మా బళ్ళో పొద్దున్నే వందేమాతర గీతాన్ని ఆలపించటం, ప్రతిజ్ఞ చేయటంతో రోజు మొదలైయ్యేది. జన గణ మన అధినాయక జయహే గీతంతో రోజు ముగిసేది. బహుశా మా అజ్ఞానమో లేక ఖర్మమో ఎవ్వళ్ళూ ఇదేం పాట? అర్థం ఏంటీ అని అడిగిన పాపాన పోలేదు. అయ్యా! నే చదువుకున్నది జి.ప్ర.ప ప్రాథమికోన్నత పాఠశాల, మరియూ జి.ప్ర.ప ఉన్నత పాఠశాలల్లో. బడిలో లంబాడీలు మరియూ యస్.టి యస్సిలు, బీసీలు మరియూ ఓసీలు. ఎవ్వరూ ఏనాడూ వందేమాతరానికి అర్థం వెతకలేదు. అనాటి ఆ సమాజంలో కూడా ఎవ్వరూ వందేమాతరానికి అర్థం వెతకలా. కారణం? పిల్లలు ఆడుకోటంలో బడిలో పాఠాలు నేర్చుకోటంలో బిజీ. తల్లితండ్రులు పొట్టపోసుకోటంలో బిజీ. రెక్కాడితేకానీ డొక్కాడేది కాదు. ఏదోక పనికి వెళ్ళితీరాలి. ఊర్కనే కూర్చున్నోడికి పొయ్యిలో పిల్లి లెగిచేటిది కాదు.
ఐతే! వందేమాతరం అనే ఓ పేరాగ్రాఫ్ సైజున్న పాట, [మొత్తం పాట పాట్టానికి అది బడా లేక పాటలపోటీనా?] పాట్టానికి పది నిమిషాలో ఏమో పట్టేది, ఆ పాటలో ఇతర మతాల మనోభావాలను దెబ్బతీసేంత అర్థం ఉందా?
ఓమారు చూద్దాం!సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
నాకు తెల్సిన పాట, మేము బళ్ళో ఆలపించిన పేరా పంక్తులు ఇవే.
ఇందులో ఎవరి మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో నాకైతే అర్థం అవ్వలేదు.
అసలు విషయం ఏవిట్టా?
ఈ సంవత్సరం నుంచి ఆంధ్రరాష్ట ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోంచి వందే మాతరం గీతాన్ని తొలగించారు. ఆ గీతాన్ని ఆలపించడం తమ తమ మతవిశ్వాసాలకు విరుద్ధమని ముస్లిమ్ క్రైస్తవ సంఘాలు (కనీసం స్థానిక సంఘాలు కూడా కాదు, ఏ.పి.కి బయటివి) వ్యతిరేకించిన నేపథ్యంలో తొలగించారని వార్త.
ఈ వేళ ఈ వార్త నిజం అవ్వచ్చు అవ్వకపోనూవచ్చు, కానీ రాబోయే రోజుల్లో నిజం అయితీరుతుంది.
కారణాలు అనేకం. పొట్టపొస్కునే స్థితిలో బిజీగా ఉన్న మనుషుల జీవితాల్లోకి డబ్బు దయ్యం ఇప్పటికే ప్రవేశించి ఆవహించేసింది. దాంతో పురసతే పురసతు. చెదపట్టిన ఖాళీమైండుకి అన్నీ తప్పులేగా. ఓటు వరాలు ఇంకా కుమ్మరిస్తే సరి, ఉచిత బియ్యం ఉచిత సరుకులు ఉచిత జీతం ఉచిత భత్యం ఉచిత జీవితం అని. ఇంకేవుంది హాయిగా తీరిగ్గా కూర్చుని బెత్తెబెత్తెలో తప్పులు వెతుక్కోచ్చు. భావవైశాల్యాలను మనోభావాలుగా చిత్రీకరించి వక్రీకరించి దేశ స్పూర్తిని వమ్ముచేసేస్తే సరి.
