Oct 2, 2009

వరదలు - అరవైఏళ్ళ దేశ చరిత్ర - ఏంలాభం?

బాబు హైదరబాద్ *అభివృద్ధి*లో గడిపేసాడు.
దివంగత రా.శే.రె ఆనకట్టలు కడదాం అన్నాడు మొదలెట్టాడు. [కొన్ని ఇప్పుడు కొట్టుకుపొయ్యాయి. కొన్ని పోతాయి. కొన్నిటి ఆనవాళ్ళుకుడా దొరక్కపోవచ్చు రేపటికి]

మొదట - ఇంతనీరు వృధా
రెండు - ఆపత్తు, దానికి ముందే సమాయత్తమయ్యే మేనేజిమెంటు, మేనేజిమెంటు ఫోర్స్, ఇంప్లిమెంటేషన్ ఫోర్స్, నిబద్ధత, సరైన డైరెక్షన్
మూడు - ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెడ్. స్టాటిస్టిక్స్, మనం ఎక్కడ? ఏంకావాలి?
నాలుగు - డిజాస్టర్ రికవరి, డిజాస్టర్ ప్లాన్స్
ఐదు - ఫ్యూచర్ గోల్స్
ఆరు - ప్లాన్స్ విత్ రిస్క్ ఎసెస్మెంట్స్ ఫర్ ఫ్యూచర్ గోల్స్.
అరవైఏళ్ళ స్వతంత్రభారతం!! పైవాటికి సమాధానాలు లేవు, ఉండవు. మనదంతా యాడ్-హాక్. ఓ వాన పడితే అతలాకుతలం. ఓ వైపు పెరుగుతున్న అప్పులు. ఇంకోవైపు ప్రపంచ పట్టీకలలో ప్రతీ దాంట్లో అట్టడుగు స్థానం.

ఇప్పుడేంటి? -

కృష్ణానది ఉగ్రరూపం. గడచిన రెండొందల సమచ్చారలలో ఇంత ఉధృతి ఎప్పుడూ రాలేదని వార్త.

చదువరి గారి టపా పోటెత్తిన కృష్ణ -ప్రమాదంలో రాష్ట్రం
నా వ్యాఖ్య -
కర్నూలు, మహబూబ్ నగర్, తెలంగాణ వైపు వరద ఉధృతంగా ఉందని విన్నా.
శ్రీశైలం డ్యాం పైనుండి నీళ్ళు ప్రవహిస్తున్నాయి అని వార్త.
డ్యం కి ఏమైనా ప్రమాదమా?
సాగర్ కి ఏమైనా ముప్పుందా? విజయవాడకి ఏమైనా ముప్పు ఉండొచ్చా?



చేతులెత్తేసిన ప్రభుత్వం!! అంతకన్నా ఇంకేంచేయగలదూ? ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే పరీస్థితి. ప్రకృతికి ప్రభుత్వం ఎవరిదీ అనేది పట్టదు కాని, ఓరి సన్నాసుల్లారా ముందుగానే సమాయత్తం కాండిరా అనిమాత్రం సంకేతాలు పంపుతుంది. వాతావరణ శాఖ తమ బూజుపట్టిన వ్యవస్థను ఒక్కసారి కదిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నా నమ్మకం.
ఇది ప్రభుత్వ చేతగానితనం కన్నా, ప్రభుత్వ *పాలనా వ్యవస్థల అట్టర్ ఫైల్యూర్*
ఐతే - ప్రమంచంలో ఏమూలకెళ్ళినా కంప్యూటర్ రిలేటెడ్ ఉద్యోగాల్లో మనోళ్ళని కనీసం ఒక్కళ్ళనైనా చూస్తాం. ప్రపంచదేశాలకు సేవలు అందిస్తున్నాం. మనకి మనం సేవలు ఎప్పటికి అందించుకుంటాం? అలా అందించినా స్వీకరించే స్థాయిలోకి ప్రభుత్వాలు ఎప్పటికి వస్తాయి?




