Oct 4, 2010

పిల్లల్లో ఆలోచనాత్మకత, సృజనాత్మకత, పరిశీలనాత్మకత

ఈనాటి చదువుల మీదా, విద్యా అవసరాల మీదా, విద్యా సంస్థల మీదా, విద్య తీరుతెన్నుల మీద ఇప్పటికే అనేకానేక గొంతులు అనేకానేక టపాలు చూసాం, చూస్తూనే ఉంటాం, చదూతూనే ఉంటాం. ఐతే, అవి మరుక్షణం మహా అయితే స్మృతిపథంలోకి వెళ్తాయి. అంతకన్నా పెద్ద జరిగేదేంలేదు. పిల్లల్లో ఆలోచనా స్పూర్తిని, పరిశీలనాత్మకత పెంపొందించాలంటే ఒక్క బడే సరిపోదు. పుస్తకాల్లో ఉన్న విజ్ఞానం మాత్రమే సరిపోదు. వారిలోకి ఎగబాకేలా వారి మనుస్సుకి హత్తుకునేలా, వారిని పరిశీలన పరిశోధన వైపుకి అడుగుడు వేయించేలా ఒక వేదిక కావాలి. ఆ వేదిక పిల్లలున్న సమాజానికి అనుసంధానంగా ఉండాలి. ఆ వేదిక పిల్లల్కు అనుదినం స్పూర్తిదాయకంగా ఉండలి. వారికి అతి చేరువగా ఉండాలి.


నిన్న పిల్లాజెల్లాలతో మా ఊరి లైబ్రరీకి వెళ్ళా. ఎప్పట్లానే రిటర్నింగు పుస్తకాలు ఇచ్చేసి, కొత్తవి తీస్కుందామని పిల్లల విభాగంవైపుకి అడుగులేసాం. దారిపొడవునా కొత్త కొత్త బొమ్మలు గట్రా పెట్టున్నాయి. హడావిడిగా ఉంది. చాలా మంది పిల్లలు, తల్లులూ వచ్చారు. అక్కడక్కడా బల్లలు వేసి ఉన్నాయి. ఏవేవో అమరుస్తున్నారు వాటిపై హడావిడిగా, పిల్లలు తీవ్రమైన ఏకాగ్రతతో. పిల్లల విభాగంలోకి వెళ్ళాం. అక్కడా అదే తంతు. తను సూరిగాణ్ణి వెంటబెట్టుకుని లెవల్ త్రీ రీడింగ్ పుస్తకాల అరలవైపుకి వెళ్ళింది. నేను పిల్లను తీస్కుని చేపెల పెట్టెవైపుకు వెళ్ళా. పిల్ల చేపలను జూసి కేరింతలు కొడుతోంది. నేను అటు పక్కగా వేసిన బల్ల దగ్గర జరుగుతున్న తంతుని గమనిస్తున్నా.

ఒక తల్లి, తన ఇద్దరు పిల్లలతో ఎదో సర్దుతూ సర్దిస్తోంది. ప్రజెంటేషన్ అట్టలు పెడుతున్నారు.
From library

పెద్దమ్మాయికి బహుశా ౧౨-౧౪ వయసు ఉండవచ్చు. చిన్నపిల్లకి ౧౦ అలా ఉండుండవచ్చు. నాలోని బ్లాగరు, సమాచార హరుడు ఊర్కోడుగా, వెళ్ళి గెలికా. యాండీ, ఏం జరిగుతోందిక్కడా అని. చిన్నపిల్ల అనర్గళంగా ఓ ఉపన్యాసం ఇచ్చింది. అర్థంకాలేదు.
From library
తల్లి వచ్చి చెప్పుకొచ్చింది. వాళ్ళది ఒక ఆర్గనైజేషన్ అట. దానిపేరు ఫోర్-ఎచ్ అట.

4-H Mission
4-H empowers youth to reach their full potential, working and learning in partnership with caring adults. 

4-H Vision
A world in which youth and adults learn, grow and work together as catalysts for positive change.

ఒక ఇదీ వాళ్ళ మోటో అట.

నాకర్థం అయ్యిందేంటంటే పిల్లల్లో ఆలోచనా శక్తిని జ్ఞాన్నీ పెంపొందించేట్లు చేయటం వీరి ముఖ్య ఉద్దేశం అని.

