Nov 30, 2010

నల్లధనంపై అధ్యయనం!

నల్లధనంపై అధ్యయనం!
Click To See Full Photo దేశంలో నల్లధనం మొత్తం ఎంతుందో తేల్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది ఎలా పుడుతోంది, ఎంత ఉంది అన్నది అంచనా వేసేందుకు అధ్యయనం జరిపించాలని యోచిస్తోంది.

వార్నీ! ప్రణబ్ ముఖర్జీ, ఏందివయ్యా, ఎంత ఉంటే ఏంజేస్తా? ఎలా పుడుతోందీ అంటావా? నువ్వే ప్రశ్నించుకో సమాధానం వచ్చుద్ది. లేకుంటే ఏ యంపీని అడిగిన్యా ఎంఎల్యేని అడిగిన్యా కాదూ వద్దూ లేదూ అంటే వార్డ్ కౌన్సిలర్ని అడిగినా సెప్యాడుగ్యా.

* నల్లధనం ఎలా పుడుతోంది?
* భారత్‌లో ఎంతుంది?
* విదేశాల్లో ఎంత మొత్తం దాచారు?
* దేశంలో నల్లధనం పుట్టుకకు దోహదం చేస్తున్న ప్రధాన రంగాలేవి?
* ఈ సొమ్ముతో దేశ భద్రతకు ఎదురవుతున్న ముప్పు ఏమిటి?
* దేశంలో, విదేశాల్లో మనీ ల్యాండరింగ్‌కు నల్లధనం కారణమవుతోందా?
* లెక్కాపత్రం లేని డబ్బు ఆర్జనకు ఎలాంటి పద్ధతులు అనుసరిస్తున్నారు?
* దీనిని చెలామణిలోకి ఎలా తెస్తున్నారు?
* నల్లధనాన్ని గుర్తించడానికి ఉన్న మార్గాలేంటి?
* ఈ సొమ్ముపై పన్నులు వేయడం ఎలా?

ఎవురైనా ఈటికి సమాధానాలు సెప్పగల్రా?

3 comments:

  1. అన్నిటికీ ఒక్కటే సమాధానం
    ముందు "మా దేశ" ( మీరు విదేశీయులు కదా ) కరెన్సీ ని మార్చాలి
    కొత్త నోట్లు ప్రవేశ పెట్టాలి (అన్ని నోట్ల మీద సోనియమ్మా బొమ్మ ఉండాలి )
    కార్డు లు వినియోగం ఎక్కువ అవ్వాలి
    వెటకారం గా రాసినా యమా సీరియస్సు ఆన్సర్ ఇది

    ReplyDelete
  2. ఓ పదేళ్ళకో ఇరవయ్యేళ్ళకో రెండుకోట్ల పేపర్లతో నివేదిక ఇస్తారు.దాన్ని చదవలేక ప్రక్కన పడేస్తాం ఇంతే సంగతులు ఇట్లు చిత్తగించవలెను,నల్లధనమేమో స్విస్సు బ్యాంకులకి మనమేమో ఈడే.

    ReplyDelete
  3. ఎందుకొచ్చిన అధ్యయనాలు ?టైం వేస్టె తప్ప ఏమి ఒరగదు

    ReplyDelete