శశాంక్ రాసిన పోస్టు -
కృష్ణమ్మ కొంచం కోపం తగ్గించుకోమ్మ..
http://aakasam.blogspot.com/2009/10/blog-post.html



పోయినేడాది, గాంధీజయంతి సందర్భంగా నే రాసిన పోస్టు -
గాంధి ని చంపేసాను http://ramakantharao.blogspot.com/2008/10/blog-post.html
అవును. నేనే. గాంధిని అత్యంత దారుణంగా, హేయంగా, ఆతని అరుపులు ఎవ్వరికీ వినబడనీయకుండా నేనే చంపేసాను. దేనికంటే.. సత్యాగ్రహమంటాడా? అహింసా? ఖాదీయా? ఉపవాసం చేయమంటాడా?
కట్నాలకోసం అమ్మాయిల్ని అతిదాఋణంగా హింసిస్తున్న సమాజాన్ని చూసి దిక్కులు పిక్కటిల్లేలా అఱవకుండా, తిలాపాపంలో పాలుపంచుకుని గాంధీని చంపేసాను.
అడుగడుగునా లంచాలతో జనాల రాక్తాన్ని పీల్చుకుంటున్న అధికారగణం మీద యుద్ధాన్ని ప్రకటించకుడా, నాకు చేతనైనంతవఱకూ లంచాల్ని ప్రోత్సహిస్తూ గాధీని చంపేసాను.
కులం కులం అని కుచ్చితాలుపెంచుకుంటున్న జనాల్ని సరైన మార్గంలో పెట్టకుండా నేనూ ఒక కుల కుంపట్ని వెలింగించి గాధీ చంపేసాను.
మతం తన పరిధులు దాటి గజ్జిగా మాఱితే నేను దాన్ని కడుక్కోకుండా అందఱికి అంటిస్తూ గాంధీని మళ్ళీ చంపేసాను.
సత్యాగ్రహం అనేపదానికి సమాజం "అ" చేర్చినప్పుడు కిమ్మనకుండా నేనూ అసత్యాగ్రహాన్ని ప్రచారం చేస్తూ గాంధీని అతిదారుణంగా చంపేసాను.
అహింస పరమో ధర్మహ కి బూజు పట్టించి దాన్ని హింస పరమో ధర్మహ లా మార్చినప్పుడు సమాజాన్ని ఎదురించటం మానేసి నేనూఒక కత్తి పట్టి గాంధీని నఱికేసాను.
పేదరికాన్ని రూపుమాపేందుకు అప్పులు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాన్ని ఎదురించటం పక్కనబెట్టి ప్రపంచీకరణ పేరుతో మన సహజ వనరుల్ని అమ్ముకుంటూ గాంధీని చంపేసాను.
అభివృద్ధి పేరుతో సంస్కృతినీ సంప్రదాయాన్ని గాలికొదిలేస్తూ గాంధీని మళ్ళి చంపేసాను

అవును నేనే, గాంధీని, నాలో ఉన్న గాంధీని చంపేసాను



సోదరుడు మలక్ ఆలోచన -
http://malakpetrowdy.blogspot.com/2009/10/blog-post.html
ఇవన్నీ ఎందుకడుగుతున్నానంటే ఇప్పుడే శరత్ తో మాట్లాడాను. కెబ్లాస అధ్యక్షుడిగా ఆయన సహాయానికి ముందుకు వచ్చారు. ఎక్కువా తక్కువా కాకుండా సహాయం చెయ్యదలచుకున్న వారి దగ్గరనుండి కనీసం 50 డాలర్ల చొప్పున సేకరిద్దామన్న ఆలోచన వచ్చింది.
- మలక్

మంచి ఆలోచన. మనం అందరం ముందుకి రావాల్సిన సమయం. అక్కడి సహాయక బృందాలకు స్పూర్తినివ్వాల్సిన సమయం.

73 comments:

  1. కొన్ని సంవత్సరాలు క్రితం అంటే తెల్లదొరలు రాకమునుపటి వరకు ఓ ఐదువేల సంవత్సరాలు మన పద్ధతి కొంచం వేరు గా ఉండేది. వర్షాకాలం లో నీటిని సాగు చేసుకునేవాళ్ళం. అంటే నదీప్రవహాం కి ప్రతి 100 మీటర్ల గట్ర కీ చిన్న చిన్న ఆనకట్టలు / ట్యాంకులు కట్టి ఎంచక్క జీవిస్తుండే వాళ్ళం. అలా రెండు ఉపయోగాలు (నా బ్లాగ్లో రాసాననుకుంటా ఈ విషయం మీద) - ground water table ఎప్పుడు renew అయ్యేది.. ఇలా నదిలోకి అతిగా నీళ్ళు ప్రవహించేది కాదు. ఇప్పుడు మన వాళ్ళ అతి తెలివి వళ్ళ మన దేశం ఇల తగలెడింది.

