Oct 22, 2009

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకారచండతాండవంతనోతునశ్శివశ్శివం

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోలవీ చివల్లరీ విరాజమానమూర్ధని
ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే
కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ

ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర
స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే
కృపాకటాక్షధోరణీ నిరుద్ధ్దుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ

జటాభుజంగపింగళ స్ఫురత్ఫనామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిహ్వధూముఖే
మదాంధసిందురస్ఫుర త్వగుర్తరీయమేదురే
మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి

సహస్రలోచన ప్రభుత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూ:
భుజంగరాజమాలయానిబద్ధజాటజూటక:
శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖర:

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా
నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకం
సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తున:

కరాళ ఫాలపట్టికా దగద్ధగద్ధగజ్జ్వల
ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే
ధరాధరేంద్రనందినీ కుచాగ్రచిత్రపత్రక
ప్రకల్ప నైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ

నవీన మేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్
కుహూ నిశీధినీ తమః ప్రబంధ బద్ధకంధరః
నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధాన బంధురః శ్రియం జగుద్ధురంధరః

ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా
వలంబి కంఠకందలీ రుచుప్రబద్ధకంధరం
స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధూవ్రతం
స్మరాంతకం పురాంతకమ్ భవాంతకమ్ మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే

జయత్వదభ్రవిభ్రమ భ్రమద్భుజంగ మశ్వస
ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళఫాలహవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగతుంగమంగళ
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః

దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో
ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:
తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్

కదానిలింపనిర్ఝరీ నికుంజకోతరేవసన్
విముక్తదుర్మతిః సదాశిరఃస్థమాంజలింవహన్
విలోలలోలలౌర్చనో లలాలబాలలగ్నహః
శివేతిమంత్రముచ్ఛరణ్ సదాసుఖిః భవావ్యహం

నిమగ్ని నిత్యమేవముక్తముక్తమోత్తమం స్తవం
పఠన్స్మరంబృవనరో విశుద్ధిమేతిసంతతం
హరేగురౌ సుభక్తిమాసుయాతినాం యధాగతిం
విమోహనం హి దేహినాంసు శంకరస్య చింతనం
[శివ తాండవ స్తోత్రం]


యావత్ లోకం కార్తీక మాసం సందర్భంగా శివధ్యానంలో మునిగిపోయి ఆ సదాశివుని కృపకు పాత్రులౌవ్వాలని కోరుకుంటా

11 comments:

  1. రెండు రోజులక్రితం ఎందుకో youtube లో కూచిపూడి నాట్యాలు మా పిల్ల కోసం వెతుకుతూ, తర్వాత ఆంధ్ర నాట్యం చూస్తూ, అటునుండి శివ తాండవం వీడియో వైపు వెళ్ళి ఎవరయినా దానికి అక్షరరూపం ఇస్తే బాగుండును అనుకొన్నాను. ఇవ్వాళ మీ టపా!!!
    కాని దీనిని మన SP పాడితే (ఇప్పటికే పాడారేమో తెలియదు) వినాలని మాత్రం అనిపించింది.

    ReplyDelete
  2. గిరిజాకళ్యాణం లో శివుడి పాత్ర వేసినపుడు నర్తించాను, శివతాండవం చేసాను కానీ ఈ పాతకి చేసానా అన్నది గుర్తుకు రావటం లేదు. అందించినందుకు థాంక్స్.

    ReplyDelete
  3. మా వారు అనర్గళంగా పాడేస్తారు దీనిని(చూడకండనే). నాకంత స్పీడ్ గా రాదు నెమ్మదిగా చదువుతా(పుస్తకం చూస్తూ):) :)

    ReplyDelete
  4. గొప్పగాఉంది!ముందు భయం వేసింది, మీరు కూడా కవిత్వం రాయడం మొదలుపెట్టారా అని? శివ తాండవం`అని చూసి హమ్మయ్య! అనుకున్నాను.

    ReplyDelete
  5. ఈ స్తోత్రం చాలా యేళ్ళ ముందు కంఠస్తం చేశాన్నేను. కొన్ని యేళ్ళుగా, అక్కడక్కడా మర్చిపోతూ ఉన్నాను.

    ఈ టపా గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  6. మంచి సమయంలో రాశారు ...ఈ తాండవం లో నాలుగు చరణాలనుకుంటా రక్తాభిషేకం సినిమాలో పాడారు బాలూగారే అనుకుంటా ! ఓం నమః శివాయ

    ReplyDelete
  7. రాతప్రతి ఇచ్చి చాలా మందికి సహాయపడినారు.
    యూట్యూబ్ లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    ఓం నమః శ్శివాయ :)

    ReplyDelete
  8. బాగుంది ! కృష్ణ గారు చెప్పినట్లు కొద్దిగా SPB గారు పాడిన వెర్షన్ ఉంటే లింక్ ఇవ్వండి కొద్ది గా Please.

    ReplyDelete
  9. క్రిస్ - :):)
    ఐతే!!
    >>కాని దీనిని మన SP పాడితే (ఇప్పటికే పాడారేమో తెలియదు) వినాలని మాత్రం అనిపించింది.
    ఎందుకలా? నాకూ అనిపించి ఉండొచ్చు, కానీ ఇప్పటి బాలూ కాదు, *ఏ దివిలో విరిసిన పారిజాతమో* పాడినప్పటి బాలు.
    మొన్నీమధ్య తికమక అని ఒక బ్లాగరు, *సునీత ఝుమ్మందినాదం* ఈటీవి కార్యక్రమ యూట్యూబు లింకు అందించారు. అందులో స్వయానా బాలూగారే పాడి వినిపించారు అప్పట్లో ఎలా పాడేవారు ఇప్పుడు ఎలా పాడుతున్నారూ అని...
    ఆయన *సెల్ఫ్ డిస్కవరి*కి చేయెత్తి నమస్కారాలు చేయాలి. తనని తాను ఇంప్రువైజ్ చేస్కుంటేనే, తనని తను ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్కుంటేనే ఎవరైనా అంత ఎత్తుకి చేరేది.
    ఉష గారు - ధన్యవాదాలు.
    తృష్ణ - నేనూ అనర్గళంగా చూస్తాను [పాట్టం రాదు] :):)
    సునీత గారూ మీరు మరీనూ..ఎంతరాయగలిగినా ఇలా రాయగలమా? అదీ సంస్కృతంలో :):)
    రవి గారు - ధన్యవాదాలు.
    పరిమళం - మనోళ్ళు వాడేస్కుంటారు ఇష్టం వచ్చినట్టు. :):)
    శర్మ గారూ - నమస్తే. మామూలుగా రొటీనుగా చదివేస్తుంటారు చాలా మంది శ్లోకాలనూ స్తోత్రాలను. కానీ పై దృశ్యమాలికలో చాలా ఉత్తేజం జనించేట్లుగా చదివారు. అందుకే ఇక్కడ పెట్టాను.
    శ్రావ్యా - తప్పకుండా. శ్రీ బాలు గారు పాడింది దొరికితే తప్పక అందిస్తా!
    ఓ నమఃశివాయ

    ReplyDelete
  10. బాగుంది..
    కాలభైరవాష్టకం లింక్ ఉంటే ఇస్తారా ..

    ReplyDelete
  11. రావణ ప్రోక్తమైన శివస్తుతి ఇది. బాలూ గారు పాడిన లింక్..
    http://www.youtube.com/watch?v=HJ3sb_GqBGg

    ReplyDelete