Oct 14, 2009

పేరు సూసి మోసపోకు మిత్రమా

మోసాలు ముఫైఆరు రకాలైతే మోసపోటాలు మూడొందలరవై రకాలు.
మొన్నీమధ్య ఇంటికాడి ఓ కొట్టుకెళ్ళాం, అయి ఇయి కొంటా సూపుల సందుకి వెళ్ళి సూసి ఎతికి, ఇది కొన్నాం - పేరు Savory Vegetable Barley Progresso Soup. బార్లీ సానా మంచిది వారోగ్యానికి అన్నిటికీ అని తోపుడుబండిలో ఏస్కున్నాం.

నిన్న ఆపీస్ నుండి ఇంటికి రాంగనే "కాపీతాగుతావా సూపు తాగుతావా? టీతాగుతావా మంచీళ్ళు తాగుతావా?" ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చింది శ్రీమతి.
"సూపుతే"
"ఏ సుపు?"
"ఏమున్నాయ్?"
"కార్న్ సూపు, టమాటా సూపు, రోస్టెడ్ పెప్పర్ సుపు, పైన సెప్పిన సూపు"
"ఐతే పైన సెప్పిన సూపుతే"
"ఏడిసేయాల్నా?, పొయ్యిమీన మాడగొట్టాల్నా?, మైక్రోవేవులో పెట్టి గోరెచ్చగా ఇవ్వాల్నా? అసలు ఇవ్వాల్నా వద్దా?"
"మైక్రోవేవులోపెట్టి ఏడిసేసి ఇవ్వు"
"సరే"
..
ఇంతలో కెవ్వుమని కేక.
"ఏంది సంగతి?"
"బాసూ ఏంసూపు తెచ్చావ్? దాంట్లోని ఇన్గ్రేడియంట్స్ చూస్కోవాల్సిన పనిల్యా?"
"ఏమీ? బార్లీ వెజిటేబుల్లు ఇంకేంగావాల?"
"అదేమరి క్యా-బే-జి అంటే"
"ఏంసంగతి"
"ఇది చూడు -
Ingradiants - Water, Beef broth, Celery, Tomatoes యాట యాట యాట"అదీ సంగతి. కాబట్టి, వళ్ళు తగ్గిచ్చుకునే మార్గంలో సూపులు గట్రా కొనుక్కునేప్పుడు తక్కువ సోడియం ఉన్నవి వెత్తుక్కుని, బీఫులు గట్రా తిననివారైతే సరిగ్గా ఇన్గ్రేడియంట్స్ చదువుకుని కొనుక్కోండి. నాలా మోసపోవద్దు.

13 comments:

 1. అయ్యో రాజు, ఇదే మొదటిసారా? ఏమిటి ? కొత్తగా వచ్చినప్పుడు ఓటల్ కెళ్ళి వాడి బాస అర్థం కాక, నాది వాడికి అర్థంకాక వాడేదో ఇత్తే.. నోట్లో పట్టుకొని మింగలేక కక్కలేక మూగోడిలా ట్రాష్ డబ్బా కోసం పరిగెత్తిన రోజులు లేవా? నాకైతే బోలెడు, లాస్ ఏంజిలస్ లో ఎన్నిసార్లు లాస్ అయ్యానో :)

  ReplyDelete
 2. మీకేంటి కనీసం ఎంగిలిపీచు (english) లో వుంటాయి...మాగతి ఏమి ? డచ్ తప్ప ఇంకోటి కనపడదు ఈ దేశం లో ...

  ReplyDelete
 3. విజయక్రాంతి - ఇదేదో ఆలోచించాల్సిన విషయమే!!
  భారారె - :):) అందుకే నేను వచ్చిన కొత్తల్లో ఒంటరిగా ఎప్పుడూ ఏ ఓటేలుకీబోలే!!!

  ReplyDelete
 4. నాలాంటి మేకలు అక్కడికి వెళ్ళినప్పుడల్లా చుక్కలే. "No egg, no beef, no pork, nee meat" అని కథలు చెప్పి చెప్పి విసుగొచ్చి ఉన్నన్నాళ్ళూ ఎంచక్కా మేకలాగ సలాడ్ జిందాబాద్. అదే ఆకులు ఇక్కడ

  ReplyDelete
 5. Hmmm.Koncham ibbandae! Choosukoevaali mari!

  ReplyDelete
 6. adi gaddi tinede kada ani laagincheyalsindi guru.. panlo pani..

  @laksmi garu - oo board raasi pettukundam anukunnna neenaite no meat ante no fish ani KUDA artham ra ____ ga ani.

  ReplyDelete
 7. కార్తీక మాసం లో ఓ మారు ఫుడ్ కొర్ట్ లో నేను ,అది వెజ్జే కదా వెజ్జే కదా అని చెవి కోసిన మేకలా అరిస్తే వెజ్ అని చెప్పి ఫిష్ సాస్ పైన జల్లి మరీ ఇచ్చాడు ఇక్కడ ..తిన్నాక తెలిసింది :(

  ReplyDelete
 8. డబ్బా తిరిగిచ్చీ లేదా??

  ReplyDelete
 9. భాస్కరన్న కేక :)
  నేస్తం గారు పాపం సమించు గాక..

  ReplyDelete
 10. పోన్లెండి తినే లోపన్నా చూశారు నయం.

  ReplyDelete
 11. హాయిగా ఇంటొ చేసుకోండి సూపులు. రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకా ఇంగ్రీడియెంట్ల గురించి డౌటుండదు. :)

  ReplyDelete