మొన్న ఆదివారం శామ్స్ క్లబ్బుకి వెళ్ళబోతూ, హోము గారిని హింటినాను "లిస్టు రాస్కున్నరానే" అని.
టట్టడాయ్ అని అనఘ కొంచేపు జంపింగు జాక్స్ చేసి హడావిడిగా ఓ కాయితకం సింపుకొచ్చింది నోటుబొక్కులోంచి. పెన్నేది, అబ్బ ఒక్క పెన్నూ రాయదు అనుకుంటా ఓ పెన్ను లాక్కుచ్చుకుని ఎదో రాస్తాఉంది.
ఏటమ్మలు ఏటి రాస్తన్నా అంటే
సరుకుల లిస్ట్ రాస్తన్నా, ఏవేం కొనుక్కోవాల్నో అని
లిస్టు రాసి నాకిచ్చింది. జోబిలో ఎట్టుకో నాన్నా అని.
సర్లెమ్మని జోబిలో దోపుకిని ఎళ్ళినాం దుకాణానికి.
లోనకిబోంగనే, లిస్ట్ ఇటివ్వు అనింది
ఇచ్చినా
అంతలో హోము గారు పాలు తీస్కోవాల అనింది.
నే అది లిస్టులో రాసినా నాన్నా అనింది అనఘ
అనఘ లిస్టులో మీకేం అగుపిస్తా ఉన్నాయో సెప్పాల!!
అన్నో ఎవుళ్ళకాళ్ళు కొనుక్కుని బిల్లు కూడక మీరే కట్టెస్కుని, ఓ మూట మిఠాయిలు ఇటంపండి!!
Apr 20, 2012
Subscribe to:
Post Comments (Atom)
నాకు తమిళ,మళయాళ, కన్నడ, అరబ్బీ, జపనీస్, ప్రాచీన చిత్రలిపిల కలయికతో ఏర్పడిన భాష రాదు కాబట్టి నేనేమీ చెప్పలేను.
ReplyDeleteఅసలు చిల్లరకొట్టుకెళ్ళేటప్పుడు జాబితా రాయాలనీ,అదీ అట్టా వరసలో రాయాలనీ తెలిసిందాలేదా అదే చానా అసల్నన్నడిగితే ఇక అచ్చరాలంటావా తిప్పి చదువ్
ReplyDeleteha ha...sweet Anagha
ReplyDeleteList super.
ReplyDeleteఇలాంటి రాత ఎవరికుంటుందబ్బా... ఆ యెలిగింది. మీడాటరు డాటరమ్మౌతుందండోయ్. ముందస్తు కంగ్రాటులు.
ReplyDeleteఇండియన్ మినెర్వా కామెంటు డిటో
ReplyDelete:))
ReplyDeleteఅనఘ .. ఏ డాక్టరో,యాక్టారో,టీచరో..ఏదన్నా కానివ్వండి ..దానితో పాటు.. మంచి ఇల్లాలు అవుతుంది. అది మాత్రం నిజం.:)
ReplyDeleteభాస్కర రామరాజు గారు"అనఘ " పేరు మాత్రం నాకు బాగా నచ్చింది. పాపాయికి నా దీవెనలు.
తెలుగేర్పడ్డ తొలిరోజుల్లో శాసనాల భాష ఇలాగే ఉండేదిట
ReplyDelete