Feb 3, 2012

వేదంలో ఏవుంది ఇన్నయ్యగారూ?

ఇన్నయ్య గారి పుస్తకంట అబద్ధాల వేట నిజాల బాట
http://paradarsi.wordpress.com/2012/02/01/book_review_abaddhalaveta/
అందులోండి ఓ తుంపర-

వేదాల్లో ఏముంది?
ఇక వేదాల్లో ఏముంది? అనే వ్యాసంలో ప్రాచీన కాలంలో ఎందరో ఆలోచనాపరులు (మన భాషలో రుషులు) ఆడుతూ పాడుతూ కంఠస్థం చేసినవే వేదాలు. ఇవి సంప్రదాయ బద్ధంగా, గురువునుంచి శిష్యునికి అలా… అలా… గుర్తున్నంత వరకూ ఆనోటా, యీనోటా నాని ప్రజలలోకి ప్రచారంలోకి వచ్చాయి. దీనికి మూల రచయిత ఫలానా అని చెప్పలేము. అలాంటి రచనలకు దివ్యత్వాన్ని ఆపాదించారు. ఇవి వెలుగు చూసిన కాలం నిర్ణయం కాలేదు – ఏదో ఉజ్జాయింపుగా చెప్పటమే. ప్రతిదానికీ దేవుడే కారణమని నమ్మారు అప్పటివారు. దయానందుడు సైతం కులాన్ని కాదన్నా వేదాలలోని వర్ణ వ్యవస్థకు వత్తాసు పలికాడు.వేదాలు నరబలిని అంగీకరించాయి. ఆ తరువాత వచ్చిన బ్రిటీషు పాలకులు దీనిని నిషేధించారు. వేదాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలను అగ్రవర్ణాలుగా సృష్టించాయి. శూద్రులు వారికి సేవ చేయాలన్నారు. వీరికి యజ్ఞం చేసే అర్హత లేదు. దయానందుడు ఎంత సంస్కరణ వాది అయినా శూద్రులు పితికిన పాలు కూడా అపవిత్రమన్నాడు. బ్రాహ్మణుడు శూద్ర స్త్రీలతో వ్యభిచరించవచ్చు. ఆ పని శూద్రులు బ్రాహ్మణ స్త్రీతో చేస్తే నరికేయాలన్నారు. ఇలాంటి తారతమ్యాలు జుగుప్సాహకర విషయాలు వేదాలలో ఉన్నట్లు ఈ వ్యాసంలో వివరించటం మనం చూస్తాం.

అహా!! ఎంతగొప్పగా ప్రశ్నించారండీ ఇన్నయ్య గారూ మరియూ వారి వకాల్తా పుచ్చుకుని బ్లాగులో వాక్రుచ్చినవారు.
వేదాల్లో ఏముందీ? ఔను మంచి ప్రశ్న. ఏవుందేవిటీ ఇన్నయ్యగారూ? తమరు ఎన్ని వేదాలు చదివారేవిటీ?

ప్రాచీన కాలంలో ఎందరో ఆలోచనాపరులు (మన భాషలో రుషులు) ఆడుతూ పాడుతూ కంఠస్థం చేసినవే వేదాలు.
ఆడుతూ పాడుతూ కంఠస్థం చేసారంటానికి మీవద్ద సాక్ష్యాలెంటీ?
ఏడుస్తూ కఠస్థం చేసుండాచ్చుగా? నిరూపించండి చూద్దాం!!
ఐతే! కఠస్థం చేసినవారు ఆలోచనాపరులు అంటారు.
మనభాషలో వాళ్ళు ఋషులు అన్నమాట.
అంటే ఋషులు ఆలోచనాపరులు. ------------------------------------ ౧ [దీన్ని అలా పెట్టుకుందాం. ఎప్పటికైనా ఉపయోగపడవచ్చు]

ఇవి వెలుగు చూసిన కాలం నిర్ణయం కాలేదు – ఏదో ఉజ్జాయింపుగా చెప్పటమే.
వెలుగు చూసిన కాలం నిర్ణయం కాలేదా? నోటిమీదకొస్తే వెలుగు చూసినట్టుకాదా?
సరే, 1000 BC అనుకుందాం, తమరి కుదృష్టిలో వెలుగు చూట్టం = ప్రింట్ కావటం, ఓహో అప్పటికి ప్రింట్ అవ్వలేదంటారా? మరి మీరు వాషింగుటన్ను పోస్టులో జాతకాలు వేసి మీ పుత్ర రతనమ్ ద్వారా సంపాదించిన ధనంతో అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ పెట్టలేదుకదా. అది మీ తప్పు.

వేదాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలను అగ్రవర్ణాలుగా సృష్టించాయి. శూద్రులు వారికి సేవ చేయాలన్నారు.
భలే భలే. ఏ వేదంలో చెప్పారండీ ఇది. ఒక్కమారు రిఫరెన్స్ చూపండి.
దయానందుడు ఎంత సంస్కరణ వాది అయినా శూద్రులు పితికిన పాలు కూడా అపవిత్రమన్నాడు.
దయానందుడు ఒంగోమన్నాడు. దానికీ వేదాలకీ సంబంధం ఎక్కడా?
బ్రాహ్మణుడు శూద్ర స్త్రీలతో వ్యభిచరించవచ్చు. ఆ పని శూద్రులు బ్రాహ్మణ స్త్రీతో చేస్తే నరికేయాలన్నారు.
ఎవరన్నారుటా? మీరా? వేదాలా? ప్రూఫ్ ఏవిటీ? మీది నోరా మునిసిపాలిటీ పాయిఖానానా? ఏవయ్యా? బ్రాహ్మణులు అనకుండా ఒక్కలైను వ్రాయగలవా? థూ!
ఇలాంటి తారతమ్యాలు జుగుప్సాహకర విషయాలు వేదాలలో ఉన్నట్లు ఈ వ్యాసంలో వివరించటం మనం చూస్తాం.
ఇలాంటి జుగుప్సాకరమైన విషయాలు వేదాల్లో కాదు ఉంది, మీ ఇరుకైన మనసుల్లో.

26 comments:

  1. బావుంది ఇన్నయ్య గారూ అయితే వేదాల రివైజ్డ్ వెర్షన్ సిద్ధం చేస్తున్నారన్న మాట.

    "దీనికి మూల రచయిత ఫలానా అని చెప్పలేము."

    మూల రచయిత ఎవరో చెప్పగలిగిన రామాయణం వంటి వాటికే తింగరి వక్ర భాష్యాలు చెప్తున్నారు ఇహ రచయిత ఎవరో తెలియక పోతే మీలాంటి వాళ్లకి పండగేగా. మీకు నచ్చనివన్నీ అందులో ఇరికిన్చేయచ్చు.

    "ఇవి వెలుగు చూసిన కాలం నిర్ణయం కాలేదు"

    అవి ఎప్పటికో అప్పటికి కనీసం వెలుగైనా చూశాయి. మీలాంటి వాళ్ళు పాపం ఇంకా చీకట్లోనే మగ్గుతున్నారుగా.

    ReplyDelete
    Replies
    1. పలానీ వాళ్ళు వ్రాసారూ అని తెల్సితే ఏంచేస్తారటా?
      అదికూడా అడగాలి ఇన్నయ్య గార్ని.

