Oct 1, 2009

జ్ఞాపకాల దొంతర - వ్యాపార అవకాశాలు ఓ మూడు కధలు

ఆ రోజుల్లో ....
కధ వన్ -
మేము తోటల మహానగరం, గదేన్వయా, బంగళూరులో ప్రాజెక్టు వర్కు ఎలగబెట్టేవాళ్ళం.
జెపినగర ఫేజ్ ఒకటి లో ఉండేవాళ్ళం. మాంచి రంజు పసందైన పేట అది. మా అపార్టుమెంటు కిరికిటీ తీస్తే యస్.యస్.యం.ఆర్.వి కళాశాల. రంగురంగులు. అహా ఓహోలు.
అలా ప్రాజెక్టువర్కుని సాగదీస్తూ సాయంత్రాలు గోలచేస్తూ వచ్చేపొయ్యే జనాలను గెలుకుతూ వీళ్ళేవరండీ బాబూ అని అనిపించుకుంటు ఉన్నరోజుల్లో ఓ పెద్దాయన ఓ రోజు మమ్మల్ని ఆపాడు.
"అబ్బాయిలూ ఏందీ కత" అన్నాడు
"అబ్బే ఏంలేదు మాదీఊరుకాదు" అన్నాం
"ఐతే ఓకే మరీమంచిది ఓ పలి మా ఇంటికి రండా, మాట్టాడాల" అన్నాడు.
ఏందిరో నాయనో అసలే ఊరుకాని ఊరు
పేటకానిపేట
ఇల్లుకాని ఇల్లు
స్థానబలం నేదు
పిలిత్తే పలికే నాధుడే లేడు వచ్చి నాలుగుతికేవాడేగాని అనుకున్నాం
ఎవురన్నా కంప్లైంటుజేసిన్త్రారా మనమీన అనుకున్నాం
జెస్తే ఎవత్తె జేసుండాచ్చూ అనుకున్నాం
ఏదైతే అదైంది. మనం గుంటూరోళ్ళం నాయ్యాల్ది జైహో అనుకున్నాం
ఎళ్ళాం. లోన ఓ పదిమంది కూకోనున్నారు. రెండు పిల్లిగడ్డాలు ఒకటి తెల్లది ఇంకోటి నల్లది. రెండు బోడిగుండ్లు ఒకటి తెల్లది ఇంకోటి నల్లది. ఓ పెద్డాయన ఓ సిన్నాయన ఒకడు నలుపు ఇంకోడు తెలుపు.
ఓ బోర్డు పెన్నులు, మార్కర్లు ఒకటి తెల్లది ఇంకోటినల్లది. హడావిడిగా ఉంది. దీనెక్క మనమీన ఎవురూ కంప్లైంటుజెయ్యలా అనుకుని లోనకి అడుగేసినం. అందరు సేతులు సేతులు పట్టుకుని లాక్కున్నరు.
ఇక ఓ తెల్ల పిల్లిగడ్దం ఏదో మొదలెట్టాడు. ఇంగిల్పీస్ లో తెగసెప్తున్నడు. బొమ్మలు గీస్తున్నాదు. మనకి ఇంగిల్పీస్లో కొంచెం ఈక్ [రహస్యం].
అర్ధంగాలే, సమఝ్గాలే. మాటల మధ్యలో ఎదో ఆడిగారు నన్ను. అహ, ఇహి, ఉహు అన్నా. సరే సరే అని మా దోశ్తుని అడిగారు వాడూ భాషమార్చి అహ ఇహి ఉహు అన్నాడు. అంతే వాళ్ళు మమ్మల్ని లెక్కలోకేసేస్కున్నారు. చివరికి ఉండబట్టలేక అడిగా మావా ఏందిరా ఈ గోల. కాపీ ఇచ్చారు, స్పీటుపెట్టారు అసలేంది కత అని?
సరే క్లుప్తంగా సెప్తా ఇనుకో అని ఆంవే అని, ఒక్కోడు ముగ్గుర్నో నలుగునో జేర్చాల అని, ఆళ్ళు ఒక్కోళ్ళు ముగ్గుర్ని జేర్పించాల అని ఏందో సెప్పకొచ్చాడు.
మేము పారిపోయివచ్చేసాం. ఒకడు బుక్కు. అది వేరే సంగతి.....