    ReplyDelete
  2. Govinda Govinda...

    Andhra Govinda...

    Rajasekharreddy poyyadu...Andhra kastalu begin ayinavi..

    ReplyDelete
  3. టీవీ చూస్తుంటే రేపటికి ఏమవుతుందో అనిపిస్తుంది.ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది.

    ReplyDelete
  4. ప్రసాద్ గారు - వై.ఎస్.ఆర్ ఉంటే వర్షాలు పడేవి కాదంటారా? :p

    ReplyDelete
  5. నోరులేని బస్సులమీద, సైన్ బోర్డులమీద, అల్ప జీవాలమీద తమ ప్రతాపం చూపిన *జగన్ సేన* ఇప్పుడు విపత్తుకి ఎదురునిలచి జనాలను కాపట్టంలో ధీరత్వం సూరత్వం చూపితే వచ్చే ఎలక్షన్లకి జగన్ కి ఉపయోగపడుతుంది.

    ఎవరైన లేటేస్టు న్యూస్ అందించగలరా?

    ReplyDelete
  6. ప్రసాద్ గారు, Y.S ఉండి ఉంటే, ఆయన స్వయాన దేవ దూత కాబట్టి వర్షాలు వరద రానట్లు పడేటట్లు వరుణదేముడును బెదిరించి చేసేవారు కదూ!!. తాను అన్ని ప్రాజెక్ట్లకంటే ముందు మొదలేట్టిన పులిచింతలను వర్షం వస్తుంది అనగానే వారం రోజులలో, పూర్తి చేయించి నీళ్లు వ్రుధా పోకుండా చేసేవారుకదూ!! అన్నిటికంటే తానే చాలా సమర్ధులని నియమించుకొన్న కలేక్టేరులు, పాలనా యంత్రాంగం, ముఖ్యంగా నీళ్ల మంత్రి పొన్నాల, ఆయన ఉండిఉంటే కాని పనిచేయనంత సమర్ధులు కదూ!!
    మర్చిపోయామండి మేమందరం, అందుకే వరదలది ఏముంది పోతే కొన్ని వేల మంది, పోతే కొన్ని వందల కోట్ల పంట, ఆస్తుల నష్టం జరుగుతుంది, కాని దేముని బిడ్డ జగన్ ఏసయ్యను పీఠం మీద కూర్చోపెట్టకపోతే, వరుణ దేముని బెదిరించి ఇంకెంత నష్టం మన పోయిన దేముడు గారు చేస్తారేమో కదా! అందుకనేకదా మీలాంటి వారందరూ వరదల గురించి కాకుండా, జగన్ ఏసయ్యను పీఠం మీద ఎలా కూకో పెట్టాలో అన్నదాని మీద పనిచేయమని మన అధికార/అనధికార యంత్రాంగాన్ని చెబ్తున్న్రు కదా!! అర్ధం చేసుకోరండి ఈ జనాలు, వీళ్లను ఎవ్వరూ బాగు చేయలేరు :)

    ReplyDelete
  7. నీటమునిగిన మంత్రాలయం!!

    ReplyDelete
  8. అవును, విపత్తును ఎదుర్కోవడంలో మనం సమర్ధవంతంగా లేము. ముందే సన్నద్ధంగా ఉండాలిగాని, అప్పటికప్పుడు ఇలాంటి విపత్తును ఎదుర్కోవాలంటే అంత తేలికేమీ కాదు. ఒకప్పుడు మనకు విపత్తు నివారణ సంస్థ ఒకటి ఉండేది, దానికో సీనియరు ఆఫీసరు కమిషనరుగా ఉండేవాడు, బ్రహ్మ అని. ఇప్పుడెవరైనా ఉన్నారో లేరో మరి.

    ఒకటి మాత్రం వాస్తవం.. ఇది మనం కనీ వినీ ఎరగని విపత్తు. కర్నూలులాంటి ఒక పెద్ద నగరమే మునిగిపోయిన పరిస్థితి. వేలాది ఊళ్ళు మునిగిపోయాయి. మరో పెద్ద నగరం ప్రమాదం అంచున ఉంది. మరింత ప్రమాదమేంటంటే.. రేపు కర్ణాటక నుండి ఇంకా ఎక్కువ వరద వచ్చే ప్రమాదముందని వార్తలొస్తున్నాయి. తలుచుకుంటేనే భయంగా ఉంది. శ్రీశైలం డ్యాము పూర్తిగా నిండిపోయి, పైనుంచి వరదనీళ్ళు పారే అవకాశం ఉంది. సామాన్యమైన విపత్తు కాదిది.

