Oct 3, 2009

మానవతప్పిదం కొంత

గత కొన్ని ప్రభుత్వాలదగ్గరనుండి ఈనాటి ప్రభుత్వం వరకూ చేసిన కొన్ని తప్పులు, తప్పుడు నిర్ణయాలు పేరుకుపొయ్యి ఈనాటి ఈ ఘోరప్రమాదానికి ఊతానిచ్చినై.
ఎలా?
౧. ఒకానొకప్పుడు ఎప్పుడూ నాగార్జునసాగర్ ని నింపి శ్రీశైలాన్ని ఖాళీగా ఉంచేవారట.
కర్ణాటక నుండి వచ్చే వరద శ్రీశైలం చేరటానికి కనీసం పన్నెండు గంటలు పట్టొచ్చు. సిద్ధాంతం ప్రకారం, నాగార్జునసాగర్ లోకి శ్రీశైలం రిజర్వాయర్ ని కనీసం సగం ఖాళీగా ఉంచి ఉంటే వరద నీళ్ళు చేరి, రిజర్వాయర్ నిండి, సాగర్ కి నీళ్ళు వదిలి అది నిండి, సాగర్ కి నీళ్ళు వదిలి అది నిండి, సాగర్ నుండి కిందకి వదిలటానికి టైం దొరికి ఉండేది. అలానే శ్రీశైలం నిండటానికి కనీసం వంద టీయంసీలు కావాల్సొచ్చి, వరద వెనక్కి తన్నకుండా కర్నూల్ మునక్కుండా ఉండేది.
తప్పిదం - శ్రీశైలంలో నీళ్ళని ఫుల్లుగా నింపి ఉంచటం, పైనున్న రాష్ట్రాలతో సత్ సంబంధాలు లేకపోవటం, సరైన కమ్యూనికేషన్ లేకపోవటం.
౨. ఇక ప్రకాశం బ్యారేజి. దీని కెపాసిటి అతి తక్కువ. క్యాచ్మెంట్ ఏరియాని పెంచుకోలేకపోవటం పెద్ద తప్పు
౩. దేశం మొత్తానికీ ఓ బాడి ఉంటుందట. దానిపేరు ఏదో ప్రకృతి వైపరీత్యాల హెచ్చరిక కేంద్రం. వీళ్ళు, ప్రతీసమచ్చరం, జూన్ నుండి అక్టోబర్ చివరివరకూ అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరికలు పంపుతూనే ఉంటారట. మనోళ్ళు వాటిని పెడచెవిన పెట్టారు.

ఇంకోవిషయం - పాలనావ్యవస్థల *సీరియస్నెస్*. ఇలాంటి హెచ్చరికలు గట్రా వచ్చినా వ్యవస్థలోని బ్యూరోక్రసి, ప్రోటోకాల్ సమస్యలు, నాకు ముందు తెలియదు అనే మనఃస్తత్వం ఇలాంటివి వ్యవస్థ మొత్తాన్నీ నిర్వీర్యంచేసి జననష్టానికీ ప్రాణానష్టానికీ దోహదపడుతున్నాయి

3 comments:

  1. పదవి కోసం కొట్టుకోవటానికే సరిపోతోంది ..ఇక వరద పరిస్థితి ఎవరికి కావాలి...

    ReplyDelete
  2. "'సీరియస్నెస్" అనేది మనరాజకీయనాయకులలోనూ వుందిసార్!
    ఓట్ల కోసం మరియు పదవులకోసం!
    యధారాజా తధా ప్రజా! అధికారులూ నాయకుల వెంటే!

    ReplyDelete
  3. ఇంకో కోణం నుండి చూద్దం:

    1. ఈ విపత్తు రాకమునుపు శ్రీశైలం లోకి 2-3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది అట ఒక్క రోజులో. సరే వచ్చింది కద కొంచం దాచుకుందాం అని సాగర్ కి వదలేదు. ఎందుకంటే ఆ పాటికి సాగర్ ఓ మూడువంతులు నిండి ఉంది కాని శ్రీశైలం మాత్రం సగం కూడా లేదు. ఇంత నీరు వస్తుంది అని ఊహించకపోవడం వారు చేసిన పొరబాటు. Deforestation ఒక కారణం అయితే ఇంథ తక్కువ సమయం లో అంత భారి వర్షం ఇంకో కారణం.

    2. గురు నువ్వు రాసిన రెండు కొంచం కాంట్రడిక్టింగ్ గా ఉన్నాయి. కెపాసిటి తక్కువ ఐతే కాచ్మెంట్ కూడా తక్కువే ఉంటుంది. కాచ్మెంట్ ని పెంచితే కెపాసిటి త్వరగా గరిష్టానికి చేరుకోదు?

    3. మన దేశం లెవెల్ లో ఓ Disaster Management Forceఓ అలాంటిది ఏదో ఒకటి ఉండేది ... దీనికి నాయకత్వం NSA ఉండేవాడు. (ఇది వాజ్పాయి జమనా మాట). మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. అన్ని సొనియామ్మ చుసుకుంటదిలే అని పీకేసారేమో.

    ReplyDelete