Dec 31, 2010
అతివలపై అకృత్యాలకు అడ్డేలేదు: డీజీపీ అరవిందరావు
మహిళలపై పెరుగుతున్న నేరాలు
తగ్గిన రోడ్డు ప్రమాదాలు: డీజీపీ అరవిందరావు
లెట్స్ సెలబ్రేట్ బ్రొ!!!!
Dec 29, 2010
ఎద్దెమ్మ బర్త్‌డే, పాటీ కేక్
పాటీ సీటు మీద క్రేయాన్స్ కొవ్వొత్తులంటయ్యా.
పాట మాత్రం హేపీ బర్త్‌దే సూయా అంట
బర్త్‌దే పార్తీ అంటయ్యా. ఎవురెవురొచ్చారో తెలుసా?
ఎద్దెమ్మ, వాళ్ళా నాన్న అమ్మ, సూయా, బురుగు (అంటే పురుగు అని, కొంచెం ఉపయోగించబ్బా) నిమ్మకాయసరస్, పిసిస్ (పిసిస్ అంటే ఏందో అని మోకాలు గోక్కోమాక, పిసిస్ అంటే స్పైడర్)
నువ్వూ వస్చావా మరి?
Dec 27, 2010
భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
ఉదాహరణకు -
భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్కృత మరియూ ప్రాకృత భాషా చేవ్రాత ప్రతులను సేకరించి భద్రపరచటంలో పేరు ప్రఖ్యాతులు పొందింది. వీరివద్ద కొన్ని వేల ప్రతులు సేకరింపబడి భద్రపరచబడ్డాయి.
ఐతే, రాజకీయావేశాలకు, ప్రాంతీయ తత్వానికీ చారిత్రాత్మకత ఆవశ్యకత అవసరం పట్టవు. ౨౦౦౩ డిశెంబరులో కొందరు మరాఠా ముష్కరులు విలువైన ప్రతులను దహనం చేసారు.
Vandalism in 2003
The institute was vandalized in December 2003 by a mob made up of members of an extremist self styled Maratha youth squad, calling themselves the Sambhaji Brigade, named after Shivaji's elder son. They claimed to be angered by the help provided by the institute's staff (in translating manuscripts) to a Western writer, Dr. James Laine, who discussed the telling and retelling of stories about Shivaji's parentage and life in his book on narrations of the Shivaji story.[5] The mob also *damaged thousands of manuscripts[6]* and attacked Shrikant Bahulkar, a Sanskrit scholar who had only explained some Sanskrit references to Laine.[7] The incident provoked widespread reaction[8] and historian Gajanan Mehendale to destroy parts of his in-progress biography of Shivaji.[9][10]
http://en.wikipedia.org/wiki/Bhandarkar_Oriental_Research_Institute
ఇలాంటి సంఘటనలు కోకొల్లలు మన దేశంలో. మహారాష్ట్రలోనే కాదు మన కళ్ళముందే ఎన్నో ఇలాంటివి జరుగుతుంటాయి. ప్రాంతీయ దురభిమానం కళ్ళకు గంతలు కట్టేస్తుంది. విలువైన మన సంస్కృతి అర్థంలేని ఆవేశంలో మట్టిపాలౌతోంది. రేపటి మన భవిష్యత్తుకి(ముందు తరాలకు) వారసత్వంలా అందించాల్సిన ఈ సంపదను కేవలం ఐదునిమిషాల ఆవేశానికి బలి ఇవ్వటం ఎంతవరకూ సబబూ?మా పల్నాటిలోని కోటలు చాలా వరకూ నాశనం అయ్యాయి. కొన్ని భూస్తాపితం అయ్యాయి. కొన్ని కేవలం గోడలుగా మాత్రమే మిగిలి పొయ్యాయి. దోచుకోబడ్డాయి, దోపిడీ కాబడ్డాయి. శిధిలమైయ్యాయి. మహాభారతానికి దీటైన నిజ చరిత్ర కేవలం పుస్తకాలలో మిగిలింది. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన కారణంకాగా ప్రజలలో లోపించిన స్పృహ మరో కారణం.
జై హింద్
Dec 26, 2010
నాన్నా క్రిస్మస్ గిఫ్ట్ ఏమిస్తావ్
సూరిగాడి సొద మొదలుపెట్టాడు.
ఏంకావాలిరా నాన్నా అని అడిగాను. వాడికి మనసులో ఏదోక పెద్ద కోఱిక ఉండేఉంటుంది తప్పకుండా అని అనిపించింది. కొంత ఊహించా కూడా. వాడి కార్ల పిచ్చి కళ్ళముందు ఒకసారి మెదిలింది. ఎప్పుడు వాల్మార్ట్ వెళ్ళినా టాయ్స్ దగ్గరకి వెళ్దామని అడుగుతాడు. వద్దురా బాబూ, వెళ్ళినప్పటినుండి కొను కొను అడి ఏడుస్తావు, నాకు తలనొప్పి రా నాయనా అంటే, లేడు నాన్నా జస్ట్ చూసి వచ్చేద్దాం అంటాడు. జస్ట్ టు సీ అంతే, నో బైయింగ్ అని ఖచ్చితంగా అంటాడు. ప్రామిసులు గట్రా చేస్తాడు. నా రోజు బాగుంటే, వచ్చేస్తాడు జస్ట్ చూసి. ఖరాబు రోజున ఏడ్చి నాకు అదు కావాలా అని రచ్చ రచ్చ చేస్టాడు. తప్పు వాడిది కాదుగా. కన్జ్యూమరైజ్డ్ మార్ట్ ది. కన్జూమర్ని అవసరంలేకపోయినా ఎట్రాక్టు చేసి కొనిపించే మార్ట్ హృదయలేమిది. ఏమైనా వాడికి ఏంకావాలో నాకు సగం అర్థం అయ్యింది. లైటెనింగ్ మెక్వీన్ కావాలంటాడు.
సరే, మాంచి సమయంచూసి ఏరా నాన్నా ఏంకావాలో చెప్పరా అని అడిగిందే తడావు, లైటెనింగ్ మెక్వీన్ రిమోట్ కంట్రోల్ కార్ కావాలి నాన్నా అన్నాడు.
రోజూ ఆఫీసు నుండి ఇంటికెళ్ళంగనే తెచ్చావా అని అడగటాం లేదురా ఇంకా టైం ఉందిగా అనటం అలవాటైపోయింది వాడికీ నాకూ.ఇక నిన్న క్రిస్మస్ ఈవ్. ౨౪ డిశెంబరు. ఇక కొందాం అని బయల్దేరాం. వా.మా వెళ్ళాం. ఎంత వెతికినా మనకి కావాల్సింది దొరకలా. ఎట్లా నాన్నా అంటాడు మొహం చిన్నబుచ్చుకుని. సరేరా టాయ్స్-స-రస్ లో ప్రయత్నిద్దాం అని అటు వెళ్ళాం. చలిగా ఉంటంతో, బ్యాచీని కార్లోనే వదిలి లోనకి ఏతెంచా. వెతికా మొత్తం, దొరకలా. ఐతే, ఒక ర్యాకు మొత్తం రి/కం అంటే రిమోట్/కంట్రోల్ కార్లు ఉన్నాయ్. అక్కడే ఫెర్రారి మోడాల్ ఒకటి కనిపించింది. వెంటనే కాల్ కొట్టా, ఏరా రెడ్ ఫెర్రారి ఉంది మరి ఏంచేద్దాం అన్నాను. ఓకే, ఐ'ల్ ప్రిటెండ్ దట్ అస్ మెక్వీన్ అన్నాడు. హమ్మయ్యా బతికాం అనుకున్ని కొన్నా. కారుదగ్గరకి పోంగనే ఇటివ్వు చూస్తా అన్నాడు. ఇచ్చాణు. నచ్చింది.
మొత్తానికి వాడికి నచ్చి వాణ్ణి ఎంటర్టైన్ చేస్తోందీ కార్ గిఫ్ట్. ఇదే ఆ కారు.
Dec 25, 2010
తమ్ముడు సుబ్బులు పుట్టిన్రోజు
ఏసు ప్రభువు పుట్టినాడంట.
కావొచ్చు
మాకేంది?
ఇయ్యాల్నే మా సిన్నోడు సుబ్బులు [అ.క.అ సుబ్రహ్మణ్య సైతన్య http://swarnmukhi.blogspot.com/]
పుట్టినేల
మనోడికి
నా శుభాకాంక్షలు
ఇట్టనే జీవితంలో ఉన్నతులు పొందాలని
నా ఆశీస్సులు
Dec 24, 2010
Dec 22, 2010
రోడ్డుపై చిల్లర వ్యాపారాలుకు కూడా గతిలేని హిందువులు
ఏంచేస్తారులే పాపం ఉన్నదంతా వెయ్యేళ్ళ ముస్లింపాలనలో దోపిడీకాబడ్డారుగా
పేవుమెంటులపై పూలమ్ముకుంటున్న ముస్లిములను చూస్తూ
పళ్ళమ్ముకుంటున్న పల్లీలమ్ముకుంటున్న ముస్లిములను చూస్తూ
ఆ పక్కనే కొంచెం జాగా కోసం కాలుపెడితే
తన్ని తరిమేసే వ్యాపారాత్మకతను నిస్సహాయంగా చూస్తూ
దూదేకుతున్నా
వీధిఅరుగుపై దర్జీపని చేస్తున్నా
గడియారాలు బాగు చేస్తున్నా
ఎవరికైనా కావాల్సింది బ్రతుకుతెఱువే అని గుర్తించని వారికి
కనీసం అదీలేకుండక
కడుపులో కాళ్ళు పెట్టుకుని
ఆర్తితో
కండ్లనీటితో
బిచ్చమెత్తుకుంటున్న హిందువులు ఎందరో
ఎవరైనా ఆ పట్టెడన్నం కోసమే
ఎవరికైన ఆ పట్టెడన్నమే
కోఱుకునేది కావాల్సింది
ముస్లిములు ఆకాశం నుండి రాలేదు
వారిని కూర్చోబెట్టి పోషించటానికి
వారు దోచిన దేశమే కదా
వారు దోచుకున్న దేశమే కదా
వారు దోచుకోబట్టే కదా
ఈ దేశం
ఒకనాడు వెలుగు వెలిగిన దేశం
ఒకనాడు ఆర్థికంగా వెలిగిన దేశం
ఒకనాడు శక్తితో వెలిగిన దేశం
ఈనాడు ఇలా
బిచ్చమెత్తుతూ
ఈనాడు ఇలా
ప్లాటుఫారంపై మిగిలిన అస్థిపంజరంలా
ఇంకేంకావాలయ్యా మీకూ
మా ఊళ్ళను ఆక్రమించారు
మా గుళ్ళను పగులగొట్టారు
మా దేవుళ్ళ కాళ్ళను విరగొట్టారు
మా స్నానాల ఘాటూలను బాంబులతో పేల్చేసారు
మా వీధులు రక్తపు ఏర్లైయ్యాయి
మా పండుగలు బిక్కుబిక్కుమన్నాయి
మా ఆనందాలు దేబిరించాయి
మా పార్లమెంటుకే ఎసరుపెట్టారు
మా దేశపు సరిహద్దుల్లోకి చొచ్చుకు వచ్చారు
కనిపించిన సామాన్యులను కాల్చివేసారు
మా హృదయాలను చీల్చివేసారు
మిగిలిన దేవళాలనూ పేల్చేస్తామన్నారు
ఔనులే మా మంచితనం మీకోవరం
మా అనైకమత్యం మీకో వరం
అనైతికతను ప్రశ్నిస్తే మతం పేరు చెప్తారు
నీ రక్తం భరతమాత తిలకం కాదు
భరతమాతని చీల్చి
ఆ రక్తంతో మీకో కోట కట్టించాం
అది మీరు మరచారు
మరో మారు చీల్చి ఇచ్చాం
మరోమారు పక్కలో పొడిచరు
డొక్కల్లో పొడిచారు
పొడుస్తూనే ఉన్నారు
భరతమాత రక్తంతో
పండగలు చేస్కున్నారు
దేనికైనా ఓ రోజొస్తుంది
దేనికైన ఓ అంతం ఉంటుంది
నా రేపటితరం
దీన్ని ప్రశ్నిస్తుంది
నా రేపటి తరం
దీనికి ముగింపు రాస్తుంది
ముగింపుకి పునాదిని నేనే వేస్తా
ముగింపుకి పునాదిని ఇప్పుడే వేస్తున్నా
నా రాజ్యాన్ని నేనే కాపాడుకునేందుకు ముందుకు వస్తున్నా
ఓ హిందూ సోదరా లే
నిద్దురలే
నీ ఇంటిని కాపాడుకునే రోజు వచ్చింది
ఇకలే
ఎదురించి పోరాడు
మన ఇంటిని మనమే కాపాడుకుందాం
మన వీధిని మనమే కాపాడుకుందాం
మన గుడిని మనమే రక్షించుకుందాం
మన రాజ్యానికి మనమే కాపలా కాసుకుందాం
Dec 20, 2010
హిందూ తీవ్రవాదం ప్రమాదకరం - రాహుల్
ఉగ్రవాదం కన్నా దానితోనే దేశానికి ఎక్కువ ముప్పు
అమెరికా రాయబారితో రాహుల్ వ్యాఖ్యలు
వెల్లడించిన వికీలీక్స్
భారత్ పట్ల అవగాహన లేని అజ్ఞాని
భాజపా, ఆరెస్సెస్ ఆగ్రహం
వివరణ ఇచ్చిన కాంగ్రెస్
సగం కిరస్థానీ సగం పార్సీ అయిన ఓ మేధావీ, నీకు దేశం దాసోహం అంటోంది. నువ్వే మాకు మార్గదర్శకుడివీ అంటోంది. రాజావారి మాటలు కొందరు కుత్తేలకు, అరుంధతీ రాయిలకు సమ్మగా వినసొంపుగా అనిపించవచ్చు.
