మా అమ్మ నిన్న మాటల మధ్యలో, ఎండలు తలలు పగులగొడుతున్నాయిరా అన్నది.
నిజమే. ఎండలు తలలే కాదు జవజీవాలను ఎండగొడుతున్నాయి.
దీనిపై టీవీల్లో జనాల్లో పేద్ద చర్చలు జఱగవచ్చు, ఐతే
ఎందుకు ఎండలు పెరుగుతున్నాయి, వేడిని తగ్గించటానికి మనచేతుల్లో ఏవుందీ, మనం ఏం చేస్తున్నాం, మనం ఏంచేసాం, మనం ఏంచేయాలి అనేవాటిపై ఎంఫసిస్ ఎక్కడా?
పిల్లలకి రిసైకిలింగు నేర్పుతున్నామా?
కాంక్రీటు వనాలను కొనకుండా ఆపుతున్నామా?
కాంక్రీటు వనంలో ఒక చెట్టన్నా నాటుతున్నామా?
పర్వావరణాన్ని అధోగతిపాలు చేయకుండా ఈనాటి మనిషి చేస్తున్న ఒక్క మంచిపని చూపండీ?
ఇప్పుడే ఇలా ఉంటే రేపటిరోజున ఎలా ఉండబోతున్నదీ?
చెట్లను కొట్టివేయుట ఆపండి
మీ బండి ఇంజన్ ఆపివేయండి
చెట్లు నాటండి
మిమ్మల్ని మీరు కాపాడుకోండి
ప్లాస్టిక్ వాడవద్దు
దోచుకొనుటలో బిజీగా ఉన్న ప్రభుత్వాలను గద్దె దింపండి
పర్వావరణ రక్షణకై నడుం బిగించండి
మీ ఆయుస్షుని పెంచుకోండి
Subscribe to:
Post Comments (Atom)
చక్కగా చెప్పారు!
ReplyDeleteచిక్కగా చెప్పా తమ్మీ
Delete:):)
చక్కగా చెప్పారు మనవంతు పాత్రను మనం పోషిద్దాం!
ReplyDeleteసోదరా నమస్తే
Deleteఈమధ్య బ్లగులకి దూరం అవ్వటం చేత, వ్యాఖ్యలక్లి ప్రతివ్యాఖ్యలు కూడా వ్రాయలేని స్థితి.
నా బ్లాగ్ మిత్రులంతా ఏవిటీ, ప్రతివ్యాఖ్యలు కూడా చేయటంలేదు భాస్కర్ అనుకోవద్దనీ సహృదయతతో అర్థంచేస్కోగలరనీ భావిస్తున్నా[అర్థిస్తున్నా]
సోదరా! మనచేతిలోనే అంతా ఉంది. కానీ అచేతనమై మోడులా బ్రతుకుతున్నాం
చెంపలు వాయించి నిద్రలేపే హస్తం రావాలి
కళ్ళముందు ఇన్ని అనర్థాలు
ప్రకృతిని యధేచ్ఛగా దోచుకుంటూ
దోచుకునేవారిని కళ్ళూ నోళ్ళూ వళ్ళూ అప్పగించి చూస్తున్నం
అచేతనంగా
ఎంతటి దౌర్భాగ్యం మనదీ?
మన జాతిదీ
గ్లోబల్ వార్మింగ్ మీద An Inconvenient Truth అనే ప్రెసెంటేషన్(మూవీ) చూడటం జరిగింది. కొంచెం ఎక్కువ అనిపించినా అల్ గోర్ బాగా హత్తుకునేలా ప్రెసెంట్ చేశాడు.
ReplyDeletehttp://en.wikipedia.org/wiki/An_Inconvenient_Truth