మాతృభాషా దినోత్సవమ్
భలే ఉంది కదూ
మాత, భాష, దిన, ఉత్సవం
అంతా సంస్కృతమే.
సరే!! మాతృభాషాదినోత్సవ సందర్భంగా ఏంచేసావ్? అని ఓ ప్రశ్న.
నా ముచ్చట చెబుతా విను.
ఇయ్యాల్నే మొట్టమొదటిసారి ఇంటా ఉన్నా ఈ దినోత్సవాన్ని. ఇంక ఏంజేసినా ఈయ్యాల?
మామూలుగానే లేచినా,
పండ్లు తోమినా
బువ్వ తిన్నా
పిల్కాయల్తో మాట్లాడినా
ఆడినా
పాడినా
పనికొచ్చినా
పనిజేసినా
....
....
.....
ఇంకేంజేయాలే?
మాతృభాషాభివృద్ధికి ఏం జేసినా అనా నీ ప్రశ్న. మరట్టాజెప్పు.
కిం.ప.దొ.న.
భాషాభివృద్ధికి మనం ఏంజేయాలా? ఏం జేసేపనిల్యా. తెలుగులో మాట్టాడు, అదే నిల్చిద్ది.
భాషని రక్షించాలంటే
నెట్లో తెలుగులో టైపించినంతమాత్రాన భాష బతకదు. భాష అనేటిది ఓలటైల్. మాట్లాడాల. మాట్లాడకపోతే భాష పోయిద్ది. భాషని నిల్చుకోబెట్టాల్నంటే, ఆ భాషలో మాట్లాడాల. ఆంగ్ల మాధ్యమాన్ని పక్కనపెట్టాల. టింగ్లిష్ బందుజేయాల. టీవీలల్లో తింగరి తెలుగు ఆపేయాల. సినిమల్లో పిచ్చి తెలుగుని ఆపేయాల. పిల్లల్తో తెలుగులోనే మాట్లాడాల. తెలుగు మాట్లాడమని వాళ్ళకి ప్రోత్సహించాల.
నిన్న సూరిగాడి కరాటే క్లాసులో ఓ పెద్ద కుటుంబాన్ని చూసా. వాళ్ళ పిల్లలు నలుగురు కరాటే నేర్చుకుంటుంన్నారు. వాళ్ళంతా కమ్మగా స్పానిష్లో మాట్లాడుకుంటున్నారు. పిల్లల్తో కూడా స్పానిష్లోనే. ఆపిల్లలూ స్పానిష్లోనే జవాబిస్తున్నారు. మిగతా జనాలతో ఆంగ్లంలో జవాబు ఇస్తున్నారు. మన తెలుగువాళ్ళో? పిల్లల్తో ఆంగ్లంలో మాట్లాడతారు.
సమస్య ఎక్కడా?
సమస్య తల్లితండ్రులే. ఎందుకూ?
పిల్లలకు భాష అనేది లెర్నింగ్ బై ఇమిటేషన్ ద్వారా వచ్చేస్తుంది. అంటే విను నేర్చుకో, చూసి నేర్చుకో, అనుకరణ స్వారా నేర్చుకో. భార్యా భర్తా తెలుగులో మాట్లాడుకుంటారు. పిల్లల్తో ఆంగ్లంలో మాట్లాడితే, అది లెర్నింగ్ కర్వని బ్రేక్ చేయటంలేదా? ఆలోచించండి.
భాషని బ్రతికించుకోవాలంటే ఇలాంటివి మానేసి, చక్కగా తెలుగులోనే మాట్లాడుకోవాలి. పిల్లల్తో తెలుగులోనే మాట్లాడాలి. వారినీ తెలుగులో జవాబివ్వమని చెప్పుకోవాలి.
ప్రింట్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా తెలుగు అచ్చువేసినా ఉపయోగం లేదు. భాష మాట్లాడితేనే నిలిచేది. దాని లోతు తెలిసేది. భావాన్ని అర్థవంతంగా చెప్పగలిగేది.
సరే, ఇషయానికొస్తే, ఈయ్యాల రోజుట్లాగనే మా పిల్కాయలతో తెలుగులోనే మాట్లాడినాను. వాళ్ళూ తెలుగులోనే సమాధానం చెప్పినారు. ప్రత్యేకంగా మాతృభాషా దినోత్సవాన్ని నేనేతే ఏం చేస్కోలేదు, చేయలేదు.
Feb 21, 2012
Subscribe to:
Post Comments (Atom)
:)
ReplyDeleteGood post..liked it!
ReplyDeleteతెలుగు సౌమ్యా, తెలుగు.
ReplyDeleteభాస్కర్ గారు, బాగుంది.
This comment has been removed by the author.
ReplyDelete"భాష మాట్లాడితేనే నిలిచేది. దాని లోతు తెలిసేది. భావాన్ని అర్థవంతంగా చెప్పగలిగేది."
ReplyDeleteనూటికి నూటొక్క పాళ్లు అంగీకరిస్తున్నాను. టపా బాగుండాది.
>>భాషని నిల్చుకోబెట్టాల్నంటే, ఆ భాషలో మాట్లాడాల>>
ReplyDeleteచక్కగా చెప్పారు.
భాస్కర్ గారు, మనం మాట్లాడితే చాలు, మీరన్నట్టు పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. ప్రత్యేకంగా ఉద్యమాలు చేయనక్కర్లేదు. డాడి, మమ్మీ, అనిపించుకుంటే అవమానం అనుకుంటే మనం తెలుగు భాష కి బోలెడు సేవ చేసినట్టే! మీ టపా బాగుంది.
ReplyDelete