Oct 26, 2009

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం,
వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం
నారదాదియోగిబృందవందితం దిగంబరం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భానుకోటిభాస్వరం భవాబ్దితారకం పరం,
నీలకంఠమీప్సితార్ధదాయకం త్రిలోచనం
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

శూలటంకపాశదండపాణిమాదికారణం,
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం,
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం,
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణశేశపాశశోభితాంగమండలం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం,
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం,
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాశనమ్
అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం,
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం,
కాశికాపురాధినాథకాలభైరవం భజే

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం,
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం,
ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం నరా ధ్రువమ్

కాశికాపురాధినాథకాలభైరవం భజే
కాశికాపురాధినాథకాలభైరవం భజే
కాలభైరవం భజే
కాల భైరవం భజే

[కాలభైరవాష్టకం]


[సంస్కృత మూలం - http://sanskritdocuments.org/all_pdf/kaalabhairava.pdf]

8 comments:

  1. ఒక ఎఫ్.ఎం వాళ్ళు ఇలాంటి మొడ్రనైజ్డ్ మ్యూజిక్ తో ఉన్న స్తోత్రాలూ ,శ్లోకాలు వేస్తారు పొద్దున్నే..బాగుంటాయి వినటానికి.నేను వాకింగ్ కు వెళ్ళేప్పుడు అన్ని చానెల్స్ తిప్పుతూ వింటూంటాను..

    ఇది కూడా బాగుంది..utube లింక్ ఇంకా బాగుంది..very nice..

    ReplyDelete
  2. ఈ స్త్రోత్రం చూసాక నేను పాడి రికార్డ్ చేసుకున్న పాట సిస్టం లొ ఉన్నట్టు గుర్తొచ్చింది.

    కాల భైరవాష్టకానికి రాగం కూర్చి, ఎలక్ట్రానిక్ తబలా సాయంతో రికార్డ్ చేశాను. ఇక్కడ వినండి.
    click here
    http://www.divshare.com/download/9032862-8b6

    ReplyDelete
  3. అణ్వేషిత గారూ - బాగుంది మీ గానం. ఐతే, ఇలాంటి శ్లోకాలౌ పాడేప్పుడు ఏ రాగం ఏ తాళం లేక ఇదీ రాగం ఈ తాళం అని ఎలా ఎవరు చెప్తారు?
    మీరు కర్ణాటక సంగీత శృతిలో పాడారు.
    బాగుంది.
    తృష్ణ - పొద్దున్నే నడిచేప్పుడుకూడా స్తోత్రాలు శ్లోకాలేనా? :) ఆనందించండి.
    చైతన్య - నీకోసమే ఈ పోస్టు.:):)

    ReplyDelete
  4. పాట నచ్చినందుకు థాంక్సండి...
    సాధారణంగా ఇలాంటి స్త్రోత్రాలు కాని, కీర్తనలు కాని, రచయిత చేత సృష్టించబడినప్పుడే నిర్దుష్టమయిన రాగం లో సంయోజనం చెయ్యబడతాయి. ఇక వాటికి తిరుగుండదు అన్నమాట. ఎవరు పాడినా అదే రాగం లో పాడాలి. కొద్ది పాటి చిన్న మార్పులు చేసుకోవచ్చునేమో!అంతే తప్ప మొత్తం మార్చే వీలులేదు. కొందరు మహామహులు ఉద్ధండులు, రాగం మార్చి ప్రయోగాలు చేశారని విన్నాను. కాని అవి అంతగా సఫలం చెందలేదు.

    కాని, ఇప్పుడు ఈ పాతకాలపు చింతకాయలని ఎవరు పాటించట్లేదు.

    ReplyDelete
  5. అణ్వేషిత గారు -
    చక్కగా చెప్పారు. పై యూట్యూబ్ నందు పాదిన విధానం కూడా బాగుందండి. మరి ఏమి రాగమో ఏమి తాళమో. ఉత్సాహభరితంగా కూడా ఉంది మరియూ వినంగనే ఠక్కున *కాలభైరవూడు* మనసులోకి వచ్చెలా ఉంది.

    నాకెందుకో అనంతరామ శర్మ గుర్తుకొచ్చాడు. పిల్లాడు ఆయన ముందు నారాయణసూక్తం తనకిష్టమైన రీతిలో పాడితే, పెద్దాయనకు కోపం వచ్చి, అవమానించటానికి ఇదా మార్గం అనేసి వెళ్లిపోతాడు. పిల్లాడెమో నువ్వు నీ ఇష్టం వచ్చిన రాగంలో పాడుకోవచ్చేం, నే పాడితే తప్పా అంటాడు.

    ReplyDelete