మొన్నటి ఆదివారం మా దేవాళయంలో అఖండ రుద్ర పారాయణ జరిగింది. ఆరున్నరకల్లా గుళ్ళో ఉండాలి అన్నారు పెద్దలు. నాలుగున్నరకి లేచి ఐదుంబావు కల్లా రోడ్డెక్కి ఆరు ఇరవై కల్లా గుళ్ళో ఉన్నాను. ఎరేంజ్‌మెంట్లు మొదలెట్టాము అందరం. పారాయణ చెసేప్పుడు అభిషేకానికి అవసరమైనన్ని పాలు పండ్లు పండ్ల రసాలు ఇత్యాది సామగ్రిని సిద్ధం చేసాం. అంతలో గురువుగరు అబ్బాయ్ ఆ పెద్ద బల్ల తీసుకురండి ఇటు అని పురమాయించారు. ఎందుకన్నా అనుకుంటూనే తెచ్చి పెట్టాం. దానిపై ఓ వస్త్రాన్ని పరిచి, పైన ముగ్గులు వేసి, అదిగో ఆ డబ్బా ఇటు తే అన్నారు గురువుగారు. పై కాయితం తీసి చూస్తే అందు బుల్లి బుల్లి శివలింగాలు. చక్కగా నల్లటి రంగులో, తెల్లని నామంతో. వందకు పైగ ఉన్నాయి.
From కార్తీకమాసం |
సరే ఆరు గంటల కార్యక్రమం అయ్యాక ప్రసాదాది కార్యక్రమాలప్పుడు ఎవరు చేసారయ్యా ఇన్ని లింగాలను ఎలా అని అడిగితే శ్రీ వినయ్ కుమార్ గారు చేత్తో చేసారని తెలిసింది. ఆయన అటుగా వెళ్తుంటే అభినందనలు తెలియపరచాను కరచాలనం చేసాను, అయ్యా చేయిని ఊపకండి ఇంకా నొప్పులుగా ఉన్నాయి అన్నారతను.
మట్టితో చేసి, కాల్చి, నల్లరంగు వేసి.........................ఎంత కళాత్మకత, ఎంత ఆర్టిస్టిక్ విజన్, థాట్.
హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాను. వారు, అయ్యా మా పిల్లకు కూడా సహాయం చేసారని వినయంగా తెల్పారు.
ఓం నమఃశివాయ.
From కార్తీకమాసం |
ఓం నమఃశివాయ.
ReplyDeletevinay kumar anTae Doctor vinay kumar gaaraenaa?
ReplyDeleteమొత్తం 108 లింగాలు ఉన్నాయా? వినయ్ గారికి అభినందనలూ, మీకు ధన్యవాదాలు.
ReplyDeleteరుద్రం , నమకం, చమకం కలిపి అఖండ రుద్ర పారాయణం అన్నారా?
చాల బాగున్నాయండీ..నేను మొదట ఇవి కొన్నవి అనుకున్నా...కానీ చేత్తో చేసారు అంటే మాటలు కాదు.చాల గ్రేట్ :)
ReplyDelete