సలికాలం మైలేజి తగ్గుద్దంటా అబ్బయ్యా. ఎందుకో? అనుకున్టన్నవా? కొన్ని కారణాలు ఇవిగో -
రోలింగ్ రెసిస్టన్స్ పెరగటం. Rolling resistance at 0 degrees F is 20% greater than at 80 degrees
స్లష్ స్నో లాంటి రోడ్డు కండీషన్స్ కూడా రోలింగ్ రెసిస్టెంమ్స్ లాంటివే. ఇవికూడా కారణభూతమౌతాయి.
ముఖ్యమైన కారణం లోయర్ ఏవరేజ్ ఇంజెన్ టెంపరేచర్. ఎందుకంటే చలికాలంలో ఇంజను ఆపరేషనల్ టెంపరేచర్‌కు చేరటానికి పట్టే సమయం ఎక్కువ. అంతేకాక ఆపినాక తొందరగా వేడిని కోల్పోతుంది కూడా. Since the engine management system orders up a richer mixture when cold (proportionately more fuel in the air/fuel combination), more fuel is being burned overall.
అంతేకాదు ఇంజను ఆయిల్ చలివల్ల జీబుకొంటుంది. జీబుకొనుట = థికెన్ కావటం. అంతేకాదు బేరింగుల గ్రీజు, ఇతరత్రా ద్రవాలు కూడా థికెన్ అవుతాయి. కాబట్టి ఎక్కువ ఎనర్జీ కావాల్సొస్తుంది ఈ థికెన్డ్ ద్రవాలతో బండిని గుంజటం. అంటే ఇంజెను ఎక్కువ తాగుతుంది ఆల్కాహాల్ని, తూచ్, కాదు గ్యాసుని. సింతటిక్ ఆయిల్స్ వాడినట్లైతే దీన్ని తగ్గించవచ్చు. నా కారుకి సింతటిక్ ఇంజన్ ఆయిల్ వాడతాను.
ఇక ఇవికాక, చలిప్రదేశాలకోసం సరఫరా చేసే గ్యాసు వేరేగా ఫార్ములైజ్ చేస్తారట better cold vaporization characteristics కోసం. అదికూడా మైలేజీని తగ్గిస్తుందట.
ఇక ఆ తర్వాతి విషయం, ఎలక్ట్రిక్ లోడ్. ఇదికూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. చలి ప్రదేశాల్లో డే లైట్ తక్కువ. కాబట్టి హెడ్లైట్ల వాడకం పెరుగుతుంది. హీటర్ వేస్కుంటాం. సైడ్ మిర్రర్స్ హీట్ చేస్తాం. ఎనక విండో హీటార్ వేస్తాం. ఇవన్నీ భారమే కదా. అంతేకాక చలి ప్రదేశాల్లో బ్యాటరీలు తొందరగా డిస్ఛార్జ్ అవుతాయట.
అంతేకాక మంచుపడిన రోజుల్లో కారు పైన పడిన స్నోని సరిగ్గా తొలగించనందువల్ల ఏరోడైనమిక్ డ్రాగ్ అనేది పెరుగుతుందట.
కాబట్టి అబ్బాయ్! చలికాలంలో, తీస్కోవాల్సిన జాగ్రత్తలు -
౧. టయర్లలో పీడనం సరిగ్గా ఉందోలేదో చూస్కోవాలి
౨. బయల్దేరే ముందు ఇంజన్ని వేడెక్కనిచ్చి అప్పుడు గ్యాస్ పెడల్ తొక్కాలి
౩. ఇంజెన్ స్టార్ట్ చేయంగనే హీటర్లు గట్రా వేస్కోవద్దు. ఇంజన్ హీటెక్కినాక వేస్కుంటే బెటర్
౪. ఎడపెడా యాక్సిలరేటర్ తొక్కకుండా నింపాదిగా తొక్కటం
౫. బ్రేకుల వాడకం తగ్గించుకోవడం
౬. ఫిల్టర్లను మార్చుకోవడం
ఇత్యాదివి మైలేజీని పెంచుతాయట.
స్నోలో అరగంట ప్రయాణం గంట పడుద్ది. అది గూడా చూడాల.
ReplyDeleteబాగున్నై విషయాలు. జీబుకొనుట మాట బావుంది. చిక్కనవుతుంది అనొచ్చు గదా. ఇంజను టెంపరేచరు సంగతి రోజుకి పది సార్లు ఆన్ చేసే విషయమైతే నిజమే కాని, ఒకటి రెండు సార్లు నడిపేదానికి అంత తేడా చూపించదు అనుకుంటా.
ReplyDeleteలక్కరాజు గారు చెప్పింది కూడా పాయింటే.
అయినా 23.3 నించి 22.6 అంటే - it is within the limits of experimental error :)
మీరు చెప్పిన జాగ్రత్తలు ఏకాలానికైనా వర్తిస్తాయండీ :)
ReplyDeleteచలికాలంలో ఇంజను కాస్త హీటె క్కాకే కదలాలన్నది ఒక అపోహ అని చదివాను మొన్నీమధ్య. నిజమేమిటో ఆ ఇంజను కెరుక.. :)
మైలేజీ మరీ అంత ఖచ్చితంగా ఎలా కొలవగాలిగారు? Just Curious...
రావు గారూ
ReplyDeleteనమస్తే. అవునవును. అదీ లో గేరులో.
అన్నగారూ
నమస్తే. జీబుకొనుట. నేను బ్రౌను నిఘంటువులో చూస్తే జీబుకొనుట అని ఉందె. అదే సరైన పదం అని వాడా౨ను.
ఉమా బ్రదర్
నమస్తే.
బొమ్మ పెట్టా చూడు పైన. నా కారులో సరాసరి మైలేజి మీటర్ ఉంది.
@ఉమాశంకర్ గారూ
ReplyDeleteఎవరన్నా experts మీకు సమాధానం చెప్తారనుకుని చూశాను. ఇది కొంచం ముఖ్యమయినది గనక నేనే చెపుతున్నాను. ఇంజను సరీగ్గా పని చెయ్యటం దాని ఆపరేటింగ్ ఉష్ణోగ్రత వద్ద. బయట -10 ఉంటె కొంత సేపు పడుతుంది. కొత్త కారు అయితే అన్నీ బాగా పని చేస్తయ్యి కాబట్టి స్టార్ట్ చేసి వెల్ల వచ్చు. కానీ పాత కార్లతో కొంచెము కష్టము. రోడ్డు మీద కారు ఆగిపోయి బాధ పడటం అనుభవించా కాబట్టి చెబుతున్నా.
భాస్కర్ గారు,
ReplyDeleteనా కారు పదకొండేళ్ళ పాతది. డేష్ బోర్డ్ లో సరాసరి మైలేజి చూపించే సూచీ లేదు. కానీ మీరు పెట్టిన బొమ్మ చూసాక గుర్తొచ్చింది, నేను అప్పుడప్పుడూ కార్లు అద్దెకు తీసుకున్నప్పుడు వాటిలో ఈ సూచీని చూసిన సంగతి. :)
రావు గారూ, ధాంక్స్ అండీ.స్వానుభవంతో చెప్తున్నారు కదా ఇక తిరుగేముంది?