ఇవ్వాళ్ళ పొద్దున్నే -
సమయం ఏడు
లేరా
హా..హూం
లేవరా బడి టయం అవుతోంది.
హా.హూం
[డోర్ కర్టెన్ తీసి చూస్తే వానపడుతోంది]
నాన్నా లేరా వానపడుతోంది, లేటు అవుతావ్ బస్సుకి
[టంటటాయ్...టకాటక్]
[లేచి కూర్చుని]
హా, ఏంటి వానపడుతోందా
ఐతే గొడుగేస్కెళ్ళొచ్చన్నమాట
వాన ఉంటే నువ్వెళ్ళేప్పటికి పడుతుంటే ఏస్కెళ్దువుగాన్లే
ఏంకాదు, పడుతుంది. ఎక్కడా గొడుగు? తీ బయటకి
అరేయ్ నీకు అందదు, స్నానం చేసి రెడీగా ఇస్తాగా
కాదు ఇవ్వు, రెడీగా పెట్టుకుంటా
[నేను] ఇవ్వు తీసి వాడితో గోల దేనికి
[తను] సరేరా ఇదిగో [తీసి ఇచ్చింది]
[ఢమాల్ ఢిమీల్ - పది నిమిషల్లో రెడీ అయి కూర్చున్నాడు.]
[గొడుగు తెరవటం ముడవటం ఆట ఆడుతున్నాడు]
[బస్సు దగ్గర]
నిక్ నా గొడుగు ఇదిగో
అరే టేంకెగా ఇదిగో నా గొడుగు
ఏం రాసుందో చూసావా *రాక్&రోల్ టీం*
ఇంతలో బస్సొచ్చింది.......అలా మాట్లాడుకుంటూ ఎక్కాడు చేతిలో గొడుగుతో, ఓరగ తెరిచిపట్తుకుని. బస్సు డ్రైవర్ కి చూపించి ఏదో చెప్తున్నాడు. నేను నెమ్మదిగా నా కారువైపుకి అడుగులెసాను.
Nov 12, 2010
Subscribe to:
Post Comments (Atom)
I am also happy. :)
ReplyDeleteFinally. :)
ReplyDelete:-) సూపర్.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteహమ్మయ్యా.. మొత్తానికి వానొచ్చింది. మీ సూరీడి ముచ్చట తీరిందన్నమాట! :)
ReplyDeleteha ha.
ReplyDeleteహమ్మయ్య మొత్తానికి మీవాడు గొడుగేసుకెళ్ళాడన్నమాట. పోనీలెండి ఆ ముచ్చట తీరిందిగా...ఇక హాయిగా పడుకుంటాడు :)
ReplyDelete