కధ రెండు -
రగతం మరిగే రోజుల్లో
మనమా ఓడికింద పనిసేయటమా అనుకునే రోజుల్లో
ఆదివారం పనిసెయ్యాలి లేకుంటే పీకేస్తాం అంటే ఏందిరా నువ్వుపీకేది, నేనే పీకేస్కుంటా అని లేచిఎళ్ళిపోయిన రోజుల్లో
జావా ప్రాజెక్టు అయ్యింది జెరెండుఈఈ ప్రాజెక్టుకి వెళ్ళు, ఈ పరీక్షరాయాలి ఐతే అంటే పోబే నేరాయ, ఇదినాకు అవమానం అనేసి పారెళ్ళొచ్చిన రోజుల్లో
యండిగాడిపెళ్ళాంతో డ్యాన్సుచెయ్యబోతే ఉద్యోగం ఊడబీకుచ్చుకుని రోడ్డునపడిన రోజుల్లో
కనిపించిన ప్రతీ బిజినెస్సూ సేసేద్దాం దానెక్క అని కాలుదువ్వేరోజుల్లో
డేటాఎంట్రీ వ్యాపారం రంజుగా సాగుతున్నరోజుల్లో
డేటాఎంట్రీలో పాతికలచ్చలు పోగొట్టుకుని నెత్తిన తెల్లగుడ్డేస్కుని ఇంకో పాతిక ముఫై యాణ్ణుంచైన ఎత్తుకొచ్చి మళ్ళీ వ్యాపారం మొదలెట్టాల అనుకునే రోజుల్లో హైద్ లో కేఫుల్లో కూకొని డెగిశాలు డేగిశాలు చాయ తాగుతూ పిరంగులు ఊత్తూ ఏదో సేసేయ్యాల అని రగిలిపోతూ ఊగిపోతూన్న రోజుల్లో
ఒకానొక రోజున పేపర్లో ఓ ప్రకటన
బ్రహ్మాండమైన వ్యాపారావకాశం. మీరు సొతంత్రభావాలు కలవారా? కలలు కంటారా? ఇరానీకేపులో చాయ తాగుతారా? ఫిరంగులు కాలుస్తారా? మీది గుంటూరా? బ్రాడీపేటా? ఐతే మాదగ్గర మీకోశం కలలోకూడా ఊహించని వ్యాపారావకాశం ఉంది, ఎమ్మటే వచ్చేయండేం. ఇదిగో పలానాసోట.
నాయాల్ది మనకోసమే ఎలా పడిందిరా అన్నాడొకడు. మనది గుంటూరని ఆళ్ళకెట్టా తెలుసుబావా అన్నాడింకోడు. మనది బ్రాడీపేట అని ఎట్టా పట్టేసార్రా అని అన్నాడింకోడు...
సరే ఆ రోజు రానే వొచ్చింది.
ఓ నాలుగు ట్రాక్టర్లు, రెండు లారీలు, పది సుమోలేస్కుని ఎళ్ళాం ఆడికి. అదో సినిమా హాలు.
లోనకి అడుగెట్టాం. కేకలు ఈలలు అరుపులు. కూకున్నాం.
స్క్రీన్ ముంగట నలుగురు నిల్చోని మైకులు పట్టుకుని నడిపిస్తున్నారు కార్యక్రమాన్ని. కూకున్న జనాలు మహా జోశ్ మీదున్నారు.
"మనం హైదరబాద్ లో ఉన్నాం"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మనం మనుషులం"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మనం"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మ"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు

ఎదోతేడాగా అనిపించింది.
ఇంతలో ఓ బండది ముందుకి దూకి తెరకాడికొచ్చింది.
ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"నువ్వు సిద్ధమా"
ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"ఔను"
ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు

సమఝ్గాలే!! మనకు సమఝ్గాలే. అప్పుడు కిందకి పడింది చూపు.
లూజ్ వెయిట్, ఆస్క్ మి హౌ. హెర్బల్ ప్రాడక్ట్స్.
సీన్ కట్ చేస్తే మేము మా లారీలు ట్రాక్టర్లు సుమోలు గాయబ్...అక్కణ్నుంచి పరుగో పరుగు.

