Nov 16, 2010

గూ.గోల

బజ్ ని తెలుగులో ఏమంటారు?
అసలు బజ్ అంటే ఒకానొక అర్థం తూనిగ లేక తుమ్మెద లేక చిన్నచిన్న ప్రాణుల రెక్కల కంపనం వల్ల వచ్చేశబ్దం. ఈగ లేక దోమ చెవిపక్కగా వెళ్తే వినవచ్చే శబ్దం బజ్‌జ్‌జ్...
గూగుల్ బజ్
అంటే
గూగుల్లో నీ గోల లేక కంపనం అనుకోవచ్చేమో.

కాబట్టాబ్బాయ్ గూగుల్ బజ్ అంటే గూగుల్ గోల అంటే గూ.గోల

మన సుబ్బులన్నట్టు,
గూగోల వచ్చినాక
కూసింత తగ్గింది బ్లాగోల.
బజ్‌లో బల్లే బల్లే సంగతులు వినిపిస్తున్నాయ్.
గీతాచార్య ఎక్కడున్నాడో ఏంచేస్తున్నాడో గోలడుతుంటాడు. మనోడి ప్రతీ బజ్‌కి తప్పనిసరిగా ఇద్దరు లైకర్స్ అనగా ఇష్టపడువారు ఉంటారు. ఒకరు సృజన, అబ్బే అందులో పెద్ద ఇషయం లేదు. కానీ ఇంకొరెవురూ? అంటే ధనరాజ్ మన్మథ.
ఇక రోజుకో బజ్‌తో గూబ గుయ్ మనిపించే బ్యాచి ఎవుర్దంటే మన కెలుకుడు బ్యాచీదే. నాగ తెగ బజ్‌తాడు. ఇక ఏండి డేండి రోజుకో బజ్. అప్పుడప్పుడు మురిపిస్తుంటాడు మన ఆర్.కె. భరద్వాజ ఎప్పుడన్నా ఓ బజ్జు. మొన్నీమధ్య బజ్‌యొక్క ఓర్పుని పరీక్షింపజేసాడు ప్రవీణ్. అప్పుడు బజ్‌లో కమెంట్ల సంఖ్యకై ఒక పరీక్షకి తెరలేపాడు మన భరద్వాజ. ఆ పరీక్షలో తేలిందేంటంటే ౫౦౦ కమెంట్లుమాత్రమే బజ్‌ తట్టుకోగలదు అని.
అప్పారావుశాస్త్రి అప్పుడప్పుడు మాంచి కెలుకుడుకి వేదికౌతాడు ఏదోక బజ్‌తో.
మన పవన్ బజ్ హాట్ హాట్ బజ్. ఒక బజ్ ‌కి వంద వ్యాఖ్యలు తప్పనిసరి.
మంచుపల్లకి తనదైన శైలిలో బజ్‌తుంటాడు. ఎక్కువగా సెగెట్రీమీద గూబలు గుయ్ మనిపిస్తుంటాడు. చదువరిగారు అప్పుడప్పుడూ కిస్క్ అంటుంటారు బజ్‌లో. అంటే ఒకలైను లేక రెండులైనులు అన్నమాట. ఇక
ఈ మధ్యకాలంలో నేస్తంగారి బజ్ బాగా హిట్టైంది. ఒక్కో బజ్జుకి బుజబుజలాడుతూ వంద వ్యాఖ్యలు కొట్టారు జనాలు. సారీ వీళ్ళని జనాలు అనకూడదు, తమ్ముళ్ళు సెల్లెళ్ళ బృందం అనాలు. రాజ్‌కుమార్, ఏరాజ్యానికీ రాజకుమారుడు కాదు, ఆర్యుడో ద్రావిడుడో కూడా తెలియకపోయినా, సెగెట్రీ పొజీషన్లోకి దూసుకొచ్చాడు. అదే, నేస్తంగారి తమ్ముళ్ళు సెల్లెళ్ళ సంఘానికి సెగెట్రి అన్నమాట. ఇక అప్పుడప్పుడూ మధురవాణిగారు మృదుమధురంగా తమ గాత్రాన్ని టపాలా అందిస్తుంటారు. మ.వా గారి ప్రతీటాపా ఓ హిట్టే.
మా అనుజుల బజ్జులు ప్రతీరోజూ ఏదోక విషయ వడ్దింపు ఉంటుంది. మా సోదరులు శ్రీ అక్కిరాజు ప్రసాద్ గారు కూడా ఓ బ్లాగరే. ఆయన బ్లాగు ఏ సంకలినిలోనూ కనిపించదు. వారి బ్లాగు పేరు *
అంతర్యామి* ఇదిగో లింకు http://prasad-akkiraju.blogspot.com

నా సోదరుడు తన ఛయాచిత్రగ్రాహక ప్రవాహాన్ని పంచుతుంటాడు. అదో మహాప్రవాహంలా అనిపిస్తూ ఉంటుంది.
ఛాయాచిత్రగ్రాహకం = కెమేరా.

