Aug 7, 2012

చైనాలో ఒలంపిక్స్ మెడల్స్ కోసం...

చైనాలో, ఒలంపిక్స్ మెడల్స్ కోసం అనే ఓ స్వార్థంకోసమన్నా పిల్లలని హింసిస్తున్నారు. మరి భారతావనిలో ఏంజరుగుతున్నదీ?
ఆడ పిల్ల పుట్టిందని పుట్టగానే చంపేస్తున్నారు గోడకేసి బాత్తున్నారు పసికందుని చెత్త కుప్పలోకి కుక్కలకు కాకులకు ఆహారంగా విసిరేస్తున్నారు.


యల్.కె.జి నుండే ఐఐటి కోచింగులు
యల్.కె.జి నుండే పది కిలోల పుస్తకాల సంచులు
ఎందరు తల్లితండ్రులు పిల్లలకిష్టమైన ఆటలను ఆడిస్తున్నారూ?
వారికిష్టమైన కథలను చెప్తున్నారూ?
ఎందరు వారి మనస్సుని తెలుసుకుని వారిలో ఉన్న కళని ప్రోత్సహిస్తున్నారూ?

బలవంతంగా ఇంజనీరింగు అనో డాక్టరు అనో నెత్తిన రుద్దటంకన్నా చైనా చేస్తున్నది ఎంతపెద్ద తప్పూ?
పతకాలకోసం చైనా తల్లితండ్రుల కోరికలకోసం ఇక్కడి పిల్లలు. ఆట్టే తేడా లేదని నా అభిప్రాయం.

3 comments:

  1. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా!

    ReplyDelete
  2. మిగతా అంతా ఏమో కానీ హైస్కూలు నుండి ఇంటర్ పూర్తయ్యేవరకు కాస్త ఒత్తిడి పెట్టాలి. ఆ సమయంలో కష్టపడితే భవిష్యత్తులో సుఖజీవనానికి పునాది ఏర్పడినట్టే కదా?

    ReplyDelete
  3. చైనా లో జరుగుతున్న పసి బాల హింస గురుంచి చెప్తున్నప్పుడు అది తప్పు అని చెప్పి భారత దేశం లో ఆడ పిల్లల ఫై జరుగుతున్న దురాచారం మంచి పని ఎవరైనా చెప్పరా ??? ఈ రెండు విషయాలకి సంబంధం ఏమిటి ? మీరు ఆ పసి పిల్లలని హింసించటం మంచి పని అని మీకు అని పిస్తే మీరు అదే చెప్పండి . అలాని భారత దేశం లో జరుగుతున్న ఇంకొక దురచారని కి దీనికి సంబంధం ఏమిలేదు

    ReplyDelete