    ReplyDelete
  9. ప్రతిపక్షాలు దీన్ని జాతీయవిపత్తుగా ప్రకటించాలని ధర్నా చేపడతాయేమో ఈరోజో రేపో

    ReplyDelete
  10. చదువరిగారూ - ఈ డ్యాములకి ఏమైనా ప్రమాదం ఉందా? ఎక్కడన్నా ఈ విషయం మీద వార్తలు కానీ, చర్చలుకానీ జరుగుతున్నయా? కాస్త తెలుపగలరు.
    అప్పుడెప్పుడో శ్రీశైలం జలవిద్త్యుత్తు కేంద్రం నీటమునిగినట్టు, ఇప్పుడూ అలాంటిదేమన్నా జరిగే ప్రమాదం ఉందా?
    శ్రీశైలంలో ఒక విద్యుదుపాదనా కేంద్రాన్ని మూసేసినట్టుగా చదివా [మీ బ్లాగులోనేనా???].

    ReplyDelete
  11. >>ఒకప్పుడు మనకు విపత్తు నివారణ సంస్థ ఒకటి ఉండేది, దానికో సీనియరు ఆఫీసరు కమిషనరుగా ఉండేవాడు, బ్రహ్మ అని
    ?? నిజంగానేనా?

    ReplyDelete
  12. కూలిన సచివాలయం గోడ
    హైదరాబాదు: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల హైదరాబాదులోనూ తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు అధ్వాన్నంగా మారాయి. సచివాలయంలో ఓ గోడ కూలిపోయింది. ఉదయాన్నే కూలడం వల్ల ప్రాణనష్టం తప్పిందని అధికారులు వూపిరి పీల్చుకున్నారు.

    ReplyDelete
  13. srisailam lo 592 cherutundi ata inkonni gantallo level. dam kattaka ide first time. so emautundi ante evvaru cheppaleeru.

    ReplyDelete
  14. Dude!! My BP is touching the roof...
    Whats gonna happen?
    My worry is all about Nagarjunasagar and towards Guntur Krishna Dt Krishna River Beds.

    ReplyDelete
  15. శ్రీశైలం డ్యాము పరిస్థితి ప్రమాదకరమేనండి. దని పూర్తి స్థాయి మట్టం: 885 అ. గరిస్ఠ మట్టం 892. 904 అడుగులకు చేరితే డ్యాము పూర్తిగా, (పైనున్న రోడ్డుదాకా) మునిగిపోతుంది. ఆ పరిస్థితి వచ్చేదాకా ప్రమాదం లేదని ఇంజనీర్ల భరోసా. కానీ ఆ పరిస్థితి రావడం సంభవమేమోనని కర్ణాటక వర్షాల వార్తలు చెబుతున్నాయి.

    విపత్తు నివారణ సంస్థ: అవును, ఉండేదండి. గతంలో ఒకసారి మనకూ, ఒరిస్సాలోనూ ఒక్కసారే వరద వచ్చినపుడు ఆ రాష్ట్రం కంటే మన రాష్ట్రమే ఎక్కువ సాయం చేసింది -ఇక్కడే కాదు, అక్కడ కూడా. ఆ బ్రహ్మ అనే ఆయన బెంగాలో అసాముకో చెందినవాడు. ఒకసారి విపత్సమయంలోనో కొద్ది రోజుల తరవాతో ఆయన తల్లి చనిపోయిన వార్త కూడా పేపర్లలో వచ్చింది.

    ఒకటి మాత్రం నేను అనుకుంటాను.. కోస్తాలో వచ్చే తుపానుల సమయంలో మన ప్రభుత్వ సంసిద్ధత మాత్రం మెరుగ్గానే ఉంటుంది. కానీ ఇప్పటి ఈ వరద -ఇది సామాన్యమైనది కాదండి.

    ReplyDelete
  16. చదువరిగారూ!!
    ఇప్పుడు ప్రభుత్వ ప్లాన్ ఏంటి? ఏమైనా చర్చిస్తున్నరా ఎవరైనా?
    డ్యంలను ఇంజనీర్లు కనిపెట్టుక్కూర్చుంటారు, కానీ మిగతావి
    విజయవాడా పరీస్థితి ఏంటి? సన్నద్ధం చేస్తున్నారా? లోతట్టుప్రాంతాలు ఖాళీ చేయించటం లాంటివి ఏమైనా చేపడుతున్నారా?

    ReplyDelete
  17. మొత్తమ్మీద సహాయ చర్యలు రేపు పొద్దున మళ్ళీ మొదలౌతాయి. అప్పటికి కర్నూలు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. కర్నూలులో సహాయ చర్యలు చాలా కష్టం. పడవలు, హెలికాప్టర్ల ద్వారా చెయ్యాలి. అప్పటికి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పలేం. రేపు ప్రమాదంలో పడే అవకాశమున్న మహబూబ్‌నగరు, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో దృష్టి పెడుతున్నారు. విజయవాడలో ఇప్పటికే ఖాళీ చేయిస్తున్నారు. అక్కడ కొందరు ఖాళీ చెయ్యడానికి ఇష్టపడడం లేదు, బలవంతానా చేయిస్తున్నారు.

    ReplyDelete
  18. ఇప్పటికే స్వైన్ ఫ్లూ వల్ల సతమతమౌతున్న జనానికి ఇదీ ఓ పెద్ద దెబ్బే. వానలవల్ల వరదలవల్ల ప్రబలే అంటువ్యాధులు అబ్బో!! ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది, ఓ వైపు గల్లాపెట్టె ఖాళీ, ఇంకో వైపు జగన్ వర్గం బస్సుల దహనాలు ఇంకోవైపు ఖాండవదహనం..ఇప్పుడిది..
    ఘోరం.
    సూచన - జనాలు ముందుగానే టికాలో షాట్సో లేక హోమియో మందులో వేస్కునుండటం ఉత్తమం అని నా అభిప్రాయం.

    ReplyDelete
  19. కర్నూలులో భూకంపం వచ్చిందా?
    నిజమేనా?
    వై.యస్.రా.శే.రె దయ్యమై ఇవన్నీ చేస్తున్నాడా ఏంది??
    అదేదో ఆ జగన్ ని ఆ కుర్చీలో అంట కూకోబెట్టండయ్యా బాబూ..
    [జోక్]

    ReplyDelete
  20. శాశాంక్ -
    విపత్తులను ఎదుర్కోటంలో పాలనా వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని నా భావం.

    ఇలాంటి ప్రకృతి విలయతాండవాలను ఎవ్వరూ ఊహించరు. అందుకే దాన్ని డిజాస్టర్స్ అంటాం. ఇక్కడ కావాల్సింది డిజాస్టర్స్ ని తట్టుకుని నిల్చోగల యంత్రాంగం. ఇలాంటి వరద భీభత్సాలను ఎవ్వరూ ఊహించకపోయినా, మన ప్రభుత, ప్రభుత్వ పాలనా యంత్రాంగం, సపోర్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క *రిస్క్ ఎసెస్మెంట్* *దూరదృష్టి* లని శంకించాల్సిందే.
    అవి సరైన రీతిలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెట్టిఉంటే నష్టశాతాన్ని తగ్గించవచ్చు అనేది నా భావన.

    ReplyDelete
  21. ఒక్కటి గురు.. సునామి వచ్చేవరకు మనం సిద్ధంగా లేము.. తర్వత భూకంపం వస్తే సునామి ప్రమాదం వస్తే సూచించే యంత్రంగ అన్ని సిద్దం చేసారు. దివిసీమ వరదలు తర్వత ఆ లెవెల్ లో కాకున్న కొంచం తక్కువ లెవెల్ లొ తట్టుకోగలము. కని ఇది కొంచం కష్టం to predict and to be prepared for

    ReplyDelete
  22. మొన్నటివార్త చూసావా శశాంక్? మన సునామీ అప్రమత్త యంత్రం సరిగ్గా లేక అనుకున్నంతగా పనిచేయలేదని ఎక్కడో చదివా.

    సరే నేను తెలుసుకున్న, చూసిన వివరాల ప్రకారం -
    మన పరికరాలు, యంత్రాలు పురాతన కాలంవి. కాదంటావా?
    మన సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి ప్రకృతి పరిణామాలను చదివేవి లేక సమాచారం అందించేవి ఐ డౌట్.
    నీ ఉద్దేశం ఏంటి? ఇలాంటి వాటి ప్రొక్యూర్మెంట్లో మరియూ ఇన్స్టాల్మెంట్లో కూడా పొలిటికల్ ఇన్ట్రవెన్స్ తప్పకుండా ఉంటూందీ అని నా నమ్మకం.

