Apr 12, 2012

డా॥ రమణ గారి *కోటయ్య కొడుకు*

నిన్నటి మా డాట్రుబాబు రమణ గారి టపా, నాన్న పొదుపు - నా చిన్ని కష్టాలు! సదివినాంక, ఈ కింది పేరా
కోటయ్య కొడుకు వైపు దృష్టి సారించాను. అడుగు బద్దలా బక్కగా, పొట్టిగా ఉన్నాడు. డిప్ప కటింగ్. చీమిడి ముక్కు. మిడి గుడ్లు. తన లూజు నిక్కర్ జారిపోకుండా ఒక చేత్తో పట్టుకుని.. ఇంకో చేత్తో తండ్రి చెయ్యిని గట్టిగా పట్టుకుని బిడియంగా నాకేసి చూస్తున్నాడు. మాసిన తెల్ల చొక్కా మోకాళ్ళ దాకా లూజుగా వేళ్ళాడుతుంది. చొక్కా గుండీలకి బదులు రెండు సేఫ్టీ పిన్నులు. ఇంజెక్షనేమన్నా పొడిచేస్తానేమోనన్న బెదురు చూపులు. ఈ ఆకారాన్ని ఎక్కడో చూశాను. ఎక్కడ? ఎక్కడ? ఎక్కడబ్బా? ఎక్కడో ఏమిటీ! అది నేనే!!

బాగా నచ్చి......శ్రీ అన్వర్ గారికి ఓ మెయిల్ పెట్టాని.
పై డిస్క్రిప్తన్తో అన్వర్ గారు ఓ బొమ్మగీయాలని ప్రార్థన అని. వారు వెంటనే స్పందించి ఇలా గీసి పంపించారు.


అన్వర్ గారికి కృతజ్ఞతలతో
డా॥ రమణగారికి అభినందనలతో

11 comments:

  1. చిత్రం వర్ణనకు తగ్గట్టు బాగుంది.

    ReplyDelete
  2. వావ్.. ఎంత బావుందో.
    అన్వర్ గారికి థాంక్స్.

    ReplyDelete
  3. WOW, Excellent!
    మరి రమణ గారికి చూపించారా లేదా? ఆయన సంతోషిస్తారు!

    ReplyDelete
  4. సూపెర్బ్!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. అద్భుతం.
    చిన్నప్పుడు మనందరి ఫోటో(చిత్రం) అదేనేమో.

    ReplyDelete