పోయినేడాది అనుకుంటా, జీ టీవీలో సరెగమప లిటిల్ ఛాంప్స్ ఛాలెంజ్ వచ్చింది. దాంట్లో అభిగ్యాన్ దాస్ అని ఒకడు పాల్గొన్నాడు. ఆ పిల్లాడి తల్లితండ్రులు బలే విచిత్రంగా అనిపించారు. ఆమాటకొస్తే ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతీ ఒక్క పిల్ల/పిల్లాడి తల్లితండ్రులూ అలానే అనిపించారనుకోండి. ఇక ఈ పిల్లాడు, అంతకు ముందే సరెగమప బాంగ్ల లో గెలిచి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చాడు. వీడు మొత్తానికి పై దాకా వచ్చి ఆరోవాడిగా నిలిచాడనుకోండి. వాడి తల్లి తండ్రులకి తపన తగ్గలా. ఈ పిల్లాడికి మల్లే వాడి తమ్ముడు శ్యామంతన్ దాస్ని లైంలైట్లోకి తెచ్చి వండివారిద్దామనుకున్నారు. స్టార్ టీవీ వాడి ఛోటే ఉస్తాద్ అనే కార్యక్రమంలోకి తెచ్చారు వాడ్ని. మొట్టమొదటి ఎపిసోడ్ లో శ్యామంతన్ దాస్ పాడినాక వాడి తల్లితండ్రుల్ని అడిగారు ఎలా పాడేడు మీ అబ్బాయి అని. సోను నిగం మరియూ రాహత్ ఫతే ఆలీ ఖాన్ జడ్జీలు. అభిగ్యాన్ దాస్ పాల్గొన్నప్పుడు సోను నిగం జడ్జ్ ఆ ప్రోగ్రాంలో. అభిగ్యాన్ తల్లితండ్రులతో కనీసం పది ఎపిసోడ్ల ఇంటరేక్షన్ ఉండింది. ఇప్పుడు, ఎలా పాడేడు మీవాడు అంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంది మా వాడు ఇలా స్టేజీఎక్కి పాట్టం అని కంటినీరు పెట్టుకు చెప్పారు. జడ్జీలు జాలిగా చూసారు. ఎవరూ ఏం మాట్లాళ్ళేదు. మీరు పలానా అని. సరే అది బిజినెస్ అని కనీస వీక్షకుడికి అర్ధం అయ్యింది. నాకైతే ఏంటీ గోల అనిపించింది.
చక్కగా చదుకుంటూ ఆడుకుంటూ పాడుకునే పిల్లల్ని ఇలా దేశస్థాయి స్టేజీమీదకి లాక్కొచ్చి, ఏం సాధిద్దామనీ అనిపించింది.
సరే అదోఎత్తైతే -
పై ప్రోగ్రాముల్లాంటి వాటికి జరిగే ఆడిషన్స్. వార్నాయనో కోపంతో భగ భగ లాడాను.
పదిహేనేళ్ళ లోపు పిల్లలు పాట్టానికొచ్చి, సరిగ్గా పాళ్ళేక, లేక సెలక్షన్ కమిటీ బిజినెస్ రూల్స్ ఫెయిల్ అయి బయటకొచ్చి, వెక్కి వెక్కి ఏడవటం. ఏట్రా అంటే మానాన్న అమ్మాల కన్న కలలను వమ్ము చేసానని ఒకడు. మా నాన్నాఅమ్మా ల కోరిక తీర్చలేపోయా అని ఇంకొకడు. ఇలా.
ఏం నాన్నా అమ్మలు వీళ్ళూ? నాకర్థంకాలా.
ఏందుకీ గుర్తింపు కోసం పాకులాట?
ఎందుకీ పరుగు?
ఏం సాధిద్దామనీ?
