సూరిగాడి టెక్‌వాన్-డొ గురువు చక్కని మార్గనిర్దేశకం చేస్తున్నాడు అతని శిష్యులకు.
సూరిగాడు గురువు నిన్న ఇలా నేర్పించాండు -
బడిలో బుల్లీయింగ్ చేసే వాళ్ళు ఎక్కడ చూసినా ఉంటారు. వాళ్ళతో ఎలా నెట్టుకురావాలి అని చెప్పుకొచ్చాడు. ఎలా నెట్టుకురావాలో చూపించాడు.
బుల్లీయింగు సమయంలో పాటించవలసిన ముఖ్యమైన సూత్రాలు ఎ బి సి డి
ఎ ఎవాయిడ్ కాన్ఫ్లిక్ట్.
బి అంటే బి కామ్. ఎవడన్నా వచ్చి కంటి దగ్గర ఏలు పెట్టి ఏడిపిస్తున్నాడుకుందాం. వెను వెంటనే ఢమాల్ ఢిమీల్ అనకుండా కామ్ గా ఉండాలట
సి అంటే కమ్యూనికేట్ విత్ కాన్ఫిడెన్స్ అట. కామ్ గా ఉండి, కాన్ఫిడెన్స్ తో వాడికి చెప్పాలట, స్టే అవే ఫ్రం మి అని.
డి అంటే డోంట్ వొర్సెన్ అట, అంటె తెగిందాకా లాగకూడదట. అంటే? స్టే అవే అని వెళ్ళిపోవాలట. అంతేకానీ వాడి ముక్కు పచ్చడి పచ్చడి చేయటం తెగిందాకా లాగటం అవుతుందట.
బుల్లీయింగ్ చెసేవాడు ఐనా వెంటపడితే టీచర్ దృష్టికి తీసుకువెళ్ళాలట. కొన్ని కొన్ని అక్కడే వదిలేస్తే మంచిదట. కొన్ని తప్పక టీచర్ దృష్టికి తీసుకువెళ్ళాలట.
ఐ కంప్లీట్లీ ఎగ్రీ విత్ హిం.
ఏటా బుల్లీయింగ్ రాక్షసికి బలౌతున్న పిల్లలు ఎందరో. ఇలాంటి డిఫెన్సివ్ స్కిల్స్ పిల్లలకి నేర్పటం ప్రతీ తల్లితండ్రుల బాధ్యత అని నా అభిప్రాయం.
Aug 23, 2012
Subscribe to:
Post Comments (Atom)
I was used to simply slap the face of bullies in my childhood days and it worked well then and now also.
ReplyDeleteWhy this kind of cowardice to be taught to Children.
చెంప పగులకొట్టటం అనేది భారతదేశంలో చెల్లిందేమో కానీ అమెరికాలో చెల్లదు శివరామప్రసాదు గారూ.
ReplyDeleteమీ అమెరికాలో బుల్లీయింగ్ చెల్లుబాటెలా అవుతున్నది మరి? చెంప పగలగొట్టటం తప్పైతే, బుల్లియింగ్ అంతకు పదిరెట్లు తప్పని అక్కడి వాళ్ళకు తెలియదా ఏమిటి! ఐనా నేను మా భారత దేశం గురించి లెండి చెప్పింది.
Deleteతరువాత ప్రస్తుతపు Commercial Writing వచ్చినాక, అటువంటి రచనల్లోవి బంగారు వ్యాక్యాలు అవ్వక్కర్లేదు, అవి తీసికెళ్ళి పిల్లల మీద రుద్దాల్సిన పనీ లేదు. జుస్ట్ టైం పాస్ రచనల్లో ఈ Self Development రచనలూ చేరిపోయి చాలా కాలం అయిపోయింది.
మా అమెరికా మీ భారత్??
Deleteమిరు పెద్దలు. పెద్ద మాటలే మాట్టాడుతున్నారు.
అమెరికాలో చేయి చేస్కోటం నేరం. బుల్లీయింగ్ అనేదీ నేరమే. అందుకేగా టీచరుకి రిపోర్ట్ చేయాలని చెప్పేది.
చెయ్యి చేస్కోటం ధైర్యం ఎలా అవుతుందీ?
చేస్కోక పోవటం పిరికితనం ఎలా అవుతుందీ?
:) చెంపా గింపా పగలా కొడితే, ఆ తెల్లోడేదో గొట్టం తుపాకీతో ఢామ్ అనిపిచ్చేస్తాడు, సరదా తీరిపోద్ది. ఆ తరవాత తెల్లోళ్ళే కొవ్వొత్తులు పెట్టేసి కన్నీళ్ళు తుడుచుకుని అయ్యిందనిపిస్తారు. ఎందుకొచ్చిన గొడవ, భాస్కర్ రామరాజు గారి మాట విందాం. :P :))
Deleteఎవాయిడ్ కాన్ఫ్లిక్ట్ అంటె ఇదే కదా శంకర్
Deleteఎక్కడైనా సరే ఎవరి జోలికీ పోని వాణ్ణి కెలకటం బుల్లీ లక్షణం. అలాంటివాడికి బుధ్ధి వచ్చేట్టుగా ఒక్కటి వెయ్యటమే మనకి, ముఖ్యంగా వాడికి ఎంతో అవసరం. మీరు భారత్ లో చెల్లింది కాని అమెరికాలో చెల్లదు అనేప్పటికి నేను అలా వ్రాయాల్సి వచ్చింది మరి. అక్కడ అమెరికాలో జరిగే వార్తలు చూస్తున్న వాళ్ళం కనుక అక్కడ ఏమి చెల్లుతుందో ఏమి చెల్లదో మాకు తెలుస్తూనే ఉన్నది. ఎక్కడైనా మానవ ప్రవృత్తి ఒక్కటే.
ReplyDeleteఇక పిరికితనం, ధైర్యం అనేవి చాలా సబ్జెక్టివ్ విషయాలు. నాకు పిరికితనం అనిపించేవి, మీకు అనిరతర ధైర్యం అనిపించవచ్చు. తప్పేమీ లేదు. కాలమే ఏది ఏమిటో తేలుస్తుంది.
ధన్యవాదాలు శివరామప్రసాద్ గారూ
Delete@SNKR
ReplyDeleteWhat you said is very true.
రావు గారూ!
Deleteధన్యవాదలు