      Delete
  2. ఇలాంటి ఇన్నయ్యలు చాలామంది "వేదాలలో ఇలా వుందట", రామాయణం లో, భారత, భగవద్గీత లో మా శూద్రులపై ఇంత అన్యాయంగా వుంది అని రాస్తారు.. అయితే స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా, రాజ్యాంగం వాళ్ళకి అనుకూలంగా రాసినా ఇప్పుడు కుల రాజకీయాలే రాజ్యం ఏలి ఇంకా దళితులకి అన్యాయం జరుగుతునే వుంది.. మిగిలిన కులాల వారు వాళ్ళకి అన్యాయం చేసినా ఒక్క మాట మాట్లాడలేరు, కాని భ్రాహ్మణుల మీద పడి ఏడుస్తారు..ఎందుకంటే బలం లేదు కాబట్టి. ఎవడి పాపానికి వాడే పోతాడు అన్న సహనం వున్న వాళ్ళం కాబట్టి, వాళ్ళ్ రాతల్లో ప్రతీ రెండు లైన్లకొకసారి బ్రాహ్మణులకి వ్యతిరేకంగా రాస్తే అది పెద్ద సంఘాన్ని వుద్దరించి నట్లు.. ఏ సామాజిక వర్గమో వాళ్ళకి వ్యతిరేకంగా ఏ దళిత నాయకుడు మాట్లాడలేదు.. ధైర్యం, దమ్ము లేకనా,భ్రాహ్మణులను తప్ప మిగిలిన కులాలపై రాయమనండి చుద్దాం..
    మన దురదృష్టం ఇలా కులాల కుమ్ములాటలోనే ఏళ్ళ తరపడి కొట్టుకుంటూ అభివృధి లోకి రాలేక పోతున్నాం..టెక్నాలజీ లో కాని నాగరికతలో గాని మనకంటే వందేళ్ళు అభివృద్ది లో వున్న జపాన్, బ్రిటన్, అమెరికా వంటి దేశాల లో leni సహజ సంపద మనకున్నా, రాజకీయ నాయకులకు కోట్ల సంపాదనకు వాళ్ళకు అనుకూలంగా కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు.. అవి ప్రశ్నించ లేని పున్నయ్యలు, ఇన్నయ్యలు ఎప్పుడో వెయ్యేళ్ళ కాలంలో ఇలా వుందట, పురాణాల వేదాల్లో ఇలా వుంది అని గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తున్నారు..

    ReplyDelete
    Replies
    1. బ్రాహ్మలనంటే తిరిగి మాట్లాడరని వీరి అభిప్రాయం. అందుకే ఈ తైతక్కలాట. మరికొందరు బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ అని ఓ నడవడికనే నెత్తినపెట్టుకు తిరుగుతున్నారు.

      Delete
    2. *బ్రాహ్మలనంటే తిరిగి మాట్లాడరని వీరి అభిప్రాయం.*

      చరిత్ర,సంస్కృతి మొద||వాటి గురించి ఎవరైనా పుస్తకం రాస్తే చర్చ జరపటానికి సిద్ద్దంగా ఉండాలి. ఆ చర్చలో కూడా చరిత్రను కాలానుగుణం గా చర్చించాలి. అలా కాకుండా ఒక బ్రాహ్మణ పదం తీసుకొచ్చి, వేద కాలం నాటి బ్రాహ్మణుల నుంచి ఇప్పటివరకు ఉన్న బ్రాహ్మణుల వరకు ఒకే గాటన కట్టేసి పుస్తకాలు రాయటం. ఇక అక్కడోక ముక్క, ఇక్కడోక ముక్క ల తో తమవాదన వినిపించటం వారి పుస్తకాలలో కనిపిస్తుంది. ఇటువంటి పుస్తకాలు రాసినపుడు కొంత చర్చ జరుగుతుంది. మరి గన్నయ్య గారు బ్లాగులో చర్చకు రారు,ఎన్ని సార్లు ప్రశ్నించిన జవాబు చెప్పరు. ఇటువంటి వారిని మేతావులకింద జమకట్టటం కూడా అనవసరం.

      Delete
  3. ఈ కులగజ్జి ఇన్నయ్యలకి మామూలేగా :)

    ReplyDelete
  4. ఏవుందేవిటీ ఇన్నయ్యగారూ? తమరు ఎన్ని వేదాలు చదివారేవిటీ?
    __________________________________________________

    ఆయన బొంద. ఎవడో తలకుమాసిన "హేటు"వాది వ్రాసిన తలతిక్క అనువాదం చదివుంటాడు.

    ReplyDelete
    Replies
    1. భలే చెప్పావ్ అన్నాయ్!!
      *అనువాది*

      Delete
    2. యం.యన్ రాయి రప్ప వ్రాసుంటాడు

      Delete
  5. మరి మీరు వాషింగుటన్ను పోస్టులో జాతకాలు వేసి మీ పుత్ర రతనమ్ ద్వారా సంపాదించిన ధనంతో అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ పెట్టలేదుకదా. అది మీ తప్పు.
    _______________________________________________________________

    KEVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVV!!!!!!!

