలుగు వారు. తమిళ సోదరులను, జాతిని చుస్తే ఒకోసారి ఈర్ష్య కలగక మానదు, మరు జన్మలోనైనా ఒక తమిళుడుగా .....!
ReplyDeleteచిరంజీవి గారు అసలు గోదావరి జిల్లా నుండి వచ్చిన వారు, మరి వారి కొడుకు నిశ్చితార్దంలో మాత్రం వేషదారణ చుడండి, పెళ్ళిళ్ళ లో కుడా సంగీత్ అని అదని, ఇదని ఏవేవో ఉంటాయి. ఇదంతా తెలుగు పెళ్లి సంప్రదాయమేనా అసలు ....? చరణ్ గారు షేర్వాని ధరించారు. ఏదో పల్లెటూళ్ళలో ఉన్న కొంత మంది పెద్ద మనుషుల వలన ఇంకా తెలుగు సంస్కృతీ అనేది మరణ శయ్య మీద చావు రాక కొట్టుమిట్టాడుతుంది. భాగ్యనగరం లాంటి సంకర జాతి పట్టణాలలో అది దగ్గరదగ్గర చచ్చిపోయినట్ట్లే. ఆంధ్రా వారికన్నా తెలంగాణా లోని ప్రజలు బాషను, సంస్కృతిని కాపాడుకోవడంలో నిబద్దత కలిగిన వారని నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఆంధ్ర ప్రాంతం వాడినైనా కుడా ఈ విషయం చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు, ఎందుకంటె అది ఏ విషయం పైనైనా నిజం నిర్భయంగా చెప్పుకోవాలి కాబట్టి...!
బాగా చెప్పారు.
Delete/ఆంధ్రా వారికన్నా తెలంగాణా లోని ప్రజలు బాషను, సంస్కృతిని కాపాడుకోవడంలో నిబద్దత కలిగిన వారని నా వ్యక్తిగత అభిప్రాయం./
వాళ్ళకు తెలుగు, ఉర్దు తప్ప వేరే భాష ఏదీ తెలియక పోవడం కూడా కారణం కావచ్చు. ఉర్దు ఆటో వాళ్ళ, స్కూటర్/కార్ మెకానిక్‌ల భాషాయె. :) ;)