ఆ పిల్ల చక్కగా ఒక అట్టమీద ఎదో రాసుకొచ్చింది. ఎదోకటి. దాని గురించి చిన్నపిల్లలకు చెప్పటం. ఆ ఏదోకటి ఎలా? సమాజం, తను చూసేది, తను గమనించేది, ఏదోక సమాచారం. దాన్ని ఒక ప్రాజెక్టులాగా తీర్చిదిద్దగలిగేందుకు అవసరమైయ్యే శక్తి తల్లితండ్రులిస్తే, దాన్ని ముందుకుతీసుకెళ్ళే స్థోమతని ౪-ఎచ్ ఇస్తోంది. ఆ తల్లిని అడిగాను. మీరేమన్నా ఒక బడిని రిప్రజెంటు చేస్తున్నారా అని. లేదు అంది. మరి ఫండ్స్ ఎలా అన్నా? ౪-ఎచ్ ఇస్తుంది అంది. మరి ప్రాజెక్టులు ఎవరు ఇస్తారూ అన్నా. మీటింగ్స్ ఉంటాయట. ప్రతీ వారమో ఏదోకరోజున. ఇది జాతీయ స్థాయి ఆర్గనైజేషనట. లోకల్ విభాగం ఒక కౌంటీ స్థాయిలో ఉంటుందట. లోకల్గా మీటింగ్స్ జరుగుతాయట. పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారట. అనేకానేక విభాగాల్లో పిల్లలకు స్పూర్తినిస్తారట. ఫటాగ్రఫి, రిసైక్లింగ్, ఫుడ్, న్యూట్రిషన్, సైన్స్, ఇలా ఏదైనా.

వాళ్ళ వెబ్సైట్లో వారి గురించిన ఒక చిన్న వాక్యం -

Preparing young people to make a positive impact in their communities and the world.

వారి వెబ్సైట్

http://www.4-h.org

ఆ బల్ల దగ్గరకి అనఘ వెళ్ళింది. తనకి క్రేయాన్స్, డిస్నీ ప్రిన్స్ ఇచ్చారు రంగులెయ్యమని. పిల్ల మహదానందంగా తీస్కుని కూర్చుంది.

From library

ఇక సూరిగాడు వచ్చాడు. ఆడికి టాయ్‌స్టోరి పజిల్ ఈస్ ఇచ్చి రంగులేసి పజిల్స్ పెట్టు అని చెప్పారు.

From library
అట్లా వాళ్ళు బల్ల తెరిచిన ఐదు నిమిషాల్లో పది-పదిహేనుమంది గుమిగూడారు.


నాకు ఎప్పటినుండో ఒక ఆలోచన బుఱ్ఱలో ఉంది. అఫ్‌కోర్స్ నిద్రావస్థలోకి వెళ్ళిందనుకోండి. అది, భారతావనిలో పిల్లలకి రిసైకిల్ అనేదానిపై అవగాహన రావాలి. దానికి సంబంధించిన స్పూర్తిని వారిలో కలుగజెయాలంటే వారినే ఇన్వాల్వ్ చేస్తూ ఒక కాం౨పైన్ తయ్యారు జేయాలి. పై పద్ధతి ద్వారా అది సాధ్యమే అనిపిస్తుంది. కానీ, ఇక్కడి పిల్లలకు గ్రంధాలయం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. అక్కడి పిల్లలకు ఆఫ్ ది స్కూల్ లైఫ్ లేదు. ఒక మీటింగ్ ప్లేస్ లేదు. అథవా ఉన్న, వారి జీవితాల్లో బడి అయ్యాక ఉన్న సమయం ఎంత? బడికి వెళ్ళటం వచ్చి ఎల్.కే.జి నుంచే ఐ.ఐ.టి కోచింగులు, లేక హోంవర్కులు. తల్లితండ్రులు అనుకుంటే ఈ పరీస్థితిలో మార్పు తీసుకురాగలరు. పిల్లలకి ఆలోచించే జ్ఞానాన్ని ఇవ్వండి. వాళ్ళకి చుట్టుపక్కల ఏంజరుగుతుందో చూపండి. 

దారిపొడవునా ఉన్న, అక్కడక్కడా డిస్ప్లేలలో ఉన్న కొన్ని బొమ్మలను ఇక్కడ పెడుతున్నా

3 comments:

 1. hmm...
  బావుంది.
  పిల్లలు ఇందులో చేరాలి అనుకుంటా.
  వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.
  పరిచయం చేసినందుకు Thanks.

  ఇక్కడి లైబ్రరీలు నిజంగానే part of life.
  బడిలో లైబ్రరీలు కూడా బడిలో తప్పనిసరి అంశం.
  లైబ్రరీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేస్తారు లైబ్రరీ టీచర్లు.

  పై తరగతుల్లో ఉంటాయేమో, మరి.
  School district ని బట్టి ఉంటాయో మరి.
  కానీ ఇంతవరకూ నేను మా పిల్లల విషయంలో miss అయ్యేవి స్కూలు ఎగ్జిబిషన్లూ, సాంస్కృతిక కార్యక్రమాలూను.
  మా చిన్నప్పుడు బాగా ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళం, ఎదురు చూసే వాళ్ళం వాటి కోసం.
  టీచర్లూ బాగా శ్రద్ధ తీసుకుని prepare చేసే వాళ్ళు.
  Social Studies వి కూడా ఉండేవి, world organisations గురించి. ఇంకా అలాంటివేవో బానే ఉండాలి మా చిన్నప్పుడు.

  ReplyDelete