నా పాత పోస్టు ఓ తోటమాలి కధ - బాగ్బాన్ http://ramakantharao.blogspot.com/2008/12/blog-post_11.html లో ఓ విన్నపాన్ని పెట్టాను ఇలా
ఓ చిన్న విన్నపం: పై అమితాభ్ ప్రసంగాన్ని ఎవ్వరైనా తెలుగులోకి అనువదించగలరా?
కృష్ణ గారు, పెద్దమనస్సుతో అమితాభ్ ప్రసంగాన్ని తెలుగీకరించి అందించారు. ఆయనకు ధన్యవాదాలు.
ఈ అమితాభ్ ప్రసంగాన్ని రాసింది జావేద్ అక్తర్. అక్తర్ ఈ సినిమాకి రచయిత కాదు, కానీ కేవలం ఈ ప్రసంగం రాసిచ్చారాయన.
కేవలం మీతో పంచుకుందాం అని ఇక్కడ పెడుతున్నా..
చూడండి..నేను రచయిత ని కాదు...రచయితలయితే ఆలోచనల సముద్రాలలో మునిగి ఎన్నో మంచి ముత్యాలు వెలికి తీస్తారు. నేనేదో జీవితం నాకు చూపించినవే కథ గా రాశాను. 'బాఘ్బన్' (తోట మాలి) నా కథో ఇంకెవరి కథో కాదు. ఈ కథ గడనిచిపోయిననిన్నటికి రాబోయే రేపటికి మధ్యనున్న నిశ్శబ్దాన్నిగురించి రాసింది. ఇది ఒక తరానికి మరొక తరానికి మధ్య కూలిపోయిన ఎన్నో వారధుల కథ. తమపై కూర్చున్న పిల్లలకి జీవితం అనే వేడుకని చూపించి ఇప్పుడు అలసిపోయి కుంగిపోయిన భుజాల కథ ఇది. తమ పిల్లలకి తప్పటడుగులు వేయడం నేర్పించి..ఇప్పుడు ఊతం లేక వణుకుతున్న చేతుల కథ....ఒకప్పుడు జోల పాటలు పాడి..ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మాటలు లేక అదురుతున్న పెదవుల కథ కూడా. కాలం మారిపోయింది..జీవితం మారిపోయింది..మా వయసు వాళ్ళకి గుర్తే[మాత్రమే] ఉంటుంది..బంధాలు అనుబంధాలు అంటూ ఎలా వెంపర్లాడేవాళ్ళమో....తండ్రి ముఖంలో పరమ శివుడ్ని చూసేవాళ్ళం..తల్లి పాదాల వద్ద స్వర్గం కనిపించేది...కాని ఇపుడు జనాలు ఇంగితం కలవాళ్ళు. ఈ తరం తెలివి, లోకజ్ఞానం కలిగినది. వీళ్ళకి ప్రతి బంధం పైకి వెళ్ళడానికి ఒక మెట్టు లాంటిదే. ఆ మెట్టు అవసరంలేదు అనిపించినపుడు ..ఇంట్లో విరిగిపోయిన కుర్చీలాగా, అరిగిపోయిన గిన్నెలాగా, చినిగిన పాత బట్టల్లా నిన్నటి వార్తా పత్రికలా ఏమూలనో పారవేస్తారు. కాని జీవితం మెట్లలా పైకి వెళ్ళదు..జీవితం చెట్టులా పెరుగుతుంది. తల్లిదండ్రులు పైకి వెళ్ళే నిచ్చెనలో మొదటి మెట్టు కాదు. తల్లిదండ్రులు, జీవితం అనే చెట్టుకి తల్లి వేరు లాంటివాళ్ళు. చెట్టు ఎంత పెద్దదైన ఎంత పచ్చగా పుష్పించినా..తల్లి వేరు కొట్టేస్తే అది పచ్చ గా మనలేదు. అందుకే ఈ రోజు నేను సాదరంగా సవినయంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏ పిల్లల సంతోషం కోసం ఒక తండ్రి తను కష్టపడి సంపాదించిన ప్రతి పైసా నవ్వుతూ ఖర్చు చేస్తాడో..