Dec 26, 2010

నాన్నా క్రిస్మస్ గిఫ్ట్ ఏమిస్తావ్

"నాన్నా క్రిస్మస్ గిఫ్ట్ ఏమిస్తావ్"
సూరిగాడి సొద మొదలుపెట్టాడు.
ఏంకావాలిరా నాన్నా అని అడిగాను. వాడికి మనసులో ఏదోక పెద్ద కోఱిక ఉండేఉంటుంది తప్పకుండా అని అనిపించింది. కొంత ఊహించా కూడా. వాడి కార్ల పిచ్చి కళ్ళముందు ఒకసారి మెదిలింది. ఎప్పుడు వాల్మార్ట్ వెళ్ళినా టాయ్స్ దగ్గరకి వెళ్దామని అడుగుతాడు. వద్దురా బాబూ, వెళ్ళినప్పటినుండి కొను కొను అడి ఏడుస్తావు, నాకు తలనొప్పి రా నాయనా అంటే, లేడు నాన్నా జస్ట్ చూసి వచ్చేద్దాం అంటాడు. జస్ట్ టు సీ అంతే, నో బైయింగ్ అని ఖచ్చితంగా అంటాడు. ప్రామిసులు గట్రా చేస్తాడు. నా రోజు బాగుంటే, వచ్చేస్తాడు జస్ట్ చూసి. ఖరాబు రోజున ఏడ్చి నాకు అదు కావాలా అని రచ్చ రచ్చ చేస్టాడు. తప్పు వాడిది కాదుగా. కన్జ్యూమరైజ్డ్ మార్ట్ ది. కన్జూమర్ని అవసరంలేకపోయినా ఎట్రాక్టు చేసి కొనిపించే మార్ట్ హృదయలేమిది. ఏమైనా వాడికి ఏంకావాలో నాకు సగం అర్థం అయ్యింది. లైటెనింగ్ మెక్వీన్ కావాలంటాడు.
LightningMcQueen.jpg
సరే, మాంచి సమయంచూసి ఏరా నాన్నా ఏంకావాలో చెప్పరా అని అడిగిందే తడావు, లైటెనింగ్ మెక్వీన్ రిమోట్ కంట్రోల్ కార్ కావాలి నాన్నా అన్నాడు.
రోజూ ఆఫీసు నుండి ఇంటికెళ్ళంగనే తెచ్చావా అని అడగటాం లేదురా ఇంకా టైం ఉందిగా అనటం అలవాటైపోయింది వాడికీ నాకూ.ఇక నిన్న క్రిస్మస్ ఈవ్. ౨౪ డిశెంబరు. ఇక కొందాం అని బయల్దేరాం. వా.మా వెళ్ళాం. ఎంత వెతికినా మనకి కావాల్సింది దొరకలా. ఎట్లా నాన్నా అంటాడు మొహం చిన్నబుచ్చుకుని. సరేరా టాయ్స్-స-రస్ లో ప్రయత్నిద్దాం అని అటు వెళ్ళాం. చలిగా ఉంటంతో,  బ్యాచీని కార్లోనే వదిలి లోనకి ఏతెంచా. వెతికా మొత్తం, దొరకలా. ఐతే, ఒక ర్యాకు మొత్తం రి/కం అంటే రిమోట్/కంట్రోల్ కార్లు ఉన్నాయ్. అక్కడే ఫెర్రారి మోడాల్ ఒకటి కనిపించింది. వెంటనే కాల్ కొట్టా, ఏరా రెడ్ ఫెర్రారి ఉంది మరి ఏంచేద్దాం అన్నాను. ఓకే, ఐ'ల్ ప్రిటెండ్ దట్ అస్ మెక్వీన్ అన్నాడు. హమ్మయ్యా బతికాం అనుకున్ని కొన్నా. కారుదగ్గరకి పోంగనే ఇటివ్వు చూస్తా అన్నాడు. ఇచ్చాణు. నచ్చింది.
మొత్తానికి వాడికి నచ్చి వాణ్ణి ఎంటర్టైన్ చేస్తోందీ కార్ గిఫ్ట్. ఇదే ఆ కారు.

5 comments:

 1. ఆహా సూరిబాబు ఫెరారీ ఓనర్ అయ్యాడనమాట :-) కార్ బాగుంది. లైటెనింగ్ మెక్వీన్ కి ఇంకా క్రేజ్ ఉందా!! చాన్నాళ్ళు అవుతుందేమో కదా.. బహుశా అందుకే దొరికి ఉండదు.

  ReplyDelete
 2. అది సరే మరి మా అనఘమ్మ గిఫ్ట్ ఏదీ :)

  ReplyDelete
 3. థాంక్స్ అండీ...నాకు మంచి ఐడియా ఇచ్చారు.మా తమ్ముడికి ఫెర్రారీ..ష్యూమాకర్ పిచ్చి.వాడికి ఇండియా వెళితే ఏం తీసుకెళ్ళాలా అని తెగ ఆలొచిస్తున్నా...ఇప్పుడు ఇది పట్టుకెళ్ళీపోతా! నాకు భలే నచ్చింది....ఎర్ర ఫెర్రారీ.మా తమ్ముడు కచ్చితంగా ఫ్లాట్ :)

  ReplyDelete
 4. మెక్వీన్ అను మహావిమానమది
  సూరిగాడు గాంచెను అచ్చెరువొందె
  (ఎమ్మెస్ రామారావు స్టైల్లో) :)

  ReplyDelete