ఇలా తమ పిల్లలను వేధిస్తున్న తల్లితండ్రులపై ఎవ్వరూ ఏ రకంగానూ చర్య తీస్కోకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
ఇక పెద్ద పిల్లలను తీస్కుంటే [అప్పర్ టీనేజ్ లేక అడల్ట్స్] - ఇలాంటి రియాలిటీ షోలలో వచ్చే పెద్ద పిల్లకాయలు కూడా భోరున ఏడవటం నాకు ఆశ్చర్యంగానే కాదు అసహ్యంగా కూడా ఉంది.
ప్రతీ చిన్నవాటికి భోరున ఏడవటం అనేది బహుశా సింపతీకోసం అయిఉండొచ్చు, కానీ దానికీ మరో కోణం ఉందా అనిపించింది.
నా చిన్న తనంలో మానాయన ఎంత ఛండాశాసనుడైనా నాకొక మిత్రుడిలా ఉండేవాడు. అన్చెప్పి ప్రతీ అడ్డమైన ఆలోచన్నీ పంచుకునే వాణ్ణి కాకపోయినా, మానాయన అనే ఓ భావన ఉండేది మనస్సులో. అలానే ఆయనకూడా తనకి ఉన్న చిన్న ప్రపంచంలో కుటుంబానికీ, కుటుంబ అవసరాలకీ వీటికే తన జీవితాన్ని ధారపోసాడు. దానివల్ల ఓ ఫ్యామిలీ, బాండేజ్ గట్రా, ఏర్పడ్డాయి. ఇలాంటివాటి వల్ల ఓ సెక్యూర్ ఫీలింగ్ కలిగినట్టే అని అప్పట్లో అర్థంకాకపోయినా ఇప్పుడు తెలుస్తోంది. అంతేకాక అప్పటి సామాజిక ఆర్ధిక పరీస్థితులు కూడా మరీ ఇప్పటంతటి హైప్ తో కూడుకున్నవి కావు. అందువల్ల *ఓ గుర్తింపు* అని వెంపర్లాడేవాళ్ళు కాదు జనాలు. ఒకవేళ వెంపర్లాడినా ఉట్టికెగరినిచ్చేవాళ్ళే కానీ ఆకాశానికి ఎగరనిచ్చేవాళ్ళు కాదు, అలా ఎగరాల్సిన అవసరం కూడా లేదు ఆ నాడు. దాంతో, మానసికంగా గట్టిగా అయినట్టే అని ఇప్పుడర్ధం అవుతోంది నాకు. నా చిన్నప్పుడు తాలూకా స్థాయి కాదు మా ఊరి స్థాయిలో జరిగిన పోటీలే అతితక్కువ. అవీ స్పోర్ట్స్ లో మాత్రమే లేక క్విజ్లో లేక వకృత్వ పోటీలో. అవీ పది పన్నెండేళ్ళ లోపునవారికి కాదు. కొంచెం పెద్ద పిల్లలకే. తొమ్మిదో పదో చదివేవాళ్ళకి. నాకు గుర్తుండి, మా బళ్ళో జిల్లాస్థాయి ఆటల పోటీలు, అంతర్జిల్లా ఆటల పోటీలు జరిగాయి. కడప జిల్లానుండి ఓ టీం హాకీ ఆడారు గుంటూరు జిల్లా తో.
ఇప్పుడు తల్లితండ్రులూ ఏడుస్తున్నారు ప్రతీదానికి, పిల్లలూ ఏడుస్తున్నారు ప్రతీ చిన్నదానికి. అలానే ఉన్నపళంగా ఆకాశానికి ఎగరాలనుకుంటున్నారు, ఎగరమంటున్నారు తల్లితండ్రులు, మా దగ్గరకు రండి ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాం మేమే ఎగిరిస్తాం మీ పిల్లలను అంటున్నాయి టీవీ చానల్స్.
ఇది ఎంతవరకూ సమంజసం. ఒకటి నుండి పదో మెట్టుకి ఒకేసారి దూకించటం ఎంతవరకూ ఆరోగ్యకరం? సో కాల్డ్ మానవహక్కులు గట్రా వీటిని ఖండించవేం.