    ReplyDelete
  23. >>కని ఇది కొంచం కష్టం to predict and to be prepared for
    మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా.

    ReplyDelete
  24. ఆ, సోదరా పరిస్థితి ఏంది. ఎంతమంది మునిగారు ఎంతమంది తేలారు? అమెరికాలో సునామీ ఎప్పుడు?

    ReplyDelete
  25. పత్రికల కధనాల ప్రకారం 130 మంది గల్లంతు. ఇది కేవలం కర్ణాటకలో. మరి ఆంధ్రాలో ప్రాణనష్టం వివరాలు ఇంకా మనదాకా రాలేదు వార్తలు.
    ఇక అమెరికాకి సునామి. అటువైపేమో తెలియదు కానీ మాకుమాత్రం నువ్వు అడ్డుగోడగా నిల్చిఉన్నావు. కాబట్టి, నేను పెద్ద భయపడను. :):)

    ReplyDelete
  26. 26 మంది మృతి
    ఆరుగురి గల్లంతు
    13వేల ఇళ్లకు నష్టం
    నీట మునిగిన పంటలు
    జలమయమైన కాలనీలు
    శిబిరాల్లో బాధితులు
    - ఈనాడు

    ReplyDelete
  27. స్థిరంగా అల్పపీడనం మరో 48 గంటలు వర్షాలు - ఈనాడు

    ReplyDelete
  28. హి హి హీ, నే పోతున్నాలే అయితే :)

    ReplyDelete
  29. 60,000 మంది ప్రాణాలు కర్నూలు లో బిక్కు బిక్కు మంటున్నాయి

    ReplyDelete
  30. మిగతా విషయాలెలా ఉన్నా ప్రస్తుతం టి.వి.చానల్ వాళ్లకు మంచి కాలక్షేపం...ఫ్లాష్ న్యూస్ లు,హంగామా,హడావుడి.."ఇంట్లోకొచ్చిన వరద నీరు","కొట్టుకుపోతున్న రైలు పట్టాలు","నడుంలోతు మునిగిన ప్రజానీకం"..
    అబ్బ..అబ్బ..అన్ని చానల్స్ వరద వార్తలతో బిజీబిజీ....!!

    ReplyDelete
  31. సూచన - కాచి చల్లార్చిన నీటిని తాగండి

    ReplyDelete
  32. ఈనాడులో తేడా గమనించారా?
    ఈనాడు ఇప్పుడు యూనికోడ్ లో వస్తోంది. ఇంతకముందు ఈనాడు ఫాంట్ అవసరమయ్యేది.
    [Just FYI]

    ReplyDelete
  33. తృష్ణ - వరద వచ్చినప్పుడు "ఇంగ్లండ్ ని చితకొట్టిన ఆసిస్" అని చెబితే జనలు వాళ్ళ స్టేషన్ వెతికి మరి వెళ్ళి కొడతారు మరి..

    @భాస్కర్ - నేనిన్నేమి తప్పుపట్టడం లేదు. మన రిమోట్ సెన్సింగ్ సటిలైట్ బానే పని చేస్తుంది.... కాని మన యంత్రంగం కొంచం లేజీ. అది ప్రబ్లం. ఈ రోజు మాత్రం బానే పని చేసింది అని అనుకుంటున్నా నేను.

    ReplyDelete
  34. ఔను.. ఇంతకీ మన "హోం మినిస్టర్" ఎక్కడ?

    ReplyDelete
  35. హొం లో ఉంది. పాపం *అన్నయ్యా* *అన్నయ్యా* అని కలవరిస్తోందట.

    ReplyDelete
  36. అన్నయ్య ని కాని అన్నయ్య చెల్లెల్ని కాని ఎమైన అంటే మీ ఇంటి ముందు ఓ బస్సు తెచ్చి తగలెడతా.. ఖబర్దార్..

    ReplyDelete
  37. అద్దెచ్చా
    నేను అన్ననికానీ చెల్లాయినికానీ ఏమీ అనల్యా. అదెమరి ఐనా బస్సులు తగలెయ్యటానికి ఇంక్యాడున్యాయ్? జగన్ మొత్తం ఆక్రమణ చేసేత్తే?

    ReplyDelete
  38. నేను అన్ననికానీ చెల్లాయినికానీ ఏమీ అనల్యా.