కధ మూడు -
ట్రింగ్ ట్రింగ్.
"మాఁమా!!"
"ఏరా ఏంసంగతి"
"అంతా మంచేనా"
"మంచేలేరా సంగతిజెప్పు"
"మవా మీఊళ్ళో ఓ మీటింగు ఉందిరా. మా వాళ్ళు అరేంఝి జేస్తున్నరు"
"ఎవుర్రా మీవాళ్ళు"
"అయన్నీ తర్వాతజెప్తా. నువ్వు ఎల్లితీరాల."
"అట్టకాదురా కర్త కర్మ క్రియ సెప్పకుండా ఎట్టారా"
"ఆడికిబో మావా అన్నీ తెలుసుకొస్తై"
"ఏం కంపెనీరా అది"
"మావా నేనేమిజెప్ప, తప్పుజెప్తానేమో అని భయం. ఆడికిబో ఆళ్ళే జెప్తారు"
"సరే"
"ఇవిగో ఇవరాలు"

సీన్ కట్ జేస్తే
హాలిడే ఇన్, లేతం, న్యూ యార్క్ -
హడావిడి. లోనకిపోంగనే ఓ ఇద్దరు కుర్రాళ్ళు మనోళ్ళె సూటూబూటు.
"హిహిహి రండి రండి రండి"
"నేను మికు తెలుసా?"
"దాందేముంది తెలుసుకుంటే అదే తెలుసుద్ది ఇంతకీ మీటింక్కేగా ఒచ్చింది అటు అటు వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే అక్కడ. ఎళ్ళండి"
సమఝ్గాలే ఎడంకన్ను ఎగిరెగిరిపడతా ఉంది
లోనకెళ్ళినా
మళ్ళి అవే అరుపులు కేకలు ఐతే సూట్లు బూట్లు అత్తరులు సంపంగులు
"మనం అందరం ఒకే ఇది"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మనం ఓ కమ్యూనిటీ"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మీరందరూ ఫైర్ అప్ప్ అయిఉన్నరా"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మళ్ళీ"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మళ్ళీ"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"ఎక్సైట్ అయ్యిఉన్నారా"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"కొత్తగా వచ్చిన వాళ్ళకోసం"
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"ఉండండి ఉండండి."
ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు
"మీరు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు"
నన్ను- "ఎనిమిది"
"నువ్వెప్పుడైనా ఊహించావా గంటకి కొన్ని వందల మ్యాన్ అవర్స్ ని?"
"యా కార్యాలయంలో "
"అదే నీ జీవితంలో జరిగితే"
"బొంగు"
"నీకు రెసిడ్యువల్ ఇన్కం అంటే ఇంటరెస్టా? ఓ గంటకి నీతోపాటు కొన్ని వందలమంది పనిచేస్తే ఎలా ఉంటుందో ఊహించావా?"
"సంగతేంది."
"నువ్వు చేరు, ముగ్గుర్ని చేర్పించు. ఆళ్ళు ఒక్కోళ్ళు ముగ్గురిన్ చేర్పిస్తారు. యాట యాట యాట."
"ఇదేం కంపెనీ?"
"క్విక్స్టర్"
మనం మాయం.

11 comments:

 1. బ్రహ్మాండమైన వ్యాపారావకాశం. మీరు సొతంత్రభావాలు కలవారా? కలలు కంటారా? ఇరానీకేపులో చాయ తాగుతారా? ఫిరంగులు కాలుస్తారా? మీది గుంటూరా? బ్రాడీపేటా? ఐతే మాదగ్గర మీకోశం కలలోకూడా ఊహించని వ్యాపారావకాశం ఉంది, ఎమ్మటే వచ్చేయండేం. ఇదిగో పలానాసోట.
  నాయాల్ది మనకోసమే ఎలా పడిందిరా అన్నాడొకడు. మనది గుంటూరని ఆళ్ళకెట్టా తెలుసుబావా అన్నాడింకోడు. మనది బ్రాడీపేట అని ఎట్టా పట్టేసార్రా అని అన్నాడింకోడు...
  సరే ఆ రోజు రానే వొచ్చింది.
  ఓ నాలుగు ట్రాక్టర్లు, రెండు లారీలు, పది సుమోలేస్కుని ఎళ్ళాం ఆడికి. అదో సినిమా హాలు.
  >>>

  super !

