Oct 15, 2009

యా కుందేందు తుషార హార ధవళా

యా కుందేందు తుషార హార ధవళా
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వర దండ మణ్డిత కరా
యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్
దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా

సరస్వతి స్తుతి. ఎంతకమ్మగా ఉంటుంది!! ఇక్కడ వినండి లేక ఇక్కడ -

చిన్నపిల్లలు అనుకుంటా ఎంత చక్కగా స్తుతించారో!!

నాకోరిక!! మా సూరిగాడు పిల్ల, ఇంకొంచెం పెద్దైయ్యాక ఇలా చక్కటి శృతిలో పాడుతుంటే, నేను నరసరావుపేట కుర్చీలో విశ్రమించి అలా మైమరచి వింటూవుండలని...

19 comments:

 1. meeru bale comedy andi....emaina narasaravupeta veladamane?????????

  ReplyDelete
 2. అవునండీ పిల్లలు పాడుతువుంటె చాలా బాగుంది.మీ పిల్లలు కూడా తప్పకుండా మీ కొరిక, కనిసం శ్లొకం పాడే వరకు తీరుస్తారు మిగిలిన కోరిక అంత easy కాదేమొ .
  నేను మీ పొస్ట్లు రెగులర్గా చదువుతాను కాని తెలుగు typing problem వల్ల ఎప్పుడు కామెంట్స్ వెయలేదు.మీ స్టైలు చాలా different గా వుంటుంది, బాగుంటుంది.

  ReplyDelete
 3. క్రాంతి -
  *నరసరావుపేట కుర్చీ* లో కూకోటానికి నరసరావుపేటపోవల్సిన పెనిల్యా చిన్నా...:):)
  సురభి -
  >>నేను మీ పొస్ట్లు రెగులర్గా చదువుతాను
  ధన్యవాదాలు.
  >>తెలుగు typing problem
  కమాన్ - ఇది చదవండి - తెలుగులో రాయటం ఎలా?
  >>మీ పిల్లలు కూడా తప్పకుండా మీ కొరిక, కనిసం శ్లొకం పాడే వరకు తీరుస్తారు
  :):) తీర్చాలీ అంటే మనం వాళ్ళకి నేర్పాలి, నేర్పాలీ అంటే వాళ్ళకి కుదరాలి. చూద్దాం. అందుకే మేము సాధ్యమైనంతవరకు శ్లోకాలు గట్రా పెడుతూనే ఉంటాం.
  >> మిగిలిన కోరిక అంత easy కాదేమొ
  నిజమే. ఇక్కడకి ఆ కుర్చి తెచ్చుకోవాలంటే కష్టమే. ఏమో వెనక్కి వచ్చేస్తే గుంటూరులో ఉన్న కుర్చీని బయటకి తీసి బూజుదులిపి యాట యాట యాట

  ReplyDelete
 4. హన్నా ఎంత స్వార్ధం మీ చిన్నప్పుడెమో గానాట, ఓకులాట ఇంకేమో ఆటలు (పేర్లు గుర్తు రావటంలేదు ) ఆడీ బాగా ఎంజాయ్ చేసి పాపం ఇప్పుడేమో సూరిబాబు మిమ్మల్ని నరసరావుపేట కుర్చీ లో కూర్చోపెట్టి సరస్వతి స్తుతి వినిపించాల ఆహా బాగానే ఉంది(j/k).

  నరసరావుపేట కుర్చీ కాకపోయినా సోఫా లో కుర్చునన్న మీ కోరిక తప్పకుండ తీరాలని కోరుకుంటున్నాను !

  ReplyDelete
 5. కొద్దిగా కష్తపడాలి గానీ అసాధ్యమైన కోరికేమీకాదు.

  ReplyDelete
 6. అభీష్ట సిద్ధిరస్తు.

  ReplyDelete
 7. ఇంత మంది అన్నాక తప్పక సిధ్ధిస్తుందిలెండి !

  ReplyDelete
 8. సూరిబాబేమో గానీ దుర్గమ్మ(అనఘ) నెరవేర్చుతుంది మీ కోరిక.

  ReplyDelete
 9. నాది కూడా ఓ తధాస్తూ...

  ReplyDelete
 10. This comment has been removed by the author.

  ReplyDelete
 11. ఆమెన్ !
  భాస్కర్ గారు, నేను మీ ఆటల బ్లాగ్లో ఒక ఆటగురించి రాసాను. వీలైతే చూడండి.

  ReplyDelete
 12. Ruth, మురళి, భావన, విజయమోహన్, పద్మార్పిత, కొత్తపాళీ అన్నగారు, తృష్ణ, సునీత గారు, శ్రావ్యా, వీవెంగ, సురభి - అందరికీ మరియూ నా బ్లాగు చదివే యావత్ ప్రజకు - దీపావళి శుభాకాంక్షలు.

  ReplyDelete
 13. చక్కటి సరస్వతీ స్తొత్రం వినిపించారు. ముందు తరాల పిల్లలంతా కూడా ఇది అనుసరిస్తే బాగుండు. మీ 'సూరిగాడి పిల్ల ' నేర్చుకుంటుంది లెండి. మీకు దీపావళి శుభాకాంక్షలు.

  ReplyDelete
 14. baagundi .

  మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .

  ReplyDelete
 15. మరీ అంత అత్యాస అయితే ఎలాగండి !

  ReplyDelete