Nov 7, 2012

ఒబామానా రామ్నీనా?

కడపటి వార్తలందేప్పటికి ఇదీ టాలీ
రామ్నని 158
ఒబామా 147
మరొక రెండు మూడు గంటల్లో ఓ స్పష్టమైన దృశ్యానికి రాగలమేమో
రామ్నీ యొక్క బృందం అన్నిరకాలుగా ఒబామా మీద బురదచల్లారు. అది నాకు నచ్చలేదు. ఒకానొక రేడియో ఛానెల్లో రష్ లింబా అనొకడు ఎంత దుష్ప్రచారం చేశాడంటే అంత. అదే రేడియోలో నిన్నటికి నిన్న పార్క్స్ అనేవాడు "రిపబ్లికన్స్ అందరూ మంగళవారం ఓటేయండి, డెమొక్రాట్స్ అందరూ బుధవారం ఓటేయండి" అని పదే పదే చెప్పుకొచ్చాడు. ఎలక్షను జరిగేది మంగళవారం, బుధవారం ఓటేయటానికి ఆస్కారంలేదని వాడి వెధవ హ్యూమర్. దాన్ని నిజంగా తీసుకునే వాళ్ళు కొందరుండచ్చు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాడికి. అంతలో ఎలక్షన్ కమీషనర్ స్వయంగా రేడియో స్టేషనుకి కాల్ చేసి వార్న్ చేశాడు. తప్పు అను. ఐనా వాడు తగ్గలేదు.
ఇక మరొక టాక్ షోలో "ప్రియ మిత్రులారా! మీమీ బ్యాంక్ ఎకౌంట్లనుండు డబ్బు డ్రా చేసేస్కొండి, ఏం జరుగుతుందో చెప్పలేం" అని చెప్పుకొచ్చాడు మరొక కుంక. అదే రేపొద్దున రామ్నీ గెలిస్తే ఏంచేస్తారూ? బొక్కసంలో ధనం లేకుండా ఏంపతకాలు అమలు చేయగలరూ?
సో! వీరి నెగెటివ్ పబ్లిసిటీ ఒబామాకి వరం కానున్నదా?
మీరేమంటారూ?

26 comments:

  1. ఫ్లోరిడాలో ఇద్దరూ నెక్ టు నెక్ ఉన్నారు
    ఒహాయో స్టేట్లో ఒబామా లీడ్ లో ఉన్నాడు [అరవైనాలుగు శాతం కౌంటింగ్ అయ్యింది ఇప్పటికి]

    ReplyDelete
  2. విస్కాన్సిన్ రామ్నీ లీడ బై టు పర్సంట్

    ReplyDelete
  3. Replies
    1. హ్మ్ కాదు సోదరా!
      మీ అభిప్రాయం ఏంటీ?
      పైన నేను రేపిన అంశాలు మీకెలా అనిపించాయీ?

      Delete
  4. న్యూ హ్యాంప్షైర్ ఒబామా లీడ్స్

    ReplyDelete
  5. వర్జీనియా రామ్నీ లీడ్స్

    ReplyDelete
  6. యాభైశాతం కౌంటింగ్ అయ్యింది.
    అందులో రామ్నీకి యాభైశతం ఓట్లు పోలవగా ఒబామాకి నలభైఎంది శాతం పోల్ అయ్యాయి.

    ReplyDelete
  7. Obama was inching towards victory as results poured in from the US presidential election, as Mitt Romney's struggled to win vital swing states.

    --- TOI,

    ఒబామానే గెలిచేలా ఉన్నాడు కదా?

    ReplyDelete
  8. నిన్నటి శాండీ తర్వాత కూడా ఒబామా శాండీలో కూరుకున్నవారితో మమేకమైనంతగా రామ్నీ కాలేదు, పైగా ఒక్కసారి కూడా న్యూయార్కుని సందర్శించలేదు. అతని అహంకారం అక్కడే తెలుస్తున్నది. న్యూయార్క్ డెమొక్రటిక్ స్టేట్ కదా!

    ReplyDelete
  9. దాని ఎఫెక్ట్ నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్ అన్నీ బ్లూనే చూపుతున్నాయి. మొదటీ నుండీ ఇవి డెమొక్రటిక్ స్టేట్స్ అయుండచ్చు గాక!

    ReplyDelete
  10. సియన్‌యన్ ప్రొజెక్షన్ యాజ్ ఆఫ్ నౌ
    ఒబామా 262
    రామ్నీ 191

    ReplyDelete
  11. ఒహాయో ఒబామా యాభై శాతం
    రామ్నీ నలభై తొమ్మిది శాతం

    ReplyDelete
  12. పదహారు ట్రిలియన్ డాలర్ల డెబ్ట్ అన్నారు. అది ఒబామా వచ్చాక జరిగింది కాదుగా. అంతక ముందు ఎందేళ్ళ పాలనలో ఎంత డెబ్టో అది కూడా చెప్పాలిగా

    ReplyDelete
  13. బ్లూ కన్నా ఎరుపే ఎక్కువగా కనపడుతోంది.. NY Times Mapలో

    ReplyDelete
    Replies
    1. లేదే
      యంపైర్ టవర్స్ బ్లూగా ఉంది కదా
      న్యూయార్కు డెమొక్రాట్ కోట కదబ్బా

      Delete
  14. ఫ్లోరిడా యనభైశాతం కౌంటింగ్ అయ్యింది
    ఒబామా లీడింగ్

    ReplyDelete
  15. అరవైశతం కౌంటింగ్ అయ్యింది
    ఒబామా నలభైతొమ్మిదిశాతం
    రామ్నీ యాభైశాతం

    ReplyDelete
  16. It's now clear.. OBAMA going to win..!!

    Obama 250, Romney 200 ...

    Democrats 50, Rep 42, +2 Democrats.. for senate..!!

    ReplyDelete
    Replies
    1. ఇవి ప్రొజక్టెడ్ రిజల్ట్సే కదా.

      Delete
  17. ఐయోవా ఒబామా లీడ్స్ యాభైమూడు శాతం.
    ఇంటరెస్టింగ్

    ReplyDelete
  18. ఎవడైతే ఏంటీ ప్రపంచాన్ని దోచుకోవడమేగా అమెరికన్ల పని

    ReplyDelete
  19. న్యూ ప్రొజెక్షన్స్
    ఒబామా 274
    రామ్నీ 201

    ReplyDelete
  20. ఓకే ప్రజలారా
    ఒబామాకి క్లియర్ కట్ గా మెజారిటీ వస్తాయ్
    ఇక నేను విశ్రమిస్తాయ్
    శుభం

    ReplyDelete
  21. అభినందనలు 'నాన్న'గారు:)

    ReplyDelete
  22. మిట్ రామ్నీ కొంచెం పొసగేటట్టు మాట్లాడితే ఏమైనా అవకాశం ఉండేదేమో. బొత్తిగా తలో రోజూ తలో మాటా మాట్లాడాడు. అమెరికాకు మంచి జరగాలంటే ఒబామా నెగ్గడమే మంచిది అని నా అభిప్రాయం.

    ReplyDelete