ఒకనాడు గాంధీకి ఊతపదం వందేమాతరం
ఆయన పేరులో తప్ప మరెక్కడా కనిపించకుండా భూస్థాపితం చేయబడ్డాడు
ఆయన నిజ వారసులు ఏ చెట్టుకింద ఉన్నారో ఎవరికీ తెలియదు
ఆయన పేరు దత్తత తీస్కున కుహానా గాంధేయులు ఆయన్ని జండాలోకి నెట్టేసి
ఆయన వాడిన వందేమాతరాన్ని కాళ్ళకింద తొక్కేసి
తమ సోషలిజాన్ని సెక్యులిరజాన్ని
ఇలా బట్టలిప్పిన ఆడదానిలా చూపుకుంటున్నారు సొగసుని సోయగాన్ని శృంగారం ఒంపుకుంటూ వ్యభిచరిస్తూ
జయ హో సోనియా గాంధీ
జయ హో ఇటాలియన్ మాతా
నువ్వే గెలిచావ్
Jun 7, 2012
Subscribe to:
Post Comments (Atom)
జనగణమన బ్రిటిష్ రాణి/రాజు నుద్దేశించి వ్రాసినది అంటారు. భారత భాగ్య విధాతా అంటూ ఇప్పటికీ పాడడానికి ఎవరికీ అభ్యంతరమే కనపడదు. ఏంటో!!
ReplyDeleteNijangaa Vandemaataram teesesaaraa? If so very sad and outrageous.
ReplyDeleteBtw, oka chinna correction..I dont think Indira Gandhy's last name has anything to do with MKGandhi. Feroz's original last name was Gandhy I believe.
భారత దేశంలో ఉన్నన్నాళ్ళూ అన్ని మతాల మధ్యలో పెరిగినా తెలియలేదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏమంటే దేవుడు తప్ప ఇంకొకరికి మొక్కడం (దణ్ణం పెట్టడం) తప్పు కొన్ని మతాల వారికి. అది వారి మూల నమ్మకాలలో ఒకటి. మా అబ్బాయి ఆసక్తితో మతాల గురించి తెలుసుకుంటుంటే నేనూ చదివి తెలుసుకోవడం మొదలు పెట్టాను. తర్వాత కొన్ని అనుభవాలు నాకు జ్ఞానోదయం కలిగేలా చేశాయి.
ReplyDelete"There was a man named Mahatma Gandhi" అని ఒక పాట ఉంది. ఏసు క్రీస్తు, గాంధి, మార్టిన్ లూథర్ కింగ్ ల గురించి వ్రాసిన పాట అది. అందులొ ఇంకో చరణం "The only son of god Almighty" అని వస్తుంది. నాకు తెలియక ఆ మొదటి లైనూ, రెండో లనూ కలగలిపి గుర్తు చేసుకునే దాన్ని. అది కూడా గాంధీ దేవుడి కొడుకు అని అర్థం వచ్చేలా. మా అబ్బాయికి కబుర్లలో ఆ పాట గురించి చెప్తే వాడు వాళ్ళ టీచర్‌కి చెప్తే ఆమె వాడిని సరి దిద్దారు. నాకు పూర్తిగా గుర్తు లేదు కానీ ఏదో తప్పు చేసినట్టు అర్థం అయ్యింది. అప్పుడు సాహిత్యం వెతికితే కొంచెం లైట్ వెలిగింది.
ఇంకో సారి పిల్లలు బస్ స్టాప్‌లో ఆడుకుంటూ నేను ఇంత గొప్పంటే నేను అంత గొప్ప అనుకుంటుంటే ఒక హిందువుల అబ్బాయి నేను "దేవుడంత గొప్ప" అన్నాడు. దానికి అక్కడ ఉన్న ఒక తల్లి తప్పు మాట అన్నాడని బాధ పడ్డారు.