    ReplyDelete
  6. ఇవి సంప్రదాయ బద్ధంగా, గురువునుంచి శిష్యునికి అలా… అలా… గుర్తున్నంత వరకూ ఆనోటా, యీనోటా నాని ప్రజలలోకి ప్రచారంలోకి వచ్చాయి.
    -------------------------
    ఎవ్వరీ ఇన్నయ్య? ప్రతీ వాళ్ళూ వేదాల మీద వంటి కాల్తో లేచే వాళ్ళే. ఆ కాలంలో ప్రచారం చెయ్యటానికి, మాట్లాడు కొటానికీ, నానటానికీ కంప్యూటర్లు లేవు నాయనా. మనుషులే దేముడిచ్చిన కంప్యూటర్లు, మనుషుల నెట్వర్క్ ఉండేది. సమాచారం చేరవేయ్యటానికి నోరే నెట్వర్క్ నోడ్.

    ReplyDelete
    Replies
    1. హేతువాద సంఘం రావు గారూ!!

      Delete
    2. రావు గారూ, జన అజ్ఞాన వేదిక అని ఒకటి ఉంది. దానిలోనివారు ఇలాంటి చెత్త అంతా రాస్తూ మరో పక్క తాము ఏ నమ్మకాలనైతేతిడతారో ఆ నమ్మకా ద్వారానే డబ్బు సంపాదించుకుంటుంటారు.. first quality frauds and cheats..

      Delete
  7. అయ్యలారా ,

    ఈ ఇన్నయ్య ఎవరండీ బాబు ? మరీ తల తిక్కల సమాచారం గా ఉన్నాడే ?

    వేదం ఏమి చేసుకుందో గాని ప్రతి ఒక్కడూ వాగటమే !

    ఓ నాలుగు గీతలు దాన్లో అర్థం కావడానికి ఓ జీవిత కాలం నాకు సరి పోవటం లే నాకైతే

    జిలేబి.

    ReplyDelete
  8. @Zilebi

    ఇన్నయ్య ఎవరనేగా మీ ప్రశ్న. Let me approach this from a different angle and provide some context.

    ఇన్నయ్య గారు ప్రవీణ్ 'మార్తాండ' శర్మ గారి అభిమాన రచయిత, thinker, philosopher and ideologue.

    ఇది చాలుగా, ఇన్నయ్య గారి విరేచన రచనలను దూరంగా ఉంచడానికి!

    ReplyDelete
  9. *ఈ గన్నయ్య ఎవరండీ బాబు?*

    భలే వారే మీరు, అదేదో సినేమాలో ఇన్నిరోజులు పోలిస్ డిపార్ట్ మెంట్ లో ఉంట్టూ నెల్లూరి పెద్దారెడ్డి తెలియదా? అని బ్రహ్మి అడిగినట్లుంది మీప్రశ్న. మీరు అసలికి బ్లాగులోకం ఎలా ఉన్నారు? ఇక గన్నయ గారు బ్లాగులోకం లో అడవిలో వంటరి కోకిల లాంటివారు. ఆయన బ్లాగులో ఎవరు వ్యాఖ్యలు రాయరు, ఆయన ఇతర బ్లాగులో వ్యాఖ్యలు రాయరు. ఇక చరిత్రలోకి పోతే చాలా ఉంది. శంభూక వధ,సూత పురణాం పుస్తకాలు రాసిన త్రిపురనేని రామస్వామి ఆఖరి అనుచరుడనుకొంటాను. ఆరోజుల్లో వీరు తమీళ నాట ద్రవిడ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని తెలుగునాట పుస్తకాలు రాసి, సనాతన ధర్మానికి(బ్రాహ్మణులకు) వ్యతిరేకంగా గొప్ప భావజాలం /పిలాసఫి సృస్ట్టించామనో లేక సృష్ట్టించాలి అనో అను కొన్నారు. అందులో భాగం గా ఆనాడు పెళ్ళి మంత్రాలను తెలుగు లో రాసి, వారి వర్గం లో వారికి నేర్పించి వారిని కమ్మ బ్రహ్మణులుగా పిలిచి పెళ్ళిళు చేయించుకోవటాన్ని ప్రోత్సహించారు. ఈ వ్యవహారమంతా రెండూ మూడూ జిల్లాలకు మాత్రం పరిమితం. దినిని గురించి మిగతా జిల్లాల వారికి పెద్దగా తెలియదు.ఆ తరువాత రామస్వామి కొడుకు గోపిచంద్ అనే అతనే తన తండ్రి సిద్దాంతాలను పట్టించుకోలేదు. ఆయన అరబిందో వైపు ఆకర్షితుడై, షిరిడి సాయిబాబా ను పూజించేవారు. ఇతను తెలుగులో ఉత్తమ రచయితలలో ఒకడు. ఇతను రాసిన తత్వవెత్తల పుస్తకం చదివితే ఇతని మేధస్సు అర్థమౌతుంది. ఇక ఆయనకి సాహిత్య అకడేమి అవార్డ్ వచ్చిన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా పుస్తకంలో ప్రధాన పాత్ర తన తండ్రి అతని చుట్టూ ఉన్న మిత్రుల కథ.