  ReplyDelete
 2. perfect!! ivi kuda vyaparalee ..
  malli veetiloo kuda scamlu gandara golam ..
  desam lo uppapudu goldstar oo goldcoin lo murali mohan gari company ... tega dabbulu chesukoni udayinchindi ani vinna ...

  ayna vallani kadu manalini manee anukovali .. verrimokalam :) :P

  [no offenses]

  ReplyDelete
 3. మరే వీళ్ళ పుణ్యమా అని అప్పట్లో గుడి వాల్‍మార్ట్ లాటి చోట్ల కొత్త వాళ్ళని పలకరిస్తే అనుమానంగా చూసే వాళ్ళు :-)

  ReplyDelete
 4. సూపరన్న నీ స్టైల్ అదిరింది ...

  ReplyDelete
 5. వేషమూ మారెను..
  భాషయూ మారెను..
  అయినా....

  ReplyDelete
 6. ఔను ఈహా హాహహా ఓహో చప్పట్లు అరుపులు కేకలు

  ReplyDelete
 7. రెండో కతలో లేను కానీ, మీ మొదటి, మూడో కతల్లో నేను కూడా బుక్కైపోయా... :(

  ఒకటి ఏంవే, రెండు కంట్రీ క్లబ్ :(

  (ఘొల్లు...............)

  నాకు నా నష్టాలని గుర్తు చేసారు. మీ మీద కేసేత్తా....

  ReplyDelete
 8. హహహ!!!
  >>మీది గుంటూరా? బ్రాడీపేటా? >>
  వాళ్ళకి భలే తెలిసిపోయిందే??--సరదాకి.
  ఎక్కడా బుక్ కాలేదుకానీ, ఆంవే, క్విక్ స్టారు, ఇంకేదో ఇన్సూరెన్సు కంపనీ, మా క్కూడా అనుభవమే ఈ బాధలు.మీ స్టైలు మాత్రం యునీక్.

  ReplyDelete
 9. అన్నాయ్! నేను మొదటి సారే దారుణంగా "Gold Quest" కి దొరికిపోయాను. భగవంతుడి దయవల్ల నా తరపున ఎవడిని చేర్పించల :) బృహఃస్పతి గారు చెప్పినట్టు నష్టాలను గుర్తు చేసినావ్. చెట్టు కింద ప్లీడర్ని రెడీ చేసుకో!

  ReplyDelete
 10. >>రగతం మరిగే రోజుల్లో
  మనమా ఓడికింద పనిసేయటమా అనుకునే రోజుల్లో
  ఆదివారం పనిసెయ్యాలి లేకుంటే పీకేస్తాం అంటే ఏందిరా నువ్వుపీకేది, నేనే పీకేస్కుంటా అని లేచిఎళ్ళిపోయిన రోజుల్లో
  జావా ప్రాజెక్టు అయ్యింది జెరెండుఈఈ ప్రాజెక్టుకి వెళ్ళు, ఈ పరీక్షరాయాలి ఐతే అంటే పోబే నేరాయ, ఇదినాకు అవమానం అనేసి పారెళ్ళొచ్చిన రోజుల్లో
  యండిగాడిపెళ్ళాంతో డ్యాన్సుచెయ్యబోతే ఉద్యోగం ఊడబీకుచ్చుకుని రోడ్డునపడిన రోజుల్లో
  కనిపించిన ప్రతీ బిజినెస్సూ సేసేద్దాం దానెక్క అని కాలుదువ్వేరోజుల్లో

  ఆహా ఏం చెప్పారు అన్నయ్యా, కెవ్వ్ కేక :)

  ReplyDelete
 11. నాకు చిన్నప్పుడు 6వ తరగతి చదువుతుండగా మనం 100 రూపాయలు కట్టాల, ముగ్గురి చేత 100 కట్టించాల. అప్పుడు మనకి ఒక వాచీ ముగ్గురు కట్టిన 100 లో 30 చొప్పున తొంబై వస్తాయని మొదలెట్టారు ఈ వ్యాపారాలు.
  తర్వాత్ ఏమ్‌వేలు,గోల్డ్ క్వెస్ట్‌లు చాలా వచ్చాయి.

  అన్నింటినుండి తప్పించుకున్న నేను, టి.ఎల్.సి. అనే ఒక దిక్కుమాలిన భీమా ఏజన్సీ వాడి దగ్గర బజాజ్ ఎలియన్స్ భీమాలో మాత్రం బుట్టలో పడ్డా. కాకపోతే సంపాదించేద్దామని కాక మా అక్క దూకింది తనని కాపాడటానికి నేనూ దూకి చేతులు కాల్చుకున్నా.

  ReplyDelete