ఇక నా గూ.గోల - చెప్పేదేముంది, ఏదోక టపా, వేస్తాను. నల్గురితో పంచుకోవాలనిపించిన ప్రతీది బజ్లో వేసేస్తా.


గూగుల్ మెయిల్ వాడకందారులారా, మీరూనూ బజ్‌ ఖాతా తెరిచి గూబలు గుయ్ మనేలా గోలచేయండి ఇక.

25 comments:

 1. ప్రవీణ్ బజ్ సహన పరీక్ష మేము కూడా వీక్షించితిమి :-)

  శ్రీ అక్కిరాజు ప్రసాద్ గారి బ్లాగ్ బావుంది. మంచి బ్లాగ్ ని పరిచయం చేశారు ధన్యవాదాలు.

  ReplyDelete
 2. అపర్ణ, శివరంజని, హరేక్రిష్ణ, సాయి ప్రవీణ్, నాగార్జునా ఎక్కడున్నా ఇక్కడకు రావల్సిందిగా మనవి. అప్పనంగా రాజ్‌కుమార్‌కి నేస్తంగారి అభిమాన సంఘసెగట్రీ పదవి ఇచ్చేస్తున్నారు. మీరు దీన్ని ఖండించాలి.

  రాజుగారు, వబ్లాస మీతో వంద కొట్టిస్తారు చూడండి రేపటికంతా.

  ReplyDelete
 3. Bhaskar Ramaraju garu
  Thank you very much for giving the excellent link
  amtaryaami.

  ReplyDelete
 4. >>>"అక్కడ కూడా ఓ కామెంటు పడేయండర్రా కుఱ్ఱ డా౨షుల్లారా - మనసులోమాట"

  డాష్ డాష్ డాష్! మేకు ఫెస్టివల్

  ReplyDelete
 5. బాగుందీ ! ఇదే మరి ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే :) కానీండి ఏమి చేస్తాం బజ్ లో వాళ్లకేమో బిర్యానీలు , బ్లాగుల్లో వాళ్లకేమో ఒక దోస ముక్కా !

  ReplyDelete
 6. శ్రీ అక్కిరాజు ప్రసాద్ అనే పేరు ఎక్కడో విన్నట్లుందే... హైదరాబాదు ఒరాకిల్ లో పని చేస్తున్నారా?

  ReplyDelete
 7. సుబ్బు :)
  బద్రి - యాడా?? మీ బృందం యాడా?
  వేణు బ్రదర్ :):) మీ బజ్ గురిమ్చి మరసితిని
  అనఘ - ఎలా ఉన్నారూ?
  గీతాచార్య - డాష్ డాష్ డాష్! మేకు ఫెస్టివల్
  మేకు?? ఏ మేకు క్యా హై?
  శ్రావ్యా - బిర్యానీ మీదాకా వచ్చిందా?
  రవిచంద్ర - అవును. ఒరాకిల్లోనే పనిచేస్తారు.

  ReplyDelete
 8. మేకు ఫెస్టివలనగా... make festival. అనగా ఆంధ్రమున పండుగ చేసుకోండీ అని

  ReplyDelete
 9. అయినా బ్రదరూ,

  నేనెక్కడున్నానో తప్ప వేరేమీ బజ్జటం లేదా? ఎంత అన్న్యాయంగా అన్నావు స్వామీ, మీసేత వం(డే)దేయించలేదూ!

  ReplyDelete
 10. I shd have married a Telgoo guy. Missing all the fun. :(


  Sir, mee clock lo Madhya Prachyam ante ok. Gartapuri ante emiti sir ?