    To be continued...

    ReplyDelete
  10. కం. ఇన్నయ్య హేతువాదుల
    కన్నయ్యే హైందవంబు నంతచెయ్యా
    లన్నదె ఆయన ధ్యేయం
    యెన్నటికిని మారజాల డితడు జిలేబీ

    కం. పళ్ళున్న చెట్లమీదే
    రాళ్ళుగదా హేతువాద రాకాసి జనం
    నోళ్ళన్నీ వేదనిందకు
    పళ్లికిలిస్తాయి బాధ పడకు జిలేబీ

    ReplyDelete
  11. ఆపుస్తకంలో వారిని అతను సునిశితంగా విమర్శించాడు. ఈ పుస్తకం గన్నయగారికి ఎందుకో నచ్చదు. బహుశా ఆయన చిత్రికరించిన పాత్రలలో వీరిది కూడా ఉండిఉండవచ్చేమో ! ఇక ప్రస్తుతానికి వస్తే ఆయన మిత్రులలో ఒకరైన ఆవుల గోపాల కృష్ణమూర్తి వివేకానందుని పైన ఎవేవో విమర్శలు చేశారని. అదొక గొప్ప విషయంలా రాసుకొంట్టుంటారు. కాని ఈమధ్య ఆయన కుతురు ఆవుల మంజులత అనే ఆవిడ (మాజి వైస్ చాన్సలర్ అనుకొంటాను ) సద్గురు శివానంద గారికి, వారి నాన్న గారి పేరు మీద ఉన్న అవార్డ్ ను ఇచ్చి సన్మానించారు. హేతు వాద ఉద్యమం నుంచి అనబడే దానిని నుంచి ఉన్న ఆపది మందిలో ఒక్కోక్కరు జారిపోయారు. దానికి ప్రధానంగా ఎన్నో కారణాలు ఉంటాయి. సమాజంలో వచ్చిన మార్పులు, మనుషులలో వికసించిన మేధస్సు మొద||. కాని నిరంతరం పుస్తకాలను అనువదించే పని లో ఉంట్టూడటం వలన గన్నయ్య గారి మేధస్సులో మొదటి నుంచి పెద్ద మార్పులు వచ్చినట్లు లేవు. ఎప్పుడు ఇతరుల అనుభవాలను/ రాసినవి కాపి చేసి తెలుగులో రాసి, చూసుకొని తనకు చాలా తెలుసనుకోవటమే కాని, అది అవగాహనలేని జ్ణానం కావటం చేత వారికి వయసుతో పాటి, పెద్దగా మేధస్సు వికసించటం జరగలేదనిపిస్తుంది. దానికి తోడు సమకాలిన సమాజం లో మార్పులను అసలికి గురితించినట్లు వారి రచనలో ఎక్కడా కనపడదు. అలా వారు గుర్తించినట్లైతే ఇలాంటి పుస్తకాలను రాయటం ఎప్పుడో ఆపేవారు. ఇక వారు ఫాలో అయ్యే ఫిలాసఫి వలన కనీసం వారి వర్గం లో వచ్చిన మార్పులను విపులంగా చర్చించినట్లు ఎక్కడా కనపడదు. వారి టపాలలో అక్కడ మేమంతా సమావేశమయ్యాము, ఆ వూరిలో మీటింగ్ వీరు వచ్చారు అనే మాటలు తప్పించి ఎమీ ఉండవు. త్రిపురనేని గారితో మొదలైన ఫిలాసఫి ఇప్పుడు ఎలా ఉందో, ఎవరు ఫాలో అవుతున్నారో వివరాలు పెద్దగా తెలియదు. మచ్చుకి, వారిలో ఇంకా కమ్మబ్రహ్మణులు ఉన్నారా? ఉంటే పెళ్ళిలు చేయించటం చేస్తున్నారా? లేకపోతే వారు ఆ వృత్తిని మానుకోవటానికి గల కారణాలు ఎమై ఉంటాయి? ఇలాంటి విషయాల మీద ఆయన ఎప్పుడు వివరాలు రాయలేదు.