    బతికి పోయ్యావు బ్రదరూ :)

    ReplyDelete
  39. నిరంతర వార్తా స్రవంతులనుండి ఏమైనా కొత్తవార్తలు అందుతున్నాయా? ఎవరైనా పంచగలరు!!

    ReplyDelete
  40. పంచడానికి పప్పుబెల్లాలన్నీ గంగమ్మ పాలు.

    ReplyDelete
  41. ఏదోటి..కిట్టమ్మలో గంగి లేదా ఏంది? :-)

    ReplyDelete
  42. పరిస్థితి దారుణం ...కనివిని ఎరగని ఉగ్ర రూపం ...కర్నూల్ తరువాత కృష్ణ జిల్లా ,పట్టణం కూడా ప్రమాదం అంచున వుందనే చెప్పొచ్చు సముద్రం లోకి వెళ్ళే నీరు కూడా ఎగువకు తన్నవచ్చు పున్నమి ప్రభావం ....

    ReplyDelete
  43. అవునా ! చూస్తుంటే దివిసీమ తుఫాను లాగున్నట్టుంది కదా!

    ReplyDelete
  44. ఇలా అయితే మా ఊర్లన్నీ ఖాళీ

    ReplyDelete
  45. ఇంట్లో వుంటే టివి 9 చూసేవాడిని. అఫీసులో వున్నా కనుక మీరిచ్చే న్యూసే శరణ్యం. ఈనాడు కంటే ఆంధ్రజ్యోతి ఈ వార్తలు బాగా కవర్ చేస్తోంది.

    ReplyDelete
  46. నా చూపంతా నాగార్జునసాగర్ మీదనే ఉంది..
    ఎక్కడన్నా టీవీ వార్తా ఛానళ్ళలో ఏమైనా చర్చలు జరుగుతున్నాయా డ్యాం సామర్ధ్యం మీద?
    దయచేసి ఎవరన్నా తెలుపగలరు.

    ReplyDelete
  47. పులిచింతల మునిగిపోయింది

    ReplyDelete
  48. ౯౦% [90%]కర్నూలు మునక

    ReplyDelete
  49. హెలీకాప్టర్లు ముందుకి వెళ్ళే పరీస్థితులు కనపట్టంలేదు - ఐ-న్యూస్

    ReplyDelete
  50. కర్నూల్ జనాభా 2,69,122 (2001)
    ఇందులో ఎంతమంది బ్రతికి బట్టకడతారో! ప్చ్

    ReplyDelete
  51. తాజా సమాచారం ఎప్పటికప్పుడు ఏదయినా వెబ్ సైటులో వస్తోందా?

    ReplyDelete
  52. రేపొద్దునకి విజయవాడ సంగతి తెలుస్తుంది..
    ముఖ్యమంత్రి విజ్ఞప్తి -
    అందరం కలసికట్టుగా పనిచేద్దాం
    కేరళ నుండి డిజాస్టర్ రికవరి ఫోర్స్ వస్తోంది
    డిఫెన్స్ శాఖతో మాట్లాడాం
    సెంట్రల్ హోంతో మాట్లాడాం
    జనాలు దయచేసి సహకరించండి.

    బాబు-
    కార్యకర్తలకు విజ్ఞప్తి
    మీమీ ప్రాంతాలకు చేరండి
    కొంతవరకు జనాలని కాపాడే ఇది ఉంది
    వారికి కొంతవరకు ఒకపూట తిండిపెట్టండి.
    నేను ఒకటే కోరుతున్నా
    అందరూ యంపీలు యంయల్యేలు ఫీల్డుకెళ్ళలి.

    వార్తాస్రవంతి -
    ఇరవై ఐదువేల మంది నీళ్ళలో చిక్కుకున్నారు కేవలం కర్నూలు లోనే
    యాభైవేల మంది రాష్ట్రవ్యాప్తంగా నీటిలో చిక్కుకున్నారు
    రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది.
    సహాయం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి చెప్తున్నా ఒక్కరికీ అందిన దాఖలాలు లేవని వార్తహరుల ఉవాచ

    ReplyDelete
  53. మరోనాలుగడుగులు పెరిగితే కర్నూలు పూర్తిగా మునక
    నాగార్జునసాగర్ కు ముప్పు ఉండొచ్చు
    - ఐ-న్యూస్

    ReplyDelete
  54. సహాయం చేసేందుకు ఐదు హెలీకాప్టర్స్ వచ్చాయి. నాలుగు ఇంధనం లేక తిరిగి వెళ్ళిపొయ్యాయి.