కుట్ర ఉండవచ్చన్న కాంగ్రెస్
రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగటంతో కాంగ్రెస్ వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేసింది. ఉగ్రవాదం, మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా దేశానికి ప్రమాదమేనని, వాటిపట్ల అప్రమత్తతతో వ్యవహరించాలన్నదే రాహుల్‌గాంధీ అభిప్రాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ పేర్కొన్నారు. వికీలీక్స్ వెల్లడి వెనుక ఏమైనా కుట్ర ఉందా అన్న అనుమానాలున్నాయని, సత్యాసత్యాలు నిగ్గు తేల్చే ప్రయత్నాలు చేస్తామన్నారు.
కుట్ర ఉంది వికీలీక్సులో కాదురా రాజకీయ దురహంకారీ. కుట్ర ఉన్నది నీ మనసులో, వెన్నెముకలేని నీ రాజకీయ స్వార్థపు విధేయతలో, కుట్ర ఉన్నది ఏంచేసైనా మళ్ళీ ఎలక్షన్లు గెలవాలనే సంకుచిత ఆలోచనలో.
Dec 17, 2010
పుట్టిన్రోజు గ్రీటింగు ముక్క
8 రాక్స్ అంటా.
ఆణిల్చుకున్నది ఆడేనంట, డైవింగుకొచ్చాడంట.
బ్రౌను రంగులో ఉంది షిప్ రెక్ అంట.
కింద రేడియం రంగు సీ వీడ్ అంట.
కింద ఆకుపచ్చ చక్రం సీ యా౨నిమోన్ అంట. అంటే ఏమ్దో నాకు తెలవదబ్బయా.
అట్ట సెప్పుకుంటా పోతే ఓ బొక్కే రాయొచ్చులే గానీ, కాయితకం ఎనకమాల ఇట్టా రాసిండబ్బా
సంటిది నాదీ, ఏపీ బర్త్‌డే అంది.
అదయ్యా ఈపొద్దు సంగతి.
స్పాన్టేనియస్ ఆర్ట్
ట్రీ ఫేస్
ముందు కళ్ళు మూసుక్కూర్చుంది వాడేనట. దాకలమూచి ఆడుతున్నాడంట.
అటు ఇటు ఉన్న పిల్లకాయలు నిక్, పియర్స్ ఇత్యాది వాడి క్లాసు మేట్లు. బహుశా వాడి రెసెస్ టయం అయిఉండచ్చు.
అదీ కథ ఈ దినం.
Dec 12, 2010
ఆలయ రక్షణ భారం దేవుడిదే
ఆందోళన రేకెత్తిస్తున్న ఐ.ఎం. హెచ్చరికలు
చేతులు ఎత్తేస్తున్న పోలీసులు
హైదరాబాద్ - న్యూస్‌టుడే
అయోద్య వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా గత మంగళవారం వారణాసిలోని దేవాలయంలో ఇండియన్‌ముజాహిద్దీన్ (ఐ.ఎం.) బాంబు పేలుళ్లకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అనంతరం భారతీయ మందిరాల్లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిస్తు కొన్ని పత్రికా కార్యాలయాలకు ఐ.ఎం. ప్రతినిధులు ఈమెయిల్ సందేశం పంపారు. 2008 ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీపార్కుల వద్ద జరిగిన పేలుళ్ళు ఈ సంస్థ పనే. ఐ.ఎం. వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్, సాంకేతిక నిపుణుడు పీర్‌భాయ్ మొదలు అనేక మంది ఐ.ఎం. కీలక సభ్యులు గతంలో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించారు. జంట పేలుళ్ళకు ముందు కొన్ని నెలలపాటు ఇక్కడ తిష్ట వేశారు. గతంలో ఈ సంస్థ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి తాజా హెచ్చరికల నేపథ్యంలో అది మరోమారు విరుచుకుపడే అవకాశాలు తోసిపుచ్చలేం. పైగా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా ప్రకటించింది కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో చిన్నాచితకా అన్నీ కలిపి మొత్తం 37వేల దేవస్థానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 27వేల దేవాలయాలకు ఎలాంటి రక్షణా లేదు. ఇందులో నిత్యం వేలమంది దర్శించే దేవాలయాల సంఖ్య కనీసం 500 వరకూ ఉంటుంది. పర్వదినాల సమయంలో ఈ దేవాలయాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో వీటికి కనీస స్థాయి భద్రత అయినా కల్పించాల్సిఉంది. అయితే దేవాలయాలన్నింటకి భద్రత కల్పించడం తమవల్ల కాదని పోలీసులు చేతులు ఎత్తివేస్తున్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా పోలీసు సిబ్బంది ఉండగా వీరిలో శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసులకు దైనందిన విధులతోనే సరిపోతోంది. రిజర్వు బలగాల సంఖ్య దాదాపు 20వేల వరకూ ఉన్నా ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోవడంతో వీరంతా తీరికలేకుండా పనిచేస్తున్నారు. వారంతపు సెలవులు కూడా తీసుకోలేకపోతున్నామని వీరు వాపోతున్నారు. ఈ నెలాఖరుకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచే బలగాలను సిద్దం చేస్తున్నారు. ఇప్పుడున్న పోలీసులను వారి విధుల నుంచి తప్పించి ఇతర పనులు అప్పగించడం సాధ్యమయ్యేలా లేదు. దాంతో ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో దేవాలయాల భద్రతపై ఆందోళణ నెలకొంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రత్యామ్నయ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది.
-----------------------------------------------------------------
చారిత్రక కట్టడాలు మన గుళ్ళు. వేల సంవత్సరాల చరిత్ర. రాజకీయ లబ్దికోసం బలిపెడుతున్నారు. మన గుళ్ళను మనమే కాపాడుకునే సమయం ఆసన్నమైంది. వెన్నెముకలేని ప్రభుత్వాన్ని, రాజకీయాలకు డబ్బుకూ అమ్ముడుపోయిన న్యాయ చట్ట వ్యవస్థని నమ్ముకుంటే మన మూలాలే మిగిలేలా లేవు.
Dec 10, 2010
టా౨బ్లెట్ల యుద్ధం
ఇది దేశీయ కంపెని. బంగళూరు దీని ప్రధాన కేంద్రం.
Apple వాడూ ఏ ముహూర్తాన ipad అన్నాడోగానీ, టా౨బ్లెట్ల యుద్ధం మొదలైంది.
Apple ipad
పది టా2బ్లెట్లు ipad తో పోటీపడేవి ఇవిగో
JooJoo
HP Slate
Exopc slate
IVD Vega
Viliv X70
Plastic Logic QUE proReader
Archos 9
Dell Steak
Asus Eee Tablet
Notion Ink Adam
Lenovo IdeaPad
అదబ్బా ఇంకా ఏవన్నా ఉన్యాయేమో, నాకు పెద్దగా తెలవదు. ఇవన్నీ దాదాపు మూడు వందల డాలర్ల నుంచి ఆరు వందల డాలర్ల ధరల్లో ఉన్నాయి. చాలామటుకు లైనక్స్ మీద చేసినవే.
Dec 9, 2010
చలికాలంలో కార్ మైలేజీ తగ్గును
సలికాలం మైలేజి తగ్గుద్దంటా అబ్బయ్యా. ఎందుకో? అనుకున్టన్నవా? కొన్ని కారణాలు ఇవిగో -
రోలింగ్ రెసిస్టన్స్ పెరగటం. Rolling resistance at 0 degrees F is 20% greater than at 80 degrees
స్లష్ స్నో లాంటి రోడ్డు కండీషన్స్ కూడా రోలింగ్ రెసిస్టెంమ్స్ లాంటివే. ఇవికూడా కారణభూతమౌతాయి.
ముఖ్యమైన కారణం లోయర్ ఏవరేజ్ ఇంజెన్ టెంపరేచర్. ఎందుకంటే చలికాలంలో ఇంజను ఆపరేషనల్ టెంపరేచర్‌కు చేరటానికి పట్టే సమయం ఎక్కువ. అంతేకాక ఆపినాక తొందరగా వేడిని కోల్పోతుంది కూడా. Since the engine management system orders up a richer mixture when cold (proportionately more fuel in the air/fuel combination), more fuel is being burned overall.
అంతేకాదు ఇంజను ఆయిల్ చలివల్ల జీబుకొంటుంది. జీబుకొనుట = థికెన్ కావటం. అంతేకాదు బేరింగుల గ్రీజు, ఇతరత్రా ద్రవాలు కూడా థికెన్ అవుతాయి. కాబట్టి ఎక్కువ ఎనర్జీ కావాల్సొస్తుంది ఈ థికెన్డ్ ద్రవాలతో బండిని గుంజటం. అంటే ఇంజెను ఎక్కువ తాగుతుంది ఆల్కాహాల్ని, తూచ్, కాదు గ్యాసుని. సింతటిక్ ఆయిల్స్ వాడినట్లైతే దీన్ని తగ్గించవచ్చు. నా కారుకి సింతటిక్ ఇంజన్ ఆయిల్ వాడతాను.
