Oct 30, 2009

పిచ్చి పజ్జెంది రకాలు

ఈ సీను గుర్తుకుదెచ్చుకోండి -

ఓ ఇగ్రహం కాళ్ళకాడ సిరన్జీవి కూకోనుంటాడు.
ఇంతలో ఓతను సైకిలు మీనొచ్చి సిరన్జీవికాడ కూకొని ఇలా జెప్తాడు.
ఏటిసెయ్యమన్టావేటి.
అడవిరాముడు సీరలొచ్చినయ్యా
అయ్యి అమ్మేలోపు దొంగరాముడు సీరలు
అయ్యికొనుక్కొచ్చి అమ్ముకునేలోపు అభిలాష సీరలు
ఇలా ఒకదానెమ్మట కొత్త సినిమా కోకలన్నీ ఇలా మారుకెట్టులోకి వత్తంటే యాపారం ఎలాజేస్కోవాల

నేనో యుపాయవ్ సెప్తా ఇన్టావా
సెప్పు గురువా
ఓ తాను సైనుగుడ్డకొను
ఏటిగురువా నుసెప్పేది, ఏటిసేస్కోమన్టా దాన్ని?
సెప్తాగా

సీను కట్ సేత్తే - యాడజూసినా అభిమాన ఈరోల ఈరోవిన్ల బొమ్మలు అచ్చెసిన గుడ్డలే. లుంగీలు, టవళ్ళు, సొక్కాలు, లన్గాలు, డోరు కర్టెన్లు, సివరాకరికి కడ్డాయర్లు కూడా.
ఏందీ అన్నీ జోతిలచ్చిమి జయమాలినివేనా మా సిరన్జీవి బాయ్య బొమ్మలవి లేవా? అని ఓ డవిలాగు.
- ఛాలెంజి సిత్రం నుండి.....

ఆయాల సినిమా కాబట్టి సూస్కుని నవ్వుకున్నాం.
నిన్న వార్తల్లో ఇదిజూసినాక నవ్వాగల. పిచ్చి పజ్జెంది రకలు అని నవ్వుకున్నా -
http://timesofindia.indiatimes.com/life/parties/delhi/Designers-at-Play-in-Delhi/articleshow/5136319.cms
పైన నొక్కండి. ఎవుత్తో డిజైనరంట. ముంబై అంట. నదియా మహమ్మూద్ అంట.
గబ్బర్ జాకెట్లు, అమితాబచ్చన్ జాకెట్లు, డిజైన్ జేసి అవతలనూకింది.
గబ్బర్ జాకెట్లు -
ఈటి మీన *ఈ చేతులు, ఈ చేతులు, ఈ చేతులు నాకిచ్చేయ్ ఠాకూర్* అని రాసుంది కొన్నిటిమీన.
ఇంకొన్నిమీన *ఎంతమంది ఉన్నార్రా, మీరెంతమంది ఉన్నార్రా* * సర్కార్ మీ ఉప్పు తిన్నా సర్కార్, ఐతే ఇప్పుడు గోలీ తిను* ఇలాంటి డవలాగులు.
*ఈ కుక్కలముందు డ్యాన్స్ నృత్యం ఆడమాక బసంతీ* అని
ఇలాంటివి ఇంకా సానా డిజైన్లంట బెమ్మాండంగా సేసిందీమె.

అదీ కధ ఈ పొద్దు.

14 comments:

  1. మాష్టారూ, మీరు తెలుగుపదంలో పాల్గొంటే బాగుంటుంది:
    http://groups.google.com/group/telugupadam?hl=

    ReplyDelete
  2. పిచ్చి పజ్జెంది రకాలా? హ హ్హ! భలే రాసారు.

    ReplyDelete
  3. సైన్యం అని ఓ కొత్త టాగ్ పెట్టారు. లింక్ పంపించగలరా.

    ReplyDelete
  4. సైన్యం కామెంట్ బాక్స్ డిసేబిలు ఐంది. కామెంట్ పబ్లిష్ కావటం లేదు

    ReplyDelete
  5. సునీత గారు, వేరే విహరిణి(బ్రైజర్) లో మళ్ళీ ప్రయత్నించండి. సైన్యం వ్యాఖ్యల సౌకర్యం ఉంది.

    ReplyDelete
  6. >>ఓ ఇగ్రహం కాళ్ళకాడ సిరన్జీవి కూకోనుంటాడు.
    ఇంతలో ఓతను సైకిలు మీనొచ్చి సిరన్జీవికాడ కూకొని ఇలా జెప్తాడు.
    ఏటిసెయ్యమన్టావేటి.
    అడవిరాముడు సీరలొచ్చినయ్యా
    అయ్యి అమ్మేలోపు దొంగరాముడు సీరలు
    అయ్యికొనుక్కొచ్చి అమ్ముకునేలోపు అభిలాష సీరలు

    Hillarious

    ReplyDelete