    ReplyDelete
  55. ఐ న్యూస్ ముందే పసికట్టిందిట. ముందే చెప్పిందిట కర్నూల్ మునిగిపోబోతోంది అని. మొట్టమొదట చెప్పింది ఐ.న్యూస్ - ఐన్యూస్ వార్తహర ఉవాచ

    దీనెంకమ్మ వార్తాస్రవంతులు.

    ReplyDelete
  56. నల్లమల లో భారీ వర్షం - ఇరగొట్టె వార్త [బ్రేకింగ్ న్యూస్: ఐ-న్యూస్]

    ReplyDelete
  57. పావురాల గుట్ట దగ్గరి తాజా పరిస్థితి ఏమిటి?

    ReplyDelete
  58. రెండుపావురాల జాడ తెలియడంలేదు.

    ReplyDelete
  59. వార్తాపుత్రికలకు/పత్రికలకు/స్రవంతులకు -
    ఇలాంటి సమయంలో ప్రభుత్వాన్ని ప్రతీవోడు విమర్శిస్థాడు. ఇలాంటి పరీశ్థితుల్లో సహాయకార్యక్రమాలను అందించటం, పర్యవేక్షించటం, రవాణా, ఇలాంటివి ప్రతీదీ ఓ సవాలే.
    మీరు చెప్పాల్సింది స్పూర్తిదాయకంగా ఉండాలి. ప్రతీవాడు *సహాయం చేద్దాం* *చేయాలి* అని ఆలోచించేలా మీరు వార్తల్ని ప్రసారం చేయండి. సామాజిక స్పృహని కలిగించేలా చేయండి.
    ప్రతీదానికీ ప్రభుత్వం ప్రభుత్వం అని ప్రతిపక్షాలనుండి లాభం పొందేలా చూడకండి.

    ReplyDelete
  60. The root cause of this disaster is Deforestation. If you have the trees standing on the hills, the influx of water will be low as the trees and the land below them act as absorbents.

    WILL WE LEARN AT LEAST NOW?

    ReplyDelete
  61. @భరద్వాజ, అందుకనేగా, కాస్తో కూస్తో మిగిలిన virgin forest నల్లమలలో ఓ 1400 హెక్టారులు దేముడుగారికి నివాళిగా deforest చేస్తున్నారు. దానికి G.O. ఇవ్వటానికి మాత్రం ఏ మంత్రికి జ్వరం రాదు!!

    ReplyDelete
  62. Update సమయం తెల్లవారి 3:15. జూలార 60 గేట్లు తెరిచేసారు అట. శ్రీశైలం లో నీటి ప్రవాహం ఇప్పుడు 891 అడుగులకి చేరుకుంది!!!! శ్రీశైలం గరిష్ట ఎత్తు 885 అడుగులు. దేవుని మీద భారం వేసి సైట్ నుండి వెళ్ళిపోయారట ఇంజనీర్లు.

    ReplyDelete
  63. ఈ సమయం లో యే APJ నో అలాంటి గొప్ప మనిష్నో టి.వీ లో "ఇల జరగడానికి కారణం deforestation" అని ఒక్క మాట చెప్పిస్తే మన ప్రజలు మారతారని నా ప్రగాఢ విశ్వాశం.

    ReplyDelete
  64. ఒకవైపు వరద వస్తుంటే ప్రకాశం బ్యారేజి మీద వేలకొద్దీ జనాలు వరదకిట్నమ్మని చూట్టానికి తండోపతండాలుగా వచ్చారు. లారీలు బస్సులు ట్రాఫిక్కు ఎక్కడిక్కడ నిల్చిపోయింది - టి.వి- తొమ్మిది

    ReplyDelete
  65. సందట్లో సడేమియా - సోనియా రాక. ఇంతలో వాయిదా...ఎవురయ్యా ఈమె. ఏంపనీపాటలేదా?

    ReplyDelete
  66. విపత్తు నివారణ శాఖ ప్రస్తుత కమిషనరు - దినేష్ కుమారట. వార్తల్లోకి వచ్చాడు.

    ReplyDelete
  67. >>సందట్లో సడేమియా - సోనియా రాక. ఇంతలో వాయిదా...ఎవురయ్యా ఈమె. ఏంపనీపాటలేదా?

    ఈమె గారి భద్రత కు ఇప్పుడు మళ్ళీ ఏర్పాట్లు. ఎన్న కొడుమై సార్ ఇదు :(

    ReplyDelete