ఇక ఇవికాక, చలిప్రదేశాలకోసం సరఫరా చేసే గ్యాసు వేరేగా ఫార్ములైజ్ చేస్తారట better cold vaporization characteristics కోసం. అదికూడా మైలేజీని తగ్గిస్తుందట.
ఇక ఆ తర్వాతి విషయం, ఎలక్ట్రిక్ లోడ్. ఇదికూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. చలి ప్రదేశాల్లో డే లైట్ తక్కువ. కాబట్టి హెడ్లైట్ల వాడకం పెరుగుతుంది. హీటర్ వేస్కుంటాం. సైడ్ మిర్రర్స్ హీట్ చేస్తాం. ఎనక విండో హీటార్ వేస్తాం. ఇవన్నీ భారమే కదా. అంతేకాక చలి ప్రదేశాల్లో బ్యాటరీలు తొందరగా డిస్ఛార్జ్ అవుతాయట.
అంతేకాక మంచుపడిన రోజుల్లో కారు పైన పడిన స్నోని సరిగ్గా తొలగించనందువల్ల ఏరోడైనమిక్ డ్రాగ్ అనేది పెరుగుతుందట.
కాబట్టి అబ్బాయ్! చలికాలంలో, తీస్కోవాల్సిన జాగ్రత్తలు -
౧. టయర్లలో పీడనం సరిగ్గా ఉందోలేదో చూస్కోవాలి
౨. బయల్దేరే ముందు ఇంజన్ని వేడెక్కనిచ్చి అప్పుడు గ్యాస్ పెడల్ తొక్కాలి
౩. ఇంజెన్ స్టార్ట్ చేయంగనే హీటర్లు గట్రా వేస్కోవద్దు. ఇంజన్ హీటెక్కినాక వేస్కుంటే బెటర్
౪. ఎడపెడా యాక్సిలరేటర్ తొక్కకుండా నింపాదిగా తొక్కటం
౫. బ్రేకుల వాడకం తగ్గించుకోవడం
౬. ఫిల్టర్లను మార్చుకోవడం
ఇత్యాదివి మైలేజీని పెంచుతాయట.
Dec 8, 2010
క్రెయాన్స్‌అట
బొమ్మలేసాడు బానే ఉంది. కింద క్రేయాన్స్ అని రాసాడు. ఆ అచ్చరాలకు రంగు పులిమాడు.
Dec 7, 2010
కాశిలో గంగా హారతి సమయంలో పేలుడు
ఇంత గోల దేనికి, కాశీ విశ్వనాథ ఆలయం తాళాంచేతులు వీళ్ళకే ఇచ్చి, అబ్బాయిలూ కూలగొట్టండీ అంటే సరిపోతుందిగా. గోల వదిలిపోతుంది.
ప్రశ్న, ఇలా ఎంతకాలం?
హోం శాఖ ఏం నిర్థారణకు వస్తే మనకేంటి? అవ్వాల్సిన పని అయ్యాక, రెడ్ ఎలర్టులు ప్రకటించి ప్రయోజనం ఏంటీ? వీళ్ళు అంతలోపలిదకా వెళ్ళి బాంబులు పెట్టగల్గుతున్నారంటే, ఏంటో, నోటమాట రావట్లా.
ఇంకెన్ని ఘోరాలు జరగబోటున్నాయో ఏంటో.
నేనూ వెళ్ళాను రెండు సార్లు ఈ హారతిని చూట్టానికి. అత్భుతంగా ఉంటుంది మహా హారతి.
పరమేశ్వరా నీ ఇంటిని ఇక నువ్వే కాపాడుకోవాలయ్యా
Dec 6, 2010
గిల్లికజ్జాలు
[ఆడు పట్టించుకున్నట్టు లేదు, మళ్ళీ అరుపు]
తూయా! స్తాపిత్
[కూసింత హెచ్చు స్వరంలో]
తూయాయాయాయా! స్తాపిత్‌త్‌త్‌త్ [మరీ హెచ్చు స్థాయిలో]
[నే డ్రైవింగ్ సీట్లోంచి అరుచుట]
అరేయ్, తంతా నిన్ను ఆపు. ఎందుకు దాన్ని ఏడిపిస్తా
నేనేం చేయలేదు నాన్నా [వాడి గొంతులో నవ్వు]
మరేంటటా అమ్మగారి గోల?
[మావిడ కల్పించుకుని]
ఏంలేదులే నువ్వు నడపవయ్యా
అదేంటి? ఏంలేకుండా అరవటానికీ ఎవరనుకున్నావ్? అనఘ
మరేంలేదులే, టెన్షన్ పడక. ఆడు అడు సీట్లో పిల్స్ ఇటు సీట్లో కదా కూర్చుండేది
అవును
ఆడు వాడి కిటికీలోంచే చూస్కోవాలంట. తల ఇటు తిప్పి పిల్స్ కిటికిలోంచి చూస్తే అమ్మగారికి కోపం
వాట్????%$&&&*(&(&*#%@#$%
అదయ్యా సంగతి.
మైక్ టెస్టింగ్..అలో వేణు .. అలో అలో
ఇయ్యాల వేణుశ్రీకాంత్ పుట్టన్రోజు
వేణూ బ్రదరూ, ప్రతీ ఏడాదీ ఇలానే సేస్కోవల నువ్వీరోజు
ఇంతవరకూ బానేఉంది, కానీ, బాసూ, ఇదేంబాలేదు.
ఇదేం బాలేదు బ్రదరూ
మా కెమారాలు లోడ్ సేసిపెట్టుంచాం
మా బా౨టరీలు సార్జింగు సేసి పెట్టుంచాం
టిక్కెట్లు బుక్కు సేస్కుని పెట్టుంచాం
మా పిల్లకాయలకు సెలవలు పెట్టుంచాం
సెప్పుల్లో కాళ్ళ పెట్టుంచాం
బువ్వ కూడక తినకుండా కూకోనున్నాం
నువ్వు పప్పన్నం పెట్టిస్చావని
ఎదురు సూచా ఉన్నాం
ఎంతకాలం ఇట్టా ఉండమంటా?
Dec 3, 2010
భావం - భాష
మన భాష తెలుగు. కాబట్టి మనం మన భావాలని తెలుగులో వ్యక్తపరుస్తాం.
మరి తేడా ఎక్కడా? భావంలోనా భాషలోనా?
ఉదాహరణ -
౧. రేడియో విరిగింది.
మొన్నీ మధ్య టీవీలో ఓ ప్రకటన చూసా. విక్స్ అనుకుంటా. ఒక ముసలాయన కుర్చిలో కూర్చుని రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటుంటాడు. రేడియో కిందపట్టమో జరుగుతుంది. అరెరె రేండియో విరిగిందే అంటాడా ముసలాయన, వెంటనే ఓ ఔత్సాహిక కుఱ్ఱాడు కామెంటరీ చెప్పేందుకు ముందికి వస్తాడు...బ్లబ్లబ్ల.
రేడియో విరిగేందేవిట్టా వాడి బొంద.
లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి మాస్ కమ్యూనికేషన్స్ చదువాతారు కొందరు. మాస్ తో కమ్యూనికేట్ చేయాలంటే దృశ్యం ఎంత ముఖ్యమో శ్రవణం కూడా అంతే ముఖ్యం అనే ఓ సింపుల్ పాయింటుని సదరు కళాశాల అధ్యాపకులు నేర్పరా ఏవిటి వీళ్ళకి?
సరే పరాయి భాషనుండి దిగుమతి చేస్కున్న ప్రకటన, తెలుగీకరించారనుకుందాం. ఇంతక మునుపట్లో కూడా ఇలా జరిగిందే మరి. ఇదేమీ కొత్త కాదుగా. విక్స్ కి గోలీలో ఖిచ్ ఖిచ్ దూర్ కరో. గొంతులో గుర గురా విక్స్ తీస్కో అనే ఓ వాక్యాన్ని తెలుగులో చెప్పించటానికి ఓ పెద్ద భాషమీద పట్టు, భాషాపాండిత్యం ఏం అక్కర్లేదుగా.
౨. మరక మంచిదే. మరకవల్ల ఏమన్నా లాభం కలిగితే మరక మంచిదే.
ఈ ప్రకటన ఓ దౌర్భాగ్యపు నీచ నికృష్టపు విలువలకు నిదర్శనం. ఇందులో భాషా ప్రయోగమే కాదు దృశ్య ప్రయోగం కూడా ఘోరం. చదువు మనిషికి ఆలోచలని రేకెత్తించేలా ఉండాలి. ఇది తీసిన వాడేవడోగానీ వాడికి కనీస లాజిక్కు లేదు.
పిల్లాడు బడికెళ్ళాడు.
స్నేహితుణ్ణి అడుగుతాడు రోజీ మిస్ రాలేదేం అని.
వాళ్ళ కుక్క పిల్ల సచ్చిందిగా అందుకే రాలేదు అని చెప్తాడా సదరు మితృడు.
కట్ చేస్తే రోజీ మిస్ ఇల్లు
పిల్లాడు, కుక్క సచ్చిందని బాధపడకు రోజీమిస్ నేనున్నాగా అని కుక్కలా ప్రవర్తిస్తాడు.
మిస్ అయిన లాజిక్కు -
పిల్లాడికి రోజీ మిస్ ఇల్లు ఎలా తెలుసు?
పిల్లాడు బడి ఎగ్గొట్టి రోజి మిస్ ఇంటికి ఎలా వెళ్ళాడు?
ఆ వయసు పిల్లాడు ఒక్కడే ఎలా వెళ్ళగలడూ?
మరక మంచిదే, మరక వల్ల లాభం కలిగితే వాడి పిండాకూడు కలిగితే మరక మంచిదే? ఏం మరకా? వాడి బొంద మరకా?
బడి ఎగ్గొట్టి రోడ్లెమ్మట తిరిగితే పడే మరక సంగతేవిట్టా?
[బడీ అయ్యాక, ఇంట్లో చెప్పి, వాళ్ళా నాన్న దింపితే....నాకు కొంచెం అకల్ ఉంది బట్]
ఇలా ప్రకటనల్లో వచ్చే తెలుగు, లేక మన యాం౨కరు అమ్మాయిల ముద్దు ముద్దు (ఆపాట పట్టుకుని ముక్కు మీద గుద్దు గుద్దు) తెలుగు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి. అదలా ఉంచితే, మనలోనే కొందరు ఖూనీ చేసేస్తున్నారు తెలుగుని, తమ మాతృభాషని.
వీపు ఇరగ్గొడతా అంటాడు ఓ మితృడు
నెయ్యి గుప్పెడు తింటే అత్భుతం ఈ పచ్చడితో అంటాడు ఇంకో మితృడు
చేయి పగిలిందంటాడు ఇంకొకడు
తల విరిగింది అంటాడు మరొకడు
ఎక్కడా లోపం?
Dec 2, 2010
కసబ్ పడవలో రాలేదు.. రైల్లో వచ్చాడు
----------------------
నేను మొట్టమొదటి నుండీ మొత్తుకుంటూనే ఉన్నా. కసబ్ అసలు ఆరోజు ముంబైలోనే లేడు. ఎక్కడో లాహోర్లో ఉంటే మన పోలీసులు అన్యాయంగా అక్రమంగా దారుణంగా అతన్ని అరెస్టు చేసి ముంబైకి ఎత్తుకొచ్చి ఇరికించారు.
ఇది మానవ హక్కుల ఉల్లంఘనే.
