Nov 11, 2010

క్షణం తీరిక లేదు

అలా వేళ్తోంది జీవితనౌక
పిల్లాజెల్లా
జలుబులు
దగ్గులు
కోరికలు
గుఱ్ఱాలు
బళ్ళు
గుళ్ళు
నిద్రలేని రాత్రులు
పిల్లల కలవరింతలు
పిల్లల పలవరింతలు
తీరకలేదా అంటే లేదు
ఉందా అంటే ఉంది
లేనట్టుగా ఉంది
ఉన్నట్టుగా లేదు
క్షణం తీరిక లేదు
ఔను, లేదు
అలా వెళ్తోంది జీవిత నౌక
ఏ గమ్యంవైపుకో
ఇదిమిద్ధంగా తెలియని ప్రయాణాంలో
తెలియని ప్రయాణంతో
ఔను, క్షణం తీరిక లేదు

8 comments: