[ బుధవారం, ఫిబ్రవరి 08, 2012 ఈనాడు]
కొంతకాలం క్రితం తాత ఇలా చెప్పుకొచ్చాడు -
దేశంలో 42శాతం మంది పిల్లలు బరువు తక్కువగా ఉండటం దేశానికే సిగ్గుచేటు. పౌష్టికాహారలోపం సమస్య పరిష్కారానికి కేవలం ఐసీడీఎస్‌పైనే ఆధారపడలేం. పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్న జిల్లాలు, అందుకు కారణమవుతున్న పరిస్థితులున్నజిల్లాలపై మనం దృష్టిసారించాలి
-తాత [ప్రధానమంత్రి]
కాబట్టి,
బాబులూ, రాజకీయ దురంధరులూ, రాజకీయ వి-నాయకులూ, డబ్బిస్తే ఏవైనా చేసే కుంకలూ, దగుల్బాజీలూ!!
ఒక్కమారు ఆలకించండి. మీ చుట్టూతా చూడండి. తిండికిలేక మలమల మాడుతున్న జనారరణ్యపు చేతగాని ప్రాణులను చూడండి. కారుమీద గుడ్లు వేస్తే వచ్చేదేవీలేదు. సదరు కారుకే తగిలేది. అవి ఆ కారులోని వ్యక్తికి తగిలినా పేద్ద జరిగేదేవీలేదు. మీరు ఇండ్లకెళ్ళి ఈ పనికిమాలిన పనితో సమ్పాదించిన డబ్బుతో మందుకొడతారు. సదరు వ్యక్తి ఇంటికెళ్ళి గుడ్లు కడిగేస్కుని మందుకొడతాడు
ఎనుబోతు మీద వాన కురిస్తే ఏటౌద్దీ?
ఎక్కడా మార్పు రాదు
ఎవడూ మారడు
ఇంత మాత్రం దానికి గుడ్లు వృద్ధా చేస్తారా?
వాటిని అన్నార్తులకు పంచండి
దయతో!!!
మా బాగా చెప్పారు
ReplyDeleteచాలా బాగా చెప్పారు సోదరా..
ReplyDelete