హిందీ సినిమాలు సూట్టానికి పాకిస్థాన్ నుండి ముంబై వచ్చాట్ట పాపం కసబ్. పత్రికల భాష చూడండి ఆయన, ఇంకానయం వారు శ్రీ కసబ్ గారు అనట్లా.
రెండేళ్ళాయ ఈ ఘోరకలి జరిగి. కసబ్ కేవలం సినిమాలు సూట్టానికే ఒచ్చినోడని ఎనక్కి పంపిస్తే పోలా, మనకి ఖర్చన్నా తగ్గుద్ది.
ఛీఛీ.....
Dec 1, 2010
ఆర్ట్
మొన్నటి ఆదివారం మా దేవాళయంలో అఖండ రుద్ర పారాయణ జరిగింది. ఆరున్నరకల్లా గుళ్ళో ఉండాలి అన్నారు పెద్దలు. నాలుగున్నరకి లేచి ఐదుంబావు కల్లా రోడ్డెక్కి ఆరు ఇరవై కల్లా గుళ్ళో ఉన్నాను. ఎరేంజ్‌మెంట్లు మొదలెట్టాము అందరం. పారాయణ చెసేప్పుడు అభిషేకానికి అవసరమైనన్ని పాలు పండ్లు పండ్ల రసాలు ఇత్యాది సామగ్రిని సిద్ధం చేసాం. అంతలో గురువుగరు అబ్బాయ్ ఆ పెద్ద బల్ల తీసుకురండి ఇటు అని పురమాయించారు. ఎందుకన్నా అనుకుంటూనే తెచ్చి పెట్టాం. దానిపై ఓ వస్త్రాన్ని పరిచి, పైన ముగ్గులు వేసి, అదిగో ఆ డబ్బా ఇటు తే అన్నారు గురువుగారు. పై కాయితం తీసి చూస్తే అందు బుల్లి బుల్లి శివలింగాలు. చక్కగా నల్లటి రంగులో, తెల్లని నామంతో. వందకు పైగ ఉన్నాయి.
From కార్తీకమాసం |
సరే ఆరు గంటల కార్యక్రమం అయ్యాక ప్రసాదాది కార్యక్రమాలప్పుడు ఎవరు చేసారయ్యా ఇన్ని లింగాలను ఎలా అని అడిగితే శ్రీ వినయ్ కుమార్ గారు చేత్తో చేసారని తెలిసింది. ఆయన అటుగా వెళ్తుంటే అభినందనలు తెలియపరచాను కరచాలనం చేసాను, అయ్యా చేయిని ఊపకండి ఇంకా నొప్పులుగా ఉన్నాయి అన్నారతను.
మట్టితో చేసి, కాల్చి, నల్లరంగు వేసి.........................ఎంత కళాత్మకత, ఎంత ఆర్టిస్టిక్ విజన్, థాట్.
హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాను. వారు, అయ్యా మా పిల్లకు కూడా సహాయం చేసారని వినయంగా తెల్పారు.
ఓం నమఃశివాయ.
From కార్తీకమాసం |
Nov 30, 2010
మమేకం కాలేనప్పుడు దీక్షబూననేలా?
జగన్ కాంగ్రేసు నుండి బయటకొచ్చాడు. బానే ఉంది. నిన్నటిదాకా సోనియా దేవత ఇప్పుడో బొమ్మలు చింపేసారు, చెప్పుల్తో కొట్టారు, ఎవరి విలువలు వాళ్ళకి ఉండచ్చు ఉండకపోనూ వచ్చు దిగజారిపోయి ఉండచ్చు అమ్ముడుపోయి ఉండచ్చు. కానీ పై బొమ్మ నాకు కష్టంగా అనిపించటానికి కారణం ఎడమవైపు చివరి వ్యక్తి. మాల వేస్కున్నాడు, బొట్టు పెట్టాడు, కాషాయం కట్టాడు, కానీ, చూడండి ఏంచేస్తున్నాడో?
మమేకం కాలేనప్పుడు దీక్షబూననేలా?
నల్లధనంపై అధ్యయనం!
* భారత్‌లో ఎంతుంది?
* విదేశాల్లో ఎంత మొత్తం దాచారు?
* దేశంలో నల్లధనం పుట్టుకకు దోహదం చేస్తున్న ప్రధాన రంగాలేవి?
* ఈ సొమ్ముతో దేశ భద్రతకు ఎదురవుతున్న ముప్పు ఏమిటి?
* దేశంలో, విదేశాల్లో మనీ ల్యాండరింగ్‌కు నల్లధనం కారణమవుతోందా?
* లెక్కాపత్రం లేని డబ్బు ఆర్జనకు ఎలాంటి పద్ధతులు అనుసరిస్తున్నారు?
* దీనిని చెలామణిలోకి ఎలా తెస్తున్నారు?
* నల్లధనాన్ని గుర్తించడానికి ఉన్న మార్గాలేంటి?
* ఈ సొమ్ముపై పన్నులు వేయడం ఎలా?
ఎవురైనా ఈటికి సమాధానాలు సెప్పగల్రా?
Nov 23, 2010
ఆమె దేశ దేవత, ఓ సంఘ సంస్కర్త - ఆమెనే తిడతార్రా??
ఆమె అనుమతితో పెట్టిన పేపర్ అది
కాంగ్రెస్‌కు అనుకూలంగానే వార్తలు రాయాలి
ఎంపీ రాయపాటి స్పష్టీకరణ
ఔను, నేనూ ఊర్కోను. అడ్డంగా నరకతా, కండలు కొరకతా. నరాలు పీకతా. సోనియా భారతదేశానికే లైవ్ దేవత. అంటే లివింగ్ దేవత. ఆయ్, ఆమెనే అంటారా? ఆమె అనుమతిస్తేనే సాక్షీ దిన పుత్రిక పుట్టింది [ఆమె నవమాసాలూ మోసి, పాపం కన్నది]. సాక్షే కాదు ఏదైనా ఎవడైనా, నాయాల్ది, బస్తీమే సవాల్. ఔను, ఆమె ఓ దేవతే. ఓ రాణి. ఆమె అనుమతి లేకుండా గాలికూడా వీచదు. ఆమె దేశంకోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఈరోజున ఐదు వేళ్ళు నోట్లోకెళ్తన్నాయ జనాలకి అంటే ఆమె సలవే.
రాయపాటి అన్నా నువ్వు గంమ్మునుండు, మేం చూస్కుంటాం. నీ [అవినీతిని] పాలనను నువ్వు కొన-సాగించు హ్యాప్పీగా. అటు ఇటు సూడమాక ఓ పాతిక కోట్లు తగ్గతుంది సంపాదనలో.
Nov 22, 2010
మా గురువుగారు పంపిన మెయిల్
"When things in your life seem, almost too much to handle,
When 24 Hours in a day is not enough,
Remember the mayonnaise jar and 2 cups of coffee.
A professor stood before his philosophy class
and had some items in front of him.
When the class began, wordlessly,
He picked up a very large and empty mayonnaise jar
And proceeded to fill it with golf balls.
He then asked the students, if the jar was full.
They agreed that it was.
The professor then picked up a box of pebbles and poured
them into the jar. He shook the jar lightly.
The pebbles rolled into the open Areas between the golf balls.
He then asked the students again if the jar was full. They agreed it was.
The professor next picked up a box of sand and poured it into the jar.
Of course, the sand filled up everything else.
He asked once more if the jar was full. The students responded with a unanimous 'yes.'
The professor then produced two cups of coffee from under the table and poured the entire contents into the jar, effectively
filling the empty space between the sand. The students laughed.
'Now,' said the professor, as the laughter subsided,
'I want you to recognize that this jar represents your life.
The golf balls are the important things - Family,
Children, Health, Friends, and The Lord –
Things that if everything else was lost and only they remained, Your life would still be full.
The pebbles are the other things that matter like your job, house, and car.
The sand is everything else --The small stuff.
'If you put the sand into the jar first,' He continued,
there is no room for the pebbles or the golf balls.
The same goes for life.
If you spend all your time and energy on the small stuff,
You will never have room for the things that are important to you.
So...
Pay attention to the things that are critical to your happiness.
Play With your children.
Take time to get medical checkups.
Take your partner out to dinner.
There will always be time to clean the house and fix the disposal.
'Take care of the golf balls first --
The things that really matter.
Set your priorities. The rest is just sand.'
One of the students raised her hand and inquired what the coffee represented.
The professor smiled.
'I'm glad you asked'.
It just goes to show you that no matter how full your life may seem,
there's always room for a couple of cups of coffee with a friend !!!.'
--
Regards
Hari OM
Nov 17, 2010
సెల్ఫ్ మోటివేషన్
ఏమా కథ?
నేనీమధ్య నా నడక ట్రెండ్ లేక పా౨టర్న్ మార్చాను. ఇంతకమునుపు గంటకి 3.5 లేక 3.6 మైళ్ళ వేగంతో నడిచేవాణ్ణి.
ఈ మధ్య ఇలా చేస్తున్నా-
నడిచే అరగంటో లేక నలభైనిమిషాల్లో మొదటి ఐదు నిమిషాలు వార్మ్-అప్. మిగతా ముఫై నిమిషాల్లో, మొదటి పదినిమిషాలు గంటకి 4.1 మైళ్ళ వేగంతో, తర్వాతి పదినిమిషాలు 4.0 మైళ్ళ వేగంతో, చివరి పదినిమిషాలు 3.9 మైళ్ళ వేగంతో నడవటం మొదలెట్టా. ఇన్క్లినేషన్ 1 పెడతా. ఈ పా౨టర్న్ వల్ల నా వర్కౌట్ అయ్యేప్పటికి షుమారుగా 280 కేలరీలు ఖర్చు ఔవుతున్నాయి.
నిన్న ఇలా చేసా
గోల్ 45 నిమిషాలు
మొదటి ఐదు నిమిషాలు వార్మ్-అప్
తర్వాతి పది నిమిషాలు 4.1 మైళ్ళ వేగంతో
తర్వాతి పదినిమిషాలు 3.2 మైళ్ళ వేగంతో, ఇన్క్లినేషన్ 10
తర్వాతి పదినిమిషాలు 3.3 మైళ్ళ వేగంతో, ఇన్క్లినేషన్ 9
చివరి పదినిమిషాలు 3.4 మైళ్ళ వేగంతో, ఇన్క్లినేషన్ 8
అంటే కొండ ఎక్కిన ఎఫెక్ట్‌తో నడిచాను.
దానివల్ల నా టోటల్ వర్కౌట్ అయ్యేప్పటికి ఖర్చుచేసిన కేలరీలు 420.
బ్రదరూ, కావాల్సింది మోటివేషన్. నీ మీద నీకు నమ్మకం, *నేను నడవగలను* అనే ఓ నమ్మకం, నడవాలి అనే పంతం. మొదటి పదినిమిషాలు బానే అయ్యింది. ఇన్క్లినేషన్ పెంచా. బాడి అబ్బా, ఆపరా, వెళ్దాం ఇక అని గోల మొదలెట్టింది. నీ ఎన్కమ్మ, నడువ్ అని నడిపించా. చెమట కక్కాను. మూడొ పదినిమిషాలు బుద్ధి తన అసలు రూపం చూపింది. ఇక పద అంది. నో అన్నా. మంచీళ్ళు కావాలి నాకు అంది. అరవమాక అన్నా. షూ లేస్ ఊడింది చూసావా ఇక ఆపు అంది. ఏంపర్లేదు నడువ్ అన్నా.
