హంతకుడికి రాష్ట్రపతి క్షమాభిక్ష
న్యూఢిల్లీ: ముగ్గురు వ్యక్తులను దారుణంగా హతమార్చిన ఓ వ్యక్తికి సుప్రీం కోర్టు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. డెహ్రాడూన్‌లో 18 ఏళ్ల క్రితం ఓం ప్రకాశ్ అనే నౌకరు పదవీ విరమణ పొందిన ఓ బ్రిగేడియర్, అతని కుటుంబసభ్యులు ఇద్దరిని హత్య చేశాడు. అతనికి ఉరిశిక్ష విధిస్తూ సూప్రీంకోర్టు...ఇటువంటి వ్యక్తి సమాజానికి ప్రమాదకారని పేర్కొంది. ఈ కేసులో అతనికి మరణశిక్షే సరైనదని తెలిపింది. హత్యకు పాల్పడే సమయానికి ఓం ప్రకాశ్ యువకుడని ఈ నేపథ్యంలో అతనికి ఉరిశిక్ష వద్దన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చివరకు ఓం ప్రకాశ్ కేసు క్షమార్హమైనదని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ గుర్తిస్తూ ఏప్రిల్ 29న అతని శిక్షను మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిభా పాటిల్ తన హయాంలో మొత్తం 27 క్షమాభిక్ష కేసులపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు బిల్వారాకు చెందిన సమాచార హక్కు(ఆర్‌టీఐ) కార్యకర్త ఎస్.ఎస్.రాణావత్ చేసిన దరఖాస్తుకు వచ్చిన సమాధానం ద్వారా తేటతెల్లమైంది.
అసలు ఎంత పెద్ద నేరం చేసినా ఒకే శిక్ష వేస్తే పోలా?
రెండేళ్ళ ఫైవ్ స్టార్ శిక్ష ఏ నేరానికైనా!
ఎందుకింత తతంగం ప్రయాస న్యాయస్థానాలు న్యాయవాదులు జడ్జులు వాదనలు పోలీసులు గోల
ఇంత జరిగీ కోర్టులో తేలీ సదరు న్యాయమూర్తులు వాదనలను విని తమ అనుభవసారం నుండీ పుస్తకాల నుండీ న్యాయాన్నీ శిక్షలను కలిపి రంగరించి శిక్షవేస్తే
చివరికి, ఒక పొలిటీకల్లీ అపాయింటెడ్ వ్యక్తి, ఏ మాత్రమూ న్యాయం తెలియక, ఏమాత్రం దాని లోతు తెలియక కేవలం వార్తల్లో మిగిలిపోవాలనే స్వార్థంతో ఆ శిక్షను రద్దు చేయటం న్యాయాన్నే అపహాస్యం చేయటం సదరు శిక్షను రద్దుచేయటం..............
Subscribe to:
Post Comments (Atom)
అవిడెవరండీ శిక్ష ని రద్దుచేయడానికి. నా ఉద్దేశంలో ఆ హత్యకిగురైన కుటుంబసభ్వుల సభ్యులు మాత్రమే క్షమా భిక్ష పెట్టడానికి అర్హులు period.
ReplyDeleteసర్వోత్తమ న్యాయస్థానమో లేక ఏ న్యాయస్థానమైనా గోళ్ళు గిల్లుకుంటూనో లేక పకోడీలో బఠాణీలో తింటూనో ఇచ్చిన తీర్పు లేక వేసిన శిక్షకాదు కదా. చట్టబద్ధంగా వేసిన ఓ శిక్షని ఎవరికైనా రద్దుచేసే హక్కు ఎందుకూ? అలా హక్కు ఉంటే శిక్షలు వేయటం దేనికీ? క్షమించేయటానికి ఎవరికి హక్కు, ఎందుకూ?
ReplyDelete:)) వాణ్ణి యవజ్జీవమూ, రిటరయ్యాక గవర్నమెంట్ నుంచి నొక్కేసిన 5ఎకరాల పూనే ఇంట్లో తోటమాలిగా ఆవిడే పోషిస్తారేమో! ఎంతటి దయాద్ర హృదయురాలో కదా...
Deleteక్షమాబిక్ష మాత్రం గోళ్ళు గిల్లుకుంటూనో లేక పకోడీలో బఠాణీలో తింటూనో ఇచ్చారా? Presidential pardon is the final phase as per constitutional due process.
Delete@భాస్కర్ రామరాజు:
ReplyDelete"ఒక పొలిటీకల్లీ అపాయింటెడ్ వ్యక్తి"
రాష్ట్రపతి క్షమాభిక్ష ఇచ్చినా పార్లమెంటులో ఉపన్యాసం చదివినా అవేవీ సొంత నిర్ణయాలు కావండి. కేంద్ర ప్రభుత్వం ఎ నిర్ణయం తీసుకున్నా ఆవిడ పాటించాల్సిందే. కొన్ని కొన్ని ప్రత్యెక సందర్భాలలో మాత్రమె (e.g. appointing PM) రాష్ట్రపతి సొంత నిర్ణయం తీసుకుంటారు.
ఇకపోతే అనేక దేశాలలో రద్దయిన మరణ శిక్ష మన దేశంలో మాత్రం ఎందుకు? మనమూ రద్దు చేస్తే పోలా?
ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి పొద్దున పెడిక్యూరుకీ సాయంత్రం డేంటిస్టు దగ్గరకీ వెళ్ళటం కాకుండా మరేం చేస్తున్నారూ?
Deleteప్రజాధనంతో విదేశీ విహారాలు కూడా వెలగబెడుతుంది లెండి.
Deleteరాష్ట్రపతికి ఎంత "ప్రతిభ" ఉన్నా సొంత నిర్ణయాలు తీసుకోలేరు. మీరు ఆ నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రిని వదిలేసి ఆవిడనే టార్గెట్ చేయడం భావ్యం కాదేమో, ఆలోచించండి.
కొన్ని దేశాలలో మందు పదార్ధాలు అమ్మడం నేరం అలంటి వాళ్ళకి ఉరి శిక్ష, అయినా క్షమించడానికి కోల్పోయింది Presidentaaaaa?
ReplyDelete