  ReplyDelete
 11. బజ్ కి మీరు పెట్టిన తెలుగు పేరు భలేగా ఉంది. నిజమే! బజ్లో గోల ఎక్కువయ్యాక బ్లాగుల్లో కొంచెం తగ్గినట్టే అనిపిస్తోంది నాక్కూడా! నన్ను కూడా గుర్తు చేసుకున్నందుకు థాంక్యూ! :)

  ReplyDelete
 12. రాజుగారు కొద్దిగా లేట్ రాజు గారు నిన్న ఈ పోస్ట్ దాదాపు 3 సార్లు చదివించేసా మా ఆయనతో ఈ పోస్ట్ ..మరి నా పేరు రాసేసారుగా :P
  మరి సూరిగాడి పరకాయ ప్రవేశం అయితే చాలామంది చేత చదివింప చేసాను.. సూపరు

  ReplyDelete
 13. రాజు గారు, జాజిపూలులో కొత్త పోస్ట్ రాలేదని అందరు తీవ్రమైన నిరాశ నిస్పృహల్తో కొట్టుమిట్టాడుతూ బ్లాగుల వైపు రావడం లేదు.

  ReplyDelete
 14. >>>>అపర్ణ, శివరంజని, హరేక్రిష్ణ, సాయి ప్రవీణ్, నాగార్జునా ఎక్కడున్నా ఇక్కడకు రావల్సిందిగా మనవి. అప్పనంగా రాజ్‌కుమార్‌కి నేస్తంగారి అభిమాన సంఘసెగట్రీ పదవి ఇచ్చేస్తున్నారు. మీరు దీన్ని ఖండించాలి.<<<<<<<<

  బద్రి గారు ఎందుకు ఖండించడం????????
  జాజిపూలు బ్లాగ్ అభిమాన సంఘ కి సెగట్రీ కావాలంటే ఏ రాజ కుమారుడో కావాలి కదా అందుకే రాజ్ కుమార్ ని సెగట్రీ గా మేమందరం ఏకగ్రీవం గా నిలబెట్టాం... ఏమంటావు అపర్ణ

  ReplyDelete
 15. @శివరంజని
  ఏదో మీరు కొట్టుకుంటుంటే ఇక్కడొక వంద కామెంట్స్ రాల్తాయని అనుకుంటే, మీరు ఇలా ఒకటైపోతే ఎలా?

  ReplyDelete
 16. రంజనీ.. చాలా బాగా చెప్పావు..:) అయినా నువ్వు మాట ఇచ్చేయడమూ, నేను కాదనడమూనా..?:)))
  బద్రి గారు, 100 కామెంట్లు రాలాలంటే కొట్టుకోనవసరం లేదండీ.. పొగుడుకున్నా, జోకులు వేసుకున్నా చాలు..:))

  భాస్కర రామ రాజు గారు, టపా భలే ఉంది..:)

  జై జాజిపూలు సెగట్రీ కి జై..

  ReplyDelete
 17. >>"సెగట్రీ కావాలంటే ఏ రాజ కుమారుడో కావాలి కదా"

  రాజకుమారులు వంశ పారంపర్యంగా వచ్చే రాజ్యాల్ని ఏలాలి. సెగట్రీ పదవులకు వాళ్ళు అనర్హులు.. :-)))

  ReplyDelete
 18. అయ్యయ్యో.. అలాక్కాదండీ.. జాజిపూలు అభిమాన సంఘం అనే రాజ్యానికి మేమంతా కలిసి ఎన్నుకున్న రాజు, మన రాజ్‌కుమార్..:)))

  ReplyDelete
 19. రామ రాజా ఏమంటిరి ఏమంటిరి ?
  >>అప్పారావుశాస్త్రి అప్పుడప్పుడు మాంచి కెలుకుడుకి వేదికౌతాడు ఏదోక బజ్‌తో
  హెంత మాట హెంత మాట
  గూ.గోల లో నేను కేలకడమే కానీ కెలికించు కొనుట లేదయా
  తమరు జిమ్ము చిత్రాలు ప్రదర్శించినప్పుడు తెగ కేలికితినే అప్పుడే మరిచితిరా ?
  గూ.గోల లో నన్ను కేలికినవారు కనపడలేదయా ఇంతవరకూ

  ReplyDelete
 20. రాజు భాయ్... నాకేం పాపం తెల్వద్ ... నేను ఎవరి గూబలు గుయ్‌మనిపించడం లేదు. అదంతా ఈ కేడీ గ్యాంగ్ కుట్ర,

  రాజ్, జొ, అప్పు, రంజని, బద్రి
  అన్నన్నా... జాజిపూలు అభిమానం సంఘం పదవులు మీరు మీరు పంచేసుకుంటారా.. ఇక్కడ సీనియర్మోస్ట్ అభిమాని ఎప్పటినుండొ కర్చీఫ్ వేసుకు కూర్చుంటే పట్టించొకుండా మీరు మీరు పంచేసుకుంటే ఎట్టాగా... సరే... అధ్యక్ష పదవి వదిలేసి మిగతావి పంచుకొండి.

  ReplyDelete