Nov 10, 2010

పరకాయ ప్రవేశం

నాన్నా నేను ఇప్పుడు పెదనాన్నని.
సరేరా
[ఇంట్లోనే ఓ సివర్న నిల్చుని]
[చేయి చెవిదగ్గరపెట్టుకుని] ట్రింగ్ ట్రింగ్
అలో [నేను]
అలో ఏరా భాస్కర్ నెనే ఉమాశంకర్‌ని
అన్నయ్య చెప్పు
నేను మీఊరొచ్చాను మీ ఇంటికి దారి చెప్పు
ఎడంచేతివైపు తిరిగి కుడికితిరి గిరగిరాతిరిగి మూందుకిరా అక్కడే మా ఇల్లు
[నా దగ్గరకు వచ్చి]
టక్ టక్ టక్ [తలుపుకొట్టినట్టు]
క్లిచక్ [తలుపు తీసాను]
[ముఖంమీద నవ్వుతో]
ఏరా భాస్కర్ నేనేరా ఉమాశంకర్ మీ అన్నయ్యని
అన్నయ్యా బాగున్నావా
బాగున్నా, ఏంచేస్తున్నావ్
టివీ చూస్తున్నా
సూరిగాడేడి
బయటకెళ్ళాడు
పిల్లేది
అక్కడెక్కడో ఆడుతోంది
కార్తికేయ కూడా ఆడుతున్నాడు, కార్తికేయ దగ్గర కూడా చాలా బొమ్మలున్నాయ్. నేనే కొన్నాను బ్లబ్లబ్ల
[ఇంతలో]
నాన్నా
??
నేను సూర్యాని
అలాచెప్పు ఏంటి
నేనిప్పుడు పోస్ట్‌మా౨న్
ఎందుకలా?
ఉండు
టక్ టక్ [డోర్ మీద బాదుట]
హాయ్ సూర్యాకి ఈ డెలీవరి
ఏవిట్టా ఇవి?
తెలియదు, బాయ్
[తిరిగి సూర్యా ఎంట్రీ]
ఎరా
నేను సూర్యాని కాదు
మరి?
పెదనాన్నని
[నాయనో] చెప్పు అన్నయ్యా
ఈ డబ్బా నేనే పంపించా
ఏవిట్టా ఈ డబ్బా
సూర్యాకి టాయీస్, తీసి చూడు
కిచక్లక్మిక్స్ఫ్గ్ద్గ్ త్౫య్[డబ్బా ఓపెనింగ్]
అబ్బో చాలా బొమ్మలే ఉన్నాయే
అవును మొన్న కార్తికేయకి కొన్నా. అప్పుడు సూరిగాడిక్కూడా కొన్నాను.
[అంతలో మరో పరకాయ ప్రవేశం]
నాన్నా ఏంటీ ఈ డబ్బా
నాన్నా?
నేనిప్పుడు సూర్యాని
[కొట్టాడు దెబ్బ అనుకుని] ఇదిగోరా పెదనాన్న నీకో డబ్బా టాయ్స్ పంపించాడు
ఔను ఔను నాకు తెలుసు [టచక్ టిచక్/డబ్బా ఓపెన్ చేసాడు] అబ్బో చాలా ఉన్నాయి బొమ్మలు మొన్న కార్తికేయ దగ్గర చూసాను
నాన్నా నేనిప్పుడు కాశ్యప్ [మళ్ళీ మూలకి వెళ్ళి చెవిదగ్గర చేయి పెట్టుకుని] ట్రిం ట్రింగ్
అలో
బాబాయ్ నేను కాశ్యప్ ని
ఏరా కాశి బాగున్నావా
బాగున్నా బాబాయ్. సూరిగాడేడి.
ఆడుకుంటున్నాళ్ళేరా
అవునా బాబాయ్. మొన్న ఇండియాకి వచ్చినప్పుడు భలే గోల చేసాడు బాబాయ్.
ఔనారా
ఎక్కడ ఉంటున్నావురా ఇప్పుడు
లండన్లో బాబాయ్
మరి ఎలా వచ్చావ్
బైక్ మీద బాబాయ్, ఇలా వచ్చాను
[ఓ డెమో. థంసప్ ప్రకటనలో మహేష్ బాబులా ఊహించుకుంటూ ఓ పేద్ద డెమో]
[అంతలో]
నాన్నా
ఎవర్రానువ్వు అన్నయ్యవా కాశ్యప్వా లేక సూరిగాడివా
సూరిగాణ్ణి
చెప్పు
నేనిప్పుడు బామ్మని
సరే
[అలా మూలకి వెళ్ళి నా వైపు నడుస్తూ]
నాయనా ఎలా ఉన్నావూ
బాగున్నాను
పండ్లు తింటున్నావా
తింటున్నాను
అమ్మని నాన్నని ఏడిపించకుండా ఆడుకుంటున్నావా
న్నాను
నాన్నా
ఎవర్రా బామ్మవా సూరివా పెదనాన్నవా కాశ్యప్వా
సూరిగాణ్ణి
నేనిప్పుడు పెద్ద సూర్యని నాన్నా
పెద్ద సూర్యా అంటే