    ఇక వీరు రాసే ఈ పుస్తకాలు ఎవరికి ఉపయోగపడతాయి? ఈ మధ్య కాలంలో ప్రజల దృష్ట్టీలో విలువను అతి త్వరగా కోల్పోతున్న మీడీయా వారికి మాత్రం ఉపయోగపడుతాయి. వారు తీరిక సమయాలలో ఈ పుస్తకంలో రాసిన వాటిని, కొంతమంది నిరుద్యోగ మేతావులతో చర్చ పెట్టి తమ విలువను తగ్గించుకకోవటానికి బాగా పనికి వస్తాయి. ఈ రోజులలో ఎలాగూ తెలుగు మీడీయాకు గౌరవంలేదు. ఆ స్టుడియోలలో చేరి ఒక వర్గం వారిని మాత్రమే దూషించేకొద్ది, పుస్తకం దానిని రాసిన రచయిత పై అందరికి గౌరవం తగ్గి పోతుంది.
    హిందూమత ఫిలాసఫి దాని ఫాలో అయ్యిన వారు, ఆ ఫిలాసఫి ఎటువంటివారిని ప్రోడ్యుస్ చేసిందో, ఇప్పుడు(వర్తమాన కాలంలో ) ఎలా ఉన్నారో అని ప్రజలు ఆలోచిస్తే, ఈ రోజు ప్రతి తెలుగు పేపర్లలో ఒక్కమగాడిగా కీర్తించిన సుబ్రమణ్య స్వామి దొరుకుతాడు.ఈయన ఫిలాసఫి అటువంటి వారిని ఎవరినైనా సమాజానికి అందించిందా?

    ReplyDelete
  12. "ఇక వీరు రాసే ఈ పుస్తకాలు ఎవరికి ఉపయోగపడతాయి?"

    శ్రీనివాస్ గారూ మీ ఈ మాటను ఖండిస్తున్నందుకు క్షమించాలి. ఆ పుస్తకాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. నాకు తెలిసి కేజీ నాలుగు రూపాయలకో ఐదు రూపాయలకో కొంటారనుకుంటా.అది ఆదాయమే కదండీ. ఉపయోగమే కదండీ.

    ReplyDelete
  13. ఇన్నయ్య విశ్వనాథ మీద రాసిన వ్యాసపు పునర్ముద్రణ చదివి నా బ్లాగులో విశ్వనాథ గురించి ఒక పోస్ట్ వేసి అగ్రిగేటర్‌లోకొచ్చా. ఇక్కడ మీరు. :)

    ReplyDelete
  14. * ఈయన ఫిలాసఫి అటువంటి వారిని ఎవరినైనా సమాజానికి అందించిందా?*

    @శ్రీనివాస్ గారు,

    అ రే రే. మీరు పేపర్ రోజు చదువుతున్నట్లు లేదు. వారి వివరాల కొరకు సాక్షి పేపర్ తిరగేస్తే తెలుసుతుంది. అదేమి రామస్వామి పెరియార్ ఫిలాసఫీనో! తమిళనాడులో అందరు అవినితి ఆరోపణలు ఎదుర్కొని సి.బి.ఐ. దర్యాప్తులు జరిపించుకొంట్టు, జైలు కెళ్ళి కూచొంట్టున్నారు. వ్యాపారాలు, డబ్బులు లక్షల కోట్లు సంపాదించుకొన్నా, సంఘం లో వారి గౌరవం, విలువ ఘోరంగా దిగజారిపోయింది. అది వారి ఫిలాసఫి 60సం||కాలంలో సాధించిన ఘనవిజయం.

    ReplyDelete
  15. http://www.ndtv.com/video/player/news/taslima-nasreen-attacked-in-hyderabad/15932

    this is how Muslims honor him.

    ReplyDelete
  16. బ్లాగులో చాలా చోట్ల తాను మొoడివాడినని, చాలా ధైర్యంగల వాడినని, మాటలు వచ్చే చిన్న పిల్లలు అమ్మ దగ్గర కోతలు కోసినట్లు కోశాడు. తన ప్రొఫేసర్ తో (ఆయన అరబిందో ఘోష్ ఫాలోయర్ ) పి చ్ డి చేసే టప్పుడు తగవు వేసుకొని, ఉస్మానియా వి సి ని ముప్పుతిప్పలు పెట్టానని రాశారు. తాన ధైర్యానికి తానే జబ్బలు చరచుకొన్నారు. ఈ విడియో లో వారి పై దాడి చేసేవారిని, ఎక్కడా కనీసం ఒక్కసారి ప్రతిగటించలేదు సరికదా, 43వ సెకను వద్ద వారి చేతిలో దెబ్బలు తిన్నారు. ఇతనిని నమ్ముకొని ఆమే డిల్లి నుంచి పుస్తకం విడుదల కొరకు వచ్చింది. ఏంత ఈజి గా లొంగిపోయారు. కనీసం ఆడవారి ముందు పోజు కొట్టటానికైనా ప్రతిఘటించ లేదు. హత విధి! వీరు పుస్తకాలు రాసి ప్రజలకు చైతన్యం, వ్యవస్థను ఎదిరించే ధైర్యం నూరిపోసేవారన్నమాట.
    హిందువులకు ధైర్యం , సంస్కారం ఎక్కువ గనుక, కొంచెం కూడా ధైర్యం లేని ఈ కలిసైనికునికి సన్మానం అనవసరమని భావించి ఉంటారేమో!

    ReplyDelete
  17. వసుధ ఏక కుటుంబం.............. !!
    వసుధ ఏక కుటుంబం అన్నది ఈ భూమి
    సర్వే జనా సుఖినోభవంతన్నది ఈ జాతి
    పలికిన వాడు బ్రాహ్మణుడు - పలికించిన వాడు బ్రహ్మదేముడు !
    ఈ భూమికి చెందని సత్ సంప్రదాయం - ఈ జాతికి చెందని సంస్కారం
    ఇలలో, ఇతర జాతులలో, జాతి అహంకారులలో కలవా కలలలో, కధలలో ?
    అమెరికా బ్రిటన్ భక్తులు -రష్యా చైనా తొత్తులు-పాక్ బంగ్లా విత్తులు
    వీరా సెక్యులర్ శక్తులు ............................................. ?
    గతమెంతో ఘనకీర్తి గల భూమి ఇది - మతమంటే మానవత్వం అన్న జాతి ఇది !
    కాదా.....ఇది త్రికాల వేదం ఈ బందా నాదం !!

    ReplyDelete
  18. మేధావి.............. !!
    ఏ మేధావికైనా తెలిసినది ఈ విఙ్నాన సాగరంలో ఓ బిందు మాత్రమే -ప్రతి మేధావీ తన జీవన పర్యంతం ఓ విద్యార్ది మాత్రమే - అంటారు నిజమైన మేధావులు - కాదా ఇది త్రికాల వేదం ఈ బందా నాదం !!

    ReplyDelete
  19. దేవాలయ ప్రవేశము లోని శాస్త్రీయత (సైన్సు) అను నా గ్రంధం చదవండి.....

    ReplyDelete