Mar 2, 2012

రోడ్డెమ్మట, గోడలనిండా సుట్టూతా నా వాళ్ల రక్తం సాక్ష్యంగ.......

వాడు నవ్వుతున్నడు
ముక్కలైన జన దేహం
పగిలి వక్కలౌతున్న కుటుంబాలు నా కళ్ళల్లో

పొద్దున్నే లేచి బువ్వ డబ్బాకెత్తుకుని
ఎప్పట్లాగనే అదే దారిలో
పనికోసం పొట్టకోసం
రోడ్డంతా నా వాళ్ళ రక్తం

చెల్లాచెదురైన దేహఖండాల మధ్య నిలబడ్డ మృగం
చేతిలోని రిమోటుని ఎగరేస్తూ గర్వంగా నవ్వుకుంటూ
ముఖాన చిందిపడ్డ రక్తాన్ని నిర్లక్ష్యంగా తుడుచుకుంటూ
కాలిన దేహాల్లోంచి వచ్చే పొగని ఆశ్వాదిస్తూ

నిర్లక్ష్యం
జిందగీ పొడుగూతా...

వాడు నవ్వుతున్నడు
అస్మంటోళ్ళు అందరూ నవ్వుతున్నరు
సందు సివర బాంబుపెట్టిన ప్రతోడు నవ్వుతున్నడు
అమాయకుల ప్రాణాలు తునాతునకలుజేసిన ప్రతోడు
గర్వంగా హేయంగా విలాసంగా జేబులనిండిన బలంతో నవ్వుతున్నడు
రోడ్డెమ్మట, గోడలనిండా సుట్టూతా నా వాళ్ల రక్తం సాక్ష్యంగ.......

(నా గుండె లోతులనుండి ఈ మంట)

1 comment:

  1. మీ కవితలో చాలా ఆవేదన వుంది. ఈ వింత నాటకానికి తెరదించాలి.

    ReplyDelete