Aug 16, 2012

అమ్మ మనసు

పుట్టిన్నాటినుండి ఆలనాపాలనా చూస్తూ పిల్లలే లోకంగా ఉంటూ
వారికి అడుగులు నేర్పుతూ మాటలు నేర్పుతూ పాటలు నేర్పుతూ
జీవిత పాటాలు నేర్పుతూ వారి అడుగులో అడుగులు వేస్తూ
అన్నీ వారై అన్నిటా తానైన అమ్మ మనసు
నాలుగో ఏడున బడికి పంపిన పూట
ఒక్కసారిగా ఏర్పడే ఆ నిశ్శబబ్దాన్ని ఎలా తట్టుకుంటుందీ?
ఎలా తీస్కుంటుందీ?
వళ్ళంతా కళ్ళై తన పిల్లలు ఇంటికి ఎప్పటికొస్తారా అని
నిమిష నిమిషానికీ గోడ గడియారం వైపు చూస్తుంటుందా?
అప్పటిదాకా పరుగెత్తిన నిమిషాల ముల్లులు
ఒక్కసారిగా ఆగిపోయాయేంటా అని అవాక్కవుతుందా?
ప్రతీక్షణం తన వెనుక తిరిగే పిల్లల అడుగులకోసం
వెనక్కి వెనక్కి తిరిగి చూస్కుంటుందా?


ఈ పిల్లలే రేపు పెద్దై ఇంటినుండి గూటినుండి
ఎగిరిపోతే, ఏ ఏడాదికో చూట్టానికొచ్చే పక్షుల కోసం
ఆ గూటిపక్షి ఎలా ఎదురుచూస్తుంటుండో?
పుట్టిననాటి నుండి పిల్లల స్మృతులను
తలచుకుని తలచుకుని ఆనందంతో ఏడుస్తుందా?
స్మృతులు కరిగిపోతాయేమో అని భారంగా దాచుకుంటుందా?
[కండ్లలో నీళ్ళు ఇక రాయనివ్వటంలేదు]

6 comments:

  1. ఏంటి అన్నాయ్... అనఘ ని బడి లో చేరుస్తున్నారా? ఎంత బాగా రాసారు...ప్రతి పదం ఒక అనుభవం....అమ్మ కాకపోయినా దాన్ని అనుభవించవచ్చు ఇది చదివితే...బాగుంది

    ReplyDelete
  2. మా పాపను మొదటిసారి స్కూల్ కి పంపించి ఇంటికి రాలేక ఆ పక్కనే వున్న పార్కులో మూడు గంటలు కూర్చున్నానండీ..ఓ పదిరోజులు పట్టింది అలవాటవడానికి.

    ReplyDelete
  3. నిజమేనబ్బాయ్ మార్పు సహజమే కానీ కష్టం కొంత,అది మనకి సంబంధించినదయితే మరీ కొంచం ఎక్కువ కష్టం

    ReplyDelete