పోయినవారం ఈ శ్యామంతన్ దాస్ గాడు ఎలిమినేట్ అయ్యాడు. పీడా పోయింది. వాళ్ళ అమ్మ, ఆమె ముఖం చూస్తే నాకు వాంతి వచ్చింది. ఆమె ఒరేయ్ సన్నాసి నీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా కదరా, రేపొద్దున్న నువ్వు లచ్చలకు లచ్చలు తెచ్చి కుమ్మరిస్తావని కలలు కన్నా కదరా ఎదవా అన్నట్టు ముఖంపెట్టి వలవలా ఏడ్చింది.
Oct 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
భాస్కర్ గారు,
ReplyDeleteనిజంగా.. ఎంత విసుగు వస్తుందో వీటిని చూస్తే.. ఇది చైల్డ్ లేబర్ కిందే వస్తుందని నా అభిప్రాయం. దానికన్నా దారుణం. చైల్డ్ లేబర్ తిండి,బట్టలు,ఇల్లూ లాంటి మౌలికావసరాలకోసం అయితే,.. తల్లిదండ్రుల ఆశలేంటో, ఆ ప్రెషర్ ఏంటో, నేషనల్ టీ వీ ల్లో ఏడుపులేంటో, వెగటు పుట్టిస్తున్నారు. 'మా పాప టాలెంట్ కోసమే మా జీవితం అర్పించాం.. అప్పులకైనా సిద్ధం.. ఉద్యోగం మానేశాం.. ' లాంటి స్టేట్ మెంటులకీ కొదవ లేదు.
ఐ ఐ టీ లూ, పాట/ఆట/నాట్యం పోటీలకోసం బలిపెట్టకుండా, ఈ రోజుల్లో ఆవెరేజ్ తెలివితేటలు, అంతకన్నా ఆవెరేజ్ కళలూ, ఫిజికల్ స్టామినా ఉంటే గానీ, బాల్యం అనుభవించలేకపోతున్నట్టున్నారు పిల్లలు.
కరెష్టుగా చెప్పావన్నాయ్!!
ReplyDeleteGoodone
ReplyDeleteనిజం చెప్పారు. ఈ టపా బావుంది.
ReplyDeleteచదువులు, టెక్నో స్కూల్స్,కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కొందరు తల్లితండ్రులు బండెడు పుస్తకాలు వీపున కట్టి తోముతుంటే,చదువు అందరూ చదివేదే గుర్తింపు కావాలనుకొని వాళ్ళ వయసు,కెపాసిటీతోసంబంధం లేకుండారియాల్టీ షోల వెంట తిప్పుతూ మరికొందరుఏదేమైనా బలిపశువులయ్యేది పిల్లలే ప్చ్...ఏం చేస్తాం?మంచిటపా !
ReplyDeletegood one
ReplyDeleteచాలా బాగా చెప్పారు, అసలు ఆ ప్రొగ్ర్రాంలు ఎమిటొ, వాటి వల్ల ఎం సాధిస్తారొ అనిపిస్తుంది
ReplyDeleteతెలుగు లొ కుడా ఇలానె ఎవొ వస్తున్నాయనుకుంట, అసలు జనాలు ఎలా చుస్తున్నారొ ఎంటో కాని
ఇలాంటి పిచ్చి సెంటిమెంట్లు(పిల్లల, వాళ్ళ తల్లిదండ్రుల ఏడుపులు) సెన్సార్ చేయకుండా టీవీల్లో చూపించి రేటింగ్స్ కొట్టేద్దామనే పనికిమాలిన ఆలోచన తెలుగు చానల్స్ లో ఓంకార్ అనే ప్రాణికి వచ్చింది. వీడిని గురించి ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత మంచిది.వాళ్ళను అలా ఏడవమని, గొడవచేయమని వీడే డైరెక్షన్స్ ఇస్తుంటాడని నా అనుమానం. ఇప్పుడు ఏ చానల్ చూసినా అలాంటి కార్యక్రమాలే రాజ్యమేలుతున్నాయి.
ReplyDelete