Dec 20, 2010

హిందూ తీవ్రవాదం ప్రమాదకరం - రాహుల్‌

హిందూ తీవ్రవాదం ప్రమాదకరం
ఉగ్రవాదం కన్నా దానితోనే దేశానికి ఎక్కువ ముప్పు
అమెరికా రాయబారితో రాహుల్‌ వ్యాఖ్యలు
వెల్లడించిన వికీలీక్స్‌
భారత్‌ పట్ల అవగాహన లేని అజ్ఞాని
భాజపా, ఆరెస్సెస్‌ ఆగ్రహం
వివరణ ఇచ్చిన కాంగ్రెస్‌
న్యూఢిల్లీ: లష్కరేతోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకన్నా అతివాద హిందూసంస్థలే భారత్‌కు ఎక్కువ ప్రమాదకరమని కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ అభిప్రాయపడినట్లుగా అమెరికా అధికారపత్రం ఒకటి వెల్లడించింది. వికీలీక్స్‌ బయటపెట్టిన లక్షలాది అమెరికా రహస్య విదేశాంగ పత్రాల్లో ఇది కూడా ఉంది. గత ఏడాది జులైలో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్‌ గౌరవార్థం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏర్పాటు చేసిన విందు సందర్భంగా రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పత్రం తెలిపింది. విందులో తన పక్కనే కూర్చున్న అమెరికా రాయబారి తిమోతి రోమర్‌తో రాహుల్‌.. దేశంలోని రాజకీయ, సామాజిక అంశాలతోపాటు ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌ మరో ఐదేళ్లలో దృష్టి సారించిన ప్రధాన అంశాలపైనా చర్చించారని పేర్కొంది. లష్కరేతోయిబా కార్యకలాపాలపై రోమర్‌ ప్రశ్నించినప్పుడు.. 'భారత్‌లోని కొందరు ముస్లింలు కూడా ఆ సంస్థకు మద్దతిస్తున్నారు. అయితే, మతఘర్షణలు పెంచుతూ, ముస్లింలపై రాజకీయ దాడులు చేస్తున్న అతివాద హిందూ సంస్థల పెరుగుదలే దానికన్నా మించిన ప్రమాదం' అని రాహుల్‌ చెప్పారు.

సగం కిరస్థానీ సగం పార్సీ అయిన ఓ మేధావీ, నీకు దేశం దాసోహం అంటోంది. నువ్వే మాకు మార్గదర్శకుడివీ అంటోంది. రాజావారి మాటలు కొందరు కుత్తేలకు, అరుంధతీ రాయిలకు సమ్మగా వినసొంపుగా అనిపించవచ్చు.


కుట్ర ఉండవచ్చన్న కాంగ్రెస్‌
రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగటంతో కాంగ్రెస్‌ వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేసింది. ఉగ్రవాదం, మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా దేశానికి ప్రమాదమేనని, వాటిపట్ల అప్రమత్తతతో వ్యవహరించాలన్నదే రాహుల్‌గాంధీ అభిప్రాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ ద్వివేదీ పేర్కొన్నారు. వికీలీక్స్‌ వెల్లడి వెనుక ఏమైనా కుట్ర ఉందా అన్న అనుమానాలున్నాయని, సత్యాసత్యాలు నిగ్గు తేల్చే ప్రయత్నాలు చేస్తామన్నారు.

కుట్ర ఉంది వికీలీక్సులో కాదురా రాజకీయ దురహంకారీ. కుట్ర ఉన్నది నీ మనసులో, వెన్నెముకలేని నీ రాజకీయ స్వార్థపు విధేయతలో, కుట్ర ఉన్నది ఏంచేసైనా మళ్ళీ ఎలక్షన్లు గెలవాలనే సంకుచిత ఆలోచనలో.

1 comment:

  1. ముత్తాత = హిందూ
    తాత = ముస్లిం
    నాన్న = క్రీస్టియన్
    సర్వ మత సమ్మేళనం

    ReplyDelete