అందుకని "వందే మాతరం" లో వందనం చెయ్యడం అనే దాన్ని పట్టుకుని లాగుతున్నారేమో మరి. తప్పొప్పుల గురించి కాదు, రాజకీయాల గురించి కాదు నా వ్యాఖ్య. నేనీ వ్యాఖ్య వ్రాసినది నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైన కొన్ని subtleties గురించి చెప్పాలని.
ఈ అనుభవాల తర్వాత ఒక సందేహం వచ్చింది నాకు. చాలా హిందీ పాటల్లో (నిజానికి ఉర్దూవి, ముస్లిం సాహిత్యకారులు వ్రాసే పాటలు) ప్రేయసిని "నువ్వు నా ఖుదా" లేదా "దేవుడి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను క్షమించు గాక" ఇలా వ్రాస్తారు. వాళ్ళ మతం ప్రకారం అలా ఎలా వ్రాయగలరు అని నా సందేహం. ఇదే మాట కొన్ని రోజుల క్రితమే నన్ను ఒక వేరే దేశస్థురాలు ముస్లిం అమ్మాయి అడిగింది. వాళ్ళ దేశంలో మన హిందీ పాటలు వింటారుట. పాడుకుంటారుట. ఆ అమ్మాయికీ ఇష్టమే చాలా పాటలు. కానీ ఇలా దేవుడితో పోల్చే పాటల విషయంలోనే వాళ్ళ మతం ప్రకారం అది తప్పు కాబట్టి ఆ అమ్మాయికి ధర్మ సందేహం.
అర్థం కాలేదు. ఇంతకీ తమరేమంటారో చెప్పనే లేదు.
Deleteలలిత గారూ
ReplyDeleteనమస్తే
మీ వివరణ బాగుంది
ఐతే వందేమాతరం అనే నినాదాన్ని తెరపైకి తెచ్చీప్పుడే ఈగోల రావాలిగా?
స్వతంత్ర పోరాటంలో అందరూ ఆలపించారుగా ఈ గీతాన్ని, అందరినోటిలో నానిందేగా వందేమాతర నినానదం. అప్పుడులేనిది అరవైఏళ్ళ తర్వాతేలా వచ్చిందీ? కేవలం రాజకీయస్వార్థం అనేదికాకపోతే
మరొక విషయం, అప్పట్లోజనం ఇంతలా పనీపాటా లేకుండాకూడా లేరు ఇంతలా ఈకలు పీకటానికి. ఇది పొలిటికల్ స్టేట్మెంట్ అయుండచ్చు కానీ నిజం.
ధన్యవాదాలు
కుమార్ భయ్యా
ReplyDeleteఫెరోజ్ గాంధీ అనేవాడూ పార్శీ, జొరాష్ట్రియన్.
గాంధీలు గుజరాతీ కోవట్లు.
వందేమాతరం పూర్తి పాఠం ఇంకా పెద్దది. తర్వాతి చరణంలో భారతమాతను దుర్గాదేవితో పోలుస్తారు. ఈ విషయంలో స్వతంత్ర పోరాట సమయంలోనే, ముస్లింలకు, సోకాల్డ్ సెక్కులరిస్ట్ లకు అభ్యంతరకరమైనందు వలననే మీరు పైన చెప్పిన కొన్ని లైన్స్ మాత్రమే ఉంచి మిగతాది వదిలేశారు. ఇప్పుడు దీనికీ అభ్యంతరం చెపుతున్నారు మరి. హ్మ్..
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteవందే మాతరం అంటే అర్ధం ఏమిటి? వందనం అంటే నమస్కారమా పూజా?
ReplyDeleteIf the song is a prayer, singing it becomes shirk.
Bhaskar bhayya Yes I knew that but his last name has nothing to do with MKGandhi last name as widely believed. Okasari wiki lo Feroz gandhi ani chudu . I know wiki is not be all the all place , but also check other authentic sources. In face Rustom Gandhi gurinchi migata vaalla gurinchi untundi. Okasari dig chesi chudu
ReplyDeleteshame of the nation.
ReplyDelete