గ్రోన్‌అప్
అంటే
నాకు పాతికేళ్ళు
ఓహ్
[మళ్ళీ మూలకి, చేయి చెవి ఫోన్] ట్రింగ్ ట్రింగ్
అలో
నేనూ సూర్యాని, బైక్ నడుపుతున్నా అడ్రస్ చెప్పు వస్తా
అటుతిరిగి ఇటు తిరిగి రా
[వచ్చాడు, ముందు నిల్చున్నాడు, తలుపు కొట్టినట్టు యాక్షన్]
క్లికచ్ [తలుపుతీసా]
[ముసిముసి నవ్వుతో] నాన్నా నే ఒచ్చా
రారా, ఏంటి సంగతులు
ఏంలేవు, మా బుజ్జోడికి కడుపులో నొప్పి
బుజ్జోడా వాడెవడూ
నాకు మా౨రేజ్ అయ్యిందిగా ఇడిగో వీడే నా కొడుకు [ఓచిన్న బొమ్మని చుపిస్తూ]
ఓర్నీ పెళ్ళైందా అబ్బోరియబ్బా. ఏమైందంటా నీకొడుక్కి
అన్నం తినటంలేదు, పూప్ కి వెళ్ళటంలేదు, మంచీళ్ళు తాగటంలేదు, పెరుగన్నం తింటంలేదు. అందుకే కడుపులో నొప్పి.
మరేం చేద్దాం
డాక్ కి కాల్ చేద్దాం, నువ్వు ఇప్పుడు డాక్
సరే
ట్రింగ్ ట్రింగ్
అలో
అలో డాక్ చంద్ర
అవూను
నేను సూర్యాని మా అబ్బాయికి కడుపులో నొప్పి
సరే ఎత్తుకొచ్చేయ్
[కొంచెం యాక్షన్ ఎత్తుకెళ్ళినట్టు]
డాక్ [నేనే]
ఏమైంది మీ వాడికి
తినటంలేది తాగటంలేదు కడుపునొప్పి మంచీళ్ళు తాగట్లేదు పెరుగన్నం తినటంలేదు
అయ్యోపాపం ఎదో చూడని
[ఉత్తిత్తి స్టెత్ గాలితో చేసింది సెచిలో పెట్టుకుని బొమ్మ పిల్లాడిమీద పెట్టి]
గాలి పీల్చరా వదులు బోర్లా పడుకో యాటయాటయాట
మీవాడు పెరుగన్నం తినటంలేదు అందుకే ఈ గోల.
[అంతలో నేనూ నేనూ నాదీ బొమ్మ ఇచ్చేయ్ అని పిల్ల]
[చెల్లెమ్మా ఐతె నువ్వు నర్స్, ఇంజెక్షన్ చెయ్యి పిల్లాడికి అని సర్ది చెప్పుట]
ఇమ్జెగ్గ్ఫ్హ్గ్ఫ్హ్థ్ య్హ్య్హ్ర్త్యెర్ ఫ్ఘ్ర్త్ య్హ్ర్త్య్ ఎర్వ్ ఫ్ఘ్య్  [అంది పిల్ల, అని ఇచ్చేసింది బొమ్మని]
థ్యాంక్యు డాక్ [అని చెప్పి వాడు తిరిగి ఇంటికి వచ్చాడు]
నాన్నా డాక్ దగ్గరకి వెళ్ళొచ్చా
[నాన్నా? ఓహో నేను డాక్ నుండి నాన్నకి రూపాంతరం చెందాలా]
ఓహో ఏవన్నాడ్రా నాన్నా తూచ్ డాక్
ఇంజెక్షలు నాలుగు చేసాడు
[ఇంతలో వాళ్ళ అమ్మ బువ్వకి పిలిచింది. కన్ఫ్యూజన్‌తో నే ఈ టపాకి శ్రీకారం చుట్టాను]

8 comments:

 1. ROFL! SUrigADu maMchi kaLAkAruDE!! :)

  ReplyDelete
 2. మీవాడసలు కేక....చదువుతూ ఉండగా నాకే డౌటొచ్చేసిమి మీరు ఎవరు అని :D

  ReplyDelete
 3. ఏమికామెంటాలో అర్థంకాక మెంటలెక్కింది. దానవీరశూరకర్ణని తలదన్నాడు

  ReplyDelete
 4. హ హ చదువుతున్న నాకే దిమ్మతరిగి మైండ్ బ్లాంక్ ఐంది సూరిగాడిదెబ్బకి, ఇంక సీన్లో ఉన్న మీ సంగతి :-)

  ReplyDelete
 5. Sooribaabaa? majaakaa? inkenni chamakkulu daagunnaayoe?

  ReplyDelete
 6. హహ్హహా - దశావతారం సినిమా చూపించాడు కదండీ.

  ReplyDelete
 7. సూరిబాబు చేత మా వూర్లొ ఎండాకాలంలో డ్రామా వేయించాల్సిందే.

  ReplyDelete