Jul 12, 2012

తలకి గాయం - రెండో కేసు

మా బావగారు! అరవై ఏళ్ళ వయసు. భారత ప్రభుత్వానికి తనవంతు సేవ చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు.
మా అక్కగారికి[పెద్దమ్మ కూతురు] భర్త, మా నాయనమ్మ వైపు బంధువులు కూడా. వీరికి ఒక్కతే కూతురు. బిటెక్ చదివి ఎదో ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. ఈమధ్యనే పెండ్లి కుదిరింది పిల్లకు. ఈనెల చివర్లో పెండ్లి. పెండ్లి పిలుపులు కూడా అందరికీ అందినాయి. పిల్లాడు కూడా మాకు బంధువే.
నిన్న బావగారు స్నానాలగదిలో జారిపడ్డారుట. తలకి తీవ్రమైన దెబ్బ. కోమాలోకి వెళ్ళారుట.

ఏంటీ ఈ స్థితి?
పిల్ల పెండ్లి ఓవైపు
మరోవైపు ఇలా

మా అక్కయ్యకి పైవాడు ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నాను.

3 comments:

  1. అయ్య్యో,ఇప్పుడెలా ఉంది బావగారికి భాస్కర్?

    ReplyDelete
  2. పోయారట అన్నా! ఇప్పుడే తెలిసింది!!
    ప్చ్!!

    ReplyDelete