Oct 6, 2009

ఇదెక్కడి గోల??

౧. శుక్రవారం రాత్రి: బెజవాడ: ఐన్యూస్ -
ఒకవైపు ముంపు ముంచెత్తుకుంటూ వస్తుంటే బెజవాడ ప్రకాశం బ్యారేజిమీద వేలకొద్దీజనాలు నీళ్ళని చూట్టానికి వేంచేసారు. ట్రాఫిక్కు జ్యాం.
౨. ముందుగా, మొట్టమొదటగా వరగ ముంపు గురించి చెప్పింది ఐన్యూసే - ఐన్యూస్
౩. ఆదివారం సాయంత్రం టివి తొమ్మిది - పొరపాటున ఎలా ఉందో పరీస్థితి చూద్దాం అని పెట్టా. తలగిర్రున తిరిగింది.
వార్తాహరులు రోడ్లెమ్మట, వాళ్ళ కార్యాలయం ముందు అక్కడా ఇక్కడా -
"తండోపతండాలుగా కదలి వస్తున్న జనం. ఇది సైన్యమా కాదు మాన్యవత్వంతో నిండిన సైన్యం. యుద్ధానికి వెళ్ళే సైన్యం కాదు, ఆపన్నులను ఆదుకునే మానవత్వపు సైన్యం." ఇంతవరకు బాగనే ఉంది. అప్పుడుమొదలయ్యింది గోల.
"టివి నైన్ వాళ్ళ పిలునందుకుని వచ్చాం - చాలా మంచి పనిచేస్తున్నారు"
"ఇప్పుడే విమాణం దిగాం. టివినైన్ వాళ్ళ ఈ డ్రైవ్ మాకెంతో నచ్చింది. విరాళం అందివ్వటానికి వచ్చాం"
"మా అమ్మాయి టివి నైన్ కార్యక్రమంలో భాగం అవ్వాలని పరిగెత్తుకుంటూ వచ్చింది ఇటైపేమన్నా వచ్చిందా?"
ఇలా!!
ఇక ఏ ఇతర ఛానలూ పెట్టాలనిపించలా.
-----------------------------

మొన్నటిదాకా మీటర్లపై మీటర్లు ఎత్తుపెంచిన కర్ణాటక, నీళ్ళు ఇవ్వండ్రా అంటే ఏడుపిచ్చుకుతిన్న కర్ణాటక.
ఎంత గొడవ. ఆ ట్రైబ్యునల్ అని ఇది అని మనకి నిద్రలేకుండా చేసారు కృష్ణా జలాలకోసం.
ఇవ్వాళ్ళ మా ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోటున్నాయర్రా ఎర్రిపీనుగుల్లారా అన్నా నీళ్ళు వదుల్తూనే ఉన్నారు.
---------------------------

తాజాగా -
మంత్రాలయం లాంటి అత్యంత దెబ్బతిన్న ప్రాంతాల్లో జనాలు ఉన్నపళంగా ఇళ్ళు ఖాళీచేనందున, ఒక బ్యాచి లూటీలు చేస్తున్నారట.

కర్నూలు వైపు కొందరు వ్యాపారస్తులు బ్రహ్మాండమైన తెలివితేటలతో కిలో బియ్యాన్ని వందకి, పాల పొట్లం ఒకటి యాభైకి అమ్ముతున్నారట.

నాకో అనుమానం మనం మధ్యతారియుగంలో ఉన్నామా?

8 comments:

 1. బాధాకరమైన విషయమండి.....
  అవకాశవాదులు చీడపురుగులు సమాజానికి.....

  ReplyDelete
 2. నేనూ విన్నాను....ఎంతటి దౌర్భాగ్యం!

  ReplyDelete
 3. మధ్య రాతి యుగంలో ఉంటే బాగానే ఉండేదనుకుంటాను, అప్పుడు ఇంత స్వార్థం ఎక్కడుంది? కళ్ళముందు పసి బిడ్డలు ఆకలికి అల్లాడుతున్నా, డజన్ అరటిపళ్ళు నూటపాతిక రూపాయలకు అమ్ముతున్నారంటే ఇక వ్యాపారానికి హద్దేముంది? ప్రతి న్యూస్ ఛానెలూ మేమంటే మేమని విరాళాలు వసూలు చేస్తున్నాయి, జెన్యూన్ గా ఎంతమంది సహాయం చేస్తాయో గానీ!

  పాపం, లోడుల్తో హైవే మీద ఆగిపోయిన లారీ డ్రైవర్ల సంగతి కూడా దయనీయంగానే ఉంది. చేతిలో డబ్బులేక, లారీని వదిలి పోలేక,అన్నం పెట్టేవారు లేక..వాళ్లదో విషాదం!

  కడుపు మండిన జనం అధికారుల్ని కడిగి పారేస్తున్నారు. ప్చ్!

  ReplyDelete
 4. అన్నాయ్, ఇవ్వాళే మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, బెజవాడ లో కూడా పాల ప్యాకెట్ 30/- పయినే అమ్ముతున్నారు.

  ReplyDelete
 5. వెనుకొకటికొక సామెతున్నది

  తెల్లవారు ఝామున చచ్చేవాడు సందకాడ చచ్చినవాని సొమ్ముదోచుకుంటూన్నాడట.

  ReplyDelete
 6. ఎక్కడ చూసినా విపరీతమైన స్వార్ధం పెరిగిపోతోంది. కలియుగం లో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది అంటే ఇదేనేమో! ఇదంతా నిజంగా కాల మహిమేనా!

  ReplyDelete
 7. >>కడుపు మండిన జనం అధికారుల్ని కడిగి పారేస్తున్నారు.

  ఎంతమంది అధికారులు, ఎంతమంది జనం? అధికారుల్ని కడిగిపారేసినంత మాత్రాన ఏమీ తేడారాదు రాబోదు. సామాజిక బాధ్యత అనేది ప్రభుత్వం వల్లనో పాలన వల్లనో రాదు. సామాజిక బాధ్యత సమాజం నుండే రావాలి, ఆ సమాజంలోని ప్రతీ వనరు నుండి రావాలి.

  ప్రస్తుత పరీస్థితిలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే తంతు ఇదే స్థితి ఉంటుంది. తెదెపా లేక భాజపా లేక లోక్సత్తా లేక ప్రరాపా. కారణం ఏ ప్రభుత్వం అయినా నడిచేది ఈ *అధికారుల* మీదనే.

  ReplyDelete
 8. మానవత్వ౦ చూసి ఆన౦దిచేలోపే రాక్షసత్వ౦ చుపుతున్నారు..ప౦చి పెడుతున్నారు అనుకునే లోపే దోచుకు౦టున్నారు..పొలిసులు,ఫైర్ సిబ్బ౦ది,మున్సిపల్ సిబ్బ౦ది దారుణ౦గా ప్రవర్తిస్తున్నారట!!!!ఏదైనా సాయ౦ చేద్దా౦ అన్న భయ౦.

  ReplyDelete