కోక కట్టుకుంది - సె
వ్వాకు లెట్టుకుంది - కొత్త
దాకలంబ లెట్టుకోని
తాళ్ళరేవు వోడమీదా
సిరి సిరి మువ్వా - బల్
తళుకు సీరలంపినానే
సిరి సిరి మువ్వా
అందినట్టు తెలపవేమే
సిరి సిరి మువ్వా - నా
అందగత్తెవీవు గావ
సిరి సిరి మువ్వా
అద్దాల మేడలోన
సిరి సిరి మువ్వా - నీతొ
సద్దులాడ నోచనైతి
సిరి సిరి మువ్వా
కాని కాల మౌటచేత
సిరి సిరి మువ్వా
కడకు నీకు దూరమైతి
సిరి సిరి మువ్వా॥
చల్లని వెన్నెలనాడు
సిరి సిరి మువ్వా - వేయి
కళ్ళా నిన్ను చూడాల
సిరి సిరి మువ్వా
తెల్లని దేహమువాడు
సిరి సిరి మువ్వా
ఎల్ల సిరుల నివ్వాలి
సిరి సిరి మువ్వా॥
జోడు కొయ్యల వోడా మీదా
సిరి సిరి మువ్వా - జోడి
పావురా లంపినానే
సిరి సిరి మువ్వా
అందిందో అందలేదో
సిరి సిరి మువ్వా నాకు
తిరుగు టపా రానేదే
సిరి సిరి మువ్వా
- కళా ప్రపూర్ణ డా॥ అనసూయా దేవి గారి "జానపద గేయాలు" నుండి
http://archive.org/details/janapadagayyaalu020440mbp
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment