Dec 15, 2012

కనెక్టికట్ షూటింగ్

కనెక్టికట్ అనే రాష్ట్రంలోని న్యూటౌన్ అనే ఊళ్ళోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో కొద్దిసేపటి క్రితం షూటింగ్ జరిగింది.
దాదాపుగా ఇరవైఏడుమంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటనలో. వారిలో దాదాపు ఇరవైమంది పిల్లలే.

షూటింగ్ గరుతున్నప్పుడు లోపలే ఉన్న ఒక పేరెటంట్ చెప్పటం, దాదాపుగా వంద రౌండ్ల కాల్పులు చేసాట్ట సదరు షూటర్.

షూటర్ దొరికాడు. వాణ్ణి గన్ డౌన్ చేశారు. వాడికి పాతికేళ్ళుట. ఇంకొక షూటర్ ఉండొచ్చని అనుకుంటున్నారు. షూటర్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేస్కొని వచ్చాట్ట. నాలుగు తుపాకులు తెచ్చుకున్నాట్ట. ఒక ఆటోమెటిక్ ఎసాల్ట్ గన్ కూడా ఉన్నదట అందులో.

చిన్నారుల అర్థాంతర మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మౌనం పాటిస్తున్నాను. ఏంజరుగుతున్నదో తెలియకుండానే ప్రాణాలు కోల్పోయిన వారి భీతితో నిండిన ఆత్మలు శాంతి పొందాలని ప్రార్థిస్తున్నాను.

నాకు మాటలు రావటంలేదు. ఏదో బాధగా ఉన్నది. మనిషి ఎందుకిలా తయ్యారౌతున్నాడో?
కూలంకుషంగా చర్చ జరగాలి మనిషి యొక్క మానసిక స్థితిగతులపై.



10 comments:

  1. Eighteen of the students were pronounced dead at the school, and two others were taken to hospitals where they were declared dead. All the adults shot at the school were pronounced dead at the scene.

    ReplyDelete
  2. “Beautiful little kids between the ages of five and ten years,” Mr. Obama said. “They had their entire lives ahead of them. Birthdays, graduations, weddings, kids of their own.”

    ReplyDelete
  3. చాలా విచారకరం .
    ఎన్ని కలలు కూలిపోయాయి. అక్కడ వేదన . చాలా బాధగా ఉంది

    మీరన్నట్లు కూలంకుషంగా చర్చ జరగాలి.మనిషి ఎందుకిలా తయారు అవుతున్నాడు ..కాబడుతున్నాడు?

    ReplyDelete
  4. ఆ తుపాకులు వాడి ఆమ్మ పేరుమీద ఉన్నవి. వాడి తల్లి అదే బడిలో కిండర్గార్టెన్ టీచరు. ఆ స్కూల్లో ఐ.డి చూస్తారుట. వీడు వాడి తమ్ముడి ఐడి చూపించితే లోపలికి రానిచ్చారు, అందునా టీచరు కొడుకు కాబట్టి. వాడు లోపలికిరాగానే ప్రిన్సిపాల్ దగ్గరకి దూసుకెళ్ళి తుపాకులు గురిపెట్టి తలుపులు ఓపెన్ చేయమన్నట్టున్నాడు. సీసా వాళ్ళ అమ్మ క్లౌస్ కి వెళ్ళాడు. అక్కడ ప్రిన్సిపాల్ కాళ్ళకి కల్చాడు. తర్వాత వాళ్ళ ఆమని, అక్కడున్న పిల్లల్ని కాల్చి తనని తనని కాల్చుకునాడు. వాడ్కి ఏడో సమస్యట ఆటిజం అనుకుంటా

    ReplyDelete
  5. My heart goes out to all the loved ones of the kids killed in the shooting today.

    ReplyDelete
  6. Asalu Guns antha easy ga ela dorukuthaayi US lo..
    konchem vivarinchagalara ?

    ReplyDelete
  7. @ మనిషి ఎందుకిలా తయ్యారౌతున్నాడో?...
    ఇదే...ఇదే అర్ధం కాని విషయం గా ఉండిపోతుంది...ఎప్పటికీ?
    ఔషదాల పై 5000% లాభాల మార్జిన్ వేసుకుని విక్రయిస్తున్నారట కంపెనీలు..ఏమిటీ విపరీతమైన పోకడలు?
    ఆసుపత్రికి వెళ్ళిన పేద వాళ్ళు మందులు కొనలేక గిజ గిజ లాడుతూ ఉంటే..వాళ్ల రక్తాన్ని పీల్చేస్తూ.. తయారీ దారులు చార్టర్డ్ విమానాల్లో దర్జాగా తిరుగుతారు??...ఇదో రకంగా సమాజాన్ని చంపుకుతినడమేగా?

    ReplyDelete
    Replies
    1. ఒట్టి ముడిపదార్థాల ఖర్చే కాదు R & D ఖర్చులు అందులోనే రాబట్టుకోవాలి. ప్రతి పరిశోధన ఆవిష్కరణలు కాలేవు. ఏ 100 పరిశోధనల్లో ఒకటి మాత్రమే వుపయోగపడవచ్చు. ఇది అరికట్టలేని అవసరమైన అన్యాయం.

      Delete
    2. ఇదొక అంతులేని కథ.
      ఉదాహరణకి -
      లవంగం తింటే ఏ అనే జబ్బు తగ్గుతుంది అని తెలుసుకున్నారనుకోండి. అమెరికన్ కంపెనీలు లవంగం గుణాలతో డ్రగ్ తయ్యారుచేసి విపణిలోకి వదుల్తారు. డాక్టర్లు ఎప్పుడూ కూడా మందులే వ్రాస్తారు కాని లవంగం తిను అని చెప్పరు గమనించండి. అలా దానికి పేటెంటు గట్రాలతో కలసి బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది, దాన్ని మార్కెట్ చేస్కోటం ద్వారా మల్టై బిలియన్ల బిజినెస్సు నడుస్తుంది, సదరు తయ్యారీదారుడు కోట్లకు పడగలెత్తుతాడు.

      Delete