Jul 21, 2012

మళ్ళీ పేలిన తుపాకులు

అమెరికాలోని కొలరాడోలో మరో మారు తుపాకులు పేలినాయి
మన్నెండు మంది నేలకొరిగినారు
వాడెవడో మెడికల్ స్టూడెంటు. నాలుగు తుపాకులు కార్లోవేస్కొని థియేటరుకి వెళ్ళి, ఫైర్ ఎమర్జెన్సీ లోనించి దూసుకెళ్ళిమరీ కాల్చాడు మనుషుల్ని పిట్టల్లాగా.

Police said the gunman entered through an exit door and appeared at the front of the theater in Aurora and released a canister, thought to be tear gas, that let out a hissing sound.

He then started shooting into the crowd, sparking pandemonium.

Witnesses said the shooter was wearing a bullet-proof vest and dressed entirely in black. Some also said he was wearing a gas mask or goggles.

"He had no specific target. He just started letting loose," the witness added.

Witnesses told reporters that the gunfire erupted during a shootout scene in the "The Dark Knight Rises."

Aurora Police Chief Dan Oates said it was established that the apartment had been booby-trapped with sophisticated explosives or flammable material and officers were trying to determine how to defuse the device or devices.

౧. హ్మ్! ఎన్టర్టైన్మెంట్ అనేది మనిషి మానసిక స్థితిపై ఇంతలా ప్రభావం చూపే పనైతే దాన్ని ఒకదగ్గర ఆపగలగటం మంచిది అని నా అభిప్రాయం.

౨. అమెరికాలో షూటింగ్ కొత్త కాదు. ఐతే, అమెరికాలో తుపాకులు దొరకటమూ కష్టం కాదు. తప్పెవరిదీ? మొన్నటికి మొన్న ఒకడు కొత్త గన్ కొని సోఫా మధ్యలో పెట్టాట్ట. వాడి మూడేళ్ళ కొడుకు ప్రమాదవశాత్తు ట్రిగ్గర్ నొక్కాట, తూటా పిల్లాడికే తగిలింది. తర్వాత ఏవైందో చెప్పాల్సిన పనిలేదు. తప్పెవరిదీ? ప్రస్థుత సంఘటనలో ఇరవైనాలుగేళ్ళ హోమ్స్ అనేవాడికి తుపాకులు అందజేసిన వ్యాపారానిదా తప్పు లేక, స్పైడర్మాన్ లాగా డ్రస్ వేసి క్యాన్స్ థియేటర్లోకి వదిలి కనిపించిన వాడ్నల్లా సినిమాలోల్లాగా కాల్చివేయటం అనే ఓ స్థితిని కలుగజేసిన సినిమా మాధ్యమానిదా లేక, తుపాకులను అడ్డుకోలేని ప్రభుత్వ పాలసీలదా?

౩. లేక, సదరు హోమ్స్ అనేవాడి మానసిక స్థితిని దిగజార్చిన కఠోరమైన మెడికల్ విద్యదా? అమెరికాలో మెడికల్ విద్యార్థుల కష్టాలు చెప్పనలవి కావని చాలా మందే చెప్పగా విన్నాను.

౪. గత పదిహేనేళ్ళుగా పబ్లిక్ షూటింగ్ అనేది కొత్త విషయం కాదు. అందునా షూటింగ్ చేస్తున్న వాళ్ళలో స్టూడెంట్ కుర్రాళ్ళే ఎక్కువ అన్నదీ కొత్తవిషయం కాదు. కానీ ఇంతవరకు ఎవరూ ఏఏ అడుగులు ముందుకి వేశారో నాకైతే తెలియదు.

౫. తల్లితండ్రులు తమ భద్రపరచుకోవాలి పిల్లలకి విలువలు నేర్పాలని ఇందాక ఎవరో రేడియోలో చెప్పగా ఇలా అనిపించింది -

"తుపాకులు బీరువాల్లో దాచిపెట్టినా, అందనిది ద్రాక్షా అవుతుంది. దాన్ని తాకాలనీ, జేబులో పెట్టుకోవాలని, గిర గిరా తిప్పాలనీ, పలానీ హీరోలాగా చేయాలనీ ఫ్యాంటసీసుని క్రియేటు చేస్తున్న మాధ్యమం, క్రియేటు చేస్తున్న వ్యవస్థా ఉన్నంత కాలం బీరువాలు ఉట్టి బీరువాల్లాగనే మిగుల్తాయి"

౬. కాపీక్యాట్ అయిన మన దేశంపై ఇలాంటి గన్ కల్చెర్ యొక్క ఇంపాక్ట్ ఏవిటీ అని ఆలోచిస్తుంటే వళ్ళు జలదరించక మానదు. తుపాకీని చూపని సినిమా చూపండి, ఒక్కటన్నా [దాదాపు లేవు అని నా అభిప్రాయం]. చట్టం నిద్రపోతూ న్యాయవ్యవస్థ కుళ్ళిపోతూ ఉన్న మన సమాజంలో తుపాకీని పొందటం ఎంత తేలికో ఆలోచించండి.

