Oct 13, 2009

రాయుచ్చుక్కొడతా!!

ఈ మధ్య ప్రతీదానికీ ఏదోటి చేసేయటం ఫ్యాషన్ అయ్యింది.

పెన్షన్ అందట్లేదు, లేక ప్రభుత్వ ఉద్యోగి ఆర్జీ అందుకోట్లేదు..సంబంధిత మంత్రి పత్రికా ముఖాముఖీకి వెళ్ళు చెప్పులిసురు.
ఇంట్లో మట్టివాసనేస్తోంది, నీళ్ల గొట్టాలు తుప్పుపట్టినై, ఏదోక పత్రికా ముఖాముఖీకి వెళ్ళు ఏదోటి చెయ్యి.
లేకపోతే కనీసం ఓ బస్సునన్నా పగల్నూకటం. పొయ్యేదేముంది బస్సుతప్ప!!

ఓ వైపు జలం ప్రళయం ఇంకోవైపు జనం ప్రళయం
సందట్లో సడేమియా జగన్ని ముఖ్యమంత్రిన్జేయండి.

ఇంకోవైపు కెసీఆర్ పొన్నాలపై సవాళ్ళు
పొన్నాల ప్రతి సవాళ్ళు
దానికి కాంగ్రేస్ - "కెసిఆర్ తాగుబో[తు]టు[ఆబోటెక్కినోళ్ళందరికి ఓ సుక్క పోస్తాట్ట], అందుకే తూలిపడ్డాడు"
దీనికి టిఆరెస్ - "రాశేరె సచ్చినాక కాంగ్రేసోళ్ళకు పిచ్చెక్కింది"

ఇయి ఇంటా జనాలకి పిచ్చెక్కే స్టేజి వచ్చింది. ఈళ్ళెమ్మ ఈళ్ళనెట్టా గెలిపించాంరా బగమంతుడా అని తలకాయలు గోడలకేసి నూక్కుంటాఉన్నారు జనాలు.

ఇంతలో ఎవుడో గన్నారావు [జూపూడి ప్రభాకర్] వై.యస్.ఆర్ ని పెల్చేసారా? లేకపోతే శవాలు అట్టా సెల్లాసెదురుగా ఎలా పడిపోతాయ్? ఎవురో ఆ హెలీకాప్టర్ ని *ఆ రెండు* కొండల మద్దిన పేల్చేసారు. దీనిపైన ఓ ఇరవైరెండు ప్రశ్నలు రాసుకొచ్చాట్ట గన్నారావ్ [జూపూడి ప్రభాకర్], సిబీఐ క్కూడా ఇచ్చాట్ట.

నేనూ ఓ పాతిక ప్రశ్నలు రాసుకొస్తా!!

ఇంతలో మన ముక్యమంత్రిగారు కర్నూలు ఎళ్ళనే ఎళ్ళారు, ఆ!! జగను మరియూ బృందానికి ఇయ్యన్ని యాడ గుర్తుంటైలే, మరి వరదలొచ్చి అన్నీ తుడిసిపెట్టుకొపాలా [జగన్ సియం కావాలా! అనే డిమ్యాండు] అనుకున్నాడు పాపం రోతయ్య [పాపము శమించుగాక] అర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ రోశయ్య. అలా ఎళ్ళాడు, ఇలా రాళ్ళేసారు కొందరు. పాపం పెద్దముండావాడు ఒగ్గేయ్యండర్రా!!!

6 comments:

  1. మీరు కొంచం వెనుకబడ్డారు.. కర్నూల్లో రోశయ్య సోఫా కింద పాము.. ఒకవేళ పాము కరిచి రోశయ్య చనిపోయి ఉంటే రాష్ట్రానికి యెంత చెడ్డ పేరు వచ్చి ఉండేదో అని చంద్రబాబు ఆవేదన... ఇవి మీరు రాసిన వాటికన్నా తాజా వార్తలు...

    ReplyDelete
  2. నిన్న చూసా మురళి బ్రదర్...కుర్చీ కింద పాము. ఆయన లేచి ఎళ్ళిపోయినక సెక్యూరిటి సిబ్బంది వెతికారట [అది తెచ్చిపెట్టిన పాములోడికి తిరిగి ఇచ్చేద్దాం అని] కానీ దొరకలేదట.

    ReplyDelete