బీట్ ది క్రాప్ బడ్, దేన్నైనా నువ్వు చేయాలి అనుకుంటే, నువ్వు తప్పక చేయగలవు. కానీ ఎప్పుడూ? ఆ కసి, పంతం పెంచుకున్నప్పుడు.
నిజంగా నువ్వు చేయగలవు.
బీట్ ది క్రాప్ బడ్....
Nov 16, 2010
గూ.గోల
అసలు బజ్ అంటే ఒకానొక అర్థం తూనిగ లేక తుమ్మెద లేక చిన్నచిన్న ప్రాణుల రెక్కల కంపనం వల్ల వచ్చేశబ్దం. ఈగ లేక దోమ చెవిపక్కగా వెళ్తే వినవచ్చే శబ్దం బజ్‌జ్‌జ్...
గూగుల్ బజ్ అంటే
గూగుల్లో నీ గోల లేక కంపనం అనుకోవచ్చేమో.
కాబట్టాబ్బాయ్ గూగుల్ బజ్ అంటే గూగుల్ గోల అంటే గూ.గోల
మన సుబ్బులన్నట్టు,
గూగోల వచ్చినాక
కూసింత తగ్గింది బ్లాగోల.
బజ్‌లో బల్లే బల్లే సంగతులు వినిపిస్తున్నాయ్.
గీతాచార్య ఎక్కడున్నాడో ఏంచేస్తున్నాడో గోలడుతుంటాడు. మనోడి ప్రతీ బజ్‌కి తప్పనిసరిగా ఇద్దరు లైకర్స్ అనగా ఇష్టపడువారు ఉంటారు. ఒకరు సృజన, అబ్బే అందులో పెద్ద ఇషయం లేదు. కానీ ఇంకొరెవురూ? అంటే ధనరాజ్ మన్మథ.
ఇక రోజుకో బజ్‌తో గూబ గుయ్ మనిపించే బ్యాచి ఎవుర్దంటే మన కెలుకుడు బ్యాచీదే. నాగ తెగ బజ్‌తాడు. ఇక ఏండి డేండి రోజుకో బజ్. అప్పుడప్పుడు మురిపిస్తుంటాడు మన ఆర్.కె. భరద్వాజ ఎప్పుడన్నా ఓ బజ్జు. మొన్నీమధ్య బజ్‌యొక్క ఓర్పుని పరీక్షింపజేసాడు ప్రవీణ్. అప్పుడు బజ్‌లో కమెంట్ల సంఖ్యకై ఒక పరీక్షకి తెరలేపాడు మన భరద్వాజ. ఆ పరీక్షలో తేలిందేంటంటే ౫౦౦ కమెంట్లుమాత్రమే బజ్ తట్టుకోగలదు అని.
అప్పారావుశాస్త్రి అప్పుడప్పుడు మాంచి కెలుకుడుకి వేదికౌతాడు ఏదోక బజ్‌తో.
మన పవన్ బజ్ హాట్ హాట్ బజ్. ఒక బజ్ కి వంద వ్యాఖ్యలు తప్పనిసరి.
మంచుపల్లకి తనదైన శైలిలో బజ్‌తుంటాడు. ఎక్కువగా సెగెట్రీమీద గూబలు గుయ్ మనిపిస్తుంటాడు. చదువరిగారు అప్పుడప్పుడూ కిస్క్ అంటుంటారు బజ్‌లో. అంటే ఒకలైను లేక రెండులైనులు అన్నమాట. ఇక
ఈ మధ్యకాలంలో నేస్తంగారి బజ్ బాగా హిట్టైంది. ఒక్కో బజ్జుకి బుజబుజలాడుతూ వంద వ్యాఖ్యలు కొట్టారు జనాలు. సారీ వీళ్ళని జనాలు అనకూడదు, తమ్ముళ్ళు సెల్లెళ్ళ బృందం అనాలు. రాజ్‌కుమార్, ఏరాజ్యానికీ రాజకుమారుడు కాదు, ఆర్యుడో ద్రావిడుడో కూడా తెలియకపోయినా, సెగెట్రీ పొజీషన్లోకి దూసుకొచ్చాడు. అదే, నేస్తంగారి తమ్ముళ్ళు సెల్లెళ్ళ సంఘానికి సెగెట్రి అన్నమాట. ఇక అప్పుడప్పుడూ మధురవాణిగారు మృదుమధురంగా తమ గాత్రాన్ని టపాలా అందిస్తుంటారు. మ.వా గారి ప్రతీటాపా ఓ హిట్టే.
మా అనుజుల బజ్జులు ప్రతీరోజూ ఏదోక విషయ వడ్దింపు ఉంటుంది. మా సోదరులు శ్రీ అక్కిరాజు ప్రసాద్ గారు కూడా ఓ బ్లాగరే. ఆయన బ్లాగు ఏ సంకలినిలోనూ కనిపించదు. వారి బ్లాగు పేరు *అంతర్యామి* ఇదిగో లింకు http://prasad-akkiraju.blogspot.com
నా సోదరుడు తన ఛయాచిత్రగ్రాహక ప్రవాహాన్ని పంచుతుంటాడు. అదో మహాప్రవాహంలా అనిపిస్తూ ఉంటుంది.
ఛాయాచిత్రగ్రాహకం = కెమేరా.
ఇక నా గూ.గోల - చెప్పేదేముంది, ఏదోక టపా, వేస్తాను. నల్గురితో పంచుకోవాలనిపించిన ప్రతీది బజ్లో వేసేస్తా.
గూగుల్ మెయిల్ వాడకందారులారా, మీరూనూ బజ్ ఖాతా తెరిచి గూబలు గుయ్ మనేలా గోలచేయండి ఇక.
Nov 12, 2010
కోరికతీరెనే
సమయం ఏడు
లేరా
హా..హూం
లేవరా బడి టయం అవుతోంది.
హా.హూం
[డోర్ కర్టెన్ తీసి చూస్తే వానపడుతోంది]
నాన్నా లేరా వానపడుతోంది, లేటు అవుతావ్ బస్సుకి
[టంటటాయ్...టకాటక్]
[లేచి కూర్చుని]
హా, ఏంటి వానపడుతోందా
ఐతే గొడుగేస్కెళ్ళొచ్చన్నమాట
వాన ఉంటే నువ్వెళ్ళేప్పటికి పడుతుంటే ఏస్కెళ్దువుగాన్లే
ఏంకాదు, పడుతుంది. ఎక్కడా గొడుగు? తీ బయటకి
అరేయ్ నీకు అందదు, స్నానం చేసి రెడీగా ఇస్తాగా
కాదు ఇవ్వు, రెడీగా పెట్టుకుంటా
[నేను] ఇవ్వు తీసి వాడితో గోల దేనికి
[తను] సరేరా ఇదిగో [తీసి ఇచ్చింది]
[ఢమాల్ ఢిమీల్ - పది నిమిషల్లో రెడీ అయి కూర్చున్నాడు.]
[గొడుగు తెరవటం ముడవటం ఆట ఆడుతున్నాడు]
[బస్సు దగ్గర]
నిక్ నా గొడుగు ఇదిగో
అరే టేంకెగా ఇదిగో నా గొడుగు
ఏం రాసుందో చూసావా *రాక్&రోల్ టీం*
ఇంతలో బస్సొచ్చింది.......అలా మాట్లాడుకుంటూ ఎక్కాడు చేతిలో గొడుగుతో, ఓరగ తెరిచిపట్తుకుని. బస్సు డ్రైవర్ కి చూపించి ఏదో చెప్తున్నాడు. నేను నెమ్మదిగా నా కారువైపుకి అడుగులెసాను.
Nov 11, 2010
క్షణం తీరిక లేదు
పిల్లాజెల్లా
జలుబులు
దగ్గులు
కోరికలు
గుఱ్ఱాలు
బళ్ళు
గుళ్ళు
నిద్రలేని రాత్రులు
పిల్లల కలవరింతలు
పిల్లల పలవరింతలు
తీరకలేదా అంటే లేదు
ఉందా అంటే ఉంది
లేనట్టుగా ఉంది
ఉన్నట్టుగా లేదు
క్షణం తీరిక లేదు
ఔను, లేదు
అలా వెళ్తోంది జీవిత నౌక
ఏ గమ్యంవైపుకో
ఇదిమిద్ధంగా తెలియని ప్రయాణాంలో
తెలియని ప్రయాణంతో
ఔను, క్షణం తీరిక లేదు
Nov 10, 2010
పరకాయ ప్రవేశం
సరేరా
[ఇంట్లోనే ఓ సివర్న నిల్చుని]
[చేయి చెవిదగ్గరపెట్టుకుని] ట్రింగ్ ట్రింగ్
అలో [నేను]
అలో ఏరా భాస్కర్ నెనే ఉమాశంకర్‌ని
అన్నయ్య చెప్పు
నేను మీఊరొచ్చాను మీ ఇంటికి దారి చెప్పు
ఎడంచేతివైపు తిరిగి కుడికితిరి గిరగిరాతిరిగి మూందుకిరా అక్కడే మా ఇల్లు
[నా దగ్గరకు వచ్చి]
టక్ టక్ టక్ [తలుపుకొట్టినట్టు]
క్లిచక్ [తలుపు తీసాను]
[ముఖంమీద నవ్వుతో]
ఏరా భాస్కర్ నేనేరా ఉమాశంకర్ మీ అన్నయ్యని
అన్నయ్యా బాగున్నావా
బాగున్నా, ఏంచేస్తున్నావ్
టివీ చూస్తున్నా
సూరిగాడేడి
బయటకెళ్ళాడు
పిల్లేది
అక్కడెక్కడో ఆడుతోంది
కార్తికేయ కూడా ఆడుతున్నాడు, కార్తికేయ దగ్గర కూడా చాలా బొమ్మలున్నాయ్. నేనే కొన్నాను బ్లబ్లబ్ల
[ఇంతలో]
నాన్నా
??
నేను సూర్యాని
అలాచెప్పు ఏంటి
నేనిప్పుడు పోస్ట్‌మా౨న్
ఎందుకలా?
ఉండు
టక్ టక్ [డోర్ మీద బాదుట]
హాయ్ సూర్యాకి ఈ డెలీవరి
ఏవిట్టా ఇవి?
తెలియదు, బాయ్
[తిరిగి సూర్యా ఎంట్రీ]
ఎరా
నేను సూర్యాని కాదు
మరి?
పెదనాన్నని
[నాయనో] చెప్పు అన్నయ్యా
ఈ డబ్బా నేనే పంపించా
ఏవిట్టా ఈ డబ్బా
సూర్యాకి టాయీస్, తీసి చూడు
కిచక్లక్మిక్స్ఫ్గ్ద్గ్ త్౫య్[డబ్బా ఓపెనింగ్]
అబ్బో చాలా బొమ్మలే ఉన్నాయే
అవును మొన్న కార్తికేయకి కొన్నా. అప్పుడు సూరిగాడిక్కూడా కొన్నాను.
[అంతలో మరో పరకాయ ప్రవేశం]
నాన్నా ఏంటీ ఈ డబ్బా
నాన్నా?