ఎలా? వీటిని ఆపటం ఎలా?

-ఆపలేము

6 comments:

  1. Bhaskar gaaru,
    Just wanted to share an experience in this context.
    My very close freind's ( just like any other next door telugu parents) son age 5, went to shopping with parents. In the parking lot the kid saw cop next to his car after getting down from the car just in fraction of sec the kid went to the cop and asked if he can have the gun. The mom and Cop both were shocked and the cop brought the boy in to conversations and explained in detail all the cop duties why he needs a gun and why kids should not have gun ( good guy) and obviously mom got a lecture from the car. Mom is still shocked. we can never imagine that something happens until it happens.
    The main reason for the kids curiosity on Gun was watching telugu movies ( thats what we felt)

    ReplyDelete
  2. హ్మ్!! ఎక్కడ జరిగిందీ ఈ సంఘటనా?

    ReplyDelete
  3. యూరప్ లో లాగా ఇక్కడ కూడా మంచి గన్ పాలసీ ఉండాలి.

    ReplyDelete
  4. భాస్కర్ ..గారు ఈ మధ్య ఏడేళ్ళ తరువాత ధియేటర్ కి వెళ్లి నేను ఒక సినిమా..చూసాను. గన్ పేలిన శబ్దాలు ఓ..వేయికి పైగానే!
    ఆ సినిమాని చూసిన చాలా మంది ఆహా..ఓహో..అంటూ రివ్యూలు.
    ఆ ఒక్క సినిమానే కాదు.. అసలు దృశ్య ప్రభావం,తుపాకీలు అందుబాటులోకి రావడం, రక రకాల ధోరణులని మనసు పై అప్లయ్ చేసుకుని.. హింస ని మోస్తున్న ఈ వ్యవస్థలో..(దేశం ఏదైనా సరే) పక్కలో పాముని పెట్టుకుని నిద్రిస్తున్నట్లే ఉంటుంది.
    బయట తుపాకులు పేలతాయి..మనసులో డైనమేట్లు పెలుతుంటాయి.:( ..

    ReplyDelete
  5. నాకు బాగా గుర్తు, రెండువేల ఐదు చివర్లో హైద్రబాదులో ఓ నెలన్నర ఉన్నాను. మా రూముకి దగ్గర్లో రిలయన్స్ బ్రౌజింగ్ సెంటర్ ఉన్నది. ఆరు నుండి పది తరగతుల పిల్లలు స్కూలు నుండి డైరెక్టుగా నెట్ సెంటరుకొచ్చి ఏదో నెట్వర్క్ ఎనేబుల్డ్ షూటింగ్ గేమ్ ఆడుతుంటే గమనించాను.
    షూటింగ్ అనేది థ్రిల్లింగా ఉంటుంది. అదే నిజం గన్ను ఇంట్లో ఉంటే, ఓహ్! ఇంట్లో గన్ అనే ఊహ మరి ఎలా ఉంటుందీ?
    పై సంఘటనలో సదరు వ్యక్తి పి.హెచ్.డి చేస్తున్నాడు. న్యూరలజీకి సంబంధించి.

    విలువలని నేర్పని చదువు చదివితే ఎంతా చదవకపోతే ఎంతా?

    ReplyDelete
  6. పై సంఘటన అతను ముందుగానే రచించుకున్నాడు *ప్రి మెడిటేటెడ్*.
    దానికి సంబంధించిన మాస్కులు తుపాకులు బుల్లెట్ ప్రూఫ్ వెస్టులు, టియర్ గ్యాసులు అన్నీ ముందుగానే తెచ్చుకున్నాడు.
    సినిమాహాల్లోకి వచ్చి కూర్చున్నాడు మామూలుగానే. సినిమా ఇక మొదలు అవుతుందనగా ఫోన్ మాట్లాడుతున్నట్టుగా బయటకి ఎమర్జెన్సీ ఎక్జిట్ నుండి వెళ్ళాడు. ట్రైలర్స్ ఇక అయ్యాయనగా మాస్క్ వేస్కుని వెస్ట్స్ అన్నీ పెట్టుకుని లోనకొచ్చాడు. ఇదంతా సినిమా థియేటర్ వారి స్టంట్ అనుకున్నారట వాణ్ణి చూసిన జనాలు. లోనకి రాగనే టియర్ గ్యాస్ వదిలాడు. మరొకవైపు సినిమా మొదలైంది. టియర్ గ్యాస్ వదిలీ వలటంతోటే షూటింగ్ మొదలెట్టాడు. వాడి వెనుకనుండి కొందరు పారిపోయి బయటకు వచ్చినవారి మాట ఇది

    ReplyDelete