Dec 27, 2010

భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

మన సంపదలను సాధ్యమైనంతవరకూ తురుష్కుడు తెల్లోడు కొల్లకొడితే, మిగిలిన అడుగు బొడుగు మన ప్రాంతీయ (దుర్) అభిమానులు తమ రాజకీయ స్వార్థం కోసం కొల్లగొట్టా౨రు, కొడుతున్నారు, కొడతారు.
ఉదాహరణకు -
భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్కృత మరియూ ప్రాకృత భాషా చేవ్రాత ప్రతులను సేకరించి భద్రపరచటంలో పేరు ప్రఖ్యాతులు పొందింది. వీరివద్ద కొన్ని వేల ప్రతులు సేకరింపబడి భద్రపరచబడ్డాయి.
ఐతే, రాజకీయావేశాలకు, ప్రాంతీయ తత్వానికీ చారిత్రాత్మకత ఆవశ్యకత అవసరం పట్టవు. ౨౦౦౩ డిశెంబరులో కొందరు మరాఠా ముష్కరులు విలువైన ప్రతులను దహనం చేసారు.

Vandalism in 2003

The institute was vandalized in December 2003 by a mob made up of members of an extremist self styled Maratha youth squad, calling themselves the Sambhaji Brigade, named after Shivaji's elder son. They claimed to be angered by the help provided by the institute's staff (in translating manuscripts) to a Western writer, Dr. James Laine, who discussed the telling and retelling of stories about Shivaji's parentage and life in his book on narrations of the Shivaji story.[5] The mob also *damaged thousands of manuscripts[6]* and attacked Shrikant Bahulkar, a Sanskrit scholar who had only explained some Sanskrit references to Laine.[7] The incident provoked widespread reaction[8] and historian Gajanan Mehendale to destroy parts of his in-progress biography of Shivaji.[9][10]

http://en.wikipedia.org/wiki/Bhandarkar_Oriental_Research_Institute

ఇలాంటి సంఘటనలు కోకొల్లలు మన దేశంలో. మహారాష్ట్రలోనే కాదు మన కళ్ళముందే ఎన్నో ఇలాంటివి జరుగుతుంటాయి. ప్రాంతీయ దురభిమానం కళ్ళకు గంతలు కట్టేస్తుంది. విలువైన మన సంస్కృతి అర్థంలేని ఆవేశంలో మట్టిపాలౌతోంది. రేపటి మన భవిష్యత్తుకి(ముందు తరాలకు) వారసత్వంలా అందించాల్సిన ఈ సంపదను కేవలం ఐదునిమిషాల ఆవేశానికి బలి ఇవ్వటం ఎంతవరకూ సబబూ?

మా పల్నాటిలోని కోటలు చాలా వరకూ నాశనం అయ్యాయి. కొన్ని భూస్తాపితం అయ్యాయి. కొన్ని కేవలం గోడలుగా మాత్రమే మిగిలి పొయ్యాయి. దోచుకోబడ్డాయి, దోపిడీ కాబడ్డాయి. శిధిలమైయ్యాయి. మహాభారతానికి దీటైన నిజ చరిత్ర కేవలం పుస్తకాలలో మిగిలింది. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన కారణంకాగా ప్రజలలో లోపించిన స్పృహ మరో కారణం.


జై హింద్