నేనిప్పుడు సూర్యాని
[కొట్టాడు దెబ్బ అనుకుని] ఇదిగోరా పెదనాన్న నీకో డబ్బా టాయ్స్ పంపించాడు
ఔను ఔను నాకు తెలుసు [టచక్ టిచక్/డబ్బా ఓపెన్ చేసాడు] అబ్బో చాలా ఉన్నాయి బొమ్మలు మొన్న కార్తికేయ దగ్గర చూసాను
నాన్నా నేనిప్పుడు కాశ్యప్ [మళ్ళీ మూలకి వెళ్ళి చెవిదగ్గర చేయి పెట్టుకుని] ట్రిం ట్రింగ్
అలో
బాబాయ్ నేను కాశ్యప్ ని
ఏరా కాశి బాగున్నావా
బాగున్నా బాబాయ్. సూరిగాడేడి.
ఆడుకుంటున్నాళ్ళేరా
అవునా బాబాయ్. మొన్న ఇండియాకి వచ్చినప్పుడు భలే గోల చేసాడు బాబాయ్.
ఔనారా
ఎక్కడ ఉంటున్నావురా ఇప్పుడు
లండన్లో బాబాయ్
మరి ఎలా వచ్చావ్
బైక్ మీద బాబాయ్, ఇలా వచ్చాను
[ఓ డెమో. థంసప్ ప్రకటనలో మహేష్ బాబులా ఊహించుకుంటూ ఓ పేద్ద డెమో]
[అంతలో]
నాన్నా
ఎవర్రానువ్వు అన్నయ్యవా కాశ్యప్వా లేక సూరిగాడివా
సూరిగాణ్ణి
చెప్పు
నేనిప్పుడు బామ్మని
సరే
[అలా మూలకి వెళ్ళి నా వైపు నడుస్తూ]
నాయనా ఎలా ఉన్నావూ
బాగున్నాను
పండ్లు తింటున్నావా
తింటున్నాను
అమ్మని నాన్నని ఏడిపించకుండా ఆడుకుంటున్నావా
న్నాను
నాన్నా
ఎవర్రా బామ్మవా సూరివా పెదనాన్నవా కాశ్యప్వా
సూరిగాణ్ణి
నేనిప్పుడు పెద్ద సూర్యని నాన్నా
పెద్ద సూర్యా అంటే
గ్రోన్‌అప్
అంటే
నాకు పాతికేళ్ళు
ఓహ్
[మళ్ళీ మూలకి, చేయి చెవి ఫోన్] ట్రింగ్ ట్రింగ్
అలో
నేనూ సూర్యాని, బైక్ నడుపుతున్నా అడ్రస్ చెప్పు వస్తా
అటుతిరిగి ఇటు తిరిగి రా
[వచ్చాడు, ముందు నిల్చున్నాడు, తలుపు కొట్టినట్టు యాక్షన్]
క్లికచ్ [తలుపుతీసా]
[ముసిముసి నవ్వుతో] నాన్నా నే ఒచ్చా
రారా, ఏంటి సంగతులు
ఏంలేవు, మా బుజ్జోడికి కడుపులో నొప్పి
బుజ్జోడా వాడెవడూ
నాకు మా౨రేజ్ అయ్యిందిగా ఇడిగో వీడే నా కొడుకు [ఓచిన్న బొమ్మని చుపిస్తూ]
ఓర్నీ పెళ్ళైందా అబ్బోరియబ్బా. ఏమైందంటా నీకొడుక్కి
అన్నం తినటంలేదు, పూప్ కి వెళ్ళటంలేదు, మంచీళ్ళు తాగటంలేదు, పెరుగన్నం తింటంలేదు. అందుకే కడుపులో నొప్పి.
మరేం చేద్దాం
డాక్ కి కాల్ చేద్దాం, నువ్వు ఇప్పుడు డాక్
సరే
ట్రింగ్ ట్రింగ్
అలో
అలో డాక్ చంద్ర
అవూను
నేను సూర్యాని మా అబ్బాయికి కడుపులో నొప్పి
సరే ఎత్తుకొచ్చేయ్
[కొంచెం యాక్షన్ ఎత్తుకెళ్ళినట్టు]
డాక్ [నేనే]
ఏమైంది మీ వాడికి
తినటంలేది తాగటంలేదు కడుపునొప్పి మంచీళ్ళు తాగట్లేదు పెరుగన్నం తినటంలేదు
అయ్యోపాపం ఎదో చూడని
[ఉత్తిత్తి స్టెత్ గాలితో చేసింది సెచిలో పెట్టుకుని బొమ్మ పిల్లాడిమీద పెట్టి]
గాలి పీల్చరా వదులు బోర్లా పడుకో యాటయాటయాట
మీవాడు పెరుగన్నం తినటంలేదు అందుకే ఈ గోల.
[అంతలో నేనూ నేనూ నాదీ బొమ్మ ఇచ్చేయ్ అని పిల్ల]
[చెల్లెమ్మా ఐతె నువ్వు నర్స్, ఇంజెక్షన్ చెయ్యి పిల్లాడికి అని సర్ది చెప్పుట]
ఇమ్జెగ్గ్ఫ్హ్గ్ఫ్హ్థ్ య్హ్య్హ్ర్త్యెర్ ఫ్ఘ్ర్త్ య్హ్ర్త్య్ ఎర్వ్ ఫ్ఘ్య్ [అంది పిల్ల, అని ఇచ్చేసింది బొమ్మని]
థ్యాంక్యు డాక్ [అని చెప్పి వాడు తిరిగి ఇంటికి వచ్చాడు]
నాన్నా డాక్ దగ్గరకి వెళ్ళొచ్చా
[నాన్నా? ఓహో నేను డాక్ నుండి నాన్నకి రూపాంతరం చెందాలా]
ఓహో ఏవన్నాడ్రా నాన్నా తూచ్ డాక్
ఇంజెక్షలు నాలుగు చేసాడు
[ఇంతలో వాళ్ళ అమ్మ బువ్వకి పిలిచింది. కన్ఫ్యూజన్‌తో నే ఈ టపాకి శ్రీకారం చుట్టాను]
Nov 8, 2010
మా గుళ్లో దీపావళి పండుగ
Nov 7, 2010
ఆర్ట్ కలాసులో
Oct 20, 2010
గొడుగు
ఆవేళ సాయంత్రం మా కార్యాలయం వద్దనున్న వాల్గ్రీన్స్‌కి వెళ్ళా పిల్లల గొడుగులేమన్నా ఉన్నాయా అని. లేవండీ అన్నాడు కొట్టువాడు. సరేనని ఇంటికి ఫోనుకొట్టి గొడుగులు దొరకలేదని చెప్పి కారు తీసి రొడ్డెక్కాను. ఇంటిదాకా వెళ్ళంగనే టర్గెట్‌లో ఓసారి చూద్దాం అనిపించింది. కారుని అటుతిప్పాను. సన్నగా తుప్పర పడుతోంది. టార్గెట్‌కి వెళ్ళాను. లోపలి ఓ సహాయక యువతిని అడిగేను పిల్లకాల గొడుగు కావాలి అని. పిల్లల డిపార్ట్మెంట్ వైపుకి వెళ్ళి చూస్కోండి అంది ఆ వైపుకి చుపుతూ. అక్కడకెళ్ళి చూస్తే ఒకేఒక రకం పిల్లల గొడుగు ఉంది. దానిపై ఏదో చిన్న డిజైను. పిల్లల గొడుగు డిజన్ పిల్లలకు ఏమాత్రం హాని కలిగించకుండా, పిల్లలు ఈజీగా తెరిచి ముడిచేలా ఉంటాయిని ఆ గొడుగు చూసాక అర్థం అయ్యింది. సరేనని అది తీస్కుని, మరి పిల్లాడికి ఏమన్నా కొంటే చంటిదానికి కొనకుండా ఎలా బుంగమూతి పెట్టుకోదూ అని బెత్తెడుజుట్టికి అరడజను సైడుపిన్నులు కొనుక్కెళ్ళా.
సన్నటి తుప్పర ఇంకా పడుతూనే ఉంది. ఇంటికెళ్ళగానే ఏంటీ ఇంత ఆలశ్యం అన్నాడు పిల్లాడు. ఏ లే లా లీ అంది అమ్మాయి. వానగా ఉందిగా అని సైలెంటుగా లోపలికెళ్ళాను. ఆపీస్ సంచి కిందపెట్టి బూట్లిప్పి, చీకట్లో తలుపు దగ్గరే దాచిపెట్తిన గొడుగు నెమ్మదిగా కాలివెనకుపెట్టుకుని వెళ్ళాను హాల్లోకి. ఠకా మని తీసి సూర్యా ఇదిగోరా అని ఇచ్చాను. మరి నాకో అని చూసిన పిల్లకి పిలక బ్యాండ్లు ఇచ్చాను.
పిల్ల అపురూపంగా చూస్కుంది. ప్యాకెట్టు ఊడదీసి బెత్తెడు జుట్టుకు నాలుగు రబ్బరు బ్యాండ్లి పెట్టుకోటానికి వాళ్ళమ్మదగ్గరకి పరుగెత్తింది.
పిల్లాడు గొడుగు చేతుల్లోకి గర్వంగా తీస్కున్నాడు. నాకళ్ళలోకి చూసాడు. నాకేనా ఇదీ అన్నట్టుగా అనిపించాయా కళ్ళు. నీకే అన్నట్టు నేనూ చూసాను. అమ్మా అమ్మా నాన్న గొడూగు తెచ్చాడని వాళ్ళమ్మకి చూపించాడు. చెల్లెమ్మా గొడుగు అని చుపించాడు. నాన్నా బాగుంది అని నాదగ్గరకొచ్చి గొడుగు టెక్నికాలిటీస్ గురించి కొంచెం ప్రోబ్ చేసాడు. ఇక దాన్ని తెరిచి మూసి తెరిచి మూసి అడుతున్నాడు.
పిల్లకి రబ్బరు బ్యాండ్లు బోరుకుట్టాయి ఈ మధ్యలో. అన్న సంబరం పిల్లకి ఎట్రాక్టివ్‌గా అనిపించింది. లాక్కోటానికి పరుగెత్తింది. షరమాములే ఇద్దరూ లాక్కుని పీక్కుని గోలగోల చెసారు. నే మధ్యలో కల్పించుకుని గొడుగుని ముడిచేసి పైన పెట్టాను.
మఱ్ఱోజు పొద్దున్నే గొడుగేస్కుని వెళ్తాం అనుకున్నాడు పిల్లాడు.
తెల్లవారింది.
వానవెరిసింది.
ఎండగా ఉంది.
గొడుగు తీస్కెళ్ళనా సాయంత్రం వానపడొచ్చేమో అన్నాడు. వద్దులేరా అన్నాము.
సాయంత్రం అయ్యింది. వానలేదు.
మఱ్ఱోజు పొద్దున్నే గొడుగేస్కెళ్ళనా అన్నాడు. వానలేదుగా అని చెప్పాం.
అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. పొద్దున్నే వాన పట్టంలేదు. వాడికేమో వానలో గొడుగేస్కుని వెళ్ళాలని కోరిక. మొన్నీమధ్య పొద్దున్నే పొగమంచుగా ఉంటె ఐతే గొడుగేసుకుని వెళ్ళొచ్చా అన్నాడు ఆత్రంగా.
అలా అటక మీదనే ఉంది గొడుగు వాడికేసి చూస్తూ!
Oct 18, 2010
చండీ హోమం
మొన్నటి శుక్రవారం చండీ హోమం అత్భుతంగా జరిగింది.
యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |
నమస్తస్యై ౧౪ నమస్తస్యై ౧౫ నమస్తస్యై నమో నమః || ౫\.౧౬||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |
నమస్తస్యై ౧౭ నమస్తస్యై ౧౮ నమస్తస్యై నమో నమః || ౫\.౧౯||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౨౦ నమస్తస్యై ౨౧ నమస్తస్యై నమో నమః || ౫\.౨౨||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౨౩ నమస్తస్యై ౨౪ నమస్తస్యై నమో నమః || ౫\.౨౫||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౨౬ నమస్తస్యై ౨౭ నమస్తస్యై నమో నమః || ౫\.౨౮||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు చ్ఛాయారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౨౯ నమస్తస్యై ౩౦ నమస్తస్యై నమో నమః || ౫\.౩౧||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౩౨ నమస్తస్యై ౩౩ నమస్తస్యై నమో నమః || ౫\.౩౪||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౩౫ నమస్తస్యై ౩౬ నమస్తస్యై నమో నమః || ౫\.౩౭||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు క్శాన్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౩౮ నమస్తస్యై ౩౯ నమస్తస్యై నమో నమః || ౫\.౪౦||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౪౧ నమస్తస్యై ౪౨ నమస్తస్యై నమో నమః || ౫\.౪౩||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౪౪ నమస్తస్యై ౪౫ నమస్తస్యై నమో నమః || ౫\.౪౬||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౪౭ నమస్తస్యై ౪౮ నమస్తస్యై నమో నమః || ౫\.౪౯||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౫౦ నమస్తస్యై ౫౧ నమస్తస్యై నమో నమః || ౫\.౫౨||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౫౩ నమస్తస్యై ౫౪ నమస్తస్యై నమో నమః || ౫\.౫౫||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు లక్శ్మీరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౫౬ నమస్తస్యై ౫౭ నమస్తస్యై నమో నమః || ౫\.౫౮||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౫౯ నమస్తస్యై ౬౦ నమస్తస్యై నమో నమః || ౫\.౬౧||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౬౨ నమస్తస్యై ౬౩ నమస్తస్యై నమో నమః || ౫\.౬౪||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౬౫ నమస్తస్యై ౬౬ నమస్తస్యై నమో నమః || ౫\.౬౭||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౬౮ నమస్తస్యై ౬౯ నమస్తస్యై నమో నమః || ౫\.౭౦||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౭౧ నమస్తస్యై ౭౨ నమస్తస్యై నమో నమః || ౫\.౭౩||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
యా దేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౭౪ నమస్తస్యై ౭౫ నమస్తస్యై నమో నమః || ౫\.౭౬||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఇన్ద్రియాణామధిష్ఠాత్రీ భుతానాఞ్చాఖిలేషు యా |
భూతేషు సతతం తస్యై వ్యాప్తిదేవ్యై నమో నమః || ౫\.౭౭||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
చితిరూపేణ యా కృత్స్నమేతద్ వ్యాప్య స్థితా జగత్ |
నమస్తస్యై ౭౮ నమస్తస్యై ౭౯ నమస్తస్యై నమో నమః || ౫\.౮౦||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
Oct 14, 2010
శ్రీ గాయత్రి రామాయణం
శ్రీ వాల్మీకి రామాయణం విన్నాను. ఎప్పుడో చదివా౨ను.
శ్రీ గాయత్రీ రామాయణం అని నిన్న ఎక్కడో చూసా౨ను. ఇదేవిటీ? దీని కథ ఏవిటీ? గాయత్రీ రామాయణం వాల్మీకి రామాయణం రెండూ ఒహటేనా? వేరేవేరేనా?
http://www.telugubhakti.com/telugupages/Vishnu/SreeRama/GayatriRamayan1.htm
Oct 13, 2010
డిష్కావ్
వాడు లేవలా
షూయా నాదీ నాదీ నాదీ లేలేలే
వాడు లేవలా
బండోడా లే..౫౪౬#&%$&&*&($&$%%$@%@#$%#&#%&%*$%%# లేలేలే
వాడు లేవలా
ఒక్కటేసింది
ముఖంమీద అచ్చుపడింది
దెబ్బకి లేచి పక్కకొచ్చి ఏడుపు లంకించుకున్నాడు
అయ్యా ఇదీ సినిమా రోజూ ప్రతీరోజు. లాగులాట పీకులాత. వాడేంతీస్కుంటే పిల్లకి అదేకావాలి. పిల్ల ఏం తీస్కుంటే వాడికి అదేకావాలి. కొట్టుకుంటున్నారు. రక్కుకుంటున్నారు.
టెరిబుల్ టూస్ అంటే ఏంటో అనుకుంటున్యారా? ఇదే. మరి వాడికి టెరిబుల్ టూస్ కాదుగా? అవున్నిజమే. కానీ, అక్కడ ఎవురూ? సూర్య. ఆడెప్పుడూ అంతే. టెర్రిఫిక్...................
Oct 12, 2010
72 మేళకర్త రాగాలు - శ్రీ నూకల చిన సత్యనారాయణ
రాగాలు 1 నుండి 14 వఱకు
రాగాలు 15 నుండి 28 వఱకు
రాగాలు 29 నుండి 43
రాగాలు 44 నుండి 57 వఱకు
రాగాలు 58 నుండి 72 వఱకు
పై లింకులు పనిచేయని ఎడల నాకుదెల్ప ప్రార్థన.
Oct 11, 2010
శుద్ధ నెయ్యి
నెయ్యి వేరే డాల్డా వేరే మరియూ వనస్పతి వేరే అని గుర్తించలి.
నెయ్యి అమ్మో అంటున్న జనాలు ఫ్యాషన్ గా మా౨క్ డోనాల్డ్స్ కో వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్/చికెన్ నగ్గెట్స్ లేక కె.యఫ్.సి కి వెళ్ళి ఫ్రైడ్ చికెన్ లేక ఏహోటలుకో వెళ్ళి మైసూరు బోడానో తింటారు కిం అనకుండా.
మ్యాక్ లాంటి రెస్టారెంట్లలో వాడే నూనెలు ఎంత డేంజరసో తెలుసా? ఎంతసేపు మరుగుతుంటాయో తెలుసా? ఇంకో విషయం నూనెని ఎక్కువసార్లు వాడేందుకు వాటిల్లో పంది లేక జంతుల కొవ్వులను కలుపుతారు. అవి నూనె యొక్క లైఫ్ ని పెంచుతాయి. ఐతే అవి వాటిల్లో వేయించిన పదార్థాలకు సాచురేటెడ్ కొవ్వుని దండిగా అంటిస్తాయి.
French fries can contain a large amount of fat from frying. Some researchers have suggested that the high temperatures used for frying such dishes may have results harmful to health (see acrylamides). In the United States about ¼ of vegetables consumed are prepared as French fries and are proposed to contribute to widespread obesity. Frying French fries in beef tallow, lard, or other animal fats adds saturated fat to the diet. Replacing animal fats with tropical oils such as palm oil simply substitutes one saturated fat for another. Replacing animal fats with partially hydrogenated oil reduces cholesterol but adds trans fat, which has been shown to both raise LDL cholesterol and lower HDL cholesterol. Canola oil could also be used, but beef lard is generally more popular, especially amongst fast food outlets that use communal oil baths. Many restaurants now advertise their use of unsaturated oils. Five Guys, for example, advertises their fries are prepared in peanut oil.
శుద్ధ నెయ్యి, ఇంట్లో చేసుకున్నది ఆరోగ్యానికి మంచిది. నెయ్యిలో యాంటై ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెయ్యి యల్.డి.యల్ ని తగ్గిస్తుంది.
* Ghee, otherwise known as clarified butter, is a healthy cooking oil due to its content of essential fatty acids which are an essential part of our diets. It is rich in easy-to-digest short chain fatty acids and vitamins A, D, E & K. It also contains 3% linoleic acid which has anti-oxidant properties.
* Ghee has a high smoke point which makes it great for cooking. It also means that it does not produce damaging free radicals.
* Ghee is suitable for people who are sensitive to lactose as the heating procedure used to clarify the butter removes the lactose content.
* Use ghee as a delicious oil for cooking or stir into rice and vegetables for a nourishing flavoursome taste.
అంతేకాదు నెయ్యిలో తొందరగా జీర్ణమయ్యే కొవ్వులు ఉంటాయట -
Ghee's chemistry holds the secret to its health benefits. Humans need both saturated and unsaturated fats as part of a healthy diet. Ghee is made from a combination of saturated and unsaturated fats. It is about 65% saturated fat and 25% monounsaturated fat with about 5% polyunsaturated fat content. Its saturated fat is primarily (89%) made from the easy-to-digest short chain fatty acids and it contains 3% linoleic acid which has anti-oxidant properties. It also contains the fat soluble vitamins Vitamin A, D, E and K.
http://www.physicalnutrition.net/ghee-benefits.htm
కాబట్టి అవసరాన్ని బట్టి వాట్టం, ఎంతతినాలో తెలుసుకుని తినటం, ఎక్కడ ఆపాలో తెలుసుకోవటం ముఖ్యం.
Oct 10, 2010
సినిమా మళ్ళి మొదలైంది
అదేనండీ, అనఘ టెరిబుల్ టూస్ లోకి వచ్చింది. వాడితో మొదటి సినిమా, మస్తుగా నడిచింది. మూడొందలరవై రోజుల బొమ్మ. సూపర్ ఇట్టైంది.
ఇక ఇప్పుడు ఈ అమ్మగారు ఏమేంజేస్తరో సూడాలె.
From Drop Box |
అమ్మగారికి పుట్టిన్రోజు శుభాకాంక్షలు
ఏప్పీ బర్త్‌డే అనఘ అని రాయమంటే కేకుజేసిన తెల్ల పిల్ల స్పెల్లింగు తప్పు రాసింది.
Oct 7, 2010
సూరిగాడి ఆలోచన
From 10-7-2010 |
ఎలా ఏసాడో తెలియదు...ఇట్టాతే ఫొటోతీస్తా అన్నా..
ఉండు అని లైక్ డిస్ అని రాసాడు. ఎలానో తెలుసా
ఎల్ ఐ క్ అనుకుంటు, ద్ ద్ ఐ స్ అన్నాడు
this అనేది వాడికింకా తెలియలా.
ఏమైనా వాడి బుఱ్ఱ అప్పుడప్పుడు ఇలా ఝలకులిస్తోంది.
Oct 6, 2010
ఏడుపుల సంత
చక్కగా చదుకుంటూ ఆడుకుంటూ పాడుకునే పిల్లల్ని ఇలా దేశస్థాయి స్టేజీమీదకి లాక్కొచ్చి, ఏం సాధిద్దామనీ అనిపించింది.
సరే అదోఎత్తైతే -
పై ప్రోగ్రాముల్లాంటి వాటికి జరిగే ఆడిషన్స్. వార్నాయనో కోపంతో భగ భగ లాడాను.
పదిహేనేళ్ళ లోపు పిల్లలు పాట్టానికొచ్చి, సరిగ్గా పాళ్ళేక, లేక సెలక్షన్ కమిటీ బిజినెస్ రూల్స్ ఫెయిల్ అయి బయటకొచ్చి, వెక్కి వెక్కి ఏడవటం. ఏట్రా అంటే మానాన్న అమ్మాల కన్న కలలను వమ్ము చేసానని ఒకడు. మా నాన్నాఅమ్మా ల కోరిక తీర్చలేపోయా అని ఇంకొకడు. ఇలా.
ఏం నాన్నా అమ్మలు వీళ్ళూ? నాకర్థంకాలా.
ఏందుకీ గుర్తింపు కోసం పాకులాట?
ఎందుకీ పరుగు?
