Mar 23, 2012

ఉగాది ముగ్గులు

ఏ పండక్కైనా హైందవ స్త్రీలు ముందు చేసేది, ఇల్లు అలికి ముగ్గులు వేయటం.
మరి మా హోము గారు కూడా అదేబాటలో ముగ్గులు వేద్దామని పూనుకున్నారు. పిల్లలిద్దరికీ ఈ ముగ్గు, చుక్కలు, మెలికలు భలే నచ్చాయి. కేరింతలు పెట్టారు. వావ్!! అమ్మా!! నువ్వు డిజైనర్వి, ఆర్టిస్టువి అని పొగిడి, మేవూ వేస్తాం మెవూ వేస్తాం అని చెరొక నోటుపుస్తకం లాక్కొచ్చుక్కుని కూర్చున్నారు. పాపం అనఘకి ఇంకా అంత రాలేదు కావున ఇలా వేసింది


సూరిగాడు తల్లి గీసిన ముగ్గుని ఇలా వేసి *నఖలు పిల్లి* అనిపించుకున్నాడు


వాళ్ళ అమ్మ వేసింది ఇది


ఏదేవైనా
యావత్ తెలుఁగు దేశానికి
నందన ఉగాది మేల్తలపులు

3 comments:

  1. బాగున్నాయండీ! ముందు ముందు అబ్బాయి ముగ్గులు కూడా వేయబోతున్నాడన్నమాట!. .:)))))

    మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ కూడా.. ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. వావ్!! అమ్మా!! నువ్వు డిజైనర్వి, ఆర్టిస్టువి

    పిల్లలు పసిగట్టేశారు, మిమ్ముల్ని చేసుకున్నాక ఓ "డిజైనర్ కమ్ ఆర్టిస్ట్" మరుగుపడిన రహస్యాన్ని :-)

    ReplyDelete
  3. నందననామ సంవత్సరాది మేలుతలపులు సోదర..

    ReplyDelete