ఆ పిల్లలు ఆ తండ్రి కళ్ళు మసక బారినప్పుడు ఆ కళ్ళకి కాస్త వెలుగు నివ్వడానికి ఆలోచిస్తారెందుకు? తన జీవితంలో మొదటి అడుగు వేయడం నేర్పిన తండ్రి జీవితం చివరి దశలో ఆ కొడుకు ఆసరాగా నిలబడలేడెందుకని? జీవితం అంతా తమ సంతోషాలను పిల్లలకోసం త్యాగం చేసే తల్లిదండ్రులకి ఏ నేరం చేసారని కన్నీళ్ళు ఒంటరితనం శిక్షగా విధిస్తున్నారు? మాకు ప్రేమని పంచలేని వాళ్ళు మా ప్రేమను తీసుకునే అధికారం ఎవరిచ్చారు? ఈ పిల్లలు ఎం అనుకుంటున్నారు? ప్రేమ అనే బంధంతో భగవంతుడు కలిపిన తల్లిదండ్రులను రెండు భాగాలుగా విడదీసి ఎవరికీ వారుగా బాధ పడేలా చేస్తారా? ఈ రోజు కోసమేనా ఒక మనిషి పిల్లలను పెంచేది? పిల్లలు మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. ఈ రోజు మాకు జరిగింది రేపు వాళ్ళకి జరగవచ్చు. ఈ రోజు మేము ముసలి వాళ్ళం ఐతే వాళ్ళు ఒక రోజు ముసలి వాళ్ళు అవుతారు. ఈ రోజు మేం అడిగే ప్రశ్నలు రేపు వాళ్ళు అడుగుతారు. ఇక మా గురించి మీరు ఆలోచించకండి. ఎందుకంటే ఎంమాట్లాడలేని, నడవలేని అర్థం చేసుకోలేని పిల్లలను పెంచి పెద్ద చేసినవాళ్ళం..మమ్మల్ని మేము పోషించుకోలేమా? మాకు ఎవరి అండ అవసరం లేదు. నేను అదృష్టవంతుడిని. ఎందుకంటే జీవితం నాకొక అద్భుతమైన తోడూ నిచ్చింది. తనతో నడుస్తూ ఉంటె దారి తేలిగ్గా అనిపించేది. తనతో నడుస్తూ ఉంటె జీవితం లో ఎంత చిక్కు సమస్య అయినా ఇట్టే విడి పోయేది. ఆ తొడు..నా భార్య. అందరు ప్రేమిస్తారు. కాని ఈ విషయం చెప్పవలసినన్ని సార్లు చెప్పరు. ఆ తప్పు నేను చేయదలచుకోలేదు. "పూజా, నువ్వంటే నాకు అంతు లేని ప్రేమ..అంతు లేని ప్రేమ..thank you for being there". "నీవు ఉంటే మనం ఉంటాం. మనం ఉంటే అన్ని ఉంటాయి..లేకపోతె ఏది ఉండదు....ఏది ఉండదు.."..నేను చెప్పవలసినది ఇంతే.
Oct 23, 2009
Subscribe to:
Post Comments (Atom)
>>నీవు ఉంటే మనం ఉంటాం. మనం ఉంటే అన్ని ఉంటాయి..లేకపోతె ఏది ఉండదు..
ReplyDeleteఇది నచ్చింది నాకు
Excellent sir,thank you
ReplyDeleteగుండె కరిగి నీల్లై పాయె.
ReplyDeleteఅమితాబోడు చేసినదుకు ఓవర్ డోసు కాలె.
ఈ dialogue ను మన 'పావలా ఇస్తే రూపాయ' action చేసే actors చెప్తే ఎట్టుంటదొ ఓ parody బ్లాగ్ రాయమని విన్నపం అద్దెచ్చా.
4 important stages in life childhood when you need your parents to guide you, teenage when you need your friends and family to guide you, adulthood when u need your better half to better understand things in life and work for a better family, old age or another childhood when we need everyone from our past, kids,wife grandkids etc etc to passaway inpeace .. my opinion any stage that's disturbed will ruin some imp thing in life .. may be we will try to make things better but someday you will surely realise you r missing something in life .. :)
ReplyDeleteBaagundi.
ReplyDeleteEmotional touch!...Very nice.
ReplyDeleteచాలా పాత సినిమాలు గుర్తొచ్చినా 'బాగ్ బన్' నాకు నచ్చింది.. టపా బాగుందండి..
ReplyDelete