Mar 1, 2012

నా రగతం మరగదా?

నేను ఈ దేశంలోనే పుట్టినా
కొన్ని వేల ఎండ్లుగా ఇక్కడ్నే
బతికి బట్టకట్టింది నా జాతి
నల్దిక్కులా నమ్మిన మతానికి
కన్పడని ఓ బలాన్కి గుళ్ళు కట్టింది నా జాతి
ఎక్కడ్నుండి ఊడిపడిండో తెల్వదు
కొడుకు, వంకర కత్తుల్తో
శాంతితో
ప్రశాంతంగా
వెల్గుతున్న నా ఇండ్లలోనికి
కుశాలుగా వెళ్తున్న జీవితాల్లోకి
బలవంతంగా సొచ్చుకుని ఒచ్చినాడు కొడుకు
కత్తి చేతబూని
రక్తం మరకల కత్తి
నా నమ్మకాలను నేలకంట కూలగొట్టిండు
ఎందర్ని సంపిండో కొడుకు
వచ్చినోడు కన్పడ్డ కుతికని
తెగ నరికిండు
జాలిలా
దయలా
పిల్లలని జుడలా
పెద్దలని జూడలా
కన్పించిన ఆడదాన్ని చెరిచిండు
కన్పించిన ప్రాణాన్ని నరికిండు
తెగ నరికిండు
నా మతంల మారు అన్నడు
నా మతం కానోడు కాఫిర్ అన్నడు
నా గుళ్ళను కూల్చిండు
నా జాతి మానాన్ని దోచిందు
నా జాతి ప్రాణాలను దోచిండు
అరె, ఇప్పుడేమైందిబై?
మతం మారిన కొడుకు
మరో దేశం గావాలె అన్నడు
నా దేశాన్ని ముక్కలుజేపించిండు
సరే, పో!! ఫైసల్. ఖతం అనుకుంటి
లే!! అప్పట్నుండి ప్రతేళ
పక్కలో బల్లెం
పొడుస్తనే ఉన్నడు
రైల్ల పోతుంటే, నిప్పుపెట్టిండు
కాలికట్టైన ప్రాణాలని జూసి
నే కన్నెర్ర జేయగూడదు
కిందా పైన సేపెట్టి మూస్కుని కూకోవాలె
ఏం? ఎందుకు?
నే మనిడిసిని కాదా?
నాలో రగతం లేదా?
న రగతం ఎరుపెక్కదా?
నేను నీకూ, ఎన్నెముకలేని ప్రభుత్వానికి వెట్టోణ్ణా?
నా రగతం మరగదా?
నా ప్రాణం ప్రాణం గాదా?
నా జనం ప్రాణం ప్రాణం గాదా?


'పహ్‌లీబార్ సబ్ కుచ్ బచా
దూస్రీబార్ బచీ జాన్‌
తీస్రీబార్ నామో నిషాన్ మిట్ జాయేగా'
                               - గుజరాత్ గోడ మీది వాక్యాలు

6 comments:

  1. డచ్ పోర్చుగీస్ బ్రిటిష్ నుండి ఇప్పటి ఇటలీ వరకు ఇలా వేరే దేశస్తులు ఏలుతూనేఉన్నారు
    చేతకాని ప్రభుత్వం
    నిరంతరం మోసపోయే ప్రజలు

    ఆ జఫ్ఫా 99 శాతం వరకు దాడులు అరికడుతూనే ఉన్నాం అని స్టేట్మెంట్లు!

    డిగ్గీ సిబాల చిదంబరం
    చెత్త పెరిగిపోతోంది దేశం లో

    ReplyDelete
  2. నా రగతం మరిగింది. మరుగుతోంది..

    ఫేక్ గాంధీలు, చెక్క బొమ్మలు ఏలినంత కాలం మనం మూసుకోక తప్పదు.. :(

    ReplyDelete
  3. కడుపు రగిలిన బాధ ప్రతి అక్షరంలోనూ కనిపించింది. చదువుతుంటే ఉక్రోషం, ఆవేశం మనసుని కమ్మేస్తుంది.

    ఒకప్పటి మాటేమో కానీ ఇప్పుడు మతమార్పిడులన్నీ లాభాపేక్షతో జరుగుతున్నవే. మన దరిద్రాన్ని డబ్బుతో కొంటున్నారు, దానికి ఫ్రీగా మతాన్నిస్తున్నారు.

    ReplyDelete
  4. మొన్న బజార్ లో వెళ్తుంటే ఒక పేరు కనిపించింది "ఇబ్రహీం.పి.గాంధీ" ట ఏమిటో మరి.

    తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం కాదు ఏకంగా ఆ రొమ్మునే కోసుకు తినే రకాలు మరి

    ReplyDelete
  5. రక్తం మరుగుతున్నా మౌనంగానే ఉన్నాం.:(((((

    ReplyDelete
  6. కామెంటిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
    వనజ గారూ - హ్మ్!! మౌనమే మన మొదటి శత్రువు అని తెలుసుకోవాలి జనం!!
    మౌనం భగ్నం చేసేందుకు మనవంతు ఎదోకటి చేయాలని నా ప్రయత్నం. జాగ్రుతం చేసి చైతన్యవంతం చేయాలని ఆశ..ఆ దిశగా అడుగులు ఇవి

    ReplyDelete