Dec 6, 2010

గిల్లికజ్జాలు

తూయా! స్తాపిత్ [షూయా కాస్తా తూయా అయ్యిందిప్పుడు]
[ఆడు పట్టించుకున్నట్టు లేదు, మళ్ళీ అరుపు]
తూయా! స్తాపిత్
[కూసింత హెచ్చు స్వరంలో]
తూయాయాయాయా! స్తాపిత్‌త్‌త్‌త్ [మరీ హెచ్చు స్థాయిలో]
[నే డ్రైవింగ్ సీట్లోంచి అరుచుట]
అరేయ్, తంతా నిన్ను ఆపు. ఎందుకు దాన్ని ఏడిపిస్తా
నేనేం చేయలేదు నాన్నా [వాడి గొంతులో నవ్వు]
మరేంటటా అమ్మగారి గోల?
[మావిడ కల్పించుకుని]
ఏంలేదులే నువ్వు నడపవయ్యా
అదేంటి? ఏంలేకుండా అరవటానికీ ఎవరనుకున్నావ్? అనఘ
మరేంలేదులే, టెన్షన్ పడక. ఆడు అడు సీట్లో పిల్స్ ఇటు సీట్లో కదా కూర్చుండేది
అవును
ఆడు వాడి కిటికీలోంచే చూస్కోవాలంట. తల ఇటు తిప్పి పిల్స్ కిటికిలోంచి చూస్తే అమ్మగారికి కోపం
వాట్????%$‌&‌&‌&*(&(&*#%@#$%


అదయ్యా సంగతి.

8 comments:

  1. ఒకన్నగా దీన్ని ఖండిస్తాండా

    ReplyDelete
  2. వేణూ :):)
    రాణీ గారూ నమస్తే.
    కొత్తపాళీ అన్నగారు - పిల్స్ = పిల్ల :)
    సుబ్బు - తొందర్లో మరికొన్ని ఖండనలు కావాలబ్బా
    సౌమ్య - మరే..

    ReplyDelete
  3. అనఘ సూపర్ కేకంతే..

    ReplyDelete