ఏం సాధిద్దామనీ?
ఇలా తమ పిల్లలను వేధిస్తున్న తల్లితండ్రులపై ఎవ్వరూ ఏ రకంగానూ చర్య తీస్కోకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
ఇక పెద్ద పిల్లలను తీస్కుంటే [అప్పర్ టీనేజ్ లేక అడల్ట్స్] - ఇలాంటి రియాలిటీ షోలలో వచ్చే పెద్ద పిల్లకాయలు కూడా భోరున ఏడవటం నాకు ఆశ్చర్యంగానే కాదు అసహ్యంగా కూడా ఉంది.
ప్రతీ చిన్నవాటికి భోరున ఏడవటం అనేది బహుశా సింపతీకోసం అయిఉండొచ్చు, కానీ దానికీ మరో కోణం ఉందా అనిపించింది.
నా చిన్న తనంలో మానాయన ఎంత ఛండాశాసనుడైనా నాకొక మిత్రుడిలా ఉండేవాడు. అన్చెప్పి ప్రతీ అడ్డమైన ఆలోచన్నీ పంచుకునే వాణ్ణి కాకపోయినా, మానాయన అనే ఓ భావన ఉండేది మనస్సులో. అలానే ఆయనకూడా తనకి ఉన్న చిన్న ప్రపంచంలో కుటుంబానికీ, కుటుంబ అవసరాలకీ వీటికే తన జీవితాన్ని ధారపోసాడు. దానివల్ల ఓ ఫ్యామిలీ, బాండేజ్ గట్రా, ఏర్పడ్డాయి. ఇలాంటివాటి వల్ల ఓ సెక్యూర్ ఫీలింగ్ కలిగినట్టే అని అప్పట్లో అర్థంకాకపోయినా ఇప్పుడు తెలుస్తోంది. అంతేకాక అప్పటి సామాజిక ఆర్ధిక పరీస్థితులు కూడా మరీ ఇప్పటంతటి హైప్ తో కూడుకున్నవి కావు. అందువల్ల *ఓ గుర్తింపు* అని వెంపర్లాడేవాళ్ళు కాదు జనాలు. ఒకవేళ వెంపర్లాడినా ఉట్టికెగరినిచ్చేవాళ్ళే కానీ ఆకాశానికి ఎగరనిచ్చేవాళ్ళు కాదు, అలా ఎగరాల్సిన అవసరం కూడా లేదు ఆ నాడు. దాంతో, మానసికంగా గట్టిగా అయినట్టే అని ఇప్పుడర్ధం అవుతోంది నాకు. నా చిన్నప్పుడు తాలూకా స్థాయి కాదు మా ఊరి స్థాయిలో జరిగిన పోటీలే అతితక్కువ. అవీ స్పోర్ట్స్ లో మాత్రమే లేక క్విజ్లో లేక వకృత్వ పోటీలో. అవీ పది పన్నెండేళ్ళ లోపునవారికి కాదు. కొంచెం పెద్ద పిల్లలకే. తొమ్మిదో పదో చదివేవాళ్ళకి. నాకు గుర్తుండి, మా బళ్ళో జిల్లాస్థాయి ఆటల పోటీలు, అంతర్జిల్లా ఆటల పోటీలు జరిగాయి. కడప జిల్లానుండి ఓ టీం హాకీ ఆడారు గుంటూరు జిల్లా తో.
ఇప్పుడు తల్లితండ్రులూ ఏడుస్తున్నారు ప్రతీదానికి, పిల్లలూ ఏడుస్తున్నారు ప్రతీ చిన్నదానికి. అలానే ఉన్నపళంగా ఆకాశానికి ఎగరాలనుకుంటున్నారు, ఎగరమంటున్నారు తల్లితండ్రులు, మా దగ్గరకు రండి ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాం మేమే ఎగిరిస్తాం మీ పిల్లలను అంటున్నాయి టీవీ చానల్స్.
ఇది ఎంతవరకూ సమంజసం. ఒకటి నుండి పదో మెట్టుకి ఒకేసారి దూకించటం ఎంతవరకూ ఆరోగ్యకరం? సో కాల్డ్ మానవహక్కులు గట్రా వీటిని ఖండించవేం.
పోయినవారం ఈ శ్యామంతన్ దాస్ గాడు ఎలిమినేట్ అయ్యాడు. పీడా పోయింది. వాళ్ళ అమ్మ, ఆమె ముఖం చూస్తే నాకు వాంతి వచ్చింది. ఆమె ఒరేయ్ సన్నాసి నీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా కదరా, రేపొద్దున్న నువ్వు లచ్చలకు లచ్చలు తెచ్చి కుమ్మరిస్తావని కలలు కన్నా కదరా ఎదవా అన్నట్టు ముఖంపెట్టి వలవలా ఏడ్చింది.
Oct 4, 2010
పిల్లల్లో ఆలోచనాత్మకత, సృజనాత్మకత, పరిశీలనాత్మకత
నిన్న పిల్లాజెల్లాలతో మా ఊరి లైబ్రరీకి వెళ్ళా. ఎప్పట్లానే రిటర్నింగు పుస్తకాలు ఇచ్చేసి, కొత్తవి తీస్కుందామని పిల్లల విభాగంవైపుకి అడుగులేసాం. దారిపొడవునా కొత్త కొత్త బొమ్మలు గట్రా పెట్టున్నాయి. హడావిడిగా ఉంది. చాలా మంది పిల్లలు, తల్లులూ వచ్చారు. అక్కడక్కడా బల్లలు వేసి ఉన్నాయి. ఏవేవో అమరుస్తున్నారు వాటిపై హడావిడిగా, పిల్లలు తీవ్రమైన ఏకాగ్రతతో. పిల్లల విభాగంలోకి వెళ్ళాం. అక్కడా అదే తంతు. తను సూరిగాణ్ణి వెంటబెట్టుకుని లెవల్ త్రీ రీడింగ్ పుస్తకాల అరలవైపుకి వెళ్ళింది. నేను పిల్లను తీస్కుని చేపెల పెట్టెవైపుకు వెళ్ళా. పిల్ల చేపలను జూసి కేరింతలు కొడుతోంది. నేను అటు పక్కగా వేసిన బల్ల దగ్గర జరుగుతున్న తంతుని గమనిస్తున్నా.
ఒక తల్లి, తన ఇద్దరు పిల్లలతో ఎదో సర్దుతూ సర్దిస్తోంది. ప్రజెంటేషన్ అట్టలు పెడుతున్నారు.
From library |
పెద్దమ్మాయికి బహుశా ౧౨-౧౪ వయసు ఉండవచ్చు. చిన్నపిల్లకి ౧౦ అలా ఉండుండవచ్చు. నాలోని బ్లాగరు, సమాచార హరుడు ఊర్కోడుగా, వెళ్ళి గెలికా. యాండీ, ఏం జరిగుతోందిక్కడా అని. చిన్నపిల్ల అనర్గళంగా ఓ ఉపన్యాసం ఇచ్చింది. అర్థంకాలేదు.
From library |
4-H Mission
4-H empowers youth to reach their full potential, working and learning in partnership with caring adults.
4-H Vision
A world in which youth and adults learn, grow and work together as catalysts for positive change.
ఒక ఇదీ వాళ్ళ మోటో అట.
నాకర్థం అయ్యిందేంటంటే పిల్లల్లో ఆలోచనా శక్తిని జ్ఞాన్నీ పెంపొందించేట్లు చేయటం వీరి ముఖ్య ఉద్దేశం అని.
ఆ పిల్ల చక్కగా ఒక అట్టమీద ఎదో రాసుకొచ్చింది. ఎదోకటి. దాని గురించి చిన్నపిల్లలకు చెప్పటం. ఆ ఏదోకటి ఎలా? సమాజం, తను చూసేది, తను గమనించేది, ఏదోక సమాచారం. దాన్ని ఒక ప్రాజెక్టులాగా తీర్చిదిద్దగలిగేందుకు అవసరమైయ్యే శక్తి తల్లితండ్రులిస్తే, దాన్ని ముందుకుతీసుకెళ్ళే స్థోమతని ౪-ఎచ్ ఇస్తోంది. ఆ తల్లిని అడిగాను. మీరేమన్నా ఒక బడిని రిప్రజెంటు చేస్తున్నారా అని. లేదు అంది. మరి ఫండ్స్ ఎలా అన్నా? ౪-ఎచ్ ఇస్తుంది అంది. మరి ప్రాజెక్టులు ఎవరు ఇస్తారూ అన్నా. మీటింగ్స్ ఉంటాయట. ప్రతీ వారమో ఏదోకరోజున. ఇది జాతీయ స్థాయి ఆర్గనైజేషనట. లోకల్ విభాగం ఒక కౌంటీ స్థాయిలో ఉంటుందట. లోకల్గా మీటింగ్స్ జరుగుతాయట. పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారట. అనేకానేక విభాగాల్లో పిల్లలకు స్పూర్తినిస్తారట. ఫటాగ్రఫి, రిసైక్లింగ్, ఫుడ్, న్యూట్రిషన్, సైన్స్, ఇలా ఏదైనా.
వాళ్ళ వెబ్సైట్లో వారి గురించిన ఒక చిన్న వాక్యం -
Preparing young people to make a positive impact in their communities and the world.
వారి వెబ్సైట్
ఆ బల్ల దగ్గరకి అనఘ వెళ్ళింది. తనకి క్రేయాన్స్, డిస్నీ ప్రిన్స్ ఇచ్చారు రంగులెయ్యమని. పిల్ల మహదానందంగా తీస్కుని కూర్చుంది.
From library |
ఇక సూరిగాడు వచ్చాడు. ఆడికి టాయ్‌స్టోరి పజిల్ ఈస్ ఇచ్చి రంగులేసి పజిల్స్ పెట్టు అని చెప్పారు.
From library |
నాకు ఎప్పటినుండో ఒక ఆలోచన బుఱ్ఱలో ఉంది. అఫ్‌కోర్స్ నిద్రావస్థలోకి వెళ్ళిందనుకోండి. అది, భారతావనిలో పిల్లలకి రిసైకిల్ అనేదానిపై అవగాహన రావాలి. దానికి సంబంధించిన స్పూర్తిని వారిలో కలుగజెయాలంటే వారినే ఇన్వాల్వ్ చేస్తూ ఒక కాం౨పైన్ తయ్యారు జేయాలి. పై పద్ధతి ద్వారా అది సాధ్యమే అనిపిస్తుంది. కానీ, ఇక్కడి పిల్లలకు గ్రంధాలయం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. అక్కడి పిల్లలకు ఆఫ్ ది స్కూల్ లైఫ్ లేదు. ఒక మీటింగ్ ప్లేస్ లేదు. అథవా ఉన్న, వారి జీవితాల్లో బడి అయ్యాక ఉన్న సమయం ఎంత? బడికి వెళ్ళటం వచ్చి ఎల్.కే.జి నుంచే ఐ.ఐ.టి కోచింగులు, లేక హోంవర్కులు. తల్లితండ్రులు అనుకుంటే ఈ పరీస్థితిలో మార్పు తీసుకురాగలరు. పిల్లలకి ఆలోచించే జ్ఞానాన్ని ఇవ్వండి. వాళ్ళకి చుట్టుపక్కల ఏంజరుగుతుందో చూపండి.
దారిపొడవునా ఉన్న, అక్కడక్కడా డిస్ప్లేలలో ఉన్న కొన్ని బొమ్మలను ఇక్కడ పెడుతున్నా