Jun 28, 2012

దేవుడా శక్తిని ఇవ్వు

జీవత ప్రయాణం కొనసాగాల్సిందే
నూరేళ్ళ ప్రయాణంలో
కలసి అడుగులో అడుగులు వేస్తూ
శ్వాసలో శ్వాసౌతూ
సగంలో సగం అవుతూ
దేవుడు కలిపే పాత్రలు
కొన్ని
అర్థాంతరంగా ముగిసిపోతాయి
కలసి నూరేళ్ళు నడవాల్సిన రెండో పాత్రకో?
ఆ లోటు తీరనిది
ఆ లోటు తీర్చలేనిది
ధైర్యమే తోడు
ముందుకు వెళ్ళితీరాల్సింది
అదే ప్రకృతి తీర్పు
జీవత ప్రయాణం కొనసాగాల్సిందే
దేవుడా శక్తిని ఇవ్వు
లేత హృదయానికి
ప్రేమించిన హృదయానికి
తట్టుకునే శక్తినివ్వు
నీ లీలనీ
నిలచిన కాలాన్ని
తట్టుకునే శక్తినివ్వు

[ప్రమాద వశాత్తూ మరణించిన నా సోదర సమానుడు, మిత్రుడు, శ్రేయోభిలాషికి అశృనయనాలతో]

10 comments:

  1. పరిచయం కొద్దిరోజులయినా, జ్ఞాపకం ఎంతగానో కలవరపెడుతుంది.
    జాబిలమ్మకు ఎందుకు వేసాడో భగవంతుడు ఆ శిక్ష !

    ReplyDelete
  2. కాకినాడ గురించి ఎంత సంతోషంగా వ్రాస్తారో కదా. తన ఊరి మీద అభిమానం అంటే శంకర్ గారి మాటల్లోనే చూడాలి.
    ఇట్లా అయిందేమిటో!

    ReplyDelete
  3. దేవుడా శక్తిని ఇవ్వు
    లేత హృదయానికి
    ప్రేమించిన హృదయానికి
    తట్టుకునే శక్తినివ్వు
    నీ లీలనీ
    నిలచిన కాలాన్ని
    తట్టుకునే శక్తినివ్వు

    _______________I pray for that!

    శంకర్, నువ్వు లేవన్న విషయాన్నీ ఇంకా.....ఇప్పటికీ నమ్మలేకపోతున్నా!

    ReplyDelete
  4. ఇక ముందు పెద్దక్షరాలతో SHANKAR.S అనే కామెంట్లు మనకి కనబడవు. బాధగా ఉంది.

    చిన్నవయసువాడు.. ఇలా అర్ధంతరంగా.. చాలా అన్యాయం.

    మీ నివాళి చాలా అర్ధవంతంగా ఉంది.

    SHANKAR.S కుటుంబ సభ్యులకి, స్నేహ బృందానికి నా ప్రగాఢ సానుభూతి.

    ReplyDelete
  5. చిన్నవయసులోనేఇలా జరగడందురదృష్టకరం...ఆయనకునివాళులు!

    ReplyDelete
  6. విషాదకర విషయం ఆలస్యంగా తెలుసుకున్నా.ఏమైంది? శంకర్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి.శంకర్ గారి ఆత్మకు సద్గతిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

    ReplyDelete
  7. విషాదకరమైన, కదిలించిన వార్త

    ReplyDelete